శర్మ కాలక్షేపంకబుర్లు-అసతోమా సద్గమయ….

అసతోమా సద్గమయ….

అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతం గమయ

అసత్యం నుంచి సత్యం వైపుకు,చీకటినుంచి వెలుగుకు, మృత్యువు నుంచి అమృతత్త్వం వైపుకు నడిపించు భగవాన్!

భారతదేశంలో సామాన్యుడు కూడా, మాటాడగలగినది వేదాంతం, అది నిత్య వ్యవహారపు మాటలలో కూడా ప్రతిఫలిస్తూనే ఉంటుంది. పై శ్లోకానికి నాకనిపించిన మాట.

అసత్యం నుంచి సత్యం వైపు నడిపించమంటే, అసలు సత్యమేది? అసత్యమేది? తెలియాలికదా! మూడు కాలాలు భూత,భవిష్య, వర్తమానాలు. ఈ ప్రపంచంలో కంటికి కనపడే ప్రతీదీ వచ్చి పొతూ ఉంటుంది, ఈ జగత్తులోకి, అంటే పుట్టి నశిస్తూ ఉంటుంది, అందుకే జాయతే,గఛ్ఛతే ఇతి జగం అన్నారు. ఈ రోజు పుట్టినది అంటే నిన్న లేదు, పుట్టినదేదైనా నశించకా తప్పదు,జాతస్య మరణం ధృవం, ఇది నేడో,రేపో నశించాల్సిందే. నశించేది సత్యం కాదు, త్రికాలాల్లోనూ నిత్యంగా ఉండేదే సత్యం. అన్నీ నశించేవే ఐనపుడు, సత్యమైనది,నిత్యమైనది ఏది? ఈ చివరి ప్రశ్నకే సమాధానం కావాలి కదా! అదే భగవంతుడు లేదా భగవతి, మనం ఎలా అనుకుంటే,ఎలాభావిస్తే అలా! అంటే కనపడేదే ఐనా నిత్యంకాని ఈ జగం లో ఉండే అనిత్యమైనవాటి నుండి, వాటిపట్ల నా రాగద్వేషాలనుంచి, నా మనసును మరలించమని ప్రార్ధన. మనసు పట్టుకుంటే బంధం,విడిచిపెడితే మోక్షం. చూడగలిగితే దేవుడు లేకపోతే రాయి.

తమసోమా జ్యోతిర్గమయ, తమస్సు అంటే చీకటి, ఏది చీకటి? కంటికి చూపునివ్వలేనిది చీకటి, వెలుగు లేనిది చీకటి, నిజానికి ఇవి భౌతికమైనవి, అసలు చీకటి మనసులో ఉంది, అదే అజ్ఞానం, తెలియనితనం. ఏది తెలుసుకోవలసినది, కూడూ గుడ్డా పెట్టేదేనా? కూడూ గుడ్డా పెట్టే దానితో పాటు పరదైవాన్నీ తెలుసుకోవాలి, అదే ”అవ్వా,కావాలి బువ్వాకావా”లంటే! సామాన్యుడు కూడూ,గుడ్డా సంపాదించుకోడంలోనే జీవితం వెళ్ళమారిపోతోంది. ఇక పరదైవం గురించి తెలుసుకునేదెపుడు? అదే అజ్ఞానం, అజ్ఞానంనుంచి జ్ఞానం వైపు, అదే చీకటినుంచి వెలుగువైపు నడక. చీకటికి అలవాటు పడిన కళ్ళు వెలుగును చూడలేవు,ఒక్కసారిగా. ఒక్క సారిగా వెలుగును చూసినకళ్ళకి, అప్పుడూ అంధత్వమే కలుగుతుంది. అందుకే చిన్నప్పటినుంచి వెలుగువైపు ప్రయాణం మొదలు పెడితే ఎంతో కొంత వెలుతురు చూసే సావకాశం ఉంది. అదే జ్ఞానజ్యోతిని దర్శించడం. అదే తమసోమా జ్యోతిర్గమయ.

ఇక మృత్యోర్మా అమృతంగమయ. పుట్టినది ప్రతిది చనిపోయేటపుడు అమృతత్త్వం ఎలా సాధ్యం? మృత్యువు నిన్న ఉంది,నేడు ఉంది,రేపు ఉంటుంది. అది సత్యం,అది నిత్యం. నిత్యమూ సత్యమూ ఐన మృత్యువే అమృతత్త్వమా? కాదు! జననమే లేకపోతే మరణమెక్కడ? ప్రకృతి సర్వం రెండు స్వభావాలతో ఉంటుంది, వేడి,చలవ;ఎత్తు,లోతు ఇలా, అలాగే జననం,మరణం కూడా ప్రకృతిలోనివే. ప్రకృతే పరమేశ్వర రూపం. ఈ పరమేశ్వర రూపమనే సత్యాన్ని తెలుసుకోలేని అసత్యమనే చీకటి మనసును ఆవరిస్తూ ఉంది, అదే మరణ సదృశం. అసత్యమనే చీకటి అనే అజ్ఞానం అనే మరణ సమానమైన దానినుంచి మరలించి, సత్యమైన, కాంతివంతమైన విజ్ఞానం, శాశ్వతమైన దానివైపు నా మనసును మరల్చమని ప్రార్ధన.

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అసతోమా సద్గమయ….

  1. నమస్కారం గురు వు గారికి

    మీరు మరిన్నీ మంచి విషయాలు వ్రాయాలని, దానికి కావాల్సిన ఆరోగ్యం మీకు భాగవంతుదు ప్రసాదించాలని కోరుకుంటున్నాను

    🙏🙏🙏
    చంద్ర శేఖర్ నిమ్మగడ్డ
    బెంగలూరు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s