శర్మ కాలక్షేపంకబుర్లు-దశావతారాలేనా?

దశావతారాలేనా?

మనం సాధారణంగా చెప్పుకునేది ’అవతారాలు పది’ అని. కాని విష్ణువు ధరించిన అవతారాలు ’ఇరువది ఒకటి’, వాటి క్రమం ఇదీ

మొదటిది బ్రహ్మచర్యం అవలంబించిన కౌమారనామావతారం.

రెండవది భూమిని ఉద్ధరించిన వరహావతారం.

మూడవది దేవఋషి నారదునిగా అవతరించడం.

నాల్గవది నరనారాయణావతారం.

ఐదవది కపిల మహాముని గా అవతరించి సాంఖ్యయోగం చెప్పడం.

ఆరవది అనసూయ అత్రి లకు కుమారునిగా దత్తాత్రేయునిగా జన్మించి అలర్కునికి ప్రహ్లాదునికి ఆత్మ విద్య చెప్పడం.

ఏడవ అవతారం ఆకూతి,రుచి అనువారలకు జన్మించి యజ్ఞుడనే పేరున ప్రకాశించి స్వాయంభువు మన్వంతరాన్ని రక్షించడం.

ఎనిమిదవ అవతారంలో నాభి, మేరు దేవిలకు ఋషభునిగా జన్మించి ఉరుక్రముడనే పేర ప్రజలకు పరమహంస మార్గం బోధించడం.

తొమ్మిదవ అవతారంలో పృధు చక్రవర్తిగా జన్మించి పృధివిని శోధించి సమస్త వస్తువులనూ సాధించడం.

పదవ అవతారంలో మీనంగా జలప్రళయంలో సర్వబీజాలనూ రక్షించి, పునః సృష్టికి నాంది పలకడం.

పదకొండవ అవతారంలో సముద్ర మథనానికి అవసరంగా కూర్మావతారం.

పన్నెండవ అవతారంగా ధన్వంతరి అమృతకలశావిష్కరణ.

పదమూడవ అవతారంగా మోహినిగా అవతరంచి అమృతాన్ని దేవతలకు పంచడం.

పద్నాలుగవ అవతారంగా నరసింహావతారంలో హిరణ్యకశిపు సంహారం.

పదిహేనవ అవతారంగా వామనావతారం.

పదాహారవ అవతారంగా పరశురామునిగా అవతరించి క్షత్రియ సంహారం.

పదిహేడవ అవతారంగా వ్యాసునిగా అవతరించి వేదాలను వ్యాసం చేయడం.

పద్దెనిమిదో అవతారంగా రామావతారం.

పందొమ్మిదవదైనది బలరామావతారం.

ఇరవైయవది శ్రీ కృష్ణావతారం.

ఇరవై ఒకటో అవతారం బుద్ధావతారం. రాబోయేది కల్క్యావతారం.

వీటిలో కొన్నిటిని పూర్ణావతారాల్నీ, కొన్ని అంశావతారాలనీ చెబుతారు, ఎవరిష్టం వారిది.

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-దశావతారాలేనా?

  • బోనగిరిగారు,
   ఈ అవతారాల క్రమం భాగవతంలో చెప్పబడింది.
   ఇక మహావిష్ణువు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చినదే వేంకటేశ్వరుడు. అవతారం అంటే ఒక పనికోసం భూమి పై ఆవిర్భవించి ఆ పనైన తరవాత తిరోహితమయ్యేది.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s