శర్మ కాలక్షేపంకబుర్లు-అగ్ని శలభ న్యాయం

అగ్ని శలభ న్యాయం

అగ్ని అంటే నిప్పు శలభం అంటే మిడత. పంచేంద్రియాలు సర్వజీవులకీ ఉంటాయి. ఒక్కో ఇంద్రియలోలత్వం ఒక్కో జీవికి ఎక్కువ ఉండి వాటి ద్వారానే చిక్కులలో పడి నశిస్తాయి.

శబ్దాదిభిః పంచభిరేవ పంచ
పంచత్వమాపుహుః స్వగుణేన బద్ధాః
కురంగమాతంగపతంగమీన
భృంగా నరః పంచభిరంచితః కిమ్. ఆది శంకరులు

జింకకి శబ్దం అదే సంగీతమంటే ఎందుకో తగని మక్కువ. వేటగాడు ఉచ్చుపన్ని మురళివాయిస్తుంటే తిన్నగాపోయి వలలో చిక్కుకుని ప్రాణం పోగొట్టుకుంటుంది. ఏనుగు స్పర్శ కోరుకుని ఆడ ఏనుగు వెనకపడి వివేకం కోల్పోయి గోతిలో పడి స్వాతంత్ర్యం కోల్పోతుంది. శలభానికి దృష్టి లోలత ఎక్కువ. అగ్ని శలభానికి ఆకర్షణీయంగా కనపడి అందులో దూకి నశిస్తుంది. చేప గాలానికి గుచ్చిన ఎరను జిహ్వ చాపల్యంతో మింగి ప్రాణం కోల్పోతుంది, సుగంధానికి ఆకర్షింపబడి, పద్మం లో చిక్కి తుమ్మెద ప్రాణం కోల్పోతుంది. ఈ జీవులకు చెప్పబడినవే బలహీనమైన స్థానాలు, ఇంద్రియాలు బలమైనవి. అన్ని ఇంద్రియాలూ బలంగా ఉండే మానవుల గురించి చెప్పేదేమి?

రూపం మోహాన్ని కలిగిస్తుంది, దానిలో చిక్కితే శలభమే అవుతాము. రూపానికి కాదు గుణానికే ఇవ్వాలి విలువ. రూపం అశాశ్వతం. ఒకటే ఉదాహరణ మోహినీ రూపానికి చిక్కిన రాక్షసులేమయ్యారు?రూపానికి మురిసి, తెలిసి తెలిసి, అగ్నిని చూసి భ్రమసిన శలభంలా మానవులు ఇందులో చిక్కుకుని గిలగిలలాడతారు. అదే అగ్ని శలభన్యాయం.

జలాక్షర న్యాయం

జలం అంటే నీరు, అక్షరం అంటే నశింపులేనిదని అర్ధం, అదే అక్షరం. నీటి స్వభావం ప్రవహించడం, నిలకడ లేకపోవడం ’నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు’ సామెత. నిలకడ లేనిదాని మీద ఏది నిలుస్తుంది? మరోమాట శిలాక్షరం, అంటే శిలమీద రాయబడ్డ అక్షరం. నిలకడ గలిగిన శిలపై రాసిన అక్షరం కాలంతో నిలుస్తుంది. నిలకడ లేని నీటి మీద రాసిన అక్షరం మరు క్షణమే మాయమైపోతుంది, అసలు రాయబడుతుందా? జలాక్షరం అంటే నిలకడలేనిమాట, అదే నీటి మీద రాత.

తొందరపడి మాటివ్వద్దు, ఇచ్చిన మాట తిరిగిపోవద్దు.మాటిచ్చి విచారించద్దు, చేయిపట్టి వదిలేయద్దు.. ఒకటే పోలిక బలి చక్రవర్తి ఏమన్నాడు గురువుతో, ”ఏమైనా కానీ దానం ఇస్తానని మాటిచ్చా! ఇచ్చి తీరుతా!” అదీ శిలాక్షరం, లేకపోతే అది జలాక్షరమే! నీటిమీదరాతే!!

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s