శర్మ కాలక్షేపంకబుర్లు-పేను కొరుకుడు

పేను కొరుకుడుunnamed

నిజం చెప్పద్దూ! చాప చుట్టేద్దాం, ఓపికా తగ్గింది, అమ్మ కూడా అనుమతిచ్చినట్టే అనుకున్నా. దగ్గరగా ఇరవై రోజులపైమాట టపా రాసి ఈ బ్లాగ్ లో. కాని టపా రాయాలిసే వచ్చింది,కారణం ఏమనగా

భారతీయ వైద్యమంతా ప్రకృతి పరంగానే ఉంటుంది. కొన్ని కొన్ని వ్యాధులకి మందులు ఆధునిక వైద్యంలో ఉన్నా ఇబ్బందులే కనపడుతున్నాయి. వ్యాధి ప్రాణాంతకం కాకపోయినా మానసికంగా ఇబ్బంది పెట్టేదే, ఇటువంటి వాటిలో పేను కొరుకుడు ఒకటి.ఇదో చర్మ వ్యాధి. స్త్రీ,పురుషులు,చిన్న పెద్ద తేడా లేదు. సాధారణంగా తలమీద,గడ్డం మీద రావచ్చు. అలా వచ్చిన చోట జుట్టు ఊడిపోయి చర్మం బిరుసెక్కిపోతుంది. ఇది నెమ్మది నెమ్మదిగా వ్యాపిస్తుంది కూడా, అంద వికారంగా ఉంటుంది కూడా, అంటు వ్యాధి కాదు. మందేమిటి? అలోపతి వైద్యంలో హార్మోన్ ట్రీట్మెంట్ ఇస్తారు, వైద్యం ఖరీదైనదే. వైద్యం చేయిస్తే తగ్గుతుంది,మళ్ళీ మరోచోట వస్తూనే ఉంది. స్వయంగా ఈ వ్యాధిని పడి మా ఇంటిలోవారే బాధ పడుతున్నాం. చికిత్స చేయించినా మళ్ళీ మొదలుకే వచ్చింది. ఆయుర్వేద వైద్యం చేసేవారున్నారు
వారి దగ్గర కెళితే మందిస్తారంటే వివరాలు తీసుకుని వెళ్ళేం. రాశారు, పని చేసింది, పెద్దగా ఉన్నచోట జుట్టు వచ్చేసింది, మరొక చిన్నచోట రావాలి. నెలలోగా మామూలవుతుందని చెప్పేరు. వైద్యం ఉచితం. వారి దగ్గరకి వెళ్ళి మందు రాయించుకోవాలంతే. అవసరమైనవారు వారి సాయం తీసుకోవచ్చును.

“పరోపకారాయ ఫలన్తి వృక్షాఃపరోపకారాయ వహన్తి నద్యః
పరోపకారాయ చరన్తి గానః పరోపకారార్ధమిదం శరీరం.

పరోపకారము కొరకు చెట్లు ఫలాలనిస్తున్నాయి, పరోపకారం కొరకు నదులు ప్రవహిస్తున్నాయి, పరోపకారంకొరకు గాలి ప్రసరిస్తూ ఉంది, మన శరీరాన్ని భగవంతుడిచ్చినది పరోపకారం కొరకే సుమా! అని కవి హృదయం.

ఇటువంటి పరోపకార పరాయణులు శ్రీ కేశవరావుగారికి నమస్కారాలతో

పేరు శ్రీ కేశవరావు గారు
ఊరు గోకవరం. (తూగోజి) రాజమహేంద్రవరం నుంచి 30 కిలో మీటర్లు Good number of RTC buses
ఫోన్ 9948 733452

వారిని విసిగించకుండేందుకుగాను కొన్ని వివరాలు నేనే చెబుతున్నాను. మందు ఒక సారి రాస్తే చాలు పని చేస్తుంది. మందురాశాకా వారం దాకా తలంటకూడదు. మందురాసిన తరవాత జ్వరంరావచ్చు,భయపడక్కరలేదు, మందు వేయక్కరలేదు, జ్వరం ఒక్క రోజులో తగ్గుతుంది. మందు రాసిన చోట పొక్కులొస్తాయి,అంటే మందు పని చేసినట్టే అని అర్ధం. పొక్కులొస్తే దురద ఉంటుంది, కొద్దిగా నూనె చుక్క రాయండి దూదితో. ఇరవైరోజులకే జుట్టొచ్చేసింది,మా కేస్ లో. శ్రీ కేశవరావు గారి దగ్గరకి ఉదయం ఏడు నుంచి ఎనిమిది మధ్యలో వెళ్ళాలి. గోకవరం రాజమహేంద్రవరం నుంచి ౩౦ కిలో మీటర్లు, బస్సులు చాలానే ఉన్నాయి.వారిని అనవసరంగా విసిగించ వద్దని మనవి.మీరు వెళ్ళినపుడు వివరాలు వారే చెబుతారు,గమనించండి.వైద్యం ఉచితం.

చెప్పడం మరచానూ వారితో మాటాడి వచ్చేరోజు నిర్ణయించుకుని వారికి చెప్పి,వచ్చేటపుడు ఒక నిమ్మకాయ కూడా తెచ్చుకోండి,మందులోకి.

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పేను కొరుకుడు

 1. Sir, me Kona Ravi Kumar from Kakinada… following your Blogs since 4 years and tried to meet yourselves many times but failed…. requesting to know that Shri. Kesava Rao garu treats only particular skin problem or for Viti-ligo also , please help me providing his contact information as my younger daughter is suffering with above said problem…. with best regards .. Ravi kona (+ 91 9177666017).

  • Kona Ravi Kumar గారు,
   శ్రీ కేశవరావుగారు పేనుకొరుకుడుకు మాత్రమే మందిస్తారు. బొల్లికి కి మరే ఇతర వ్యాధికి మందివ్వరు.
   ధన్యవాదాలు.

   • రవి కుమార్ గారు,
    మన తూ.గో.జి లో రావులపాలెం దగ్గరున్న గోపాలపురంలో బొల్లి వ్యాధికి మందిచ్చేవారు,ఎం.ఏల్.ఎ సోమసుందర రెడ్డిగారి తండ్రిగారు. చాలా ప్రఖ్యాతి చెంది ఉండేది, దేశవిదేశాలనుంచి మందుకోసం వచ్చేవారు, చాలా కాలంగా ఇది జరుగుతున్నట్టులేదు. ఈ మాట చెప్పడం ఇలా జరిగేది సుమా అనేదాన్ని గుర్తుచేయడానికే సుమా
    ధన్యవాదాలు.

 2. నమస్కారం. మంచి సమాచారం ఇచ్చారు శర్మగారూ, దయచేసి, మీకు ఓపిక ఉంటేమాత్రం అప్పుడప్పుడైనా ఏదో ఒకటి రాయాలని నా విన్నపం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s