శర్మ కాలక్షేపంకబుర్లు-జోగి జోగి రాసుకుంటే…..

dscn0046

జోగి జోగి రాసుకుంటే…..

 మొన్ననో టపాలో ఒక అనామకం ఇలా శలవిచ్చారు :)”మీకూ పని లేదు,జిలేబికి పని లేదు.దొందూ దొందే! జోగి జోగి రాసుకుంటే బూడిదరాలిందని మీ టపాలో ఓ సామెత గుర్తుకొస్తోంది”

శాభాషూ! అనామకానికి ఎంత జ్ఞానోదయమయింది 🙂 జిలేబి తొమ్మిదేళ్ళనించి, నేను ఆరేళ్ళనుంచి పనిలేక ఈ బ్లాగుల్లో ఉన్నామన్నదే కదా ఆ సత్యం 🙂 ఒక జాతి పక్షులే ఒక చోటికి చేరతాయి కదూ! మాకు పనిలేక ఇక్కడ తిరుగుతున్నామన్న సత్యం తెలిసిన ఈ పక్షి కూడా, ఈ గూటిదే సుమా! మా చుట్టూ తిరుగుతున్న ఈ పక్షి నిజంగా పనిలేని……. ఆ సత్యం మరచిపోయింది, అదీగాక మమ్మల్ని ఇద్దరినీ దొందూ దొందే అన్న ఈ గూటి పక్షి కూడా సన్నాసే! అందుకే మాతో రాసుకుంటోంది. జోగి అంటే సన్యాసి,యోగి అనే అర్ధాలున్నాయి మరి. జిలేబికి ఈ పక్షి తెలిసినదేనన్న మాటా సూచనగా తెలుస్తోంది.

పుఱ్ఱెతో పుట్టిన బుద్ధి పుడకలతోకాని పోదని సామెత, ఏంటటా? తండ్రి శుక్లం,తల్లి శోణితం కలిస్తే ఏర్పడేదే బుఱ్ఱ. అది పది నెలల తరవాత భూమి మీదపడితే అది పుఱ్ఱె. ఈ పుఱ్ఱె రోజురోజుకీ ముదురుతుంది. దీనిలో బుద్ధీ ముదిరి పండాలి, కొన్ని పుఱ్ఱెలలో బుద్ధి పండదు, పుఱ్ఱె ముదురుతుందిగాని. ఇక పుడకలంటే కట్టెలు కదా! ఈ పుఱ్ఱెతో పుట్టిన బుద్ధి పుడకలమీద పెట్టే సమయానికే తిన్నబడుతుంది, ఎవరికీ, ఎందుకూ ఉపయోగపడక. దీనికేంగాని ఆ పక్షికి సామెత కూడా నా టపాలో నే దొరికింది, చిత్రం కదూ! ఇంత చక్కటి సామెతని ఇక్కడ సందర్భోచితంగా గుర్తుకు తెచ్చిన అనామకానికి ధన్యవాదాలు తెలుపుతూ విషయంలోకెళదాం 🙂

జోగులు బూడిద రాసుకుంటారు. నిజంగానే ఇద్దరు సన్నాసులు రాసుకుంటే బూడిదే రాలుతుంది, దొంగ సన్నాసులైతే ఇక చెప్పేదేముందీ, బూడిదతో పాటు చాలా రాలచ్చు. జోగి అంటే సంన్యాసి అనే అర్ధం ఉన్నట్టే, బూడిద అంటే విభూతి అని అర్ధం ఉంది. విభూతి అంటే వైభవం అని అర్ధం. ఏంటీ వైభవం,ఎవరిదీ వైభవం? తరచి చూస్తే, వెదకి చూస్తే అది భగవంతుని వైభవం, ఎలా? అదీ ప్రశ్న, నిజమైన సన్నాసైతే 🙂

ఇద్దరు పనిలేని సన్నాసులు కలిస్తే ఒక సన్నాసన్నాడు

అంతర్భ హిశ్చతత్సర్వం వ్యాప్య నారాయణ స్ధితం || 

లోపలా బయటా నాయణుడున్నాడయ్యా! వెతకి చూడాలంతే, ఉన్నవాడు నీలో ఉన్నాడు చూడు! ఎక్కడా? అనుకుంటే ఇదిగో ఇక్కడా! ఎలా ఉన్నాడు?

పద్మ కోశ ప్రతీకాశగ్ ౦ హృదయంచా ప్యదో ముఖం ||
అధో నిష్ట్యా విత స్త్యాన్తే నభ్యాముపరి తిష్టతి
జ్వాలమాలాకులంభాతి విశ్వస్యాయతనం మహః ||
సంతతగ్ ౦ శిలాభిస్తు లంబత్యాకోశ సన్నిభం
తస్యాన్తే సుషిరగ్ ౦ సూక్ష్మంత స్మిన్సర్వం ప్రతిష్టితం ||
తస్యమధ్యే నుహానగ్ని ర్విశ్వార్చిర్విశ్వతో ముఖః
సోగ్రభుగ్విభ జన్తిష్ట న్నాహార మజరః కవిహ్ ||
తిర్యగూర్ధ్వ మధ శ్శాయీర శ్మయస్తస్య సంతతా
సంతాపయతిస్వం దేహమపాద తలమస్తకం ||
తస్యమధ్యేవ హ్నిశిఖా అణీ యోర్ధ్వా వ్యవస్దితః
నీలతో యద మధ్య స్ధాద్విద్యుల్లెఖేవ భాస్వరా ||
నీ వార శూక వత్తన్వీ పీతభాస్వత్యణుపమా
తస్య శిఖాయామధ్యే పరమాత్మా వ్యసస్దితః ||

బొడ్డుకు పైన ఉన్న హృదయపద్మంలో నల్లని మేఘం మీద మెరిసే విద్యుల్లతలోని శిఖరం మీద అణువు రూపంలో ఉన్నాడని వేదం చెబుతోందన్నాడు. దానికి రెండో సన్యాసి అదే ఎక్కడా సరిగా చెప్పలేదు వితస్త అంటే ఏంటీ? అర్ధం చెప్పూ! అంటే నాకు తెలిసింది చెప్పేనన్నాడు, మొదటి సన్నాసి. రెండవ సన్నాసి ఇదిగో వితస్త అన్నది ఒక కొలత, పన్నెండంగుళాలు, అన్నాడు. ఈ చర్చ విన్న ఒక బుద్ధిజీవి పన్నెండంగుళాలుండదు ఆ దూరం, ఈ పదానికి అర్ధం జాన కావచ్చూ అని. మరొకరు దానితో ఏకీభవించారు. ఇంతలో మొదటి సన్నాసి కలగజేసుకుని ఇది ఎవరి కంఠం నుంచి హృదయానికి ఉన్నదూరం,వితస్త్యాంతే అంటే జాన చివర అనిభావం, ఎవరికి వారి జానకి సరిపోతుంది చూడండీ! అనడం తో అంతా ఏకాభిప్రాయానికొచ్చారు.

ఇంతలో మరో బుద్ధిజీవి మీరు నారాయణుని గురించి చేస్తున్న వర్ణన సైన్సూ ఒప్పుకుంటోంది, మన గుండెలోదీ సైనో ఆట్రియల్  నోడ్ అనే ఒక స్థానం ఉంది, దానినుంచి ఒక ఎలక్ట్రికల్ తరంగం వెలువడి గుండెను పని చేయిస్తుం! https://en.wikipedia.org/wiki/Sinoatrial_nodeదీనికి కొంత దూరంలో ఆట్రియో వెంట్రుకులర్ నోడ్ ఉంటుంది, ఈ రెండూ కలిస్తేనే గుండె పని చేస్తుంది. ఈ సైనో ఆట్రియల్  నోడ్ నుంచి విడుదలయ్యే విద్యుత్ ఎలా పుడుతుంది తెలియదు, ఇదే పరమాత్మ సుమా, దీనిని పైనుంచి ఇచ్చి గుండెను పని చేయిస్తున్నారు, ఇదే పేస్ మేకర్ అని చెప్పుకొచ్చారు.

images

images-1

దీని మీద మరొకొంత చర్చ జరిగితే ఏదో ఒక స్వరూపం,భావం ఏర్పడచ్చు. మా అనామకం జోగికి కూడా ఇది ఇష్టమయీ ఉండచ్చు, మా అనామకం జోగికి పుఱ్ఱె పండలేదింకా! భగవంతుని వైభవం తెలుసుకోడానికి. మా అనామకానికి నోరిచ్చాడు దేవుడు మాటా ఇచ్చాడు, దానిని సద్వినియోగం చేసుకునే అలవాటే మా జోగికి రాలేదింకా.. జోగీ జోగీ రాసుకోడం అంటే ఒళ్ళూ ఓళ్ళూ రాసుకోడం కాదు, బుద్ధీ బుద్ధీ రాపాడించడం, అంటే భగవంతుని వైభవం గురించి ఎవరికి తెలిసినది,అనుభవించినది వారు చెబితే,పెద్దలు చెప్పినదానితో పోల్చుకుంటే, నేటి విజ్ఞానంతో సరి చూసుకుంటే ఏర్పడే ఒక సమగ్ర అభిప్రాయమయింది కదా! అమ్మయ్యా! ఇదండీ జోగి జోగీ రాసుకోడం సంగతి, మరి మా అనామకం జోగికూడా ఇది అర్ధమయి ఉంటుందనుకోనా? అందుకే ఇంతమరీ మరీ చెప్పేను. చీమలు నడుస్తే రాళ్ళు అరుగుతాయన్నది పెద్దల మాట, నిజమా! అవును. అలాగే మా అనామకం జోగికి మరోమారు చెబితే నైనా అర్ధమవుతుందేమోనని ఆశ. అప్పటికీ అర్ధం కాకపోతే..మా అనామకానికి మిగిలేది నిజంగా నీఱే!

3 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-జోగి జోగి రాసుకుంటే…..

 1. శహభాష్ శర్మ గారు.
  అనామకం జోగికి బాగా బుద్ది చెప్పారు.

  శర్మ గారు మన్నించాలి . మీకు శహభాష్ చెప్పేటంత వాడిని కాదు.
  కానీ మిమ్మల్ని విమర్స చేసే వాళ్ళకి బాగా చెప్పారు అనే ఉద్దేశంతో రాసాను.

  చాలా బాగా చెప్పారు

  ధన్యవాదాలు.
  సర్వరాయుడు

  • రాయుడు గారు,
   శహభాష్ అన్న మాటను మన పల్లెలలో స్త్రీలు వ్యంగ్య,హాస్యాలను చెప్పేటపుడిలా సాగ దీసి శాభాషూ అనడం మామూలు,అందుకలా ప్రయోగించాననమాట.

   విషయం మంచిది పానకంలో పుడకలా ఇలా ఇబ్బంది పెడితే మరో టపా గిలికేను, చెప్పినదే మళ్ళీ చెప్పి. మిత్రులు ఫోటో లతో చెబితే అన్నారు. అందుకు వాటినీ జోడించానంతే.
   మీ అభిమానానికి.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s