శర్మ కాలక్షేపంకబుర్లు-దొంగ చెయ్యి కరుస్తాడే!

dscn0048

దొంగ చెయ్యి కరుస్తాడే!

”దొంగ చెయ్యి కరుస్తాడ”ని చెబుతుంటారు కదా దీని సంగతేమీ? దొంగ చెయ్యెలా కరుస్తాడు? చిన్న కత చెప్పుకుందాం అందరికి తెలిసినదేననుకోండీ!

  అనగా అనగా ఒక పల్లెటూరు, ఆ ఊళ్ళో లంకంత కొంపలో జాయ,పతి నివాసం,కలిగిన సంసారం. రోజూలాగే వీరు తలుపులన్నీ భద్రంగా గడియలు పెట్టుకుని ఒక గదిలో నిద్రకి ఉపక్రమించేరు. నిద్రలో ఉండగా అలికిడతే జాయ కి నిద్రాభంగం కలిగింది. లేచి చూచింది,ఏమీ కనపడలేదు, పక్క మీంచి జాయ లేవడంతో నిద్రాభంగం కలిగిన పతి ”ఏం లేచావని?” ప్రశ్నించాడు. ”అలికిడైతే చూస్తున్నాన”ని సమాధానమిచ్చింది. ”నీ అనుమానంగాని ఏం ఉండదు, ఏ పందికొక్కో తలుపు గీరి ఉంటుంది,వచ్చి పడుకో” అన్నాడు పతి,నిద్ర మత్తుతో. జాయ చేసేదిలేక వచ్చి పడుకుంది. మళ్ళీ కాసేపటికి శబ్దం వినపడితే లేచి చూచింది, ఏం అనుమానం కనపడలేదు, మళ్ళీ పడుకుంది. మాగన్నుగా నిద్ర పట్టింది. ఒక్కసారిగా మెలుకువొచ్చేటప్పటికి ఎవరో గదిలో తచ్చాడుతున్నట్టనిపించింది, దీపం ఆరిపోయి ఉంది. ఈ సారి నిర్ణయంగానే దొంగ లోపలికి చొరబడ్డాడనుకున్న జాయ నెమ్మదిగా కౌగిటిలో ఉన్న పతిని గిల్లి లేపి, నోరు మూసి, చెవిలో గొణిగింది,నెమ్మదిగా, ’దొంగ గదిలో దూరాడు, బంగారం,వెండి పట్టుకుపోతాడూ’ అని. పతి పెద్ద వీరుడు, అందుకు ”పడుకో” అని చెయ్యిపట్టి లాగేడు. పతి ధైర్యానికి విస్తుపోయిన జాయ నెమ్మదిగానే, మొగుణ్ణి విదిలించుకుని లేచి చీకటిలోనే తడుముకుంటూ బంగారం,వెండి,విలువైన వస్తువుల్ని మూటకడుతున్న దొంగ చెయ్యి పట్టుకుంది, ధైర్యంగా. దొంగని పట్టుకుని ”ఏమండీ! దొంగ!దొంగ!! నా బంగారం ఎత్తుకుపోతున్నాడ”ని అరిచింది. ”లేవండి! దొంగని చెయ్యిపట్టుకుని ఆపేను”అనీ చెప్పింది. ఆడ కూతురు ధైర్యంగా చెయ్యిపట్టుకునేటప్పటికి దొంగకి మతిపోయి నిలబడిపోయాడు, ఏంచెయ్యాలో తోచక. ఇది విన్న పతికి వెన్నులోంచి వణుకే వచ్చి ”ఒసేవ్! దొంగ చెయ్యి కరుస్తాడే!” అన్నాడు. ఆడకూతురు, దొంగతనానికికొచ్చిన తనను ధైర్యంగా చెయ్యి పట్టుకోడంతో ఏమి చెయ్యాలో తోచక నిలబడిపోయిన దొంగ, ఈ మాటతో తెలివి తెచ్చుకుని గబుక్కున జాయ చేతిని కొరికి, కట్టుకుంటున్న మూట వదిలేసి పారిపోయాడు, బతుకు జీవుడా! బతికేనురా దేవుడా అనుకుంటూ.

చెయ్యికరిచి పారిపోయిన దొంగను పట్టుకోలేక బాధ పంటి బిగువున భరిస్తూ జాయ దీపం వెలిగిస్తే పతిదేవుడు మంచం మీంచి కాలు కిందపెట్టేడు. దొంగ బీరువాలోంచి తీసిన నగలు చిందరవందరగా పడుంటే ఏరుతూ జాయ “మీ మగాళ్ళకి బుర్రుండి చావదనుకుంటానండీ! దొంగవెధవ, నేను చెయ్యి పట్టుకునేటప్పటికి బుర్ర పని చెయ్యక నిలబడిపోయాడు, తమరు ”చెయ్యికరుస్తాడే” అన్న తరవాతే నా చెయ్యి కరిచి, విదిలించుకు పారిపోయాడు.” అంది. ఇంతకీ జాయ పతిని తిట్టిందా? దొంగని తిట్టిందా?

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-దొంగ చెయ్యి కరుస్తాడే!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s