శర్మ కాలక్షేపంకబుర్లు-వీరివీరి గుమ్మడి పండు……..

dscn0028

వీరివీరి గుమ్మడి పండు……..

   ”వీరివీరి గుమ్మడి పండు వీరి పేరేమి?” ఇదొక ఆటకి ఉపయోగించే మాట. పాతకాలంలో ఒక ఇంట్లో నలగురురైదుగురు ఆడమగ పిల్లలుండేవారు, చుట్టు పక్కల పిల్లలు, అన్నదమ్ముల పిల్లలు ఇలా కలిస్తే, పదిమంది ఐతే తక్కువమాట. ఈ పిల్లని ఒక తల్లి తాను కూచుని ఉండి ఈ ఆట ఆడించేది. ఇందులో పంటలేసుకోడం దగ్గరనుంచి పిల్లలకి సంఘీభావం తెలిసేది. ఆ తరవాత ’దొంగ’ ’తల్లి’ ఒడిలో కూచుని ఉండగా ఎదురుగా ఒక పిల్లో, పిల్లాడో నిలబడి ఉండగా, దొంగ చేతిని ఎదురుగా నిలబడ్డ పిల్ల,పిల్లవాని చేతిలో వేసిన ’తల్లి’ అనేది ”వీరివీరి గుమ్మడిపండు వీరిపేరేమి?”అని, అంటే ’దొంగ’గా కూచున్నవారు ”లల్లక్క” అంటే నిజంగా అది లల్లి ఐతే దొంగైనట్టు లేకపోతే ’తల్లి’ ”లల్లక్కా పారిపో” అంటే ఆ చేతిలో చెయ్యి వేసిన వారు పారిపోయి దాక్కునేవారు. ఇలా ఎవరిని సరిగా గుర్తించి చెప్పలేకపోయినవారు, దాక్కునవారిని వెతుక్కుంటూ వెళ్ళి ముట్టుకోవాలి, అలా దొరికిపోతే దొరికినవారు దొంగ, దొంగ ముట్టుకోకుండా దొంగకి దొరక్కుండా పారిపోయి వచ్చినవారు తల్లిని ముట్టుకుని వెనక చేరేవారు, తల్లిని ముట్టుకున్న తరవాత వారిని దొంగ ముట్టుకున్నా ఉపయోగం లేదు. ఇలా ఆట కొనసాగేది. ఈ ఆట చూడడానికి వినోదంగా ఉన్నా దీనిలో చాలా అంశాలు ఉన్నాయి.

పిల్లలకి జ్ఞాపకశక్తి మీద పరిశ్రమ, అక్కడున్న పిల్లలందరి పేర్లు గుర్తుండాలి. రెండవది పిల్లలకి తమలో బాంధవ్యాలు,వరసలు అవగాహనకి సావకాశం. పక్కింటి పిల్లలు కూడా వరసలతో పిలుచుకోవడంతో ఆత్మీయత, వయసొచ్చాకా వారూ వీరు బంధువులు కాకపోయినా అనుబంధాలుండిపోవడం,జీవితంలో ఒక గొప్ప చిక్కని అనుభూతి. ఈ తరవాత పిల్లలకి పరుగుతో చిన్నపాటి శ్రమ. ఆ తరవాత కళ్ళు మూసుకుని కూడా దగ్గరకొచ్చినవారిని అడుగుల చప్పుడు,స్పర్శ, వాసన ద్వారా గుర్తించే నేర్పు. ప్రతివారి శరీరంనుంచి ఫెరొమోన్స్ విడుదలవుతాయి, ఎవరివి వారివే,ప్రత్యేకత కూడా. ఒక చిన్న ఉదాహరణ చెబుతా, చిన్నపుడు అమ్మ చంక దిగక ఏడ్చేవాణ్ణట. అప్పుడో పెద్దావిడ ”లచ్చమ్మా! నీ చీరొకటి వాడి దగ్గర పడేసి దాని మధ్యలో కూచోబెట్ట”మని సలహా ఇస్తే అమ్మ అలా చేసిందట. నేను హాయిగా అమ్మ చీరతో ఆడుకుంటూ ఏడుపు మానేశానట.. ఇదేంటి ఒక పరిశీలన, ఆ పెద్దావిడ చెప్పినది, ఆవిడకి ఈ ఫెరొమోన్స్ వగైరా తెలియకపోవచ్చు, కాని అనుభవం పెద్ద పాఠం చెప్పింది కదా! ఇలా ఈ ఆట పరిశీలనకు దోహద పడుతుంది.

    ఈ పరిశీలన గురించో మాట చెబుతా! పాలకొల్లులో ఉండగా నాకు పది చిన్న ఎక్ఛ్ంజిలైనా ఉండేవి,చిన్న ఊళ్ళలో. రోజు ఉదయమే ఏడుగంటలకి ఆ ఊళ్ళనుంచి లైన్ మన్లు అక్కడి పరిస్థితి చెప్పేవారు, ఇబ్బందులు,ఫాల్ట్స్ వగైరా. ఒక ఊరినుంచి ఒక లైన్ మన్ పేరు సుబ్బారావు, ఇతను ఫోన్ చేస్తే అతను మాటాడేలోగానే ”ఆ( చెప్పు సుబ్బారావు” అనేవాడిని, అతను ఆశ్చర్యపోయేవాడు, ఫోన్లో నేనే పిలిచానని ఎలా కనుక్కున్నారనేవాడు, ఎప్పుడూ చెప్పలేదు ఆ రహస్యం. ఆ తరవాత మరో ఊరు లైన్మన్ ఇతని పేరు శంకరుడు, ఇతన్నీ ఇలాగే చెప్పేసేవాణ్ణి, ఇదేదో పత్తేదారిలా కాకుండా వారు చాలా ఆనందపడేవారు,బ్రహ్మ విద్య కాదు,ఉపాసనా కాదు, పరిశీలన అంతే!

ఫోన్ లో వారేనని ఎలా చెప్పేవాణ్ణి? సుబ్బారావు ఊపిరులు దీర్ఘంగా ఉండేవి, అవి ఫోన్ లో వినపడేవి,అతని మాటకి ముందు. ఇక శంకరుడు ఉహు,ఉహు అంటూ ఉండేవాడెప్పుడూ. వీరికి వాటి ద్వారా నేనువారిని గుర్తిస్తున్నానన్న సంగతి తెలియదు, అదీ రహస్యం.

నెట్ లోకొచ్చిన తరవాత వ్యాఖ్య రాసినవారెవరు పరిశీలించే అలవాటు చేసుకున్నా! వారిమాట తీరు,శైలి వగైరాలు గమనించడం బాగా అలవాటయింది. ఆ తరవాత వారు మాటాడేమాట ఎందుకంటున్నదీ గుర్తించే అలవాటు చేసుకున్నా! ఇలా ‘Reading between the lines’ అలవాటయింది 🙂

ఒక మనవరాలు లండన్ నుంచి అనామకం గా వ్యాఖ్యలు రెండు రాసింది. నేను అమ్మాయ్! అని సంబోధిస్తూ సమాధానమిచ్చేశాను, ఇంకేముంది 🙂 విన్నకోటవారు పట్టేసేరు, ఆ కామెంట్లు పెట్టినది అమ్మాయని ఎలా చెప్పేరూ అని. అది నా పరిశీలన మాత్రమే! ఈ అమ్మాయి ఇదివరలో కామెంట్లు పెట్టినట్టు లేదు, నాకు తెలియదు కూడా. ఎలా కనుక్కున్నాను? మాట రాస్తే దాని వెనక మనసు అర్ధం చేసుకోడం,ఎవరై ఉంటారని కొద్దిపాటి పరిశీలన అలవాటు చేశా. రెండు కామెంట్లు దగ్గర దగ్గర టైములో వచ్చాయి గనక వేరు కాదు, అదీగాక గ్రావటర్ బొమ్మ ఒకటే! అందుచే ఒకరే చేసిన కామెంట్లవి. అమ్మాయి గోగుపూల పచ్చడి తప్పించి అన్నీ లండన్ లో కూడా తింటున్నాం అన్నమాట ఆడవారు మాటాడే పద్దతిలో ఉంది, రెండో కామెంట్ ను కూడా కలుపుకుంటే అందులో తెలుసుకోవాలనే కుతూహలం కనపడుతుంది, అలసందలు బొబ్బర్లు ఒకటేనా అని, ఈ పాతిక ముఫై ఐదేళ్ళ మధ్య అమ్మాయి కుతూహలం కనపడుతుందా మాటలో, చివరగా తాతగారు అన్న సంబోధన, ఈ కామెంట్ రాసినది మనవరాలే అని ధృవ పరచేసింది, ఎందుకంటే ఆడవారు అభిమానం వ్యక్తం చేస్తారు, మగవారికీ అభిమానం ఉంటుందిగాని వారు అంతగా వ్యక్తం చెయ్యలేరు. వీటిని దృష్టిలో ఉంచుకుని ఆ కామెంట్లు మనవరాలే చేసిందని, ఆ అమ్మాయి వయసుకూడా పాతిక ముఫై ఐదు మధ్య ఉండచ్చనీ నా అంచనా! ఎందుకంటే అంతకంటే ఎక్కువ వయసైతే తప్పక బాబాయ్ అనేదే! ఇదీ పరిశీలన 🙂 వ్యాఖ్య రాసేవారి పరిపక్వత వారు రాసే భాషలో, శైలిలో ప్రస్ఫుటంగా కనపడుతుంది, వారు రాసిన కామెంట్ వెనక హృదయం కూడా కనపడుతుంది…

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s