శర్మ కాలక్షేపంకబుర్లు-జీవిత సమరంతొలిరోజులు-ట్రైనింగ్

dscn0040

జీవిత సమరంతొలిరోజులు-ట్రైనింగ్

    మర్నాడు దరఖాస్థు పూర్తిచేసి ఇచ్చేసేను, దాన్ని పంపేస్తున్నానని చెప్పేరు,ప్రెసిడెంట్ గారు. ఇప్పుడు అసలు సమస్య బయటికొచ్చింది. నేటిలా నాటిరోజుల్లో ప్రయాణ సాధనాలు లేవు, రాజమంద్రి రోజూ వెళ్ళిరావడం జరగనిపని, పోనీ సైకిల్ మీద అంటే రోజూ రానుపోను దగ్గరగా నలభైకిలోమీటర్లు సైకిల్ తొక్కడం సాధ్యమా! కుదరని పని. రాజమంద్రిలో ఉండాలంటే తక్కువలో తక్కువ వంద రూపాయలు కావాలి,నెలకి. ట్రైనింగ్ ఫీస్ వగైరా ఎంతలేదన్నా సంవత్సరానికి వెయ్యి రూపాయలు కావాలి, జరిగేలా కనపడలేదు, ఆలోచించా,ఏం చెయ్యాలీ,అని. షావుకారు సుబ్బారావుగారి దగ్గరకెళ్ళి విషయం పూర్తిగా చెప్పను, ఆయన విని అమ్మ చేత నోట్ రాయించమన్నారు, నేను మాటాడలేదు, ఏం అన్నట్టు చూశారు. నా బాధ చెప్పుకున్నా! అమ్మ చేత ఇంకా నోట్లు రాయించడం నా వల్లకాదు, మీరు నా మీద నమ్మకం ఉంచి సొమ్మివ్వండి, నేను ఇంకా మేజర్ కాదుగనక నేను నోట్ రాసిచ్చినా చెల్లదు గనక నా మీద నమ్మకం ఉంచమన్నా! మరోమాట కూడా, ఇప్పటికి అమ్మ మీకివ్వాల్సిన సొమ్ము కూడా మేజర్ అయ్యాకా నేనే జమ చేయాలి,మీకు. నేను మేజర్ అయ్యాకా అన్ని నోట్లు తిరగరాయమంటే రాస్తా. ఈ సంవత్సరం లోపు నా మీద దయ ఉంచి నమ్మకముంచి సొమ్మివ్వండి, అది కూడా ఒక్కసారిగా కాదు, నెలనెలా వందివ్వండి, అన్నా! ఆయనేమనుకున్నారో తెలియదుగాని, మీ మీద నమ్మకంతో డబ్బిస్తాను, బాగా చదువుకోండి, ఇదుగో రెండు వందలని సొమ్ము చేతిలో పెట్టారు. ఇంటికొచ్చి జరిగినదంతా అమ్మకి చెప్పేను. మరుసటివారంలో రాజమంద్రిలో ట్రైనింగ్ లో చేరాను.

రాజమంద్రిలో ఆనంద్ భవన్ అని మెయిన్ రోడ్ లో హోమియో షాపు పక్కన ఒక భోజనాలయం ఉండేది, దానిలో నెలకి అరవై రూపాయలు. గది ఎనిమిది మంది శ్రీకాకుళపు సత్యానందం గారి మేడమీద, ఆర్యాపురం, ఫైర్ స్టేషన్ పక్క వీధి,నెలకి నావాటా పది రూపాయలు, చిల్లర ఖర్చులు, సిగరెట్ల ఖర్చు, చూసి చూసి కాల్చుకున్నా, అప్పుడప్పుడు సినిమాలు, ఇలా కాలం గడచిపోయింది.. ఇందులో ఒక స్నేహితుడు దొరికాడు తీర్థులు పేరు.. ఒక రోజు చెయ్యి పట్టుకున్నాడు ఒరే ఎందుకురా ఇంత చదువుతావు, నువ్వు ఇందులో ఉండవురా అన్నాడు చెయ్యి చూసి, అదేమన్నా! నువ్వు ఈ డిపార్ట్మెంట్ లో ఉండవురా మరో టెక్నికల్ ఉద్యోగానికి పోతావు, అదికూడా దూరంలో లేదూ అన్నాడు, ఏమో! నిజమెంతో గాని వాడి మాట మాత్రం నన్నిప్పటికి వెంటాడుతూనే ఉంది, వాడెలా చెప్పేడూ అని.

అప్పటిదాక చదువుకున్నవి,ఇంగ్లీషు,తెలుగు,లెక్కలు, సైన్స్,సోషలు అదికూడా మిడి మిడి జ్ఞానమే

ట్రయినింగ్ లో
History
World Co-operative movement
Indian co-operative sector

Law
Indian Constitution (in brief)
Criminal procedure code(in brief)
Civil procedure code(in brief)
Laws of Indian co-operative sector
Laws of Andhra Pradesh

Banking
Reserve Bank of India
State bank of India
Scheduled Banks
Stock Exchange
Stock Market, stock in trade
Rural India Banking

Book- keeping.
Double entry Book keeping (Botliboi)
Four column Cash book
Bank reconciliation statement
Profit and loss accounts.
Assets and Liabilities statements.

Economics
Rural poverty
Indian economy
Macro, micro economics etc

కొన్ని కొన్ని చెప్పడం మరచానేమో కూడా. Finally to say, I am a rolling stone which gathered no moss 🙂 Now, some people may laugh at me for narrating all these details 🙂

చదువైపోయింది,ఫలితమూ వచ్చింది. ఫస్టు క్లాస్ లో పాస్ అయ్యా! లా లో మాత్రం డిస్టింక్షన్ వచ్చిన గుర్తు 🙂

కొండలరావు గారికో అభినందన పత్రం పంపింది సంస్థ, ప్రతిభగల అభ్యర్ధిని పంపినందుకు. ఆయన బ్రహ్మానందం చెందారు, అక్కకి చెబితే, తన స్వంత తమ్ముడే ఘనకార్యం చేసినంత ఆనందపడింది, నా పరిస్థితి తెలిసినది కనక, ఇంకా చదువుకుంటే ఆర్ధిక సాయం చేస్తానని మాటిచ్చింది, సున్నితంగానే తిరస్కరించాను. అమ్మ ఆనందానికి మేర లేదు. మళ్ళీ మొదలుకే వచ్చింది సమస్య. ప్రతిభ ఉండచ్చు గాని గుర్తించేవారుండద్దూ? ఉద్యోగం ఇచ్చి ప్రోత్సహించేవారేరీ? ప్రెసిడెంట్ గారు బేంక్ లో పని చెయ్యండి,అప్రెంటిస్ గా, జీతం ఇవ్వలేనన్నారు. మీరేం చెబితే అలాగే అని అక్కడ పని చేయడం మొదలెట్టా. ఎందుకీ జీతం బత్తెం లేని ఉద్యోగమని కొందరు నవ్వేరు కూడా….. మూడు నెలలయింది, ప్రెసిడెంట్ గారిని కలుస్తూనే ఉన్నా! ప్రయత్నం చేస్తున్నట్టు చెబుతున్నారు. నేను నా ప్రయత్నం చేస్తే కొంతమంది పెద్దలను కలవను కూడా కలవలేకపోయా! అదీ వారితో చెప్పుకున్నా…సమస్య తీరలేదు,ఉద్యోగం రాలేదు…..

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s