శర్మ కాలక్షేపంకబుర్లు-మహాభారత యుద్ధానికి దూరంగా ఉన్నవాళ్ళెవరు?

మహాభారత యుద్ధానికి దూరంగా ఉన్నవాళ్ళెవరు?

మహాభారత యుద్ధంలో ప్రపంచం లో, నాటికి ఉన్న రాజులంతా పాల్గొన్నారు. జనాభాలో స్త్రీలు పిల్లలు తప్పించి యువకులు ఎవరూ మిగలలేదు. కాని ఆ యుద్ధానికి దూరంగా ఉండిపోయినవాళ్ళిద్దరున్నారు. ఒకరు రుక్మి, రెండవవారు బలరాముడు.

బలరాముడు శ్రీకృష్ణుని అన్నగారు. ఆయనకి యుద్ధం అంటే భయమేం లేదుగాని, అన్నదమ్ములు ఇలా తలపడటం ఇష్టం లేకపోయింది. ఆయన యుద్ధానికి ముందుగా ధర్మరాజు దగ్గరకొచ్చి, ఈ అన్నదమ్ముల కలహం తనకు నచ్చలేదని, తమ్ముడైన కృష్ణునికి ఈ కలహాన్ని మాన్చమని చెప్పినా వినలేదని చెప్పి, తానకి ఇరువైపులవారూ సమానమేనని చెప్పి, ఈ యుద్ధానికి దూరంగా తీర్థయాత్రలు చేస్తున్నట్లు చెప్పి వెళిపోయారు.

రుక్మి గుర్తొచ్చాడా? రుక్మిణీ దేవి అన్న, శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవిని తీసుకుపోతుంటే వెనక తరిమి యుద్ధం చేసి, యుద్ధంలో చాల లేకపోతే, రథ చక్రానికి కట్టేసి, కత్తి దూసి, తల తరగడానికి బదులు, ప్రేయసి కోరికపై బావగారి మీసము,తల సగం సగం గొరిగి వదలిపెట్టబడినవాడు, శ్రీకృష్ణునిచే. యుద్ధానికి ముందు తన బలగంతో ధర్మరాజు దగ్గరకొచ్చి యుద్ధం అంటే భయమైతే చెప్పు కొరవులని ఓడించేస్తానని అంటే అర్జునుడు ఆ భయమేలేదు, మీరు మరెవరికైనా సాయం చేయచ్చని చెప్పి పంపేశాడు. రుక్మి దుర్యోధనుని దగ్గరకెళ్ళి నీకు సాయం చేస్తానంటే నమస్కారం పెట్టి వద్దని చెప్పి పంపేశాడు.

అలా మహాభరత యుద్ధానికి దూరంగా ఉన్న బలరాముడు, రుక్మి ఇద్దరూ కూడా శ్రీ కృష్ణునికి కావలసినవారే కావడం చిత్రం…ఇందులోనూ చిన్న తేడా ఉంది గమనించారా? బలరాముడు రెండు పక్షాలవారినీ కాదన్నారు, రుక్మిని రెండు పక్షాలవారూ తిరస్కరించారు అదీ తిరకాసు. ఇలా యుద్ధానికి సహాయం చేస్తానంటే వద్దని వెనక్కి పంపబడినవాడు చరిత్రలో రుక్మి ఒక్కడే!పదిమందితో చావు కూడా పెళ్ళిలాటిదే అని నానుడి, ఇలా అందరిచేత విసర్జింపబడటం……

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మహాభారత యుద్ధానికి దూరంగా ఉన్నవాళ్ళెవరు?

 1. నమస్కారం !మహాభారత యుద్ధానికి బలరాముడు దూరంగా ఉన్నాడని తెలుసు కాని రుక్మి సంగతి తెలియదు .మంచి సంగతి తెలియ జేసినందుకు ఎప్పటిలాగే ధన్యవాదాలు ….. డా..సుమన్ లత

  • dr.r.Suman lata గారు,
   భారతం ఒక సారి చదివినదే ఐనా మరో సారి చదివితే మరో కొత్త అర్ధం స్ఫురిస్తుందండి, కొత్త సంగతీ తెలియచ్చు.
   భారతం ఏ వయసులో చదివితే ఆ వయసుకు తగినట్టు, ఏ మానసిక పరిణితితో చూస్తే అలా కనపడుతుందండి.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s