శర్మ కాలక్షేపంకబుర్లు-కళ్ళుపోతాయిరా!

కళ్ళుపోతాయిరా!

పాతరోజుల్లో పెద్దాళ్ళు చూడకూడనివి చూస్తే కళ్ళు పోతాయిరా అనేవారు, నిజమా! చాలా చూశాం, ఏం మా కళ్ళుపోలేదేం, పత్తికాయల్లా బాగానే ఉన్నాయి, మీ అంధ విస్వాసాలని,మూఢ విశ్వాసాలని, మా మీద రుద్దకండని అబ్బో! రెచ్చిపోయాం. పాపం పెద్దాళ్ళు ”నీకర్మకి నేను కర్తనుకాదురా! రోజొస్తుంది, కళ్ళుపోతాయి,అప్పుడేడుద్దువులే” అని ఆశీర్వదించారు. నిజంగానే ఆ రోజులొచ్చినట్టే ఉన్నాయి. అదేదో యూనివర్సిటీవాళ్ళు పరిశోధన చేసి చెప్పేరట చూడకూడనివి చూస్తే పాక్షిక అంధత్వం కలుగుతుందీ, అలా అలవాటుగా చూస్తే పూర్తి అంధత్వం కలుగుతుందీ అని. గాడిద గుడ్డేం కాదూ, ఎవరిమాటా వినం,చూస్తాం, కళ్ళున్నంతవరకూ చూస్తాం, పోతే ఏడుస్తాం.. 🙂

వేసంకాలం పరుగేట్టుకొచ్చేసింది, ఎప్పుడూ? శివరాత్రి రోజునే! వేడిమి నలభై కిదగ్గరగానే ఉంటోంది పగలు, రాత్రికి కూడా ఇదేం తగ్గటం లేదు, కారణం చుట్టూ ఉన్న సిమెంట్ భవంతులు, పగలంతా వేడిని గ్రహించి,రాత్రి వేడిని వదలిపెడుతున్నాయి. ఎవరింటా పచ్చని చెట్టే లేదు,మాకు తప్పించి, కాని ఉపయోగం లేదు,ఒంటికాయ సొంటి కొమ్ముతో.

రాత్రి వేడిమి కూడా గదిలో ముఫై దాటి ఉంటోంది, ఎప్పుడూ ఏ.సి వేసుకుని తప్పించి ఉండడం కష్టం లాగానే ఉంది, కావలసినంత కరంటో అంటారు, ముఖ్యమంత్రిగారు, నిజమే కావచ్చు కాని, అదేమో సరిగా మద్యాహ్నం ఒంటిగంట,రాత్రి నిద్ర పట్టే సమయం ఇలా మంచి సమయంలో ఒకటి రెండు గంటలు కరంట్ పీకేస్తేగాని, కరంట్ వారికి కళ్లు చల్లగా ఉండవు, ఇదేమో తెలియనిది.

డెస్క్ టాప్ ముందుగదిలో ఉంటుంది, పగలు,రాత్రి అక్కడ కూచోడమే కష్టం, ఎటొచ్చి తెల్లవారుగట్ల రెండు గంటలు నాలుగునుంచి, అంతే. మిగిలిన సమయం ఏ.సిలోనే. మొదట్లో ఒక పంపురాయి నా జేబులో పడేసి సెల్ ఫోన్ అలవాటు చేశారు,ఇంట్లోవాళ్ళు,వద్దంటున్నా వినక. అందులో వినపడేదికాదు. అలా ఉంటే దాన్ని మార్చేసి మరొకటి సాంసంగ్ E-350 మోడలుట ఇది చాలా పల్చగా ఉంది, ఐదంగుళాలలోపు పొడుగు రెండున్నరంగుళాల లోపు వెడల్పు. దీనిలో తెర రెండుంపాతిక, వెడల్పు రెండంగుళాల లోపు. దీనికి స్పీకరు,ఎన్ని హంగులో. స్పీకర్ పెట్టుకున్నా చెవులు వినపడాలిగా 🙂 అది నా దగ్గరలేనిదేనని కొంతమంది మిత్రులకి కూడా స్వానుభవం, రామాయణం అంతా విని రాముడికి సీతేమవుతుందని ప్రశ్నించినట్టు, అంతా వినేసి ఏమన్నారూ అంటుంటే. పగలు డెస్క్ టాప్ దగ్గర కూచోడమే అసాధ్యం, నెట్ లోకి రాకుండా ఉండలేని రోగం, మరెలా? దీనికి చికిత్స చేసేరు, అదే ’జియో’ట. కొత్తలో కార్డ్ తీసెయ్యమన్నా! తప్పదుగా అదే మళ్ళీ వేయించుకున్నా, కొత్తలో కష్టంగా ఉండేది, దాన్ని దారిలోకి తెచ్చా. ఇంత చిన్న ఫోన్ లో ’జియో’ కార్డ్ మీద నెట్, ఓపెరా మిని బ్రవుజర్ లో 4G టకటకా లోడ్ అయిపోతోంది. అక్షరాలు అలుక్కుపోయినట్టుంటుంటే, జూం చేస్తే, బెదురుచీమ (చాలా చిన్నదైన నల్ల చీమ) తలకాయల్లా అక్షరాలు కనపడుతున్నాయి, చదువుతుంటే నిజమే ’కళ్ళుపోతాయిరోయ్’ అన్న ఆశీర్వచనం నిజమేననిపించిందండీ!

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కళ్ళుపోతాయిరా!

 1. మా శ్రీకాకుళం లో మంచి వేసవిలో కూడా సాయంత్రానికి చల్లబడిపోతుంది.రాత్రి 25 డిగ్రీలు మాత్రమే ఉంటోంది.ఫాన్ వేసుకుంటే చాలు.జూన్ నెలలోనే ఉక్కపోత ,చమట, ఎక్కువ గా ఉంటాయి.కాని ఈ వూరు కూడా క్రమంగా కాంక్రీట్ జంగిల్గా మారుతోంది ప్రస్తుతానికి పరవా లేదు..ఐనా మామూలు ఫోన్ వాడకుండాఎందుకు స్మార్ట్ ఫోన్?

  • M.V.Ramanarao గారు,
   ఈ మధ్యకాలంలో కట్టడాలు బాగా పెరిగిపోయాయి. మా పల్లెటూరిలో దగ్గరగా అరవై దాకా అపార్ట్మెంట్ బిల్డింగులున్నాయండి, మాదగ్గరే ఒక పది ఉన్నాయి. రోడ్లన్నీ సిమెంటే,ఇక చెప్పేదేమి?

   పిల్లలిస్తే వాడేసేను, కళ్లు ఇబ్బంది పడుతుంటే వాడకం మానేశాను.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s