శర్మ కాలక్షేపంకబుర్లు-మేనత్త కొడుకా?

మేనత్త కొడుకా?

”ఆయనెందుకు ఉపకారం చేస్తాడయ్యా! నేనేమైనా మేనత్త కొడుకునా?” అంటూ ఉంటారు. ఇదే కాక మీరు అధికార దుర్వినియోగంతో అవతలివారికి ఉపకారం జరిగేలా చేశారంటే, ”ఆయన నాకు మేనత్తకొడుకేం కాదులేవయ్యా” అంటుంటారు. ఇంకా వివరించాలనుకునేవారు ”ఆయన నాకు మేనత్త కొడుకూ కాదు,నేనాయన మేనమామ కొడుకునీ కాదు” అంటుంటారు. మనకు కావలసినన్ని వరసలున్నాయి కదా తల్లి,చెల్లి,బావ,మరది, అన్న,తమ్ముడు ఇలా….మరి ఈ మేనత్తకొడుకు అనే ఎందుకంటారు? 🙂

అర్జునుడు, అతనొక్కడే ఏంలెండి, పాండవులు అందరూ శ్రీకృష్ణునికి మేనత్త కొడుకులే. అందునా అర్జునుడు బావకూడా కదా! అదే సుభద్ర భర్త కూడా. మేనత్తకొడుకే బావైతే ఆ మజాయే వేరు 🙂 ఒరే బావా అనచ్చు,అదే పైవాడైతే బావగారూ అనాల్సిందే కదా! ఇక మేనమామ కూతురే ఇల్లాలైతే,పైకి చెప్పుకుంటే బావోదులెండి 🙂 ఆ చనువే వేరు ”మా అన్నయ్య చెప్పినదాంటో తప్పేముందీ” అని సాగదీయడానికీ బాగుంటుంది 🙂 డొక్కలో పొడిచి.

అసలు మేనత్త కొడుకుగా శ్రీకృష్ణుడు పాండవులకు చేసిన ఉపకారమేంటని కదా! చెప్పుకుంటూపోతే మొత్తం భారతమే!! ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడాడు, చివరిదేగాని చివరిమాటకాదు, అర్జునునికి సారథిగా ఉన్నాడు. అదేం సారథ్యం అంత గొప్పపనా అనకండి. నిజంగా సారథ్యం అంటే చెప్పుల కాళ్ళతో తన్నులు తినడం. అదేంటని కదా తమ అనుమానం అవధరించండి 🙂

రథంలో సారథి గుర్రాల కళ్ళేలు పట్టుకుని ’నొగలు’లో కూచుని ఉంటాడు, దీనినే బండిలో ’తొట్టి’ అంటారు.
రథికుడు అంటే యుద్ధం చేయవలసినవాడు, రథంలో ఆయుధాలుంచుకుంటాడు, రథంకి ఇరువైపులా చక్ర రక్షకులుంటారు,చక్రాలని కాపాడుతూ. రథికుడు యుద్దం నిలబడి యుద్ధం చేస్తున్నవాడు, తనని తాను రక్షించుకోవాలి,సారథిని రక్షించాలి, చక్ర రక్షకులని రక్షించుకోవాలి. నిజానికి అక్కడ యుద్ధంలో ఆత్మరక్షణకి కూడా ఆయుధం లేనివాడు సారథి మాత్రమే!

రథికుడు తనను తాను రక్షించుకుంటూ, సారథిని, రథాన్ని, చక్ర రక్షకుల్ని రక్షించుకుంటూ శత్రువు పైన అస్త్ర, శస్త్రాలేసి చంపాలి, ఇన్ని పనుల్లోనూ సారథికి సూచనలివ్వాలి. రథం ఎటువెళ్ళాలి,ఎటు తిరగాలి, ఎక్కడాగాలి, ఎక్కడ ముందుకు నడిపించాలి, ఎంత వేగంగా కదలాలి, అన్నది. సూచనలివ్వడం ఎలా? ఇంత హడావుడిలోనూ? నోటితో కుదరదు,వినపడదేమో కూడా, ఆ రణగుణద్వనిలో. అందుకు, ఎడమ, కుడి కాళ్ళతో, సారథి డొక్కలో ఎడమవైపు, కుడివైపు తన్నుతూ, సూచనలిస్తాడు. రథికుడు కాళ్ళకి ”ముచ్చెలు” అంటే బూట్లలాంటివి వేసుకుని ఉంటాడు, వాటితో సారథి డొక్కల్లో తన్నుతుంటాడు. అంటే సారథి ఎంతవాడైనా రథికుని కాలి తాపులు తినక తప్పదు. శ్రీకృష్ణుడు ఆర్జునుని చెప్పులకాలి తన్నులు తిన్నాడు, సారథ్యం చేసి.

శ్రీకృష్ణుని పెద్దలు చెఱబోయారా కాలితాపులు తిని అర్జునునికి సారథ్యం చేయడానికి? సామాన్యులనుకునే మాట మేనత్త కొడుకు కనక కాలితన్నులైనా తిని సారథ్యంచేసి యుద్ధం గెలిపించాడు,అంటారు. అదండి అలా మేనత్తకొడుకా ఉపకారం చెయ్యడానికన్నది జన సామాన్యానికి చేరింది, భారతం నుంచే.

సారథ్యం గురించిన విషయ సేకరణ: శ్రీ చాగంటివారి ప్రవచనంలో విన్న గుర్తు.

స్వగతం: తెల్లవారుగట్ల కూడా కంప్యూటర్ దగ్గర ఎక్కువ కాలం కూచోడమే కష్టమవుతూ ఉంది.

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మేనత్త కొడుకా?

  • సిరిమల్లెలు,

   అమ్మాయ్! శీత కన్ను కాదమ్మా!! ఎండ,వేడి చాలా ఎక్కువగా ఉన్నాయి. పగలు నలబై దాటే ఉంది వేడి, రాత్రి నలభైకి దగ్గరగా ఉంటోందంటే అతిశయోక్తి కాదు. తలుపులు తీసుకుని బయటికొస్తే పొయ్యిలోకొచ్చినట్టే ఉంటోంది. డెస్క్ టాప్ ఏ.సి రూం లో లేదు, లోపల పెట్టుకునే సావకాశమూ లేదు. బయట రూంలో డెస్క్ టాప్ దగ్గర కూచుంటేగాని రాసేందుకు లేదు. తెల్లవారుగట్ల కూడా ఫేన్ తిరుగుతున్నా చమటలు దిగబోస్తూనే ఉన్నాయి. కొత్త టపాలు రాసేందుకు అనుకూల పరిస్థితులు లేవు. నిన్న పగలు రాత్రి కూడా చాలా వేడి చాలా దారుణంగా ఉంది.
   https://kastephali.wordpress.com/ కష్టేఫలే(పునః ప్రచురణ)
   పై బ్లాగులో పాత టపాలు మరల ప్రచురిస్తున్నా! కామెంట్లుంటే చూసి,సమాధానాలిచ్చి వెళిపోతున్నానమ్మా! ఇంతకు మించి చల్లబడేవరకు ఏమీ చెయ్యలేననే అనిపిస్తూ ఉంది.

   మీ అభిమానానికి
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s