శర్మ కాలక్షేపంకబుర్లు-కారప్పొడి.

కారప్పొడి.

దీనినే కరివేపాకు కారప్పొడి,ధనియాలపొడి లేదా కారప్పొడి అంటారు. నేటి కాలంలో దీన్ని పేకట్లలో అమ్ముతున్నారట, ఇందులోకి కావలసిన సరుకులు.

ధనియాలు.
శనగపప్పు.బాలెంతకోసం చేసే కారప్పొడిలో శనగపప్పు వెయ్యరు
మినపపప్పు.
జీలకర్ర.
ఎండు మిర్చి.
కరివేపాకు.
చింతపండు ఉట్లు లేనిది
ఉప్పు
పసుపు
వెల్లుల్లి రేకలు ఇష్టమైనవారు వేసుకోవచ్చు, పోపులోనే వేసి వేయించుకోవచ్చు. కారప్పొడ్డి వేడి చేస్తుంది. వెల్లుల్లి మరికాస్త వేడి చేస్తుంది.

మూకుడు కాలేసి సరుకుల్ని చెప్పిన పద్ధతిలో వేయించండి.

మూకుట్లో తగిన నూనివేసి కాగిన తరవాత శనగపప్పు,మినపపప్పు దోరగా వేయించండి.ఆ తరవాత ధనియాలు వేయండి వేగుతుండగా జీలకర్ర వేసి వేయించండి.ఆ తరవాత ఎండు మిర్చి వేయండి. కమ్మని వాసనొచ్చిన తరవాత కరివేపాకు వేసి వేయించండి. కరివేపాకు పచ్చిగా ఉండిపోతే బాగోదు. దించిన పోపుకి కొద్ది పసుపు చేర్చండి, తగిన ఉప్పు చేర్చండి. చింత పండు ముద్దను చిదిపెయ్యండి. వీటన్నిటిని మిక్సీలో వేసి తిప్పండి, మరీ మెత్తగా అక్కరలేదు, బరకగా ఉన్నా బాగానే ఉంటుంది. రుచి చూడండి,ఎక్కువ తక్కువలు సరి చేయండి. దీనిని ఒక స్టీల్ డబ్బాలో గాలి చొరని దానిలో నిలవ చేయండి.

ఆకలిలేకపోవడం, రుచు లేకపోవడాన్ని అరికడుతుంది. బాలెంతలు కూడా వాడచ్చు. జ్వరపడి పత్యం తీసుకునేవారు ముఖ్యంగా తీసుకోవాలి. ఒక స్పూన్ పొడి రెండు ముద్దల వేడి అన్నంలో కరిగిన నేతితో తీసుకుంటే బాగుంటుంది. ఉదయం ఇడ్లీ టిఫిన్ లోకీ నేతితో బాగుంటుంది.

ఇందులోని ధనియాలు హృదయానికి,రక్తప్రసారానికి మంచి మందు. జీలకర్ర గురించి చెప్పెదేమి? ఎండు మిర్చి కేన్సర్ కారకాల్ని అణిచేస్తుంది. వెల్లుల్లి గురించీ చెప్పక్కరలేదు. ఇందులో ఉన్నవన్నీ మందులే, రుచికరమైన మందులు.

ప్రకటనలు

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కారప్పొడి.

  1. వేడి వేడి ఇడ్లీ లలో , కొబ్బరి పచ్చడి తో పాటుగా , కారప్పొడి , ఆ కారప్పొడి మీదే వేసిన కమ్మని నెయ్యి !
    ఉదయమే ప్లేటులో ఉంచి వడ్డిస్తే , అయిన వాళ్ళ సమక్షం లో కబుర్లు చెప్పుకుంటూ ,
    తింటూ ఉంటే, ————————- ఆ అనుభూతులే ప్రత్యేకం !
    మరి ఏ , ఏ పాళ్ళలో అవి వేసుకొని మర వేసుకోవాలో కూడా చెప్పండి శర్మ గారూ ! 

    • సుధాకర్ జీ,
      శనగపప్పు వగైరాలన్నీ సమానంగా తీసుకుంటే చాలు. జీలకర్ర,ధనియాలు ఎక్కువైతే కొంచం వాసనఏస్తుందంతే!వీటికి సరిపడ మిర్చి. కొద్దిగా ఆవగింజలూ వెయ్యచ్చు పోపులో, చెప్పడం మరిచాను పురటాలుకి పెట్టే కారప్పొడిలో శనగపప్పు వెయ్యరు. అన్నీ గుప్పెడు గుప్పెడు తీసుకుంటే కరివేపాకు దోశడైతే చాలు. ఏది ఎక్కువైతే దాని వాసన ఉండిపోతుందంతే!
      వేడి వేడి ఇడ్లీ కారప్పొడి,నేతితో ఇల్లాలితో కబుర్లు చెప్పుకుంటూ తింటే! ఆ రుచేవేరు కదండీ!! 🙂
      ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s