శర్మ కాలక్షేపంకబుర్లు-అతి చేస్తే……..

అతి చేస్తే……..

అతిచేస్తే గతి చెడుతుందన్నది తెనుగు నానుడి. తెనుగువారు ఫలితం కూడా చెప్పేరు. అదే సంస్కృత పండితులు అతి సర్వత్ర వర్జయేత్ అని చెప్పి ఊరుకున్నారు, ఫలితం చెప్పకుండా. ఫలితం చెప్పడం కూడా అతి చేసినట్టే అని వారి భావం కావచ్చు.

పిల్లలు ఉట్టిన వెంటనే పాలుతాగడం నేర్పుతారు. ఆ తరవాత నిలబడ్డం, పడిపోకుండా నడక నేర్పుతారు. ప్రమాదం జరక్కుండా కాపూ కాస్తారు. ఆ తరవాత ఏ చొక్క వేసుకోవాలో,ఎలా వేసుకోవాలో నేర్పుతారు, ఎలా చదువుకోవాలి, ఏం చదువుకోవాలి చెబుతారు. కావలసినది, నచ్చినదాన్ని ఎన్నుకోవడం నేర్పుతారు, ఆపై ఉద్యోగం, జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంకి సలాహా లిస్తారు. పిల్లలిప్పుడు పెద్దవారై తమ జీవితం తాము నడుపుకుంటూ ఉంటారు. ఇప్పుడు పెద్దవారు నడకలో పడిపోతావని చెప్పరు, ఆ అవసరం లేదు గనక. అలాగే జీవితంలో ఆటుపోట్ల గురించి కూడా ఎక్కువగా పెద్దలు కలగజేసుకోవడమూ మంచిది కాదు. ప్రతి విషయానికి పెద్దలు కలగజేసుకుంటుంటే పిల్లలెపుడు నేర్చుకుంటారు? సైకిల్ నేర్చుకునేటపుడు పట్టుకున్నాం వెనక అన్న ధైర్య్ం తోనే ముందుకు దూసుకుపోయినట్టు, పెద్దలు వెనక ఉన్నారన్న భావం ఉండాలి కాని నిత్యం కలగజేసుకుంటే, అతి చెయ్యడం అవుతుంది, అప్పుడు గతీ తప్పుతుంది.

ఈ మధ్య జరుగుతున్న రెండు సంఘటనలు చూద్దాం.

రేమాండ్స్ సామ్రాజ్యాధి నేత వెయ్యికోట్ల రూపాయల తన షేర్లు, కొడుకు మీద ప్రేమతో ఇచ్చేశాడు, చిల్లికానీ కూడా ఉంచుకోకుండా! ఇప్పుడు ‘కొడుకు వీధిన పడేశాడో’ అని వీధినపడ్డాడు, గుండెపోటొచ్చి హాస్పిటల్లో చేరేడు…. అతిచేస్తే జరింది కదా!

మరొహటి! పెద్ద కంపెనీ, ప్రమోటర్లు చాలా కష్టపడి నిర్మించిన సామ్రాజ్యం. వయసైపోయి తప్పుకోవాల్సి వచ్చింది. వెనకుండి నడిపిస్తే ఆనందం కదా! జరిగిందేమిటి? ”సి.ఇ.ఒ గా పదవి చేపట్టిన రోజునుంచి చెప్పులోని రాయి లాగా గొలుకుతుంటే ఏం చెయ్యనూ?” రాజీనామా చేస్తే ఏమయింది. ఇది పెద్దవాడిగా నీకు తగదని ప్రమోటర్ నే తిడుతున్నారు. సి.ఇ.ఒ రాజీనామా చేస్తే ఏమయింది? పెద్దాయన ఇబ్బందుల్లో పడలేదా? నలుగురు నాలుగు మాటలనటం లేదా? రాజీనామా చేసినాయనకి మాత్రం ఇబ్బంది కాదా? ఇంతకంటే మరో మాట షేర్ హోల్డర్లకి కంపెనీ మీద నమ్మకం తగ్గటం లేదా?

అతి సర్వత్ర వర్జయేత్!నేర్చుకోవలసిన జీవిత పాఠం ఉందంటారా?

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అతి చేస్తే……..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s