శర్మ కాలక్షేపంకబుర్లు-sixth letter O square L

sixth letter O square L

అవి స్వాతంత్ర్యం వచ్చిన తొలిరోజులు. తెల్లదొరల స్థానాల్లో నల్లదొరలు, పరిపాలకులుగా, అధికారులుగా కుదురు కుంటున్న కాలం. కొత్తగా అధికారులుగా కుదురు కుంటున్న నల్లదొరలలో రిటయిర్డ్ మిలిటరీ ఆఫీసర్లు కూడా ఉండేవారు. కోస్తా జిల్లాలలో ఓ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసూ. తనిఖీ కొస్తున్నట్టు తంతి వార్త, ఆఫీస్ సిద్ధమైయింది. చిన్నదొర ఎదురెళ్ళి స్టేషన్ నుంచి పెద్ద దొరని తీసుకొచ్చాడు. మిలిటరీ ఆచారం ప్రకారంగా పెద్ద దొరొచ్చేటప్పటికి అందరూ వరుసలలో నిలబడి పెద్దదొరకి స్వాగతం చెబుతుండగా చిన్న దొర సిబ్బందిని పెద్దదొరకి పరిచయాలు చేస్తూ వచ్చాడు.

ఆఫీస్ తనిఖీ మొదలయింది, కొత్తగా వచ్చిన ఓ కుర్రగుమాస్తాకి పెద్ద దొరకి వాదన మొదలయింది, తనిఖీ రెండవరోజు. పెద్దదొర కుర్ర గుమాస్తా చెప్పినదంతా విని చివరికి ‘It seems you are a fool’ అనేశాడు. ఒక్క క్షణం ఆఫీస్ సూదిపడితే వినపడేటంత నిశ్శబ్దం అయిపోయింది. కొద్ది క్షణాల తరవాత, ఆఫీస్ వారంతా తేరుకుని ఎవరిపనిలో వాళ్ళు పడిపోయారు, పెద్దదొర మరో పనిలో పడ్డాడు. కాని, కుర్రగుమాస్తా ఉడికిపోయాడు,ఏం చెయ్యలేడు. ఎదుటివాడు పెద్ద ఆఫీసరు, ఓపిక పట్టేడు..

చివరిరోజైన మూడో రోజు పెద్దదొర వీడ్కోలు సందేశమిచ్చి, వరుసలో నిలబడ్డ ఒక్కొకరితో చేతులు కలుపుతూ వస్తున్నాడు. కుర్ర గుమాస్తా దగ్గరకొచ్చేటప్పటికి, కుర్ర గుమాస్తా ‘I refuse to shake hands with a fool’ అనేశాడు. ఒక్క సారి మళ్ళీ అంతా నిశ్శబ్దం, పెద్దదొర తేరుకుని ముందుకెళిపోయి, కారెక్కేసేడు.

అంతా చూస్తూ ఉన్న చిన్నదొర పిసుక్కుంటున్నాడు, పరుగున పెద్దదొర ఎక్కిన కార్ దగ్గర నిలబడి, కుర్ర గుమాస్తాపై ఏం చర్య తీసుకోమంటారని అడిగాడు, వినయంగా. పెద్దదొర చిరునవ్వు నవ్వి You are a sixth letter O square L అనేసి వెళిపోయాడు.

మా సీనియర్లు చెప్పుకునే ఆఫీస్ కతల్లో ఇదోహటి.

9 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-sixth letter O square L

 1. బాబాయిగారు ,
  ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు, పిన్ని గారు త్వరలో ఆరోగ్యం గా తిరుగాలని కోరుకుంటున్నాను.
  మీకూ మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు.
  రాజేశ్వరి.

  • చిరంజీవిని రాజేశ్వరి
   దీర్ఘాయుష్మాన్భవ
   దీర్ఘసుమంగళీభవ

   నూతన సంవత్సరం నీకు మరిన్ని శుభాలు సమకూర్చాలని మా ఆకాంక్ష, శుభకామనలు.

   నీ పలుకు అమృతపు చిలుకై పిన్నిలో మరింత ఆత్మ విశ్వాసం పెంచింది, కోలుకుంటాననే ధైర్యాన్నీ నింపింది తల్లీ! నీ కామెంట్ చూపించాను తనకి, చాలా ఆనంద పడింది, మాటలకందని అనుభూతి.
   ధన్యవాదాలు.

  • అమ్మాయి రాజేశ్వరి,

   నేను బానే ఉన్నాను. ఇల్లాలి అనారోగ్యం చాలా కాలం నుంచి ఉంది, అది ఎక్కువై గత రెండు నెలల పైగా మంచం దిగటం లేదు. వైద్యం జరుగుతోంది. ఆమెను కనిపెట్టుకు ఉండిపోతున్నాను. మరే విషయాలు పట్టించుకోటం లేదు. అందుకు బ్లాగుల జోలికి రావటం లేదమ్మా!
   మమ్మల్ని ఆప్యాయంగా తలుచుకున్న నీ మంచి మనసుకి జోహారు.
   కొద్ది కాలంలో మళ్ళీ ప్రజలలో పడతామనుకుంటున్నాం, ఇల్లాలి ఆరోగ్యం కుదుటపడుతోంది.
   ధన్యవాదాలు.

  • అక్కడేమో విన్నకోట వారు
   మీ దయ రాదా అని పాడేస్తున్నారు దీక్షితులు గారు

   మీరేమో బ్లాగ్సన్యాసం పుచ్చేసుకున్నారు

   కుశలమేనా ?

   పునర్దర్శన మెప్పుడండీ ?

   జిలేబి

   • జిలేబిగారు,
    ఇల్లాలి అనారోగ్యంతో ఇబ్బందులు,కష్టాలు. కాకపోయినా నారదాయనమః తప్పించి మరేం కనపట్టం లేదే 🙂
    ధన్యవాదాలు.

   • మినిమం నారదాయ నమః అయినాఉంది చూసారూ దాని కై నా వీర తాడు వేయాలె 🙂

    బదులిచ్చారు సంత సం

    త్వరగా కో లు కో వా లని ఆశిస్తో

    ಜ಼ಿಲೆಬಿ

   • జిలేబి గారు,
    మీ పై కూలైతే అర్ధమే కావు, మాటలూ అర్ధం కావటం లేదు. 🙂
    ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s