శర్మ కాలక్షేపంకబుర్లు-బందెల దొడ్డి

బందెల దొడ్డి

బందెల దొడ్డి అంటారు కాని అసలు మాట బందీల దొడ్డి అనేది నా మాట 🙂 ఎవరా బందీలు, ఎక్కడుండేవని కదా తమ అనుమానం అవధరించండి.

పల్లెలలో పశువులు స్వేఛ్ఛగా తిరిగేవి, గ్రామ కంఠాలలో మేసేవి. గ్రామ కంఠాలంటే గ్రామానికి సంబంధించి ఉమ్మడి స్థలాలు, ప్రభుత్వానివే! కొన్ని గొడ్లు గ్రామకంఠాలలో మేస్తూ కూడా పక్క పొలాలలో పడి పైరును పాడు చేస్తే రైతులు బయటికి తోలేసేవారు. ఐనా కొన్ని దొంగ గొడ్లకి ఇలా పై పొలాల్లో మెయ్యడమే అలవాటు. అవెవరి గొడ్డో తెలిస్తే వారికి చెప్పి అదుపు చేసుకోమనే వారు. అలా చెప్పినా వినిపించుకోని సందర్భం లోనూ, ఎవరి గొడ్డో తెలియని సందర్భంలోనూ ఆ గొడ్డును బందీ చేసి మునసబు ఆధీనం లో ఉన్న బందీల దొడ్డికి తరలించేవారు. ఇలా చేరిన పశువుకు మేతతో సహా అన్నిటిని గ్రామ నౌకరు చూసేవాడు. పశువు తప్పిపోతే బందెలదొడ్లు వెతుక్కునేవారు, ప్రతి ఊళ్ళోనూ ఒక బందెల దొడ్డి ఉండేది. తన పశువు బందెలదొడ్డిలో కనపడితే ఆ మున్సబు దగ్గరికిపోయి ఎన్ని రోజులనుంచి ఆ పశువు దొడ్డిలో ఉన్నదో దానికి తగిన మూల్యం, జరిమానా చెల్లించి మరలా ఇంటికి తోలుకుపోయేవారు. ఆగండి..ఆగండి ఇది వింటూంటే ఏదో గుర్తొచ్చిందంటారా నేటి కాలపు విషయం 🙂

కేంప్ రాజకీయాలని బందెల దొడ్డి రాజకీయాలని వీటికి పేరుష.మా వాళ్ళా రోజుల్లో అలా అనేవారు. ముచ్చటైన విషయం, తెలుసా! ఇవి దేశంలో ఎక్కడ మొదలయ్యాయో? దీనికి మొదటివారం మేమే!! ఈ ఆలోచనకి మాదే పేటెంట్ హక్కు. మా జిల్లాలో అనగా తూగోజిలో మా ఊరికిదగ్గరలో ఉన్న ఒక పంచాయతీ సమితికి నాటి రోజుల్లో ఎన్నికలు జరిగాయి. అధ్యక్షుడిని ఎన్నుకోడానికి సమయం ఉండిపోయింది, పంచాయితీ ప్రెశిడెంట్ల ఎన్నిక పూర్తయినా. కప్పల తక్కెడ రాజకీయం, ఆయారాం గయారాం లంతా మా తరవాత వారే సుమా! ఆ రోజుల్లో ఉన్నది ఒకటే పార్టీ అదే కాంగ్రెస్, అందులో రెండు వర్గాల మధ్య పోరు. కప్పలతక్కెడలాగా ఇటూ అటూ గెంతి పక్షాలు మార్చకుండేందుకుగాను, మా ప్రాంతంలోని రాజకీయ చాణుక్యుడొకరు పంచాయతి ప్రెసిడెంట్లందరిని బస్సులో బెంగుళూరు ( బెంగలూరుకి బందెలదొడ్డి రాజకీయాలకి ఏదో అవినాభావ సంబంధం ఉండే ఉంటుంది)పంపించి తిరిగి వచ్చేటప్పుడు తిరుపతి వేంకన్న బాబు దర్శనం చేయించి గుళ్ళు కొట్టించి, ఒక్కొక్కరికి ఒక పచ్చ కండువా కప్పి ఎన్నిక సమయానికి ఎన్నిక స్థలానికి చేర్చారు. నిజం! దానిని ఆ రోజుల్లో ముచ్చటగా చూశాం, పచ్చటి గుండుతో (గుండు మీద స్వామివారి శ్రీగంధపు పూతతో) పచ్చ తువ్వాలు కప్పుకుని బస్సు దిగుతున్న సర్పంచులని చూసి తరించినవారం. ( అప్పటికి తెలుగుదేశం పార్టీ పుట్టలేదు) అలా బందెల దొడ్డి రాజకీయానికి మొదటివారం, ప్రారంభకులం.

నేటి కాలం బందెలదొడ్డిలో సెల్ ఫోన్ లు కూడా ఊడ బెరుక్కున్నారట, ఆ కాలంలో సెల్ ఫోన్ లు లేవు, మామూలు లేండ్ ఫోన్ లే తక్కువ. నాటి కాలానికి గొప్ప హోటల్లో బస, మందు,విందు,పొందు కార్యక్రమాలు అని నాటి సర్పంచ్ లు గుర్తు చేసుకుంటుంటారు.

మీరీ పాటికి వారెవరో గుర్తించి ఉంటారు గా! నేటి రాజకీయాలు చూస్తుంటే టపా తన్నుకొచ్చేసింది, నా ప్రమేయం లేకనే! 🙂

3 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-బందెల దొడ్డి

  1. ఎం చెప్పారు గురు వర్యా….
    మొన్నటి నించీ ఈ బండెల దొడ్డి అనే మాట మీద మా ఇంట్లో గొప్ప తగువైపోనాది.
    తన వారంతా కాషాయం కప్పుకొన్నవారైనట్టు …వాళ్ళని నేనేదో లోకువ చేసినట్టు మా శ్రీమతికి మహా ఉక్రోషం.
    అసలు చెప్పదల్చుకున్నది వేరే సంగతి.
    చిన్నప్పుడు ఒకసారి, మా పొలం లో మేస్తున్న పక్కవూరి గేదెల్ని …వాటి బుద్ధ పాలేరు తో సహా బండెల దొడ్లో పెట్టి తాళం వెయ్యడం …పాపం ఆ చిన్న కుర్రాడిని లోపల పెట్టినందుకు నా వీపు సాఫు చేయించు కోవడం ,అదీ తాటి మత్త తో ..ఇంకా గుర్తే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s