పరిచయం.
శ్రీకృష్ణ రాయబారం ముగిసింది. వీడ్కోలివ్వడానికి తోడెళ్ళిన కర్ణుని ద్వారా పాండవుల యుద్ధ ప్రకటన తెలిసిన తరువాత, సభలో ఉన్న భీష్ముని వద్దకు దుర్యోధనుడు చేరి ”తాతా! ఇరు పక్షాలలో, వీరులలో నీకు తెలియనివారు లేరు,ఎవరెంతవారో వివరించవా?” అని అడిగాడు. విన్న తాతగారు ”చెబుతావిను” అని మొదలు పెట్టేరు.
నీవు అతిరథుడవు, నీతమ్ములంతా రథిక శ్రేష్టులు. నా గురించి నేను చెప్పుకోడం బాగుండదు, నా గురించి అందరకూ తెలిసినదే అని, మిగిలినవారందరి బలాలు చెబుతూ చివరకు కర్ణుడు ’అర్ధ రథుడు’ అన్నారు. ఇది విన్న కర్ణుడు కోపంతో ఊగిపోతూ ముసలితనం లో మతి తప్పి మాటాడుతున్నావు నీవే అర్ధరథుడివి అన్నాడు. ఇది విన్న సుయోధనుడు కలగజేసుకుని మీ ఇద్దరిని నమ్ముకుని బాధ్యత మీకప్పగించాను, మీరిద్దరూ ఇలా కొట్లాడుకోడం అంటూ…… తాతా మిగిలినవారి గురించి చెప్పూ అన్నాడు.
పాండవుల గురించి చెబితే నీ మిత్రుడికి కోపం వస్తుంది, నువ్వేమనుకుంటావో చెప్పలేను, మధ్యలో నాకేల నయ్యా ఈ తగులాటం అని బాధపడ్డారు భీష్ముడు. చెప్పు తాతా అని అనగా… పాండవులబలాలు చెబుతూ శిఖండి మహారథుడు అతనిని నేను చంపలేనయ్యా అన్నారు. ”తాతా! అదేల!! ఆ విషయం వివరంగా చెప్పమంటే……భీష్ముడు చెప్పినదే తరవాత…భాగాలలో…చాలా పెద్ద కథ..చిన్న చిన్న భాగాలుగా…..
నామాటగా శిఖండి పరిచయం :- శిఖండి పాండవుల సేనలో ఒక అక్షౌహిని సేనకు నాయకుడు, దృష్టద్యుమ్నుని, ద్రౌపదిల కు అన్నగారు, ద్రుపదుని పెద్ద కుమారుడు, మహావీరుడు. కౌరవుల బలంలో సగం బలాన్ని ద్రుపదుని కుటుంబమే నాశనం చేసింది. శిఖండి భీష్ముని పడగొట్టేడు, దృష్టద్యుమ్నుడు ద్రోణుని పడగొట్టేడు, ఇంక మిగిలిన వీరులను పాండవులు నంచుకున్నారు…
నిజమేనండి. అయితే ఇటువంటి సంగతి కూడా “అనామకం” గా వ్రాయడమెందుకండీ?
విన్నకోట నరసింహారావు గారు
తల్లి తండ్రి పెట్టిన పేరు చెప్పుకోలేని వారి దురవస్థ ఏమో తెలియదు కదండీ
ధన్యవాదాలు
విష్ణు సహస్రనామాలలో శిఖండి కూడా ఉంటుందండి.