పరితాపం.
తప్పు చేయనివారు లేరు. తప్పు చేయడం మానవ సహజం, దిద్దుకోవడం దైవత్వం.
మొన్న ఆగస్ట్ నెలలో కష్టాల్లోనే ఉన్నాం. ఆరవ తేదీ ఉదయమే ఒక మెయిల్ వచ్చింది. చూశాను,నా కళ్ళను నేనే నమ్మలేకపోయా! నిజమా!! ఎవరేనా సరదాకి చేస్తున్నారా!!! మానుతున్న గాయాన్ని కెలుకుతున్నారా అని మథన పడ్డాను. వితర్కించి చూసి నిజమని నమ్మించింది, బుద్ధి.
ఆ మెయిలిదే.దీనిలో కొంత భాగం తీసేశాను, ఆ చిన్నారి స్వవిషయాలందులో ఉన్నందున.
“నమస్కారం శర్మ గారు,
చాల రోజుల తరువాత మీరు గుర్తొచ్చారు. కాని మీ బ్లాగ్ పేరు గుర్తురాలేదు. చాలా సేపు పదాలాను పెత్తి వెతికితే చివరికి కనిపించింది. మీ పోస్టులు చూడగానే గతం లో జరిగిన చాలా విషయాలు మనసుకి మెదిలాయి. కాని అప్పట్లో నేను మీ మనసుని కష్టపెట్టినందుకు క్షమించండి. మీకున్న అక్షర ఙానం తో అద్భుతమైన విషయలను మాకు తెలియచేస్తున్నందుకు కృతఙతలు.
నా వ్యక్తిగత విషయాలు కొన్ని మీకు చెప్పాలనిపించింది. రాస్తున్నాను.
……………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… నాకు ఉన్న ఒక వ్యాపకం కొత్త విషయాలు తెలుసుకోవటం. నేనే రాయాలంటే ఉన్నదంతా కష్టమే. ఆ ఆలోచనల నుండి భయటకి రావడానికి నేను ఏర్పరచుకున్న వ్యాపకం మిమ్మల్ని ఇబ్బంది కలిగించినందుకు మరొకసారి క్షమాపణ అడుగుతున్నాను. ఇప్పుడు నేనే ఓ బ్లాగ్ రాస్తున్నాను. నా అనుభవాన్నే రాస్తున్నాను. అన్ని రాస్తున్నాను. గతం, వర్తమానం రెండింటిని కలిపి రాస్తున్నాను. ఎవరివి కాపీ చెయ్యటం లేదు. ఏదేమైనా ఒక తప్పు చెయ్యకుండా ఆదిలోనే హెచ్చరించినందుకు కృతఙతలు.
Thanks & Regards
Girija kandimalla
“If you want happiness for a lifetime – help the next generation.”
ఒక రోజు ఆగి మరునాడుదయమే సమాధానమిచ్చాను.
విషయం గుర్తొచ్ౘి ఉండచ్చు. కొద్దిగా చెబుతా…
మూడేళ్ళ కితం నా బ్లాగులో టపాలను కొన్నిటిని ఈ చిన్నారి తన బ్లాగులో ప్రచురించుకుంది తనవిగా. నా కళ్ళ పడితే అడిగితే నన్ను తిట్టింది, పిచ్చివాణ్ణని ప్రచారమూ చేసింది. ఆ సందర్భంగా కొన్ని టపాలూ రాశాను. విషయం మరుపునా పడుతోంది కానీ, ఈ చిన్నారిని బాధపట్టెంది, ఫలితమే ఇది.
నా సమాధానం
“గిరిజగారు,
నమస్కారం.
…….మీ మెయిల్ చూసి అవాక్కయ్యను. ఇంతకాలం తరవాత నన్ను తలుచుకునే అవసరం ఎందుకొచ్చిందో చెప్పలేదు. గతం గతః.
మీ వ్యక్తిగత విషయాలు నన్ను కలవరపెట్టాయి,బాధ పెట్టాయి. అశక్తుడిని మాట సాయం చేయగలనేమో! కష్టంలో ఉన్నాను.
ఎప్పటికి మీరు ఆయురారోగ్య ఐశ్వర్య సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటా.
మీరు గుర్తు చేసుకుని మెయిల్ ఇచ్చినందుకు
ధన్యవాదాలు.”
చిరంజీవి గిరిజ మరల నాకిచ్చిన మెయిల్
”నమస్కారం శర్మగారు.
ఓకసారి వెనుదిరిగి చూసుకున్నాను. నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలని నా బ్లాగ్ లో రాసుకునేటప్పుడు గతం తాలూకూ సంఘటనలు కూడా చాలావచ్చాయి…………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………….. మీరు అక్షర ఙానం ఉన్న వాణీ పుత్రులు. మీలాంటివారి ఆశీర్వచనం ఎల్లవేళ్ళలా ఉండాలని ఆశిస్తున్నాను.
Thanks & Regards
Girija kandimalla
“If you want happiness for a lifetime – help the next generation.””
చిరంజీవి గిరిజను మనసారా మరల ఆశీర్వదిస్తున్నాను.
దీర్ఘాయుష్మాన్భవ.
దీర్ఘ సుమంగళీ భవ
తప్పు దిద్దుకున్న చిరంజీవి గిరిజను మీరూ ఆశీర్వదించవలసినదిగా కోరుతున్నా! నేను కష్టాలలో ఉన్నందున వెంటనే టపా రాసి విషయం చెప్పలేకపోయినందుకు విచారిస్తున్నాను.
క్షమించమని అడగడం, క్షమించడం బహు అరుదు. మీరు చేసి చూపెట్టారు.
అన్యగామిగారు
ఎప్పుడో మూడేళ్ళ కితం జరిగిన సంఘటన. అందరూ మరచారు, నాకూ మరుపున పడుతున్నదీనూ, కాని ఆ చిన్నారి మరువలేకపోయింది. దాని ఫలితమే ఇది. ఇది ఆమె విజ్ఞతకి ఉదాహరణ. సాధారణంగా నిత్య జీవితంలో ఇటువంటి సంఘటనలు జరగడం బహు అరుదు. ఈ చిన్నారి ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది. జీవితంలో ఆమె కష్టాలనుంచి గట్టెక్కిఆనందంగా జీవితం గడపాలని,పిల్లా పాపలతో వర్ధిల్లాలని మరొక సారి ఆశీర్వదిస్తూ
దీర్ఘాయుష్మాన్భవ
దీర్ఘసుమంగళీభవ.