శర్మ కాలక్షేపంకబుర్లు-వజ్రం వజ్రేణ

వజ్రం వజ్రేణ

వజ్రం వజ్రేణ భిద్యతే అనేది సూత్రం, అంటే వజ్రం చేతనే వజ్రం కోయబడుతుంది. సృష్టిలో బహు కఠినమైనది వజ్రం. అటువంటి దానినికోయాలంటే మరో వజ్రమే కావాలి.

ఏనుగు బలమైనది. అటువంటి ఏనుగును లొంగదీసుకోడానికి మరో ఏనుగే కావాలి. లొంగదీసుకోడానికి ఉపయోగించే ఏనుగు ఒక ఆడ ఏనుగై ఉంటుంది. దానిని ఈ మగ ఏనుక్కి ఎరగా వాడతారు. ఆ ఆడ ఏనుగును చూడగానే ఈ మగ ఏనుగు మనసు పారేసుకుని దాని వెనకపడిపోయి, గోతిలో పడిపోతుంది (నిజమే దీన్ని ఖెడ్డా అంటారు), చిక్కిపోతుంది. ఆ ఆడ ఏనుగు తప్పించుకుపోతుంది. మగ ఏనుగు జీవితాంతం బానిసలా పడిఉంటుంది.

మానవుల్లోనూ ఇంతే కదా! హా ప్రేయసీ! అని ఆమె వెనకపడి, పెళ్ళనే బుట్టలో పడి, జీవితాంతం కుటుంబానికి, దేవికి బానిసలా పడి ఉండి, ఏమీ దౌర్భాగ్యం! మగవాడికి ఆడదే శత్రువు, ఆడదానికి మగవాడే శత్రువు.

మరో మాటా, దీపం వెలుగు ఇస్తుంది, మరి వెలుగును మింగే చీకటెక్కడుంది? దీపం కిందనే ఉంది. అదీ వజ్రం వజ్రేణ భిద్యతే కదా!

ఇదెందుకిప్పుడని కదా అనుమానం. మనుష్యుల రక్తాన్ని, కుట్టి పీల్చేవి ఆడ దోమలేట, మగ దోమలు రక్తం జోలికి పోవట. మరి ఈ ఆడ దోమలే ఎందుకు రక్త పిపాసులు? పాపం వాటి బాధ వాటిది. ప్రతి జీవికి తన జాతిని అభివృద్ధి చేసుకోవాలనే తపన ఉండి తీరుతుంది కదా! ఇది ఆడవారిలోనే ఉన్నది, తల్లితనం అంటే అంత మక్కువ, ఇదే లోక రీతి. ఇలా పునరుత్పత్తి కోసం ఈ ఆడ దోమలు రక్తం తాగుతాయి, అవి రక్తం తాగినా బాధపడం గాని వ్యాధికారక సూక్ష్మ జీవుల్ని మనుషుల్లో ప్రవేశపెడుతున్నందుకే బాధ కదా! అందుకే ప్రతి దేశం దోమల నివారణ కోసం కోట్ల కొద్దీ డబ్బు ఖర్చు పెడుతూనే ఉంది. ఐనా వీటి నిర్మూలన సాధ్యం కావటం లేదు. అటువంటి అసాధ్యం సుసాధ్యం అయ్యే రోజు దగ్గరపడిపోయినట్టే ఉంది. దోమ జాతికే చెడుకాలం సంప్రాప్తించింది.

అమెరికాలో ఒక లేబ్ వాళ్ళు పరిశోధన చేసి కనుక్కున్నారట. మగదోమలలో ఏదో ప్రవేశపెడితే అవి కాస్తా ఆడ దోమలతో జట్టు కట్టి అవి గుడ్లు పెడితే, అవి ఏదో అయి దోమ జాతి నశిస్తోందిట. ఒక వేళ ఆడదోమలే నశిస్తుంటే, మగదోమలు జట్టుకట్టే సావకాశం లేక అల్లాడిపోవా? ఇది మగ దోమల పట్ల హక్కుల ఉల్లంఘన కాదా? ప్రయోగాలలో ఎనభై ఐదు శాతం విజయం నమోదయిందిట. అమ్మో! దోమ జాతి అంతరించిపోతుందా? ఇది సాధ్యమా? ఒక జీవ జాతిని అంతరింపచేసే హక్కు మానవ జాతికి ఉన్నదా? భూమిమీద నివసించే జీవులన్నీ మానవునికి బానిసగా పడి ఉండాల్సిందేనా? మానవుని మనుగడ కోసమే అవి బతకాలా? భూమి మీద అన్ని జీవులకూ సమాన హక్కులతో జీవించే సావకాశం లేదా? లేదా? లేదా? ప్రశ్నిస్తున్నాను. ఈ అన్యాయం జరగవలసిందేనా? హక్కుల పరిరక్షణ సంఘాలు అంతర్జాతీయంగా పోరాటం సలపవా? పోరాటం జరిపి ఈ అన్యాయాని ఎదుర్కోకపోవటం అన్యాయం కదూ!

దోమజాతి రక్షణ సమితికి విరివిగావిరాళాలివ్వండి.

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-వజ్రం వజ్రేణ

 1. సహేతుకమైన ప్రశ్న గురువు గారు. పాపమ్ దోమలకి మాత్రమే జీవించే హక్కు లేదా? మీ క్రొత్త సంస్థ – దోమజాతి రక్షణ సమితి – దినదిన ప్రవర్ధమానమవ్వాలి.

  • anyagaamiగారు,

   దోమజాతిని సమూలంగా తుడిచిపెట్టేసే హక్కు మానవులకెక్కడిదీ అన్నది ప్రశ్నండి.

   దోమలపట్లనే ఈ వివక్ష తగునా అన్నది కొశ్చనండి.

   ఆడదోమలపట్ల చేసేది ఇది దురన్యాయం కాదా అన్నదే పాయింటండి.

   దోమజాతి తన వంశాభివృద్ధి చేసుకోతగదా?
   ధన్యవాదాలు

 2. అలాగే ఉష్ణం ఉష్ణేన శీతలం.

  ఆడఏనుగుతో చేసే ఖెడ్డా లాంటి దాన్నే మనుషుల మీద వాడితే దాన్ని “హనీ ట్రాప్” అంటారనుకుంటాను గూఢచారుల పరిభాషలో 🤔.

  // “ఆడదానికి మగవాడే శత్రువు.” // . అవునండి …….. పెళ్ళయిన తరువాత 😀

  దోమల్ని నిర్మూలిస్తే డి.డి.టి. తయారీ కంపెనీలు ఏమయిపోవాలి? మునిసిపాలిటీ వారు ఏదో మందుని వీధుల్లో పొగమంచు లాగా స్ప్రే చేసే కార్యక్రమం ఏమవుతుంది? మన చిన్నతనంలో NMEP సిబ్బంది నెలకోసారి ప్రతి ఇంటికీ వచ్చి యోగక్షేమాలు విచారించి ఇంటి గోడ మీద పెన్సిల్ తో ఒక టేబుల్ గీసి దాంట్లో ఆ రోజు తేదీ వేసేవారు కదా …. ఊళ్ళల్లో ఈ కార్యక్రమం ఇంకా నడుస్తోందా? నడుస్తుంటే దాని గతి ఏమవాలి? ఏతావాతా నేననేది ఏమిటంటే దోమలు ఎక్కడికీ పోవు, మనతో సహజీవనం చేస్తూనే ఉంటాయి. మొహం మీదో, చేతి మీదో, కాలి మీదో వాలిన దోమను ఒడుపుగా కొట్టి చంపే నైపుణ్యం తిరిగి సంపాదించుకోవాలి జనం … పాత రోజుల్లో లాగా 😀😀.

  • విన్నకోట నరసింహారావుగారు,

   ”ఉష్ణం ఉష్ణే నశీతలం” అదండి 🙂

   హనీ ట్రేప్ లు బాగానే నడుస్తున్నాయండి.

   మీరన్న డిపార్ట్మెంట్ ఉన్నట్టు లేదండి, చాలా కాలంగా కనపట్టం లేదు గోడమీద రాతలు, మీ ఇంట్లో అంతా బాగున్నారా మాటలు.

   దోమజాతి బతుకేం కానుందోనండి.
   ధన్యవాదాలు

 3. చూడటానికి చిన్నది అనిపించినా, చాలా పెద్ద పొరపాటు.
  మూర్ఖుడు కూచున్న చెట్టు కొమ్మ నరుక్కున్నట్టు.
  ఆహార గొలుసు తెగుతుంది. ఎన్నో జీవులకు, మనిషికి కూడా చాలా ప్రమాదకరం.
  బలమైన ఒక మనిషిలో ఏదన్నా అవయవాన్ని కోయడం వంటిది.
  కోట్లాది సంవత్సరాలుగా ప్రక్రుతి ఏర్పాటు చేసిన వ్యవస్థను నాశనం చేయడం. ప్రక్రుతి మనుషులకన్నా తెలివైనది, మేలు చేసేది.

  • maheshuduగారు,

   ఆహారపు గొలుసు తెగిపోయిందో బాగా బలహీనపడిందో చెప్పలేను.

   పల్లెలలో కూడా చిన్న పక్షులు బాగా తగ్గిపోయాయి. కారణం రేడియేషన్ అని ఒకరంటారు, మరొకరు పురుగుమందులంటారు. నేను చూసినది పురుగుమందులు జల్లిన ఆహారం తిని చనిపోయిన పక్షులను తిన్న డేగ,రాబ0దు చనిపోతున్నాయి భారత ప్రభుత్వం కాబోలు రాబందు కనపడితే చెప్పండోయ్ అంటున్నారు. ఇలా విషపూరితమైన చనిపోయిన పక్షులను తిన్న కుక్క,కాకి,నక్కలాటి మాంసాహార జంతువులు పక్షులు బాగా తగ్గిపోతున్నాయి. పల్లెలలో కూడా కాకి కనపడటం లేదు.

   కొంతకాలం కితం ఒక పట్టణానికి పల్లెల మీదుగా ప్రయాణం చేశా,మోటర్ సైకిల్ మీద. ఒక ఊళ్ళో పిచుకలు,కాకులు, పక్షులు చాలా ఎక్కువగా కనపడ్డాయి. ఆగి వాకబు చేశాను. ఆ ఊళ్ళో మూడు సెల్ టవర్లున్నాయి, కాని ఊరి రైతులు పురుగులమందులు వాడకం మానేశారట.ప్రతి ఇంటి ముందు వరిగంట కనపడింది.

   పురుగుమందులు వాడుతున్న,జల్లుతున్న పురుషుల్లో పునరుత్పత్తి సామర్ధ్యం తగ్గిపోతోంది. దీనినెవరూ పట్టించుకున్నట్టు కనపడటం లేదు.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s