శర్మ కాలక్షేపంకబుర్లు-శివాలయంలో ప్రదక్షిణం ఎలా చేయాలి?

image.png

 

1105శివాలయంలో ప్రదక్షిణం ఎలా చేయాలి?

 

ఆలయాలకి, గిరులకి,తరువులకు, ప్రదక్షిణంచేయడం సనాతన ధర్మంలో భాగమే! ప్రదక్షిణం అంటే మన కుడి భుజం ఆలయం వైపు లేదా గిరివైపుగా ఉండగా చుట్టూ తిరగడమే ప్రదక్షిణం, ఎడమవైపుగా ఉండడం అప్రదక్షిణం. అన్ని ఆలయాల్లోనూ  ప్రదక్షిణం మూడు సార్లు చేస్తాం. శివాలయంలోనూ ప్రదక్షిణం  మూడు సార్లే చేస్తాం. కాని అన్ని గుడులలోనూ చేసినట్టు కాదు. శివాలయంలో ప్రదక్షిణం  ఎలా చేయాలి? ప్రదోష వేళ అప్రదక్షిణం చేయాలా? ఇదీ అనుమానం.

శివాలయాన్ని పరిశీలిస్తే, వెళ్ళగానే కనపడేది ద్వజస్థంభం. దీనికి సరళ రేఖలో నంది, నందికి సరళ రేఖలో శివలింగం కనపడతాయి. శివ ప్రదక్షిణం  చేయాలంటే ధ్వజస్థంభం ఈవలినుంచి కుడి వైపుగా అనగా అప్రదక్షిణంగా బయలుదేరి సోమ సూత్రం దాకా వెళ్ళి అక్కడనుంచి వెనక్కి వచ్చి ధ్వజస్థంభం ఈవలినుంచే కుడి వైపుగా సోమ సూత్రం దాకా వెళ్ళి వెనక్కి తిరిగి మళ్ళీ ధ్వజస్థంభం మీదుగా సోమ సూత్రాని జేరి వెనక్కి బయలుదేరిన చోటికి వచ్చి మూడుప్రదక్షిణలు పూర్తి చేయాలంటే అప్రదక్షిణంగా సోమ సూత్రం దగ్గరకు మూడు సార్లు, ప్రదక్షిణంగా రెండు సార్లు వెళ్ళి బయలుదేరిన చోటికి అనగా ధ్వజస్థంభం దగ్గరకు జేరితే మూడు ప్రదక్షిణలు పూర్తయినట్టు. ఏ ప్రదక్షిణం  లోనూ సోమ సూత్రం దాటడం జరగదని గుర్తించాలి.

సోమ సూత్రమనగా, లింగానికి కింద ఉండేది పానవట్టం. అభిషేకం చేసిన ద్రవ్యాలు బయటికి వచ్చేమార్గమే సోమ సూత్రం. శివాలయాలు తూర్పు ముఖంగానూ, పశ్చిమ ముఖంగానూ ఉంటాయి. ఏముఖంగా ఉన్నా సోమ సూత్రం మాత్రం ఉత్తరం వైపే ఉంటుందని గుర్తించాలి.

ఆ తరవాత నంది పృష్టాన్ని తడిమి కొమ్ముల మధ్యగా శివుని దర్శించాలి.ఏ సమయంలోనూ ధ్వజస్థంభం,నంది మధ్యగాని,నందికి శివునికి మధ్యగాని దాటకూడదంటారు. 

అనుమానం తీర్చుకోడానికి బొమ్మలో చూడండి

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-శివాలయంలో ప్రదక్షిణం ఎలా చేయాలి?

 1. ఇంకొక చిన్న సందేహం!

  ఈ ప్రదోష కాల ప్రదక్షిణ అన్ని రోజుల్లోనూ చెయ్యవచ్చా?లేక కొన్ని ప్రత్యేకమైన రోజులకే పరిమితమా?

  మనం ఎటూ ప్రత్యేకమైన విశేష దినాల్లోనే ఆలయానికి వెళ్తూ ఉంటామనుకోండి.కానీ ప్రదోష కాల ఆపసవ్య ప్రదక్షిణకి అటువంటి నియమం ఏదైనా జతచెయ్యబడి ఉందా అనేది నా సందేహం.ఈ ఒక్కటీ తీర్చేస్తే నాకు దీనికి సంబంధించిన బెంగ తీరుతుంది.

  ఇంకో విషయం, “గాలిలో తేలే సోమనాధ లింగం!” గురించిన వివరాలు కూడా దొరికాయి.నేను quora dijest చర్చా వేదికని ఫాలో అవుతుంటాను కదా,అక్కద దొరికింది.

  ఒక్కోసారి నిజమే చెప్పాలి అనే పట్టుదలతో నిజానిజాలు తేల్చుకోవడానికి నేను పడుతున్న శ్రమ చూస్తుంటే నాకే ముచ్చటేస్తుంది – మొత్తానికి పోష్టులో ఉంచాలనుకున్న విషయాలకన్నిటికీ నికరమైన ఆధారాలు దొరికాయి!

  భవదీయుడు
  హరి.S.బాబు

  • Haribabu Suraneni గారు,

   ఒక్క ప్రదోష వేళనే కాదు, ఎప్పుడూ ఇలాగే ప్రదక్షిణం చేయాలండి. మార్పులొచ్చాయి.

   గాలిలో తేలే లింగం గురించి టపాకోసం ఎదురు చూస్తున్నాను.
   ధన్యవాదాలు.

   • అంటే, శివుడికి వేళతో నిమిత్తం లేకుండా ఎప్పుడూ ఇలాగే చేయాలని అర్ధమా?మరి పంతులు గారు అమంగళం అని కంగారు పడ్డాడు కదా,క్లారిటీ ఇవ్వమంటే కన్ఫ్యూజ్ చేస్తున్నారు.కొంచెం విపులీకరించి చెప్పండి!

   • హరిబాబు గారు,

    నాకు తెలిసి శివాలయంలో ప్రదక్షీణం ఇలాగే చేయాలండి, కాలంతో నిమిత్తం లేక. ప్రదోష వేళ దర్శనం శ్రేష్టం అన్నారంతేనండి. నేనే సర్వజ్ఞుడిని కాదు.

    ధన్యవాదాలు.

 2. కేరళ రాష్ట్రం లోని నేను చూసిన శివాలయాలలో … సోమసూత్రాన్ని దాటకుండా ఉండడానికై సోమసూత్రం దగ్గర అడ్డంగా తాడు కట్టి ఉండడమో, మరేదన్నా అడ్డం పెట్టి ఉండడమో గమనించాను. మన దగ్గర కూడా శివాలయాలలో అలా చేస్తే బాగానే ఉంటుంది … సంగతి తెలియక దాటడానికి ప్రయత్నించేవారిని దృష్టిలో పెట్టుకుని.

  • విన్నకోట నరసింహారావుగారు,

   పెథాయ్ తుఫాను నష్టం మిగిల్చింది. మాకైతే కొద్దిగాలి, ఎడతెగని చినుకులు. పెద్ద వర్షంకాదు. చలి మాత్రం బాగా పెరిగింది. నిన్న ఉదయం తొమ్మిది నుంచి నుంచి కరంట్ లేదు. రాత్రి తొమ్మిదిలోగానే కరంట్ ఇచ్చేశారు. కష్టమే పడ్డారు. కరంట్ లేక నీళ్ళు లేవు, కరంట్ వచ్చిపోతుండడం లో మాకు కంప్యూటర్ నష్టం.

   సోమ సూత్రం దగ్గర చండీశ్వరుని చిన్న గుడి ఉంటుంది. చాలా చోట్ల ఇప్పుడు లేదు. అక్కడ వినాయకుని ప్రతిష్ట చేస్తున్నారు. వినాయకుడు నైఋతి దిశలోనూ, అమ్మవారు తూర్పు,ఆగ్నేయం మధ్య ఉండాలంటారు. ఆగమం తెలిసినవారు చెప్పాలి. చాలా మార్పులొచ్చాయండి, వస్తాయి కూడా!
   ధన్యవాదాలు.

   • శర్మ గారూ,
    పైన మీరు చెప్పిన “బొమ్మ” లింక్ తెరుచుకోవడం లేదు. ఈ ప్రదక్షిణా విధానాన్ని బొమ్మతో సహా వివరించిన వ్యాసం (ఆంగ్లంలో) ఒకటి ఆన్లైన్లో దొరికింది. దాని లింక్ ఈ క్రింద ఇస్తున్నాను 👇.

    https://www.hariome.com/how-to-perform-chandi-pradakshina-in-lord-shiva-temple/
    ———————
    అవునండీ, చాలా మార్పులొచ్చేస్తున్నాయి, మీరన్నట్లు ఇంకా వస్తాయి కూడా. శివాలయంలో చండీశ్వరుడి విగ్రహం బదులు వినాయకుడి విగ్రహం పెడుతున్నారా 🤔? ఆగమశాస్త్ర పండితుల్ని సంప్రదించారో, లేదో? కొంతమంది స్వంత తెలివి ఉపయోగించడం కూడా చూస్తుంటాం. కొన్నాళ్ళకి వినాయకుడి బొమ్మ / చండీశ్వరుడి బొమ్మ బదులు ప్రస్తుత popular deity అయిన షిర్డీ సాయిబాబా బొమ్మని ఆ స్థానంలో పెట్టినా ఆశ్చర్యపోనక్కర లేదు (వెంటనే నా వివరణ ఇక్కడే ఇచ్చెయ్యడం శ్రేయస్కరం అనిపిస్తోంది …. పైన నేను వ్రాసిన మాట ఎవరినీ నొప్పించడానికి కాదు, ఎవరి మనోభావాలనూ దెబ్బతియ్యడానికి అసలే కాదు. ఎవరి నమ్మకాలు వారివి, ఎవరి భక్తి వారిది. కేవలం నేను గమనిస్తున్న ధోరణులను బట్టి మాత్రమే పైన నేను వ్రాసిన ఆ వాక్యం 🙏. ఉదాహరణకు … ఏదన్నా పూజ … సాయి పూజ కాక వేరే పూజ … చేసుకున్న వారు తీర్థం ఇస్తూ శ్రీ షిర్డి సాయి పాదోదకం అనడం కూడా నేను చూసిన ప్రస్తుత ధోరణులలో ఒకటి).

    శివాలయానికి వెళ్ళినప్పుడు సోమసూత్రం / గోముఖి దగ్గరున్న చండీశ్వరుడిని ముందుగా దర్శించుకోవాలని అంటారు. ఈ ప్రదక్షిణా విధానం వలన అది జరుగుతుంది. ఈ విధానాన్ని చండీశ్వర ప్రదక్షిణ అని కూడా అంటారట. దర్శనం తరువాత ప్రసాదాన్ని కూడా చండీశ్వరుడికి (చిటికెల చండీశ్వరుడు అని కూడా పేరు అట) చూపించి, తీసుకోవడానికి ఆయన అనుమతి అడగాలని చాగంటి వారి ఒక ప్రసంగం వలన తెలుస్తోంది 👇 (ఈ క్రింది లింక్ లోని విడియో చివరి భాగంలో ఈ ప్రస్తావన వస్తుంది ). కాబట్టి చండీశ్వరుడి బొమ్మ తీసేసి వేరే బొమ్మ పెట్టడం ఎంతవరకు శాస్త్రసమ్మతమవుతుందో మరి?

   • విన్నకోటవారు,

    ఈ టపా కంగారుగా కరంట్ పోతున్న సమయంలో, కరంట్ ఉంటుందో ఉండదో అనుకునే సమయంలో, తుఫాను లో రాసినది. జవాబివ్వాలనే కంగారులో సరిగానూ చెప్పలేకపోయి ఉండచ్చు. బొమ్మ బ్లాగర్ శ్రీరాజశేఖరుని విజయ శర్మ గారిది, గూగుల్ నుంచి తీసుకున్నది, వారికి ధన్యవాదాలు. బొమ్మను వివరించినా సరిపోయేదేమో!

    చాలా మార్పులు వస్తున్నాయండి, కొన్ని కావాలని చేస్తున్నవి,కొన్ని తెలియక చేస్తున్నవీ ఉన్నాయి. సనాతన ధర్మం మార్పు దేనినైనా ఆహ్వానించింది, చెడ్డా మంచీ కూడా.నేడు కర్ణాటక సంగీతంలో గొప్ప విప్లవమే నడుస్తోంది,మద్రాసులో.

 3. చాలా సంతోషం!

  నేను ప్రస్తుతం సోమనాధ విధ్వంసానికీ మక్కా లోని కాబాకీ మధ్య ఉన్న సంబంధం గురించి ఒక పోష్టు వేస్తున్నాను.అందులో ఈ వివరం కూడా కలిపితే బాగుంటుందని అడిగాను.మీ నుంచి జవాబు వచ్చే ముందే నేను తరచు వెళ్ళే శివాలయం పూజారిని అడిగాను వచ్చీ రాని తమిళంలో. మొదట “అపసవ్య ప్రదక్షిణ” అనే మాట వినగానే “కూడాదు,కూడాదు అమంగళం!” అని కంగారు పడ్డాడు, ప్రదోషం అని గుర్తు చేశాక అప్పుడు కొత్తగా గుర్తు తెచ్చుకుంటున్నట్టు చెప్పాడు.వీరశైవం దెబ్బకి మనం శివార్చన తగ్గించెయ్యడంతో దీన్ని పూజార్లే మర్చిపోయారన్న మాట!

  మక్కాలో ఈ మొత్తం ప్రదోష ప్రదక్షిణ నుంచి సొఘమే తీసుకుని అపసవ్య ప్రదక్షిణానికి పరిమితం చేశాడు ముస్లిముల ఆఖరి ప్రవక్త – పూర్వ ఇస్లామీయ మక్కా లోని కాబా ముమ్మాటికీ శివాలయమే!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s