శర్మ కాలక్షేపంకబుర్లు- పన్నెండవ ఇ-బుక్

పన్నెండవ ఇ-బుక్


నా పన్నెండవ    ఇ-బుక్ కినిగె లో ప్రచురింపబడింది. ఈ కింది లింక్ లో చూడచ్చు.

1.http://kinige.com/kbook.php?id=9223
2.http://kinige.com/kbook.php?id=9231

3.http://kinige.com/kbook.php?id=9237

4.http://kinige.com/kbook.php?id=9245

5.http://kinige.com/kbook.php?id=9251

6.http://kinige.com/kbook.php?id=9258

7.http://kinige.com/kbook.php?id=9265

8.http://kinige.com/kbook.php?id=9270

9.http://kinige.com/kbook.php?id=9274

10.http://kinige.com/kbook.php?id=9287

11.http://kinige.com/kbook.php?id=9295

12.http://kinige.com/kbook.php?id=9310

ప్రచురించిన అన్ని ఇ-బుక్స్ ని కినిగె లో నా హోమ్ పేజిలో చూడచ్చు.
http://kinige.com/author/Chirravuri+Bhaskara+Sarma

123 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- పన్నెండవ ఇ-బుక్

 1. శర్మ గారు,
  “సాబూతు” యనగానేమి? అది యొక బూతు విశేషం …. కాదు.
  సాక్ష్యం, ఋుజువు అని అర్థం (సబూత్ యను హిందీ పదం. ఇది హిందీ సినిమాలు చూడడం వలన అబ్బిన “విణ్ణానం” 😎)

 2. శర్మ గారు,
  // “వేదనాడు ఎలచ్చన్ల నాటికే దిగబడి ఉంటారు, ఇప్పుడే మనకి తెలిసిందండీ! ” //

  అలనాటి “మాయాబజార్” సినిమాలోని మాయాదర్పణం (పెట్టె) ఆ తరువాత ఏమైపోయిందా అనుకునేవాడిని … మీ దగ్గరకు చేరిందన్నమాట!

  అయితే తిరుగు ప్రయాణానికి సిధ్ధమై అప్పుడు కుశలం అడిగారన్నమాట మిమ్మల్ని? బాగుంది.

  • మాయా దర్పణ ముందం
   డీ! యాడున్నాభళీ ఫెడేల్మని కనుగొం
   టా! యైపీ డబ్ల్యూపీ
   సాయంబుందండి మాకు సాబూతుగనే 🙂

  • విన్నకోటవారు,
   అంతే కదండీ! వేపెరిలో వేంచేసి ఉన్న ఆండాళ్ళమ్మ 🙂
   మూటా ముల్లే సద్దేశారు మరి. ఓడెక్కుతారో గాలివోడెక్కుతారో తెలీదు. దేశం వదలిపోతున్నాం కదా అని ఓ సారి ఇలా పలకరించేశారు!

   • ఓహో, దేశప్రవేశమా (ఒకప్పుడు వచ్చిన “జింబో నగరప్రవేశం” సినిమా పేరులో లాగా) 🙂? ఉన్నట్లుండి మిమ్మల్ని కుశలమడగడం వెనకనున్న కారణం అర్థమైంది 🙂.

   • విన్నకోటవారు,
    వేదనాడు ఎలచ్చన్ల నాటికే దిగబడి ఉంటారు, ఇప్పుడే మనకి తెలిసిందండీ! మూటా ముల్లే సద్దేసినట్టున్నారు తిరుగు ప్రయాణానికి.

 3. మిత్రులు బోనగిరిగారు,
  వందనాలు.

  మీరు ముందుమాట రాసిన నా ఇ.బుక్ రెండవవారం కూడా మొదటి పదిలోనూ ఉన్నట్టు కినిగెవారి వార్త

  Your book శర్మ కాలక్షేపం కబుర్లు – నాకు నచ్చిన పెళ్ళి (Sarma Kalakshepam Kaburlu Naaku Nachchina Pelli) is in weekly top ten list of Kinige

  ధన్యవాదాలతో

 4. శర్మ గారికి,
  “నాకు నచ్చిన పెళ్ళి” అనే పేరుతో మీ పన్నెండవ ఇ-బుక్ కూడా ప్రచురించబడింది, అభినందనలు. ఇప్పుడే “కినిగె” నుండి ఒక కాపీ తీసుకున్నాను. బోనగిరి గారి “ముందుమాట” చదివాను. “ఈ పుస్తకం నిండా ఉన్నవి కేవలం కాలక్షేపం కబుర్లు కాదు, శర్మ గారి దశాబ్దాల జీవన సారం” అని ఒక్క వాక్యంలో మీ వ్రాతల గురించి చక్కటి ప్రశస్తి చేశారు బోనగిరి గారు.

 5. సుధాకర్ జీ,
  మీరు ముందుమాట రాసిన నా ఈబుక్ ఈ వారం కూడా మొదటి పదిలోనూ ఉన్నట్టు కినిగెవారి వార్త.
  Your book శర్మ కాలక్షేపం కబుర్లు – పీత్వా పీత్వా పునః పీత్వా.. (Sarma Kalakshepam Kaburlu Pitva Pitva Punah Pitva) is in weekly top ten list of Kinige
  Inbox
  x

  Kinige.com
  6:41 AM (9 hours ago)
  to me

  Your book is in weekly top ten books of Kinige. This means it is very prominently displayed on Kinige.com home page and also on every other book page of Kinige, for every visitor 24/7 for this whole of week. http://kinige.com/kbook.php?name=Sarma+Kalakshepam+Kaburlu+Pitva+Pitva+Punah+Pitva

  ధన్యవాదాలతో

 6. శర్మ గారు,
  “పీత్వా పీత్వా పునః పీత్వా” అనే పేరుతో మీ పదకొండవ ఇ-బుక్ ప్రచురించబడినందులకు అభినందనలు. ఇందాకనే దింపుకుని చూశాను. యు.కె. నుండి డాక్టర్ సుధాకర్ గారు మహత్తరమైన “ముందుమాట” అందించారు. మీ పుస్తకంలోని వ్యాసాలను సంక్షిప్తంగా పరిచయం చేస్తూ, ముగింపు వాక్యంగా మిమ్మల్ని “అంతర్జాల ఉషశ్రీ” అని వర్ణించడం ఎంతైనా సముచితంగా ఉంది 👌.

  • అంతర్జాల ఉషశ్రీ!
   వంతెన ! కష్టేఫలి! ప్రతిభాశాలి కతల్
   వింతైనవి! జీవితపు ప్ర
   శాంత సమయమందు చేర్చె సద్భావనలన్ !

   జిలేబి

   • జిలేబిగారు,

    మొన్ననే కదండీ కన్ను ఆపరేషన్ చేయించుకున్నారు, అప్పుడే పోయాయా రెండూ…………… సీన్ కట్ చేస్తే

    ఓ ముసలావిడని పొదివి పట్టుకుంటే ముసలావిడ కర్రతో కెమెరాలోకి నడిచొస్తోంది, బేక్ గ్రవుండ్ లో ఈ పాట వినపడుతోంది. క్యా సీన్ హై

    చూడకళ్ళూ….. లేవు…….. నారాయణా
    కళ్ళు కాళ్ళూ….. లేవు……. నారాయణా
    చీకటి…….బతుకాయె………. నారాయణా
    గుడ్డి……. జలమామాయె……… నారాయణా
    కుంటి…….. జలమామాయె………. నారాయణా
    దయగల……… తల్లులూ…………. నారాయణా
    దయగల……… తండ్రులూ………….. నారాయణా
    పాపిష్టి……… జనమాయె………….. నారాయణా

    అమ్మా! తల్లీ, బాబూ

    ధన్యవాదాలు.

   • చూడ కళ్ళు పోయె సుందర వదనా జి
    లేబి! కాళ్ళు పోయె లేవ కష్ట
    మాయె!చీకటి బతు కాయె నారాయణా!
    కూచి! వచ్చె హరిమ గూడు బోవ !

 7. పదకొండవపొత్తంబది
  గదిగో ..
  ..

  కాస్త ఆ కవరు చిత్రం‌ మంచి క్వాలిటీ ఫైల్‌ పెట్టమని‌ చెబ్తే‌బావుండు. మరీ అలుక్కుపోయి వుంది‌ ?

  జిలేబి

  • పుస్తకం పేరే “పీత్వా పీత్వా పునః పీత్వా” కదా. అలుక్కుపోయినట్లే కనిపిస్తుంది మరి, హ్హ హ్హ హ్హ 😀😀 😀.
   (శర్మ గారు మన్నించాలి. పుస్తకంలో ఆ పేరుతో మీరు వ్రాసిన వ్యాసం వేరే ద్రవపదార్థం గురించి లెండి, నాకు తెలుసును 🙂)

 8. పదియవ పొత్తంబొచ్చెను
  సదమలమగు యంతరంగ చక్కదనముగా,
  అదిగో హస్తోదకమది
  గదిగొ కరతలామలకము కష్టేఫలియై!

 9. # శర్మ గారు

  చూశాను ఇప్పుడే చూశాను “గవళ్ళ గంగమ్మ గారి హస్తోదకమ్” అనే మీ పదవ ఇ-బుక్. రెండంకెల సంఖ్యను జేరుకున్నందుకు అభినందనలు.

  వైవీయార్ వ్రాసిన “నమస్సుమాంజలి” అనే ముందుమాట గురించి ఏమని చెప్పను? “అంతరంగాల” స్పెషలిస్ట్ అయిన ఈ శ్రీనివాసుడు ఈ విషయంలో ‘మాధుర్యం’ నిండిన పలుకులతో తన ‘అంతరంగం’ ఆవిష్కరించిన విధానం చాలా హృద్యంగా ఉంది.

  • విన్నకోటవారు, జిలేబిగారు, వై.వి.ఆర్ గారు

   ఇప్పటికి పది బుక్స్ అయ్యాయండి. మరొక రెండు బుక్స్ కినిగె వారివద్ద లైవ్ చేయడానికున్నాయి. అక్కడికి పన్నెండు బుక్స్ అవుతాయి. ఇంకా మూడు మిగిలున్నాయి, వాటికి కొరవలుండిపోయాయి, ఇప్పుడు ప్రచురించలేను. గత నాలగైదు రోజులుగా మంచం నేస్తున్నాను.లేవలేకున్నా తప్పక లేచాను.

   అంతరంగాలెరిగిన శ్రీనివాసుడు ఈ శ్రీనివాసుని ద్వారా పలికించడం నా అదృష్టంగానే భావిస్తాను. అందరికి
   ధన్యవాదాలతో

   • గురువుగారు నమస్సులు🙏
    ఆఫీసు ప్రయాణాలలో వుండి వెంటనే స్పందించలేక పోయాను.
    నా “ముందుమాట” చంద్రుడికి చూపిన దివిటీ మాత్రమేనండి.
    సముద్రం దాటడానికి దూకిన హనుమంతుడి వేగానికి మహేంద్రగిరి పైనున్న చెట్లు, వాటి పూలు ఆయనతో పాటు కొంత దూరం ఎగిరి సముద్రంలో పడిపోతాయి. మీ జ్ఞానసుధా సాగరంలో పడిన నా నాలుగు మాటలు మహా అయితే ఆ పూలలాంటివి. నాకీ అవకాశం కల్పించిన మీ వాత్సల్యం నాకు ఆశీర్వాదం. 🙏⚘🙏⚘🙏⚘

  • బులుసు సుబ్రహ్మణ్యం గారు,
   నమస్తే!

   మీరు ముందుమాట రాసిన నా ఇ.బుక్ రెండవవారం కూడా మొదటి పదిలోనూ ఉన్నట్టు కినిగె వారి వార్త.

   Your book శర్మ కాలక్షేపం కబుర్లు – కించిత్ భోగం భవిష్యతి (Sarma Kalakshepam Kaburlu Kinchit Bhogam Bhavishyati) is in weekly top ten list of Kinige
   Inbox
   x

   Kinige.com
   6:42 AM (1 hour ago)
   to me

   Your book is in weekly top ten books of Kinige. This means it is very prominently displayed on Kinige.com home page and also on every other book page of Kinige, for every visitor 24/7 for this whole of week. http://kinige.com/kbook.php?name=Sarma+Kalakshepam+Kaburlu+Kinchit+Bhogam+Bhavishyati
   ధన్యవాదాలతో

 10. విన్నకోట నరసింహారావు గారూ…..
  ధన్యవాదాలు. మీ మాటలు శ్రవణానందకరంగా ఉన్నాయి.
  ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నా ముందు మాటకు మెరుగులు అద్దిన వారు విన్నకోట నరసింహా రావు గారే. మరొక్క మారు మీకు ధన్యవాదాలు. ……… దహా

  జిలేబి గారూ ………
  కొత్త కధ వ్రాసిన వెంటనే మీ అందరి దర్శనానికి వస్తాను. అంతదాకా వేచి చూడండి. …………. దహా

  • ఎంత మాట ఎంత మాట, బులుసు వారూ 🤫! అద్భుతంగా కుదిరిన మీ ముందుమాటను … మీకు నాయందు గల అభిమానం వల్ల … ముందస్తుగా కాస్త తొంగిచూడనిచ్చారు, నేను చూశాను. అంతే, అంతకు మించి నేను చేసిందేమీ లేదు. నన్ను ములగచెట్టు ఎక్కించకండి 😳. మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏.

   • బులుసువారు, విన్నకోటవారు
    నమస్సులు.

    పగలే చలిగాలి రివ్వున కొడుతోంది, ఆలస్యానికి మన్నించాలి.

    బులుసువారు పుస్తకాన్ని ప్రతి అక్షరం శోధించి ముందుమాట రాసారు, అది వారి హృదయం నుంచి ఉరికిన సదభిప్రాయం. అందుకే అది అంత శోభాయమానంగా ఉన్నది.నా ఇ.బుక్ కే మకుటాయమానంగానూ ఉన్నది. అది నా ఇ.బుక్ ను సుసంపన్నం చేసింది.

    ఇక విన్నకోటవారు బులుసువారి ముందుమాటను మరోసారి ఉల్లేఖించారు. ఇద్దరూ నా ఇ.బుక్ ను ఆశీర్వదించినందులకు కృతజ్ఞుడిని.

    ఈ ఇ.బుక్ నేటివారం కూడా మొదటి పదిలోనూ ఉన్నదని కినిగెవారి వార్త.

    Your book శర్మ కాలక్షేపం కబుర్లు – కించిత్ భోగం భవిష్యతి (Sarma Kalakshepam Kaburlu Kinchit Bhogam Bhavishyati) is in weekly top ten list of Kinige

    x

    Kinige.com
    Fri, Feb 1, 6:41 AM (22 hours ago)
    to me

    Your book is in weekly top ten books of Kinige. This means it is very prominently displayed on Kinige.com home page and also on every other book page of Kinige, for every visitor 24/7 for this whole of week. http://kinige.com/kbook.php?name=Sarma+Kalakshepam+Kaburlu+Kinchit+Bhogam+Bhavishyati
    ధన్యవాదాలతో

 11. శర్మ గారు,

  తొమ్మిదవ ఇ-బుక్ వెలుగు చూసినందుకు అభినందనలు.

  శ్రీ బులుసు వారు వ్రాసిన “ముందుమాట” పుస్తకానికి వన్నె తెచ్చింది. “ఈ నాటి విద్యావ్యవస్థ లో మంచి చెడులను చెప్పే, వివేకం నేర్పే విధానాలు తక్కువ అవుతున్నాయి. పాత వాటిలోని మంచిని కూడా గ్రహించలేని దురవస్థ లోకి కొత్త తరాలు వెళ్లి పోతున్నాయి.” అలాగే, “శ్రీ శర్మ గారికి మన పురాణాలు, ఇతిహాసాలు, అధ్యాత్మిక విషయాలు, చరిత్ర, సాహిత్యం మీద ఘట్టి పట్టు ఉంది. అందుకనే వారు (చెప్పే) వ్రాసే కబుర్లు బ్లాగు పాఠకులని అమితంగా ఆకర్షించాయి……………… నిస్సందేహంగా ఇవన్నీ ఒక విజ్ఞాన సంగ్రహం అనే అనుకుంటాను నేను. నేర్చుకోవాలనుకునే వారికి నేర్చుకోగలిగినన్ని విషయాలు ఉన్నాయి” అంటూ చక్కటి “ముందుమాట” వ్రాశారు.

  మొదట్లో ఒక మాట అంటారు, అది చదివితే నాకు సరదాగా అనిపించింది. “కబుర్లు చెప్పడమనేది ఒక కళ” అంటారు, అంత వరకు బాగానే ఉంది. తరువాత మాత్రం “నాలాంటి వాళ్ళకి ఒక కల” అంటారీ … ఎవరు … స్వయానా చెయ్యితిరిగిన సీనియర్ బ్లాగరూ, తన బ్లాగ్ కబుర్లతో చాలా కాలం పాఠకులని అలరింపజేసిన రచయితా అయిన శ్రీ బులుసు గారు. ఔరా! 🙂 (దహా). అఫ్కోర్స్ అలా అనడం శ్రీ బులుసు వారి సంస్కారం, గొప్పతనం 🙏.

 12. పొత్తంబొచ్చెను గా సరి
  కొత్తగ శర్మ కబురులు! పకోడి జిలేబీల్
  కొత్తు పరోటాలై సఖి
  సత్తువు కల్గిన విదురుని చదురుదనముగా !

  జాల్రా జిలేబి‌
  తొమ్మిదవ‌ పొత్తానికి గ్రీటింగ్స్ 🙂

 13. శర్మ గారూ తొమ్మిదో పుస్తకం ప్రచురించినందుకు మీకు అభినందనలు. ఈ పుస్తకానికి ముందు మాట వ్రాసే అదృష్టం నాకు కలిగించినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు.

  • ఈ మిష మీదైనా బులుసు వారు కనబడ్డారు 🙂
   మళ్ళీ యెప్పుడు ప్రద్యుమ్నుడి కత లతో బ్లాగు లోకానికి
   రాబోతున్నారు బులుసు వారు ?

   జిలేబి

   • ముకుదాడు బట్టి లాగిరి
    పకాలు న నగవును రువ్వు ప్రద్యుమ్నుడినే
    సకి, ముందుమాట రాయమ
    ని, కవచిత ఘృతాచిని, కమనీయంబాయెన్ !

    జిలేబి

   • జిలేబి గారూ ……….
    ధన్యవాదాలు. మీ పద్యం ఇప్పుడే చూశాను. ఘృతాచి ని కూడా తీసుకొచ్చేశారు. ఇంకా నయం రంగమ్మ గారు, ఉజ్జ్వల భట్టాచార్య గుర్తుకు రాలేదు మీకు. …….. దహా

 14. ఎనిమిదవ పొత్తమొచ్చెను
  కినెగిని మన బండివారు కిర్రుమనుచు లా
  గి నిలుపగ ముందు మాటల,
  జనులెల్లరు మేలుగాన సత్సంగమునన్

  జిలేబి

 15. అభినందనలు శర్మ గారూ. మీ ప్రోజెక్ట్ సగంపైగానే పూర్తయిందని తెలుస్తోంది. సంతోషం 👍.

  ఇందాక “కినిగె” నుండి కాపీ దింపుకుని మిత్రులు బండివారు వ్రాసిన పరిచయవాక్యాలు మొదటగా చదివాను.

  “ఏది విద్య? ఎవరు గురువు?” అనే మీ ఈ 8వ ఇ-పుస్తకానికి తను వ్రాసిన “ముందుమాట” లో
  // “నేను చెప్పబోయేది గోరంతయినప్పటికిన్నీ, మీకు తెలియబోయేది కొండంతగా శ్రీ శర్మ గారి పలుకుల ద్వారా ఈ పుస్తకంలో లభించనున్నది” అన్న సారాంశమే నా ఈ ముందుమాట”” // అని ప్రారంభంలోనే చదువరులకు చక్కటి హామీ ఇచ్చి, పుస్తకంలోని అనేక వ్యాసాలలో మచ్చుకు కొన్నింటిని స్పృశిస్తూ
  // “వారు ప్రస్తావించిన 51 అంశాల లోని ప్రతి ఒక్క అంశం పూర్తిగా విజ్ఞాన, వికాసదాయకంగా మలచబడింది” // అంటూ // “ఇవి కాలక్షేపం కబుర్లు కావు, కలకాలం నిలిచే జ్ఞానసుధలు, …..” // అని ముగింపు ఇచ్చిన పద్ధతి ….. అద్భుతం. మహత్తరమైన ముందుమాట 👌.
  బండివారికి నా మెచ్చుకోలు 👏.

  • కాపీ దింపుకు ముందుమాట చదివా! కవ్వించెగా పూర్తిగా
   తాపీగా చదవాలె యింకొక దఫా ! తాత్సారమేలన్ కొనన్
   మీ పొత్తంబును దండిగాను కినిగే మీకిచ్చు డిస్కౌంటు కూ
   డా! పోషించును మీదు మేధనయ రారండయ్య రండీ వెసన్!

   జిలేబి

  • విన్నకోటవారు,జిలేబి,బండివారు.

   మరో నాలుగే ప్రచురిస్తున్నాను,ఇప్పుడు. వీటి ప్రచురణ పూర్తైతే….
   జిలేబి
   పద్యమేమో అర్ధం కాలా!

   బండివారు,
   ముందుమాటకు వందనాలు

   అందరికి వందనాలు.

 16. ఇక ముందుకు దుముకుడి యను
  చు కదమ్ము కదము బడాతె చువ్వ‌న బండిన్
  చకచక నడిపిరి రావ్సా
  బు! కినిగెని పరిచయపరిచి బ్రువ్వట బాబా 🙂

  జిలేబి

 17. గత రెండు మూడు రోజులుగా అనారోగ్యం పాలవడంతో స్పందించలేకపోయాను,మన్నించండి. ఈ రోజు తప్పక లేచాను.

  శ్యామలరావుగారు.
  అక్షరదోషాలు కొన్ని తొలగినాయి. నా అభ్యర్ధన మేరకు ముందుమాట రాసినందుకు ధన్యవాదాలు.

  తల్లీ భారతి
  మాతానాస్తి పితానాస్తిపుస్తకానికి మీరు రాసిన ముందుమాట,అద్భుతంగాఉన్నదంటే అతిశయోక్తి కాదు.
  ధన్యవాదాలు.

  విన్నకోటవారు.
  మీరురాసిన ముందుమాటతో నా ఇ.బుక్ కి వెలుగొచ్చిందన్నదే నిజం
  ధన్యవాదాలు.

  లలితమ్మాయ్!
  మీ అభినందన ఆనంద పరచింది.
  ధన్యవాదాలు.

  జిలేబి.
  మీరు స్పెషల్ కదా వేరుగా చెబుతా. 🙂
  ధన్యవాదాలు.

 18. ఆరున్నొక్కటవ ఈ-బుక్కుకి విన్నకోట నరసింహారావుగారు అభిమానంతో రాసిన ముందుమాట బావుంది. పుస్తకం ప్రచురింపబడినందుకు మీకు, ముందుమాట రాసిన వారికి శుభాభినందనలు!

   • జిలేబి గారు,

    పల్లెటూరివాళ్ళం కదండీ! సప్తమాన్ని తెనుగు మాటలో కూడా ఉచ్చరించడానికి ఇచ్చగించం, అందుకే ఆరున్నొకటి అంటాం. తమరేమో గోజిల్లో పుట్టి పెరిగినా ఆధునికులైపోయారు కదా! అభం శుభం మరచిపోయారు, గుర్తు చేయక తప్పదుకదా!

    కొలిచేటప్పుడు కూడా సప్తమ స్వరం వినిపించనివ్వరు అప్పుడు ఆరు, ఆరున్నొక్కటి అని పాటలా పాడ్తారు, ఆతరవాత పదారు, పదేను అంటారు. పదేను అంటే పదిహేను అనికూడా అర్ధం కావచ్చు అందుకే పద్నాల్గు,పదిహేను అని పలుకుతారు, పదాహారు తరవాత పదేను అంటారు ’డు’ కి బదులు ’ను’ పలుకుతారు. అదీ పల్లెటూరివారి సభ్యత.

    ఇక ఆరున్నొక్కరాగానికొస్తే పల్లెటూరి వాళ్ళం కదా జీవితమెప్పుడూ కష్టమేనని, ఎదుర్కోడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం, ఆరున్నొక్క రాగం తీయం. తమలాటి అధునికులకి కష్టమంటే భయం…అందుకే …ఆలాపిస్తుంటారు. తెలిసిందా? 🙂
    Take it easy 🙂
    ధన్యవాదాలు.

   • పల్లె టూరి వాళ్ళము జిలేబమ్మ! సప్త
    పదిని నమ్మిననూ మరి భయము విడువ
    మమ్మ యేడన నే యనమమ్మ నగరి
    బామ్మ వినవమ్మ మామాట పంచులచ్చి 🙂

    నారాయణ
    జిలేబి
    పదమూడన్న భయమ్మదేల రమణి‌ … 🙂

   • జిలేబిగారు,

    సప్తమాన్ని తెనుగులో అనకపోవడం భయంతోనూగాని మూఢనమ్మకంతోనూ గాని కాదండి. ఆమాట ఉచ్చరిస్తే ఎదుటివారిని కించపరచినట్టు ఉంటుందన్నదే మాట. ఇది సభ్యతకు సంబంధించినదే!

    ఇక పదమూడు గురించి ఒక టపాయే ఉన్నది చిత్తగించండి.
    https://kastephale.wordpress.com/2018/01/08/

    ఒకప్పుడో రూం నంబర్ విషయంలో జరిగిన పసందైన సంఘటన గుర్తొచ్చింది, ఇప్పుడుకాదు, మరెప్పుడేనా! ఇదేం వాగ్దానమూ కాదు.
    ధన్యవాదాలు.

   • ఆహా యిదియే కదా జిలేబి మాయ 🙂

    తీగను లాగగ డొంకయు
    బాగుగ కదిలె మరియొక టపావచ్చునికన్
    మాగురు వర్యుల జ్ఞానము
    చేగూర్చు మరియొక మణిని చెలియ జిలేబీ 🙂

    జిలేబి

   • సప్తమును తెలుగున పలుక
    క్లుప్తము గా నారునకొక కూడికతో ని
    ర్లిప్తత చూపుదురుగదా
    క్షిప్తము గా చూచి రమణికి తెలియనిదకో ?

    జిలేబి

 19. శ్రీ శర్మ గారు,
  అభినందనలు. ఇప్పుడే “కినిగె” నుండి దింపుకున్నాను. నన్ను ప్రోత్సహించి నాచేత “ముందుమాట” వ్రాయించిన పుస్తకమా ఈ ఆరున్నొకటవ ఇ-బుక్? ధన్యోస్మి 🙏.

 20. మరోపుస్తకం ప్రచురితమయినందుకు అభినందనలు.
  విన్నకోట నరసింహరావుగారి ముందుమాట చక్కగా ఉంది.
  భేషైన ముందుమాటతో అలరిస్తుంది ఈ పుస్తకం.

  భారతి

  • శ్రీమతి భారతి గారు,
   నమస్కారం. నేను వ్రాసిన “ముందుమాట” మీవంటి విదుషీమణికు నచ్చడం నా అదృష్టం. ధన్యవాదాలు.

   • విదుషీమణినా ! నమ్మో !
    పదుగురి లోనొకతెనయ్య భారతి నంతే
    సదమలపు మనసు కలిగిన
    విదురులు భాస్కరులు మీరు విస్తృత పరిధిన్

    జాల్రా జిలేబి 🙂

 21. ఏడవ పొత్తంబొచ్చెన్
  చూడగ తడిమె క్షవరమును చువ్వన గ జిలే
  బీ! డమ డమ కల్యాణం
  బాడబ సరిగమపదనిస పదనిస గరిసా !

  జిలేబి

 22. ఆరవ ఇ – బుక్ గా వెలువడిన “ఊతపదాలు” గురించి –
  ‘లోకానుభవాన్ని మంచి పఠనీయమైన శైలిలో జన బాహుళ్యానికి అందిస్తున్న శర్మగారి కృషి మిక్కిలి ప్రశంసనీయం’ అంటూ మేటైన రచనలకు సాటైనా ముందుమాట రాసిన శ్రీ శ్యామలరావుగారికి అభినందనలు.

 23. ఆరవ పుస్తకం కూడా ప్రచురించబడినందుకు అభినందనలు శర్మ గారూ.

  శ్రీ తాడిగడప శ్యామలరావు గారు వ్రాసిన విలువైన మాటలతో కూడిన ముందుమాట చదివాను. బాగుంది.

  • ఆరవ పొత్తంబొచ్చెను
   శ్రీరస్తు! శుభముల జేర్చు చిరు కానుకగా
   సారము జీవిత సారము
   ధీరత ధీమతయు చేర్చు దీటుగ శర్మన్ !

   జిలేబి

 24. శర్మగారికి నా నమస్సులు.. కాలక్షేపం కబుర్లు గా మీరు ప్రచురించిన టపాలు మంచి విషయాలుగా మననం చేసుకొని ఆలోచింప జేసేవిగా ఉన్నాయి.. సరళభాషలో అర్ధవంతంగా విషయాల్ని కూలంకషంగా తెలిపారు.
  భారతి ద్వారా మీ మాతానాస్తి పితానాస్తి ఇ-పుస్తకం గురించి తెలుసుకొని కినిగె నుంచి పుస్తకం తీసుకుని చదువుతున్నాను..భారతి రాసిన”ముందుమాట”చదివాక పుస్తకం చదవాలన్న ఆసక్తి ని రేకెత్తించింది.. భారతికి.. మీకు నా ధన్యవాదాలు..

  • ల.సౌ భారతి ద్వారా తెలుసుకుని ఇ.బుక్ చదివినందుకు ధన్యవాదాలు, వందనాలు. ల.సౌ.భారతికి ఆశీర్వచనాలు
   ధన్యవాదాలు.

   ల.సౌ భారతి ముందుమాట రాసిన ఇ.బుక్ మొదటి పదిలో ఉన్నదని కినిగె వార్త
   Your book శర్మ కాలక్షేపం కబుర్లు – మాతా నాస్తి పితా నాస్తి (Sarma Kalakshepam Kaburlu Mata Nasti Pita Nasti) is in weekly top ten list of Kinige

  • వనితావని వేదిక బ్లాగర్ వేద శ్రీ గారు, మీరు అన్నట్లుగా శర్మగారివి మననం చేసుకోదగ్గ మంచి టపాలు.
   అనుభవ ప్రజ్ఞతో, అవగాహన పటిమతో, అనేకనేక అంశాలతో అరవిరిసిన అరవిందాలు ఈ ఇ – బుక్స్. అందుకే అగ్రభాగంలో (మొదటి పదిస్థానాల్లో) నిలిచి బహుళ జనాదరణతో భాసిల్లుతున్నాయి.

 25. అభినందనలు శర్మ గారూ. సినిమా వారి సంక్రాంతి విడుదల లాగా వచ్చింది మీ ఐదవ ఇ-పుస్తకం 🙂. వాటి కంటే పెద్ద హిట్టే అవుతుంది 👍.

  “కినిగె” నుండి ఇప్పుడే ఓ కాపీ దింపుకున్నాను. భారతి గుండపు గారు వ్రాసిన “ముందుమాట” ముందుగా చదివాను. మీ పుస్తకంలోని పలు అంశాలను స్పృశిస్తూ సుదీర్ఘమైన పరిచయం చేశారు. “ఈ పుస్తకం ఎందరికో మార్గదర్శకం అవుతుంది” అనే ముగింపు వాక్యంతో చక్కగా వ్రాశారు.

  • విన్నకోటవారు,

   నాది పాత సినిమా re-రిలీజండి, అదెప్పుడూ హిట్టే కదండి.

   నిజంగానే ఈ ఇ.బుక్ చిరంజీవి భారతి చేత ముందుమాట రాయించడానికే కంపోస్ చేశాను. అందులో జిలేబిగారి టపా ఒకటివాడుకున్నాకూడా. ఇ.బుక్ లో వేసుకుంటున్నా మీ టపా అంటే, దానికి అడగాలా? వేసుకోండి అన్నారు, దయతో. చివరిపేజిలో మూడు పద్యాలు రాసిపెడతానని రాసిచ్చేరు, అవి కూడా ఇందులో చేర్చానండి.

   చిత్రమైన విషయం చెబుతా! ఈ ఇ.బుక్ విడుదలైన కొద్దిగంటలలోనే ప్రచురించిన అన్నిటినీ మించిపోయిందంటే…నిజంగానే ఆశ్చర్యం.

   ధన్యవాదాలు.

   • ఆశ్చర్యం ఏమీ లేదండి శర్మ గారు. సార్వజనీనమయిన అంశాల మీద వ్రాసిన వ్యాసాలు కదా, బహుళ జనాదరణ పొందడంలో వింతేమీ లేదు.

  • విన్నకోట నరసింహారావు గారు నమస్తే! శర్మగారి ప్రతీ పుస్తకం చదివి, సకాలంలో మీ స్పందనను తెలపడమే కాకుండా, ముందుమాట రాసినవారిని కూడా ప్రశంసించడం మీ సద్గుణం. “మాతా నాస్తి పితా నాస్తి” కు ముందుమాట రాసే భాగ్యం నాకు కలగడం నా అదృష్టం. వీరి ప్రతీ రచన భావితరానికి ఓ దిక్చూచి. నేను రాసిన పరిచయ వాక్యాలు నచ్చి, మెచ్చిన మీకు మనసార ధన్యవాదాలు.

  • జిలేబిగారు,

   జిలేబి హైటెక్కూ
   విప్పిచెప్పడమే టెక్కునిక్కూ
   ఇదే కదా బెస్ట్ ఆఫ్ లక్కూ
   వినయమే హై టెక్కునిక్కూ

   చెబితే శానా ఉంది

   ధన్యవాదమ్స్

 26. చాలా చాలా సంతోషం శర్మ గారూ, నాలుగు e- బుక్కులు ప్రచురించినందుకు. మీ పుస్తకాలు బహుళ ప్రజాదరణ పొందుతున్నాయని తెలిసి ఇంకా ఆనందించాను. మరింతగా ప్రజాదరణ పొందాలని కోరుకుంటున్నాను. మీకు అభినందనలు.
  చాలాకాలం తరువాత ఈ వేళ మాలిక చూశాను. వ్యాఖ్యల విభాగంలో శ్రీ విన్నకోట నరసింహ రావు గారి వ్యాఖ్య చూసి ఇలా మీ బ్లాగుకి వచ్చాను. వారు అనుసరించిన విధానం లోనే కినెగే లో పుస్తకాలు చూశాను, ముందు మాటలు చదివాను. జిలేబి, లలిత, వనజ, చంద్రిక గార్ల ముందు మాటలు మీ పుస్తకాలకి అందం, విలువ పెంచాయి. వారికి కూడా అభినందనలు.
  మిగతా పుస్తకాలు కూడా త్వరలో ప్రచురించాలని కోరుకుంటున్నాను.
  మరొక్క మారు అభినందనలు. శుభాకాంక్షలు. .

  • బులుసు సుబ్రహ్మణ్యం గారు.

   మొత్తం పదిహేను ఇ-బుక్స్ అయ్యాయండి, దగ్గరగా రెండు వందల పేజీలతో. ఒక్కటి మాత్రం మూడు వందల పేజీలైపోయింది. వీటిలో పదమూడు బుక్స్ కినిగె వారికి పంపేను. వాటిలో నాలుగు లైవ్ చేశారు. మిగిలినవి చేయాలి. వారి ఇబ్బంది తెలియదు. కనుక్కోవాలి. మిగిలినవాటిని త్వరలోనే లైవ్ చేస్తారని ఆశిస్తున్నాను. మిగిలిన రెండు బుక్స్ నేను తయారు పూర్తి చేసి కినిగెకి ఇవ్వాలి. లైవ్ చేసిన బుక్స్ లో మొదటి పది స్థానాలలో ఉన్నాయని కినిగెవారి వార్త. మొదటి పది, ప్రతి శుక్రవారం దీనినినిర్ణయిస్తారనుకుంటున్నాను.

   విన్నకోటవారికి ధన్యవాదాలు.

   జిలేబి,లలితా, వనజ,చంద్రికల గార్ల ముందుమ్నాటలు నా బుక్స్ కి అందాన్ని,విలువను పెంచినమాట నిజం. ఆ మాట మీ నోట విన్నందుకు మరీ ఆనందం.

   ధన్యవాదాలు.

   • మూడు వేల పేజీలపై మూడు నూర్లు
    మొత్తము పదిహేనన పొత్తములు! జిలేబు
    లై కినిగెలోన హాట్కేకులయ్యె చదువ
    రులకు, టాపు టెన్నున వెల్గురువ్వలగుచు 🙂

   • పదిహేను ఇ.బుక్స్ హైలెస్స
    ముఫైఒక్క నూర్ల పేజీలు హైలెస్స
    జిలేబి పెనుమాయ హైలెస్స
    ముసుగులో ముసుగు హైలెస్స
    కలిగినవారి కానందం హైలెస్స.
    కుళ్ళుబోతుల కేడుపూ హైలెస్స.
    జిలెబికి ధన్యవాదాలు హైలెస్స.

   • హైలెస్సా! పొత్తంబులు
    హై లెస్సంగ పదిహేను హైహై జంబూ
    మాలగ గుచ్చిరి! విదురులు
    సోలెడు సాయమునకు మము స్తుతియించిరిగా 🙂

   • Zilebi

    అదెకదా విణ్ణానం
    ఇదెకదా సౌభాగ్యం
    ఉడతదెంత సాయం
    మరో మంచి కబురౌను.

    చంద్రిక ముందుమాట
    మెరుపై మెరవంగ
    మలివారం మొదటిపదిలో
    కినిగె చెప్పినవార్త

    Your book శర్మ కాలక్షేపం కబుర్లు – జీవిత సమరం తొలి రోజులు (Sarma Kalakshepam Kaburlu Jeevita Samaram Toli Rojulu) is in weekly top ten list of Kinige
    Inbox

    Kinige.com
    6:41 AM (5 hours ago)
    to me

    Your book is in weekly top ten books of Kinige. This means it is very prominently displayed on Kinige.com home page and also on every other book page of Kinige, for every visitor 24/7 for this whole of week. http://kinige.com/kbook.php?name=Sarma+Kalakshepam+Kaburlu+Jeevita+Samaram+Toli+Rojulu

 27. అనపర్తి కామెంట్ క్రిందనే :
  “జిలేబి
  P.మూరు 😦”
  అని మరొక కామెంట్ కూడా ఉంది. మరి ఇది ఏ ఊరో 🤔? అయినా కంటి ఆపరేషన్ చేయించుకున్న నెలలోపే ఇలా ఆ ఊరూ, ఈ ఊరూ తిరుగుతారా ఎవరయినా 🤔? (ఎమర్జెన్సీలయితే వేరే సంగతి లెండి). హేవిటో, మీరన్నట్లు విష్ణుమాయ.

  • విన్నకోటవారు,
   1.కినిగె వారికి తెలియజేస్తున్నాను.
   2.వనజగారు కవయిత్రి, జీవితానుభవం ఎక్కువ,భావుకురాలు. ఒక్కమాటలో ఎక్కువ అర్ధాన్ని చెప్పగల సామర్ధ్యం ఉన్నవారండి. నేను చెప్పింది బహు స్వల్పం.
   3.చంద్రికగారి గురించి మీరుచెప్పినమాట నిజమేననుకుంటానండి.
   4&5.సింగపురంలో కంటాసుపత్రులకు కొఱవా? అదికాదండి పాయింటు. ఇక్కడెవరో ముఖ్యులు ఉండి ఉంటారండి, పి.మూరు అన్నారుగదండీ, అది పొలమూరు, శ్రీపాదవారి ఊరు, అక్కడెవరో బందుగులుండి ఉండచ్చని చిన్న అనుమాన, సందేహం. పనిలో పని, కంటికి ఆపరేషన్ కానిచ్చి ఉంటారు. ఇక్కడ చాలా సౌఖ్యంగా ఉంటుందండి ఆసుపత్రి, కావాలనుకుంటే ఇన్ పేషంట్ గా ఉండచ్చు, వసతులు చాలా బాగుంటాయి. అందుకు ఆపరేషన్ ఇక్కడ కానిచ్చేసి ఉండచ్చని డౌటు. బహుశః డిసెంబరు ఆరోతారీకునొచ్చుండచ్చు. ఆపరేషన్ తరవాత వారం రెస్టు చాలు. ఆ తరవాత పొలమూరులోనే ఉండి ఉండాలి. ఏమో ఎప్పుడు కలిసారో చెప్పలేను,నిజమే కావచ్చేమో! నాకే కొంత గడబిడైపోయిందంటే చూడండి. ఇప్పుడేమో సింగపురంలోనే ఉన్నట్టుంది.

   చూద్దాం, తెలియకపోదులెండి.
   ధన్యవాదాలు.

   • ఐపీ అడ్రెస్సుల తో
    టోపీ వేయగ జిలేబి టోకర గాంచెన్
    మా పొలమూరు గురువు తా
    నీ పాటికి బుర్రవేడినిక తాళునకో 🙂

    జిలేబి
    P.మూరు

 28. శర్మ గారూ, మీరు కూడా బహు చతురులు సుమండీ 🙂. మీ అనపర్తిలో మంచి కంటాసుపత్రే ఉండచ్చు గాక (అలాగే మేం కొత్తపేటలో ఉంటున్న కాలంలో డా.వెంకటేశ్వరరావు గారనే కంటివైద్యుడు విరివిగా కేటరాక్ట్ ఆపరేషన్లు చేస్తుండేవారు; ఆ రోజుల్లో కోనసీమలో పేరు గాంచిన కంటిడాక్టర్ గారు).

  కానీ వారు నివసిస్తున్నారని చెబుతున్న సింగపురం లో ఆసుపత్రులకు కొదవా? పోనీ రాణీపేట గనక వారి నివాసం అనుకుంటే ప్రక్కనే ప్రసిధ్ధి చెందిన వెల్లూరు ఆసుపత్రే ఉంది కదా? ఏతావాతా రెండు ఊళ్ళు కూడా మీ ఊరికి దూరాభారమేగా.

  మరి వారి మాటలు నమ్మేసేటంత అమాయకులు మీరని నేను అనుకోను. అటువంటి బుట్టలో వేసే మాటలు చెప్పడం వారికి “కొండాటం” గదా 🙂

 29. శర్మ గారికి,
  మీ నాలుగో ఇ-పుస్తకానికి (జీవితసమరం) చంద్రిక గారు వ్రాసిన “ముందుమాట” short and sweet గా చక్కగా ఉంది. స్కూల్ రోజుల్లో చంద్రిక గారు బహుశః precis writing లో దిట్ట అయ్యుంటారు 👌🙂.

  (“కినిగె”లో PDF Preview లో చదివాను ఈ “ముందుమాట”.)

 30. శర్మ గారికి,

  “పూర్తిగా చదివి ఆకళింపు చేసుకునేవారికి యిది ఒక ఊటబావి” అని మీ వ్రాతల గురించి ఒక్కమాటలో చెబుతూ మీ మూడవ బ్లాగ్ ఇ-పుస్తకానికి (“గఱికెల మాన్యం”) చక్కటి “ముందుమాట” వ్రాశారు వనజ తాతినేని గారు.

 31. శర్మ గారూ,

  “కినిగె” లో మీ నాలుగో ఇ-పుస్తకాన్ని (జీవితసమరం) కొందామని ప్రయత్నించాను. ఈ క్రింది error ను చూపించింది. రెండు సార్లు ప్రయత్నించినా అదే ఫలితం. మీ దృష్టికి తీసుకొద్దామని ఇక్కడ తెలియజేస్తున్నాను.

  “No download filetype found. Please contact support”

 32. Message from Lalitammaay

  Lalitha
  9:19 AM (0 minutes ago)
  to me

  Sarma gaaru,
  Namaste!

  For some reason, I am not allowed to add a comment on your blog: https://kastephale.wordpress.com/2019/01/04/%e0%b0%b6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%87%e0%b0%aa%e0%b0%82%e0%b0%95%e0%b0%ac%e0%b1%81%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b0-14/.

  Please add this one for me:

  అప్పుడే నాలుగో పుస్తకం – భలే! శుభాభినందనలు, శర్మగారు!
  నా ముందుమాటను మెచ్చుకున్న విన్నకోట నరసింహారావుగారు, వనజగారు, భారతిగారికి ధన్యవాదాలు!
  Happy New Year to All!

  Thank you,
  Lalitammay

  Thanks for the message. Check up my blog for comment section.
  Thank u

 33. అప్పుడే నాలుగో పుస్తకం – భలే! శుభాభినందనలు, శర్మగారు!
  నా ముందుమాటను మెచ్చుకున్న విన్నకోట నరసింహారావుగారు, వనజగారు, భారతిగారికి ధన్యవాదాలు!
  Happy New Year to All!

  • లలితమ్మాయ్!

   నీ ఈ కామెంటు నాలుగు సార్లు స్పేం లోకి పోయింది. వెతికి పట్టుకున్నా.
   Happy new year.
   ధన్యవాదాలు.

 34. “నూతన వత్సర శుభాకాంక్షలతో

  జిలేబి
  అనపర్తి”
  ——–‘——-
  వీరు మీ ఊరిలోనే ఉన్నట్లున్నారే, శర్మ గారూ 😉?

  • విన్నకోట నరసింహారావు గారు,
   మా ఊళ్ళో చాలా మంచి కంటి ఆసుపత్రి ఉందండి. ఇక్కడగాని ఆపరేషన్ చేయించుకున్నారేమో! కావలసినవారెవరో ఉండే ఉంటారులెండి.

   ఇక్కడే ఉండి కూడా దర్శనం ఇవ్వకపోవడం అమ్మవారి ప్రత్యేకతే కదండి.
   ధన్యవాదాలు.

 35. తల్లీ! భారతి! వందనమ్ములివియే! తాతయ్య పల్కుల్ సదా
  యుల్లాసంబును జేర్చె! మీదు మదిలో యుత్సాహ ముప్పొంగగా
  కల్లోలంబుల తీర్చెనందరికి, శ్రీ కష్టేఫలీశర్మ కో
  కొల్లల్గట్టి కతల్ జిలేబి వరుసల్ కొండాట్టమై నిల్పగా!

  నూతన వత్సర శుభాకాంక్షలతో

  జిలేబి
  అనపర్తి

  • తల్లీ భారతి వందనములివియే
   కన్నన్నన్ మావూరెగద ప్రసిద్ధి
   జిలేబి యకటా ఇట్లే వచ్చినన్
   కన్పించపోయె నకటా ఏమందునీ చిత్రమున్

   ఆంగ్లనూతన వత్సరమన
   నిదియే స్వాగతంబు శుభకామనలతో
   కన్నున్ మిన్నును గనుటెగదా
   సర్వార్ధముల్ గావుతన్.

   • మీవూరొచ్చితిమీ సా
    రూ! వురుకుల కలిసితిమి గురో మిమ్ము భళా
    తావున్ తెలుపక గాయబ్ 🙂
    తావిని జేర్చిరిగదా సుతారముగ సుమీ !

    జిలేబి
    P.మూరు 😦

 36. వనజగారు,
  మీరు ముందుమాట రాసిన నా ఇ-బుక్ గఱికెలమాన్యం మొదటి పదిలోనూ ఉన్నదని కినిగెవారి వార్త.

  Your book శర్మ కాలక్షేపం కబుర్లు – గఱికెల మాన్యం (Sarma Kalakshepam Kaburlu Garikela Manyam) is in weekly top ten list of Kinige
  Inbox
  x

  Kinige.com
  6:41 AM (1 hour ago)
  to me

  Your book is in weekly top ten books of Kinige. This means it is very prominently displayed on Kinige.com home page and also on every other book page of Kinige, for every visitor 24/7 for this whole of week. http://kinige.com/kbook.php?name=Sarma+Kalakshepam+Kaburlu+Garikela+Manyam

 37. మూడు ఇ బుక్స్ ప్రచురితం అయినట్లు మొన్న రాత్రి తెలిసింది.
  హృదయపూర్వక అభినందనలండి.
  జిలేబీ గారు, లలితా TS గారు, వనజ తాతినేని గారి ‘ముందుమాట’ ముచ్చటగా ఉన్నాయి.

 38. శర్మ గారికి,
  మూడో ఇ-పుస్తకం వెలుగు చూసినందుకు అభినందనలు. ఇందాకనే “కినిగె” లో కొన్నాను. చదువుతాను.

 39. జిలేబిగారు మొదటిమాట రాసిన నా ఇ-బుక్ ఈ వారం కూడా మొదటి పదిలోనూ ఉన్నదని కినిగెవారి వార్త.

  ”Your book శర్మ కాలక్షేపం కబుర్లు – ఆయ్! మాది ప.గో.జి అండి! (Sarma Kalakshepam Kaburlu Aai Maadi Pagoji Andi) is in weekly top ten list of Kinige
  Inbox
  x

  Kinige.com
  6:41 AM (1 hour ago)
  to me

  Your book is in weekly top ten books of Kinige. This means it is very prominently displayed on Kinige.com home page and also on every other book page of Kinige, for every visitor 24/7 for this whole of week. http://kinige.com/kbook.php?name=Sarma+Kalakshepam+Kaburlu+Aai+Maadi+Pagoji+Andi
  ధన్యవాదాలు.

  • బొందలపాటివారు కూడా తన పుస్తకాన్ని ఎంతమంది చూసారో చెప్పారు కానీ తనకెన్ని డబ్బులు వచ్చాయో చెప్పలేదు. టాప్ టెన్ లో ఉండి లాభం ఏమిటీ ? మీ బ్లాగ్ లో కూడా వ్యూస్ వస్తాయి కదా ? మీకెంత డబ్బు వచ్చిందో చెపుతారా ? అది మాత్రం చెప్పరు. రోజూ అంతమంది చూసారూ …ఇంతమంది చదివారు….ఎందుకు ఇవన్నీ ?
   నాకు ఇంత డబ్బు వచ్చింది అని చెపితే వ్రాసేవారూ వ్రాస్తారు కినెగే లో ప్రచురించుకుంటారు.

   • అనామకం/అనామకి/ Trans Gender

    మరో బ్లాగర్ గురించి నా బ్లాగులో ప్రస్తావన అనవసరం,అప్రస్థుతం. వారు వివారాలు చెప్పలేదని ఇక్కడ మాట్లాడటం పనికి రానిది. ఎవరిష్టం వారిది.

    మొదటి పది..లాభం.
    నా ఇ-బుక్స్ ప్రచురణకు, అవి మొదటి పది స్థానాలలో ఉన్నట్టుకినిగె వారి రిపోర్ట్ కు ఆనందించేవారి అనందం పెంచేందుకు, నా టపాలు ఇ-బుక్స్ గా ప్రచురణ జరుగుతున్నందుకు, అవి మొదటి పదిస్థానాలలో ఉన్నందుకు అసూయతో కడుపు మండి ఏడుస్తున్నవారి ఏడుపు మరికొంచం పెంచేందుకు.

    నావి పదునాల్గు పుస్తకాలు. రెండే ప్రచురణ జరిగింది, మిగిలినవి ప్రచురణ జరగాలి. సమయం పడుతుంది. ప్రచురణ పూర్తయ్యాకా అమ్మకాలు జరిగాకా కదా ఎంతొచ్చిందీ? అని తేల్చుకోడానికి. ప్రచురణ జరిగి పది రోజులు కాలేదు, అప్పుడే ఎంతొచ్చింది? ఇవన్నీ పూర్తికాడానికి కనీసం ఆరునెలలు పడుతుంది. అంతదాకా ఉంటారా?

    మరోమాట ఎవరికి ఇష్టమున్నా లేకున్నా మరో ఇ-బుక్ అనగా పదిహేనవదీ ప్రచురిస్తున్నా. మొదటగా ఇక్కడే చెప్పాను.

    ఎవరికి దురదేస్తే వాళ్ళే గోక్కుంటారు. మధ్యలో మీ సిఫార్సు అక్కరలేదు. కావలసినవాళ్ళే తిన్నగా అడుగుతారు.

    మార్కెట్లో సరుకు విలువనుబట్టి కొనుగోళ్ళుంటాయి. మీ దగ్గర సరుకుంటే మార్కెట్ లో పెట్టండి, నాడెమైనదైతే ఎగరేసుకుపోతారు, క్యూలో నిలబడి కొనుక్కుంటారు. నాడెం లేకపోతే మొహం చూడరు. అమ్మి పెట్టేవారికి సిఫార్స్ అక్కరలేదు. అమ్మి పెట్టడానికి షరతులు వారి దగ్గరకెళ్ళి అడిగే చెబుతారు.

  • ఉంటుందని చెప్పాను కదా శర్మ గారూ 🙂. అభినందనలు 👏.

   (ఈ సమాచారం మొదటి ఇ-పుస్తకానికి సంబంధించినది కాబట్టి మీ ఈ వ్యాఖ్యను “మొదటి ఇ-బుక్” అన్న మీ పోస్ట్ క్రిందే / క్రింద కూడా పెడితే బాగుంటుందేమో కదా?)

   • విన్నకోట నరసింహారావుగారు,

    మీ మాటే జరిగిందండి.
    ప్రతిసారి కొత్త టపాకంటే దీనినే పొడిగించేద్దామని, ఆ టపాకింద కామెంట్ పెట్టలేదండి.
    ధన్యవాదాలు.

 40. @విన్నకోటవారు,
  అమ్మకదండీ! అభిమానం!!
  పుస్తకం కొన్నారా? _/\_
  ధన్యవాదాలు
  ——————————————————————
  @@వనజగారు,
  _/\_
  ధన్యవాదాలు
  _______________________________________________
  @@@లలితమ్మాయ్!
  ధన్యవాదాలు

 41. మీ పుస్తకానికి ముందుమాట రాసే అవకాశం నాకిచ్చినందుకు కృతజ్ఞతలు, శర్మగారు! ఈ-పుస్తకాలు ప్రచురిస్తున్న మీకు శుభాభినందనలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s