ఎవరో!
నా బ్లాగులో టపాలు తీసుకుంటున్నారు గత పదేనురోజులుగా! ఎవరో అభిమానులే ఐ ఉంటారు. ఒక చిన్నమాట.
ఇ బుక్ చేసుకోడానికైతే, తయారు చేసిన ఇ బుక్కులున్నాయి, ఇది తెలిసి ఉండదనుకోను. ”కాదు! నాకు నచ్చిన టపాలు ఇ బుక్ చేసుకోడానికి” ఐతే మీ ఇష్టం. ఇంత కష్టం అవుసరమా? 🙂 కారణం ఎంచుకున్న టపాలు ఇ బుక్ చేయడానికి ఎంత కష్టం ఉంటుందో తెలిసినవాడిని కనక. ఇక ఎంచుకున్న టపాలను ప్రింట్ పుస్తకం వేయించుకోడానికి, ఐతే మీరలా వేయించుకోవడానికి నేను అనుమతి ఇవ్వను.
అభిమానం అన్నది వైరల్ జ్వరంలాటిది. అది పొంగినపుడు ఏం చేస్తున్నామో తెలియదు. నేనూ ఈ జ్వర పీడితుణ్ణే! ఒకప్పుడు. రెండేళ్ళ కితం ఈ జ్వరం వచ్చిన ఒక మనవరాలు ”బ్లాగ్ టపాలు ప్రింట్ బుక్ వేస్తాను” అంటే ”ఖర్చు చాలా అవుతుంది, బుక్ కొనేవారుండరు, భారీగా నష్టపోతావు వద్దని, నీవు నష్టపోవడం నాకిష్టం లేదు . మనవారికి పుస్తకం కొని చదివే అలవాటిoకా కాలేదు”అని ఆపేశాను.
జ్వరం తగ్గు ముఖం పట్టక సంవత్సరంకితం మళ్ళీ ”ఎన్నిక చేసిన టపాలు ప్రింట్ బుక్ వేయిస్తా, మహా ఐతే నాకు ఐదువందల డాలర్లవుతాయి, నష్టమైనా బాధ లేదు. నాకు కావలసిన వాళ్ళకి బుక్ ఇచ్చుకుంటా”నంది. అప్పుడు చెప్పేను ఇలా ప్రింట్ పుస్తకాలేయించిన వారు పడిన బాధలు ఉదాహరణ చెప్పేను.”ఇ బుక్స్ ఉన్నాయి, అవి చాలు. అభిమానం ఉండచ్చుగాని, ఇంత సొమ్ము ఖర్చు పెట్టేటంత కాదని” అపేశాను. ఆతరవాతా మనవరాలు మాటాడటం మానేసింది, కోపం వచ్చి మాటాడటం మానేసినా బాధ లేదుగాని, తను నష్టపోవడం ఇష్టం లేకపోయింది. అందుచేత ఇప్పుడు టపాలు తీసుకునేవారికో చిన్నమాట, ప్రింట్ పుస్తకం వేయించి డబ్బులు వృధా చేయకండి. ఇదే నా విజ్ఞప్తి.ఈ సంగతి బ్లాగ్ ముఖంగా చెప్పక తప్పలేదు.
తల్లీ కన్నడ రాజ్యలక్ష్మీ, దయ చూపవా, నేను శ్రీనాథుడిని సుమా!
నాటి వారి ప్రార్థనకు నేటి జమానా లో కన్నడ రాజ్యలక్ష్మి IT రూపేణ బెంగుళూరు న తెలుగువాళ్ళకు వండి వార్చి పెడుతోంది 🙂
జిలేబి,
అవును 🙂 అక్కడినుంచి సింగపూర్,ఆస్ట్రేలియా,అమెరికా అలా అలా ప్రపంచం మొత్తం మీదకి…….
ధన్యవాదాలు.
ఆశ దోశ అప్పడం వడ 🙂
ఏదో పోతే పోనీ మా తాతగారు కదాని చెబ్తే ఇంత లాంగు జంపు చేస్తానంటే యెట్లా 🙂
మొదట కాకి నాడి పట్టండి ఆపై మిగతా వన్ని వస్తాయి
ఆల్ ది బెష్టు 🙂
Anonymous.
తమరు, జిలేబిని అనుకరించాలని ప్రయత్నమా?
ఏం వద్దులెంది 🙂 చాలు చాలునిక చాలున్ చాలున్!
ధన్యవాదాలు
ఓయ్ ఓయ్ తెగింపా ?
శ్రీ కంది వారు ౨౪ అక్టోబర్ తేది కాకినాడ, చల్లా ఫంక్షన్ హాల్ విద్యుత్ నగర్ కాకినాడ లో ౧౦ గంటలకు తేనీ “టి” శతక పుస్తక ఆవిష్కరణ లో సభలో వుంటారు. వీలు చేసుకుని కలవండి.
జిలేబి,
పిలిచిన పేరంటాలకే వెళ్ళలేకపోతున్నాం 🙂
ధన్యవాదాలు.
అభిమానంతో పుస్తకం ప్రచురిస్తామంటె ఎందుకు ఒప్పుకోరు మీరు.
అదే జిలేబీ పైకూ తవికలకు ఇలాంటి బంపరాఫర్ ఎవరైనా ఇస్తారా ?
దయచేసి ఆ అజ్ఞాత అభిమానిని కనీసం జిలేబి బుక్స్ ప్రచురించమనండి. మాలాంటి పాతపుస్తకాలు, పేపర్ల వ్యాపారులు బతకొద్దా.
అనామకం,
ప్రచురణ వద్దనడానికి కారణాలు టపాలోనే చెప్పబడ్డాయి. మీరు జిలెబితో నేరుగా మాటాడచ్చు. నా చోట మీ చిత్తుకాగితాల వ్యాపారం అనువైనది కాదు.
మరో చోటు వెతుక్కోండి, దేశం గొడ్డుపోలేదు.. శలవు తీసుకోండీ
ధన్యవాదాలు.
ఒకే. చిల్ తాతయ్యా.
తవికలు ప్రచురింప జిలే
బివి చెప్పుడి శర్మగారు విధిగా కొంటా
నవి యాభై పైన కిలో
ల విడువక చదివెద! బుచికి లబలబ లాడెన్ 🙂
అనామకం
జిలేబి అంటే టన్నులకొద్దీ అభిమానం ఉందిటా…కాని కేజిల్లెక్క కావాలటా.. ఆ పై మీ ఇష్టం..మజ్జలో బుచికి చేసిన పాపమేంటో 🙂
జజ్జనకరి 🙂
విన్నకోటవారు,
యువకుడిలాటివారు మానసిక వికలాంగులు. నేడు వీరి సంఖ్య పెరుగుతున్నది. ఏ.ట్.ఏమ్ లు లిఫ్ట్ లే కాదు ప్రతి చోట వీరు కనపడుతున్నారు.
మానసిక వికలాంగుల పట్ల జాలి చూపాల్సిందే!
ధన్యవాదాలు.
అనామకం,
నా అమ్మే,నా బాబే, నా తల్లే. జిలేబి పట్ల ఎంత అభిమానం,ఎంతభిమానం, టన్నుల్లెక్క కనపడుతున్న అభిమానాన్ని కేజిల్లెక్కని బేరమాడటమా? ఏమైనా జిలేబి దయ మీ ప్రాప్తి, మధ్యలో నాదేముంది? 🙂
ధన్యవాదాలు.
జిలేబి తవికలు పుస్తకాలు ప్రచురిస్తే చెప్పండి. నేను 50 కిలోలు కొనుక్కుంటాను.
శర్మ గారు,
మీ “కష్టేఫలి” బ్లాగ్-స్పాట్ బ్లాగ్ లో ఇవాళ (22-10-2019) పెట్టిన “ఆ చూపులకర్ధమేంటి?” అనే టపాలోని ఆ వికలాంగురాలి తూష్ణీభావపు చూపులో అటువంటి మనుషుల పట్ల జాలి కనిపిస్తోంది నాకు.
ఆ యువకుడి లాంటి అహంకారులు, నిర్లజ్జాపరులు తరచూ తగులుతూనే ఉంటారు … ముఖ్యంగా ఇలా లిఫ్ట్ దగ్గర, ఈ రోజుల్లో ATMల దగ్గరానూ. వాళ్ళ సంస్కారలేమి కొట్టొచ్చినట్లు బయటపడుతుంటుంది. ఈ తరం వాళ్ళని చూస్తుంటే నాకు కూడా జాలే కలుగుతుంటుంది.
విన్నకోటవారు,జిలేబి.
తెలిస్తే సమస్య లేదుగా, చెప్పచ్చు, వారికి జరిగే నష్టం స్పష్టంగా!
కానున్నది కాక మానదు. వేచి చూదాం
ధన్యవాదాలు.
ఓ యబ్బో ! అనామకాలని జిలేబీ గా గుర్తుపట్టే తాతగారికి మనవరాలెవరో తెలియక పోయెనా ! హతవిధీ 🙂
అనామకం
జిలేబి గారు, అందరిని అన్ని వేళల వెంఠనే కనిపెట్టడం సాధ్యం కాదు. మనవరాలు వద్దన్నానన్న కోపంతో మాటాడటం మానేసిందేమోగాని, చెప్పకుండా మాత్రం ఏ పని చెయ్యదని నమ్మిక. . ఇప్పుడు జరుగుతున్నదా మనవరాలు చేస్తున్నది కాదు, అంకపొంకాలతో, అభిమాన జ్వరం తో బాధ పడుతున్న మరొక అభిమాని పనిది.
వారు బాధ పడకూడదనే బ్లాగ్ ముఖంగా చెప్పేను, వినకపోతే చెయ్యికాలుతుంది, అప్పుడు ఆకులు పట్టుకుని ఉపయోగం ఉండదని తెలుసుకుంటారు.
ధన్యవాదాలు.
అందరిని అన్ని వేళల
తొందరగా కనుగొనుట కుదురదు జిలేబీ
కొందరి నే కను గొనగల
మిందున ప్రైవసి తెరలను మీరుచు రమణీ 🙂
అనామకం,
జిలేబి ఒక పెనుమాయ, ఆపై అనామకం మరో మాయ. పెనుమాయకు ప్రైవసీ! పిడుక్కి వారశూలంటారు ఇది ఏ గాబోలు
ధన్యవాదాలు.
పెనుమాయ జిలేబియె! ఈ
అనామకము దానిపై త్సునామియె సుమ్మీ
పెనుమాయకు ప్రైవసియో ?
అనకొండవలె తను చుట్టు నంతయు సుమ్మీ 🙂
మళ్ళీ మొదలయిందా 🙁?
ఈ లోకంలో రచనలు ఉన్నంత కాలం తస్కరణలూ ఉంటాయనుకోవాలేమో?
ఎవరా శుంఠ శిఖామణులు 🙂