శర్మ కాలక్షేపంకబుర్లు- n log బంగారం

చీమలు పెట్టిన పుట్టలు

పాముల కిరవైన యట్లు పామరుఁడు దగన్

హేమంబుఁ గూడఁబెట్టిన

భూమీశులపాఁ జేరు భువిలో సుమతీ

  చీమ చాలా చిన్న జీవి, ఇవి సంఘ జీవులు. కష్టపడి పుట్ట నిర్మించుకుంటాయి. అది చాలా సౌకర్యంగా ఉంటుంది. పాములు సొంతంగా గూడు నిర్మించుకోలేవు. ఇవి బలహీనమైన చీమల పుట్టల్ని స్వాధీనం చేసుకుంటాయి. సాధారణంగా చీమలు ఓడిపోతుంటాయి.పాములు చీమల పుట్టల్ని స్వాధీనం చేసుకున్నట్టు ప్రభుత్వం సామాన్యులు పోగుచేసుకున్న బంగారాన్ని స్వాధీనం చేసుకుంటారంటారు బద్దెన. కాని అప్పుడపుడు ఇలా కూడా జరుగుతుంది.

బలవంతుడ నాకేమని

పలువురతో నిగ్రహించి పలుకుట మేలా

బలవంతమైన సర్పము

చలి చీమల చేతజిక్కి చావదె సుమతీ

బలవంతుడినని విర్రవీగినవారంతా చిన్నవైన చలిచీమల చేత చనిపోయిన మహా సర్పంలా ఐపోతారు సుమా అని కవిగారి మాట. అందుకు ఎప్పుడూ ఎక్కువమందితో విరోధం పెంచుకోకూ అని సలహా కూడా.

ప్రజలు కూడా చిన్న చీమలలాటివాళ్ళు. బంగారం పోగుచేస్తూనే ఉంటారు. ఇదే వారికి ఒక ఆధారం,అత్యవసరాలలో. అదెలాగంటే, ఏ కుటుంబంలో నైనా ఎంతో కొంత బంగారంలో మదుపుచేయాలని చూస్తారు. అది కూడా స్త్రీకి అనగా ఆఇంటి ఆడకూతురికి నగగా ఉండాలని చూస్తారు. దీనిని స్త్రీ ధనం అంటారు, ఆ బంగారం తండ్రి ఇచ్చినదే కావచ్చు లేదా భర్త ఇచ్చినదే కావచ్చు. సాధారణంగా స్త్రీ ధనాన్ని ముట్టుకోడానికి పురుషాహంకారం అడ్డొస్తుoది. పూర్తిగా అర్ధికంగా చితికిపోయి దిక్కుతోచని సమయంలో ఆ ఇంటి స్త్రీ, తన ఒంటి మీద బంగారాన్నిచ్చి కుటుంబాన్ని నిలబెట్టిన కతలూ కోకొల్లలు. అందుకు భారతీయులు అందునా స్త్రీలు బంగారం మీద మోజు చూపిస్తారు, పై పై కబుర్లు చెబుతారుగాని పురుషులూ సహకరిస్తారు.. మరి ఈ బంగారం అధికంగా ఉంటే ప్రభుత్వం పట్టుకుపోతుందని బద్దెనగారు నాడే చెప్పేరు, మరి ఇప్పుడు బంగారం ఎంత వుండచ్చు అన్నది CBDT Central board of direct taxes చెప్పిన మాట ఇలా ఉంది.

1.బంగారం మీదగ్గర ఎంతైనా ఉండచ్చు అది వస్తు రూపంలో ఉండాలి. నాణేలు,బార్ ల రూపంలో ఉండకూడదు. కొన్ని మినహా ఇంపులున్నాయి, కుటుంబ కట్టుబాటులు, మత ఆచారాలుకి సంబంధించిన నాణేలు వగైరా,పాతకాలపు కాసుల పేర్లు,లక్ష్మీ రూపులు వగైరా కావచ్చు..

2. అలా ఉన్న బంగారం మీకు ఎలా సంక్రమించినదీ ఋజువులు కావాలి. అనగా ఆ వస్తువులు మీకు విల్లు ద్వారా గాని మరో విధంగాగాని సంక్రమించిన కాగితాలు కావాలి.అవీ లేకపోయినా బాధ లేదు, మీకు పెద్దలనుంచి వచ్చినదైతే వారి ఆర్ధికస్థితి చెప్పాలి. మీరు స్వంతంగా తయారు చేయించుకుని ఉంటే వాని తాలూకు రసీదులు, అవీ లేకపోయినా బాధలేదు, మీరు సంపాదించిన సొమ్ముకు టాక్స్ కట్టినదీ చూపిస్తేచాలు. ఇవేవీ లేక ఆ బంగారం మాది కాదు మరొకరిది మాదగ్గర ఉంచారన్నా ప్రభుత్వం నమ్మదు,పట్టుకుపోతుంది.

3. ఒక కుటుంబంలో ఎంత బంగారం ఉండచ్చు?

ఒక కుటుంబాన్ని చూద్దాం. ఒక భార్య,భర్త. ఒక కొడుకు కోడలు, ఒక కూతురు, పెళ్ళి కానిది. మొత్తం ఎంత బంగారం ఉండచ్చు వీరందరికి కలిపి?

మగవారికి ఒక్కొక్కరికి 100 గ్రాములు

పెళ్ళైన స్త్రీ ఒకరికి 500 గ్రాములు

పెళ్ళికాని స్త్రీకి ఒక్కొకరికి 250 గ్రాములు

మగవాళ్ళు (తండ్రి,కొడుకు) = 2 X 100= 200 grams

పెళ్ళయిన స్త్రీలు(అత్త,కోడలు) 2 X 500 = 1000 grams

పెళ్ళికాని ఆడపిల్ల 1 X 250 = 250 grams

మొత్తం బంగారం ఆ కుటుంబంలో ఉంచుకోతగినది. 1450 gram.ఈ బంగారానికి ఋజువులు సాక్ష్యాలు అక్కర లేదు. ఐతే ఒకటే షరతు, ఇదంతా వస్తురూపంలోనే ఉండాలి, కాని బార్ లా ఉండ కూడదు. 1450 gramsఅంటే దగ్గరగా 181 కాసులు… 1 కాసు= 8 grams.

దగ్గరగా కేజిన్నర బంగారం నేటి ధర ప్రకారం ఎంత విలువ చేస్తుంది. గ్రాము నాలుగు వేలైతే, 1450 X 4000 = nearly 60 lakh rupees. బంగారంలో పొదుపు నిరర్ధక పెట్టుబడి. దీనిపై రాబడి ఉండదు.మరి దీనిలో ఎందుకు జాగ్రత్త పెట్టాలని చూస్తారు? భద్రత,స్త్రీలవద్ద ఉంటుంది గనక,చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. అమ్ముకుంటే తొందరగా సొమ్ము చేతికొస్తుంది, ఆపద తొందరగా గట్టెక్కచ్చు, ఇదీ సామాన్యుల ఆలోచన. చిన్నమెత్తు అన్నది చాలా చిన్న మొత్తం, బంగారపు తూకంలో. ఈ చిన్నమెత్తు బంగారం కూడా లేని భారతీయులు కోటానకోట్లు ఉన్నారు. ఐతే కేజిల కొద్దీ, టన్నుల కొద్దీ బంగారం ఉన్నవారూ ఉన్నారు.

కొంతమంది దగ్గర బంగారపు నిల్వలే దొరుకుతున్నాయి, టన్నుల కొద్దీ, వెతికినకొద్దీ.

ఇక ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లో 181 కాసుల బంగారపు ఆభరణాలుండచ్చంటోది. ఇంత బంగారం ఉన్నవారు సామాన్యులై ఉంటారంటారా? అరవై లక్షల రూపాయలు నిరర్ధక ఆస్థిగా ఉంచగలిగినవారు కోటీశ్వర్లులు కారూ? మరి వీధికెక్కి ఎందుకు కొంతమoది బాధ పడుతున్నారు?

 సామాన్యుని దగ్గర ఇంత బంగారం ఉంటుందా?

స్త్రీ పురుషుల మధ్య ఇంత వివక్షతా! (Gender discrimination)అన్యాయం కదూ!! స్త్రీ శక్తి సంఘాలు పిల్ PIL వేయవేం?

24 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- n log బంగారం

 1. // “మా పల్లెటూళ్లల్లో గాలిదయ్యం పట్టిందంటుంటారు .
  ఈ దయ్యం పడితే వదలదంటారు”. //

  హ్హ హ్హ హ్హ, రాజారావు మాస్టారూ, బాగా చెప్పారు. బ్లాగులోకం అనే “గాలిదయ్యం” పట్టింది మనలో చాలా మందికి, తేలిగ్గా వదిలించుకోగలిగేలా లేదు 😃.

  • మిత్రులు రాజారావు గారు,

   చిదంబర రహస్యం అంటారు, దీనికో మాటా చెబుతారిలా. నేనెప్పుడూ చిదంబరం పోలేదు సుమా! ఇది వినికిడి మాటే !

   ఆలయంలోకి భక్తులను దర్శనానికి నిలబెడతారు. వీరికెదురుగా ఒక తెర వేసి ఉంటుంది. ఆలయంలో చిక్కగా ధూపం వేసి ఉంటారు. ఇది సాంబ్రాణి, గుగ్గిలం కావచ్చు. ఈ రెండిటిని ధూపం వేస్తే పరిమిత ప్రాంతంలో గాలిని శుభ్రం చేస్తాయి, ఇవి బెంజాయిన్ ఇస్తాయి పొగలో. అదేగాక ఈ పొగ నాడీమండలాన్ని ఉత్తేజపరుస్తుంది. ఈ సమయంలో ఒక్కసారిగా తెర తొలగించి మూసేస్తారు. అందరికి చిదంబరేశ్వరుని దర్శనమైనట్లు తలుస్తారు. చిదంబరేశుడు వాయు లింగం. వాయువున్నదా? కనపడటం లేదు,కనక లేదు. ఉన్నదా? ఉన్నదని తెలుస్తోంది, కనక ఉన్నది ఇదే అద్వైతం అని నా భావన. అలాగే జిలేబి ఉన్నదా ఉన్నది మన బ్లాగుల్లో రాస్తున్నది కనక, లేదు ఎవరికి ఇప్పటికి కనపడ లేదు గనక, ఇదీ చిదంబర రహస్యం అనుకుంటున్నానండి. .
   ధన్యవాదాలు.

   • ఊరికి వచ్చి ధీమాగా మాట్లాడి ఫోటో దిగబడి ఇచ్చిన దక్షిణ పుచ్చుకొని వస్తే కూడా ఈ తాతగారికి ట్యూబులయిటు వెలగ లేక చిదంబర రహస్య మంటారేమిటి చెప్మా 🙂

   • సార్ , బాగా చెప్పేరు . ధన్యవాదాలు .
    మా పల్లెటూళ్లల్లో గాలిదయ్యం పట్టిందంటుంటారు .
    ఈ దయ్యం పడితే వదలదంటారు . ఐతే , గుగ్గిలం
    ధూపం వెయ్యాలన్నమాట . వదలటానికి .అర్ధమయ్యింది .

   • వెంకట రాజారావు . లక్కాకులగారు,

    ”ధూపం” అనే టపా రాయాలని కొన్నేళ్ళుగా ప్రయత్నం, కొనసాగలేదండి. కొన్నేళ్ళకితం ఒకరు అడిగితే మెయిల్లో సమాధానమిచ్చేసేను, ఆ తరవాత టపా రాయాలనుకున్నా కుదరలేదంతే 🙂 మళ్ళీ మీరు గుర్తు చేసేరు.
    ధన్యవాదాలు.

  • జిలేబి గారూ,

   బంగారం గురించి ఒక టపా రాస్తున్నాను, మంచి హెడ్డింగ్ చెప్పవా అని కాలేజి కెళుతున్న ఒక మనవరాలి వెంటబడ్డాను. ఇదిగో ”n Log బంగారం” ఇలా చెప్పేసి కాలేజికి తుర్రుమంది. 🙂

   Question what is n Log బంగారం ?

   1000 can be written as 10 to the power of 3 and this also can be written as ”3log10”
   40000 can be written as 4 X 10 to the power 4 and also can be written as “4log40″
   4log40=10 grams gold so for n units
   The answer is ”n log బంగారం” 🙂
   Thank you

 2. ఈ విషయంపై అనేక అపోహలు/భయాందోళనలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని టీవీ చానెళ్లు పనికట్టుకొని విపరీత దుష్ప్రచారం (ఉ. మధ్యతరగతి గృహిణుల బంగారంపై మోడీ సర్కార్ దండయాత్ర) చేస్తున్నాయి.

  శర్మ గారు టపాలో ఈ తరహా అపోహలకు జవాబు ఇవ్వడం సంతోషం. అదనపు సందేహవివృత్తి కొరకు నాకు తెలిసిన సమాచారం పొందు పరుస్తున్నాను.

  1. ఆదాయ పన్ను ఎగవేత దారులను కట్టడి చేసే క్రమంలో “ఆదాయానికి మించిన ఆస్తి” (నిజానికి “assets *significantly exceeding* known sources of legal income & original assets” అనాలి, తెలుగులో ఇచ్చిన అనువాదం అంత కరెక్ట్ కాదు) అనేది ఒక సాధనం.

  2. ఒక వ్యక్తికి అటువంటి స్థాయిలో ఆస్తులు ఉన్నాయని రూఢిగా (prima facie) నిర్ధారణ జరిగితే, ఆదాయపు పన్ను సోదాలు లేదా తణిఖీలు (మీడియాలో వాడే “దాడులు” పదం సరికాదు) జరపవచ్చు.

  3. సోదా చేస్తున్న సమయంలో దొరికిన సామగ్రి (నగదు, బంగారం, పత్రాలు వగైరా) & దస్తావేజులను జఫ్తు (seize అనగా తాత్కాలిక స్వాధీనం) చేసే హక్కు అధికారులకు ఉంది. Please note title remains with the owner, department gets possession pending the disposal of the case.

  4. పైన 3 పాయింటులో ఉటంకించిన జఫ్తు విషయంలో CBDT అప్పుడెప్పుడో చాలా ఏళ్ల కిందట కొన్ని మార్గనిర్దేశాలు చేసింది, అవే ఇంకా చెల్లుబాటులో ఉన్నాయి.

  5. సదరు గైడులైన్ల ప్రకారం అందుట్లో పేర్కొన్న పరిమితుల వరకున్న ఆభరణాలను జఫ్తు నుండి మినహాయింపు ఇచ్చారు. This gold cannot be seized even if the individual possesses disproportionate assets.

  ఇక ఆస్తి వెర్సిస్ ఆదాయం లెక్కల వివరణ గురించి వస్తే అనేక విషయాలు గమనించాలి. వ్యవసాయ ఆదాయంపై ఆదాయ పన్ను లేదు. ఇళ్ళు & భూములు అమ్మినప్పుడు కూడా పన్ను ఇండెక్స్ తరువాతనే. ఆదాయపు పన్నులో సైతం ఎన్నో మినహాయింపులు (ఉ. గ్రాట్యుటీ) ఉన్నాయి.

  • జై గారు,
   అనవసరపు అపోహలకే బాధ. మీ అంత వివరంగా చెప్పుకుంటూపోతే టపా బోర్ కొడుతుందనిన్నీ, పట్టుకుపోవడం అన్నది కాన్ఫిస్కేషన్ కాదనీ, చాలా రక్షణలు బహు కాలంగా ఉన్నవేననీ, వాటిని అమలు చేస్తారనీ చెప్పడమే నా ఉద్దేశం 🙂 మీరు చాలా బాగా వివరించారు. ఆస్తులని, బంగారాన్ని కూడా నోటి మాటతో సక్రమింపజేయడం మంచిది కాదనీ, ఒక విల్లు రాయాలనీ తెలియాలన్నది మరొక ప్రయత్నం. known legal source of income is correct terminology as said by you.

   వివరణ వివరంగా ఇచ్చినందుకు
   ధన్యవాదాలు.

 3. టపా బాగుంది, శర్మ గారు.
  స్త్రీధనం ఉండడం ఆవశ్యకమే.‌ అనాదిగా వస్తున్నదే. పైగా ప్రస్తుతం ప్రభుత్వం వారు ఆడవారికి 500 గ్రాములు అనుమతిస్తే, మగవారికి 100 గ్రాములే అంటున్నారు. మరి gender discrimination అని వేస్తే గీస్తే మగవారు PIL వెయ్యాలి గానీ ఆడవారు ఎందుకు వెయ్యడం,
  సరిగ్గా బోధపడలేదు?

  ఇక కోటీశ్వరులంటారా, ప్రస్తుత మార్కెట్ రేట్ బట్టి 60 లక్షలంటున్నాం గానీ, అది ఇప్పుడు నగలు కొనుక్కునే వారికి ఎక్కువ వర్తిస్తుంది అని నా అభిప్రాయం. తల్లిదండ్రులో లేదా “జిలేబి”గారికి వారి “తాతగారు” ఇచ్చినట్లు (🙂) తాతగారో ఇస్తే దాచుకున్న బంగారం అలనాడు కొన్నప్పుడు ఈనాటి Rs.4000/- per gram అంత హై రేటుకు అయ్యుండదు? అలాగే కలిగిన కుటుంబం కాకపోయినా ఆ కాలంలో మెల్లిగా రూపాయి రూపాయి డబ్బులు కూడబెట్టుకుని చేయించుకున్నదో / కొనుక్కున్నదో అయిన ఓ చిన్న నగ ఇప్పటంత ఖరీదు పడంండదు ? ఈ విషయాలన్నీ మీకు తెలియనివి కాదు, inflation వల్ల, కాలక్రమేణా అన్నిటికీ పెరుగుతూ వచ్చిన ధరల లాగానే ఆ పాత బంగారం ధర కూడా పెరిగి ఇప్పుడు అంతంత valuation పలుకుతోంది. కానీ కొన్నప్పుడు అంత పెట్టలేదుగా? కాబట్టి అంత పాత బంగారం ఉన్నవారు కూడా కొంతమంది సామాన్యులే అయ్యుండవచ్చేమో ? ఆ, ఒకటి, ఆ బంగారాన్ని ఇప్పుడు అమ్ముకుంటే గనక లక్షాధికారులు, కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుందేమో మరి?

  ఏవిటో, నా అభిప్రాయం సరిగ్గా వివరించ గలిగానో, లేదో🙏?

  • విన్నకోట సార్!

   స్త్రీధనం కుటుంబ ఆర్ధిక రక్షణకు ఏర్పాటు చేసినదేనండి. పాతంతా రోత కాదు పాత కొత్తల మేలు కలయిక ఆచరించడం గొప్ప…

   అన్నిటా మగవారితో సమానం అంటున్నారు కదా!ఈ విషయంలో దానికోసం ఎందుకు పోరాడరూ అన్నది, కాదంటే వారికి కూడా మాతో సమానం చేయమని పోరాటం ఏదన్నది పాయింటు కదండీ! 🙂

   మగాడికి అన్యాయం కదండీ! పెళ్ళి కాని ఆడపిల్లకి పావు కేజి బంగారం ఉండచ్చన్నప్పుడు అలాగే పెళ్ళి కాని మగపిల్లాడికి ఉండకూడదా మిలార్డ్

   పాతకాలపు బంగారానికి రక్షణ ఏర్పాటు చేశారు కదండీ, ఇప్పుడు ఇంత సొమ్ముతో నగలు కొనేవారు సామాన్యులై ఉంటారా?

   మీరు కరక్టుగానే చెప్పారు కదు సార్! పాతకాలపు బంగారం ఆరోజులనాటికున్నధరతో కొన్నది కాని నేటికి దాని ధర పెరిగిందంటే. నిజానికి చెప్పుకోవాలంటే అంతకు డివేల్యూ అయిందనేమో కదా అర్ధం.

   ప్రజలలో అనవసరపు అపోహలు పెంచడానికి కొంతమంది పని కట్టుకు చేస్తున్న దుష్ప్రచారం కొనసాగుతూనే ఉందండి.
   ధన్యవాదాలు.

  • జిలేబి

   బామ్మా!

   పిల్ల కాసుల పేరు నీకేనే మనవరాలు కళా!
   గోవర్ధనం గొలుసు,చంద్రహారాలు, పలకసర్లు నీకేనే కోడలు పిల్లా! లేస్తే కూచోలేను కూచుంటే లేవలేను, ఎంత చాకిరి చేస్తున్నావో,
   అమ్మాయి మొత్తం ఎనిమిది జతల గాజులు 16 తులాలు నీకేనే అని నోటితో చెబితే కుదరదు, ఒక విల్లు రాసి రిజిస్టర్ చేయించాలి తెలిసిందా? లేకపోతే పిల్లలికి ఇచ్చేది బంగారంకాదు, చిక్కులు.

   మాతాత బంగారం 🙂
   అన్నట్టు మరచా! భారతంలో సువర్ణష్ఠీవి కత చదివేరా? 🙂
   ధన్యవాదాలు.

   • ఓ! అప్పుట్లో మీరు సీక్రెట్టు సీక్రెట్టుగా వేసేసుకున్న టపా అన్న మాట 🙂

    ఎలాగో బయట పడవేయించింది బామ్మ జనాలు బాగు పడేదానికి 🙂

   • బామ్మ గారు,

    అందరూ ఇంతే, కొన్ని తెలిసి, కొన్ని తెలియక, కొంత అశ్రద్ధ అదే మనం 🙂
    మానవులం 🙂
    ధన్యవాదాలు.

   • తెలపండీ లెక్కలనిక
    ములుగులలో బంగరులకు మూలమ్మేదో!
    వలవేసి పట్టెదమికన్
    జిలేబులన్ దాచు వార్ని చెండాడి మరీ 🙂

    తాత గారి వద్ద బంగారమెంతుందో ! వామ్మో వామ్మో మనవరాలా గుట్టుగ లాగేయ్ 🙂

   • Zilebi బామ్మగారూ!

    స్టీవ్ జాబ్స్ ఏమని ఏడ్చేడు,చివరి రోజుల్లో! మనవాళ్ళేం చెప్పేరు? నీకూడా ఏంరాదు ఎంత సంపాదించినా, నువ్వు ఇప్పుడిచ్చుకున్నదే నీది, మరో జన్మ మాటెలా ఉన్నా, ఇప్పటి జన్మలోనే ఆత్మ సంతృప్తి. ఎవరికోసం సంపాదించావు? అదే మనవారాలి మెడలో పిల్ల కాసుల పేరు వేసి ఎంతందంగా ఉన్నావే నాపోలికే అని గుచ్చి కౌగలించుకుంటే ఎంత ఆనందం అలా చేసి చూడవమ్మా! అప్పుడు ఆనందం నీ వెంటే!
    ఎంతున్నా కూడా రాదు, చెప్పడం మరచా! ఒకమాటా! చివరికి ఒక పిసరు నోట్లో పడేస్తారు లే 🙂
    ధన్యవాదాలు.

   • Anonymousగారు,
    పోలిక సరిపోలేదనుకుంటానండీ! 🙂 అమ్మవారిదో పెద్ద కత,చిదంబర రహస్యం 🙂
    ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s