దౌర్మంత్ర్యాన్నృపతిర్వివశ్యతి యతిః సంగాత్సుతో లాలనాత్
విప్రోఽనధ్యయనాత్కులం కుతనయాచ్ఛీలం ఖలోపాసనాత్ ।
హ్రీర్మద్యా దనవేక్షణాదపి కృషిః స్నేహః ప్రవాసాశ్రయాన్
మైత్రీ చాప్రణయాత్సమృద్ధిరనయాత్త్యాగ ప్రమాదాద్ధనమ్॥
యతిసంగంబున, బాలుడాదరముచే, జ్యాభర్త దుర్మంత్రిచే,
శ్రుతిహానిన్ ద్విజు,డన్వయంబు ఖలుచే, గ్రూరాప్తిచే శీల, ము
ద్ధతిచే మిత్రత, చూపులేమిగృషి, మద్యప్రాప్తిచే సిగ్గు, దు
ర్మతిచే సంపదయు నశించు, జెడు నర్ధంబుల్ ప్రమాదంబునన్.
దుర్మంత్రివలన రాజు,సంగమువలన యతి,లాలించుటచే పుత్రుడు, వేదాధ్యనమౌ లేమి బ్రాహ్మణుడు,చెడ్డ పుత్రునివలన వంశము, దుర్మార్గుల సేవలతో సదాచారము, మద్యపానముచే సిగ్గు, చూడకపోవడం మూలంగా వ్యవసాయము, దేశాంతరము వలన స్నేహము,అనురాగము లేమివలన మైత్రి, నీతిలేమి వలన సంపద, అపాత్రదానము,పరాకువలన ధనము నశించును.
ఎవరంతట వారు పాడైపోతే బాధ లేదుగాని ఒకరు మరొకరిచే పాడవడం విచారించతగ్గదే 🙂 ఎవరెవరి వలన పాడవుతారని భర్తృహరి చెప్పిన మాట లక్ష్మణకవి నోట పలికారు. అదెలాగో తెలియాలిగా 🙂
యతిః సంగాత్
యతి అంటే సంన్యాసి. సర్వసంగ పరిత్యాగులైతే సంన్యాసి అవుతారు, రమణులలాగా. ఇలా ఉండవలసిన సంన్యాసి సంగము అనగా ఏ విషయం మీదనైనా స్నేహంచే చెడిపోతారు, అంటే తాముండవలసిన మార్గం లో ఉండరు. యతి నిత్య సంచారం చేయాలి,ఇది నియమం. ఎక్కడ ఆగినా రెండు రాత్రులు మించి ఒక చోట ఉండరాదు,ఇదీ నియమమే. అటువంటి యతి ఒక ఊళ్ళో ఉండిపోయారంటే అక్కడేదో స్నేహం ఏర్పడింది, అది ఏ స్నేహమైనా కావచ్చు, ఆఖరికి ఆ చోటు బాగుందనిపించడం కూడా అందులోనిదే! మరి వీరు చాత్రుమాస్యం చేస్తారు కదా! అప్పుడు సంచారం ఎలా? ప్రశ్న. నిజమే అందుకు చాతుర్మాస్యానికి ఒక పుణ్యక్షేత్రానికి చేరుకోవాలి. అదండి సంగతి, బాబోయ్ నేను సంన్యాసిని కాను….
సుతో లాలనాత్…..
చిన్నపిల్లవాడిని కొంతవయసొచ్చేదాకా రాజులా పెంచాలి, ఆ తరవాత సేవకునిలా చూడాలి, మరికొంత వయసొచ్చాకా మిత్రునిలా చూడాలి లేకపోతే….పప్పూలే తయారవుతారోచ్
దౌర్మంత్ర్యాన్నృపతిర్వివశ్యతి……
రాజు చెడ్డవాడైన మంత్రిచే చెడిపోతాడట. ఇప్పుడు రాజులూ లేరు, రాజ్యాలూ లేవు మంత్రులూ లేరు. నేడు ప్రజలే ప్రభువులు, ఆ ప్రభువులనుంచి ఎన్నుకోబడినవారే మంత్రులు వారే నేటి రాజులు. అధికార గణమే మంత్రులు. వీరు సరియైన సలహాలిచ్చి మంత్రులను నడిపించాలి. ””ఇదిగోనండీ ఇదో మంచి కాంట్రాక్టు, మీరు పదవికి కొత్త, ఇక్కడ బాగానే నొల్లుకోవచ్చు..”” ””.రేపెవవరేనా చూస్తే…పట్టుకుంటే…పరువుపోయె,డబ్బుపోయే…భయంగా ఉందయ్యా!”” ” నేను ఇరవైయేళ్ళుగా ఉద్యోగం చేస్తున్నా, ఎంతమంది మీలాటి కొత్తవారికి ఉపకారం చెయ్యలేదు, మనం మనం ఒకటే,రేప్పొద్దున్న ఏమొచ్చినా మీరు మమ్మల్ని కాపాడాలి,మేము మిమ్మల్ని కాపాడాలి, చిదంబర రహస్యం తెలిసింది కదా! అంచేత నొక్కండి……నన్ను మరిచిపోకండి, ఇంకా ఇరవైయేళ్ళు ఉద్యోగంలో ఉంటా……”” ఇంకా మంత్రి ఎలా తయారవుతాడు, అసలే కోతి కల్లుతాగింది,నిప్పుతొక్కింది,పిచ్చిపట్టింది,ఆ పై దయ్యం పట్టినట్టు కనపడిన ప్రతీది నొల్లేసుకోడూ? అందుచేత సలహా చెప్పేవాణ్ణి సరైనవాణ్ణి వేసుకోకపోతే ఇంతే సంగతులోచ్..
విప్రోఽనధ్యయనాత్…..
ఇప్పుడు వేదం చదువుకునేవారే తక్కువ. కుల బ్రాహ్మణులేగాని గుణ బ్రాహ్మణులు లేరు. వేదం చదుకున్నవారు అధ్యయనం చేయకమానరు. అలా అధ్యయనం చేయకపోతే చెడిపోవడం ఖాయం.
కులం కుతనయా…..
కులములో నొక్కడు గుణవంతుడుండిన కులము వెలయువాని గుణము చేత అన్నారు వేమనతాత. అంతెందుకుగాని ఒక్కడు కుపుత్రుడుంటే చాలు, తల్లి తండ్రులకు అందరికి గొప్పపేరు తెచ్చిపెడతాడు కదా! ఏదీ ఆ ఆకులవారబ్బాయా! ఓహో ఎంత గొప్పవాడు అని చెప్పుకోరూ
శీలం ఖలోపాసనాత్….
దుర్మార్గుని సేవలో సదాచారం, బ్రాకెట్ కంపెనీలో ఉద్యోగం చేస్తే ఏంమాటలు అబ్బుతాయి? డబల్ జీరో వస్తుందా? నిన్న ఓపెనింగ్ ఈవేళ క్లోజింగ్ వస్తుంది,ఒరే నిన్న రత్నాలొచ్చింది కదా! ఎప్పుడెళ్ళిందీ? ఇటువంటి మాటలు తప్పించి మంచిమాటలొస్తాయా?
టపా పెద్దదైపోతోంది,మిగిలింది తరవాత
పీతల మంగపు కతలన్
మా తాతయ్య ప్రచురించె మరల జిలేబీ
యేతావాతా యేదై
నా తాత్పర్యము కలదకొ నాతుక తెలుపన్ 🙂
ఈ మధ్య తాతగారు రిపీటు టపాల మేటి యయ్యిరి 🙂
జిలేబి
పిడకల వీడియో మళ్లీ పెట్టేరేమిటి ?
ఇంతకు మునుపే ఓ మారు పెట్టేరుగా ?
ఏమన్నా విశేషమా ? 🙂
సంక్రాంతి దగ్గరకొస్తోందిగా, అందువల్లనేమో?
నాకు అబ్బురంగా అనిపించినది ఆవిడ అంత precision తో గోడ పై భాగంలో ఖాళీ ఉన్నచోట కు విసరడం. ఆహాహా, అటువంటి వ్యక్తులకు కాస్త లేత వయసులోనే ట్రెయినింగ్ ఇచ్చినట్లయితే మంచి బాస్కెట్ బాల్ ఆటగాళ్ళుగా తయారయ్యే అవకాశాలు ఉంటాయి కదా. గ్రామీణ ప్రతిభను ఉపయోగించుకోవడం లేదు దేశం.
విన్నకోటవారు,
ఎక్కడో నొక్కబోయి ఎక్కడో నొక్కితే ఏదో అయింది.
మీరన్నదే నిజం పోలీసు, మిలిటరీ లో ఐతే తూటా బీరుపోదుగా.
గ్రామీణ ప్రతిభని ఎక్కడ బతకనిస్తున్నారండీ 🙂
జిలేబి బుర్రే బుర్ర కదా 🙂
jokes apart.
ఎక్కడో నొక్కబోయి ఎక్కడో నొక్కితే ఏదో అయింది.
ఏ అనామకం అడిగినా జిలేబి యే అంటూ సమాధానాలిచ్చేస్తున్నారామెటి ఈ మధ్య ? వారు తప్పించి “కష్ట” “మరలు ” లేరా మీకు 🙂
అనామకం
on 15:22 వద్ద డిసెంబర్ 7, 2019
జిలేబి ని తమరు అనుకరించినంతలో జిలేబి అనేసుకోను 🙂
జిలెబి ఒక అనామకం, మీరూ ఊరూ పేరూ చెప్పుకోలేని అనామకంలో చేరిపోయినందుకు సంతసం 🙂
ఒకప్పుడు ’కష్ట’ ’మరల’ కోసం ఎదురు చూసాను, నిజమే! 🙂
ఎప్పుడూ ’కష్ట’ ’మరలు’ నా బ్లాగు చూడలేదనీ, వ్యాఖ్య చేయలేదనీ అనుకో లేదు. 🙂
నిజానికి ఇప్పుడు నావి నాకాలక్షేపం కోసం రాసుకునే కబుర్లే 🙂
తమరు చిత్తగించచ్చు. 🙂
// “నీతిలేమి వలన సంపద, … నశించును” //
సుభాషితం చక్కగానే ఉంది కానీ ఈ కాలంలో నిజం కాదేమో ? అటువంటి సంపదే మరింత వృద్ది చెందుతోందన్నట్లు తోస్తోంది.
ఈ కాలపు చదువుల్లో భర్తృహరి / లక్ష్మణ కవి సుభాషితాలు పాఠ్యాంశాలుగా జేరుస్తున్నారా అని నాకనిపిస్తుంటుంది. అసలు తెలుగు ఎవరు చదువుతున్నారండీ అంటారా, అదీ నిజమే.
విన్నకోటవారు,
మీ మాటే కరక్టనిపిస్తోందండి.
సెకులర్ ప్రభుతవారు వీటిని చాలా ఏళ్ళుగానే పాఠ్యాంశాలనుంచి తొలగించారండి.