శర్మ కాలక్షేపంకబుర్లు-ఘనపాఠి

 

Posted on నవంబర్ 22, 2015

ఘనపాఠి

వేదాన్ని శ్రుతి,స్వాధ్యాయం అని కూడా అంటారు. శ్రుతి అనగా వినబడినదని అర్ధం. అనూచానంగా వేదాన్ని కంఠోపాఠంగా మాత్రమే ఉంటోంది. రాసుకోవచ్చుగా అన్నారు మేధావులు, అలాకాదు వేదాన్ని ఉదాత్త అనుదాత్త స్వరాలతో పలకాలి, లేకపోతే అర్ధం మారిపోతుంది, కనుక ముఖతః ఉండక తప్పదన్నారు. అదీగాక ఈ వేద పారాయణ శబ్దానికి శక్తి ఉంది. అందులో విషయం గురించి తర్కించేటంత తెలివి నాకు లేదు, ఇది అప్రస్తుతం కూడా.

వేదం లో ఉన్న వాటిని సూక్తులు అంటారు. వేదం లో వాటిని ఋక్కులు అనీ అంటారు. ఈ సూక్తులను కంఠోపాఠం చేయడానికి కొన్ని పద్దతులున్నాయి, అవి

1.వాక్య పాఠం లేదా సంహితా పాఠం 2.పదపాఠం 3.క్రమ పాఠం 4.జట పాఠం .5. ఘన పాఠం. వీటి స్వరూపాలు చూద్దాం. ఇవిగాక మరిన్ని పద్ధతులూ ఉన్నాయట. ఇలా చేయడం మూలంగా అక్షరం కూడా బీరుపోకుండా ఉంటుంది. అక్షరం బీరుపోకుండా అన్న నానుడి దీనినుంచి పుట్టినదే!

త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యో ముక్షీయ మామృతాత్

ఇది మహా మృత్యుంజయ మంత్రం.దీనిని వివిధ రకాలుగా పారాయణ చేయడం చూదాం.

1. వాక్య లేదా సంహితా పాఠం:- పై సూక్తాన్ని అలాగే సంధులు విడతీయకుండా గానం చేసేది వాక్య లేదా సంహితా పాఠం.

త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యో ముక్షీయ మామృతాత్

2.పద పాఠం:- ఇందులో సూక్తాన్ని పదాలుగా విడతీసి గానం చేయడం.

పదాలుగా 1.త్రయంబకం2.యజామహే3.సుగంధిం.4.పుష్టి5.వర్ధనం. 6.ఉర్వారుక7. ఇవ.8.బంధనాత్ 9.మృత్యో 10.ముక్షీయ 11.మాం 12.అమృతాత్. పదాలుగా విడతీసి గానం చేయడాన్ని పద పాఠం అంటారు. ఇలా వేదాన్ని అధ్యనం చేసినవారిని తెనుగునాట స్వాధ్యాయి అనేవారు.

3.క్రమ పాఠం:- క్రమ పాఠంలో పై సూక్తిలోని పదాలను క్రమంలో గానం చేయడం. అది ఇలా,

పదాలు. 1-2,2-3,3-4,4-5,5-6,6-7,7-8,8-9,9-10,10-11,11-12.

త్రయంబకం యజామహే, యజామహే సుగంధిం, సుగంధిం పుష్ఠి, పుష్టి వర్ధనం, వర్ధనం ఉర్వారుక, ఉర్వారుక మివ, ఇవబంధనాత్, బంధనాత్ మృత్యో, మృత్యో ముక్షీయ, ముక్షీయమాం, మాంఆమృతాత్.

ఇలావేదాన్ని అధ్యయనం చేసినవారిని క్రమాంతస్వాధ్యాయి అనేవారు.

జట పాఠం:- సూక్తంలో పదాలని
1-2,2-1,1-2;
2-3,3-2,2-3;
3-4,4-3,3-4;
4-5,5-4,4-5;
5-6,6-5,5-6;
6-7,7-6,6-7;
7-8,8-7,7-8;
8-9,9-8,8-9;
9-10,10-9,9-10;
10-11,11-10,10-11;
11-12,12-11,11-12.
ఇలా కూర్చి సుస్వరంగా గానం చేస్తే, అదిలా ఉంటుంది. ఇలా వేదాన్ని అధ్యయనం చేసినవారిని జటాంత స్వాధ్యాయి అంటారు.

త్రయంబకం యజామహే,యజామహే త్రయంబకం,త్రయంబకం యజామహే;
యజామహే సుగంధిం, సుగంధిం యజామహే,యజామహే సుగంధిం;
సుగంధిం పుష్టి,పుష్టి సుగంధిం, సుగంధిం పుష్టి;
పుష్టి వర్ధనం, వర్ధనం పుష్టి, పుష్టి వర్ధనం;
వర్ధనం ఉర్వారుక,ఉర్వారుక వర్ధనం ,వర్ధనం ఉర్వారుక;
ఉర్వారుకమివ, ఇవ ఉర్వారుక,ఉర్వారుకమివ;
ఇవ బంధనాత్, బంధనాత్ ఇవ, ఇవ బంధనాత్;
బంధనాత్ మృత్యో,మృత్యో బంధనాత్ బంధనాత్ మృత్యో;
మృత్యో ముక్షీయ,ముక్షీయ మృత్యో ,మృత్యో ముక్షీయ;
ముక్షీయ మాం, మాం ముక్షీయ, ముక్షీయ మాం;
మాం అమృతాత్,అమృతాత్ మాం ,మాంఅమృతాత్;

ఘన పాఠం:- సూక్తంలో పదాలని
1-2,2-1,1-2-3,3-2-1,1-2-3;
2-3,3-2,2-3-4;4-3-2,2-3-4;
3-4,4-3,3-4-5,5-4-3,3-4-5;
4-5,5-4,4-5-6,6-5-4,4-5-6;
5-6,6-5,5-6-7,7-6-5,5-6-7;
6-7,7-6,6-7-8,8-7-6,6-7-8;
7-8,8-7,7-8-9,9-8-7,7-8-9;
8-9,9-8,8-9-10,10-9-8,8-9-10;
9-10,10-9,9-10-11,11-10-9,9-10-11;
10-11,1-10,10-11-12,12-11-10,10-11-12.
ఇలా కూర్చి సుస్వరంగా గానం చేస్తే, అదిలా ఉంటుంది. వేదాన్ని ఇలా అధ్యయనం చేసినవారిని ఘనాంత స్వాధ్యాయి లేదా ఘనపాఠీ అంటారు. వీటిని గురుముఖతః నేర్చుకోవలసిందే. అలవాటులో ఇది ఘనాపాఠీ అయింది. ఈ ఘన పాఠంలో కూడా కొన్ని భేదాలున్నాయి. ఇంత కష్టపడి వేదం జిహ్వాగ్రాన ఉంచుకున్నవారు, అదీగాక పరిక్షలో నూటికి నూరు మార్కులూ రావలసిందేగాని కొన్ని తగ్గినా కుదరనిదీ ఈ విద్య. అందుకు వీరిని ఘనపాఠీ అని గౌరవించడం జరుగుతుంది.  ఈ ఘనపాఠీ పదానికి కూడా వికృతార్ధమే చెప్పేస్తున్నారు.

౧-౨,౨-౧,౧-౨-౩,౩-౨-౧,౧-౨-౩;
త్రయంబకం యజామహే;యజామహే త్రయంబకం,త్రయంబకం యజామహేసుగంధిం,సుగంధింయజామహే త్రయంబకం,త్రయంబకం యజామహేసుగంధిం
౨-౩,౩-౨,౨-౩-౪;౪-౩-౨,౨-౩-౪;
యజామహే సుగంధిం, సుగంధిం యజామహే,యజామహే సుగంధింపుష్టి,పుష్టి సుగంధింయజామహే,యజామహే సుగంధింపుష్టి;
౩-౪,౪-౩,౩-౪-౫,౫-౪-౩,౩-౪-౫;
సుగంధిం పుష్టి,పుష్టి సుగంధిం, సుగంధిం పుష్టివర్ధనం,వర్ధనంపుష్టి సుగంధిం, సుగంధిం పుష్టివర్ధనం;
౪-౫,౫-౪,౪-౫-౬,౬-౫-౪,౪-౫-౬;
పుష్టి వర్ధనం, వర్ధనం పుష్టి, పుష్టి వర్ధనంఉర్వారుక,
ఉర్వారుక వర్ధనంపుష్టి, పుష్టి వర్ధనంఉర్వారుక; ,
౫-౬,౬-౫,౫-౬-౭,౭-౬-౫,౫-౬-౭;
వర్ధనం ఉర్వారుక, ఉర్వారుకవర్ధనం,వర్ధనం ఉర్వారుకమివ,ఇవ ఉర్వారుకవర్ధనం,వర్ధనం ఉర్వారుకమివ;
౬-౭,౭-౬,౬-౭-౮,౮-౭-౬,౬-౭-౮;
ఉర్వారుకమివ, ఇవ ఉర్వారుక,ఉర్వారుకమివబంధనాత్,
బంధనాతివౌర్వారుక,ఉర్వారుకమివబంధనాత్;
౭-౮,౮-౭,౭-౮-౯,౯-౮-౭,౭-౮-౯;
ఇవ బంధనాత్,బంధనాత్ ఇవ, ఇవ బంధనాత్బంధనాత్మృత్యో,మృత్యోబంధనాత్ ఇవ, బంధనాత్బంధనాత్మృత్యో;
౮-౯,౯-౮,౮-౯-౧౦,౧౦-౯-౮,౮-౯-౧౦;
బంధనాత్ మృత్యో,మృత్యో బంధనాత్,బంధనాత్ మృత్యోముక్షీయ;ముక్షీయమృత్యోబంధనాత్,బంధనాత్మృత్యో ముక్షీయ;
౯-౧౦,౧౦-౯,౯-౧౦-౧౧;౧౧-౧౦-౯,౯-౧౦-౧౧
మృత్యో ముక్షీయ,ముక్షీయ మృత్యో,మృత్యో ముక్షీయమాం;మాంముక్షీయమృత్యో,మృత్యో ముక్షీయమాం;
౧౦-౧౧,౧౧-౧౦,౧౦-౧౧-౧౨;౧౨-౧౧-౧౦,౧౦-౧౧-౧౨
ముక్షీయ మాం, మాం ముక్షీయ, ముక్షీయ మాం అమృతాత్, అమృతాత్ మాం ముక్షీయ, ముక్షీయ మాం అమృతాత్.

విషయ సేకరణ, శంకరాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారి గ్రంధం The Vedas నుంచి.

ఘనపాఠం వినండి

https://drive.google.com/file/d/1dNMOVa1jPv4t9FbwewZM0vF4UvqwxmXn/view?usp=sharing

14 THOUGHTS ON “శర్మ కాలక్షేపంకబుర్లు-ఘనపాఠి”

 1. Venkatram Rao Kalaga on 12:17 వద్ద నవంబర్ 26, 2015 said:మార్చు 0 0 Rate ThisSarma GaruExcellentWe expect moreReply ↓
 2. anniyya@yahoo.com on 09:53 వద్ద నవంబర్ 23, 2015 said:మార్చు 0 0 Rate Thisమేక మేక తొక తోక మెకమెక తొకమేక మెకతోక. ఇవి చాలా కష్టం సార్.Reply ↓
 3. Zilebi on 22:29 వద్ద నవంబర్ 22, 2015 said:మార్చు 0 0 Rate Thisబాగుందండీ శర్మ గారు,మరి ఆ ఘన ఘటం ఆకాశం లో కలిసి పోయాక ఆ స్వరమాలిక స్థానం/ప్రస్థానం ఎక్కడ ?జిలేబిReply ↓
  • kastephaleon 00:24 వద్ద నవంబర్ 23, 2015 said:మార్చు 0 0 Rate ThisZilebi గారు,
   సంఘటితమైతే జీవం విఛ్ఛినమైతే……అంతా మిధ్య. ఆకాశంలో కలిసిన తరవాత స్వరమాలికా లేదు/స్థానమూ లేదు. అనంతంలో కలిస్తే విడిగా కనపడుతుందా? 
   ధన్యవాదాలు.Reply ↓
 4. venkat on 22:10 వద్ద నవంబర్ 22, 2015 said:మార్చు 0 0 Rate Thisavunu, cinemaalo vinadame thappa, poorthigaa theliyadu. mee valla..thelisindi..Thank you so much.Reply ↓
 5. తాడిగదప శ్యామలరావు on 07:06 వద్ద నవంబర్ 22, 2015 said:మార్చు 0 0 Rate Thisదాన్ని ఉదాత్త అనుదాత్త స్వరాలతో పలకాలి, లేకపోతే అర్ధం మారిపోతుందన్నారు. నిజమే. కాని ఈ‌రెండే కాక స్వరిత, ప్లుతాలనే‌మరో రెండు స్వరబేధాలు కూడా ఉన్నాయనుకుంటాను. నాకు సరిగా తెలియదు.Reply ↓
  • kastephaleon 00:18 వద్ద నవంబర్ 23, 2015 said:మార్చు 0 0 Rate Thisతాడిగదప శ్యామలరావు గారు,
   చాలా విషయాలు మనకు తెలియనివే ఉన్నాయి. వేద శాఖలు 1192 ట. అందులో ప్రస్తుతం ప్రకటం గా ఉన్నవి 92 శాఖలట. ఇక మీరు చెప్పినవి కూడా ఉండ్చ్చు, నాకూ తెలిఅయదు.
   ధన్యవాదాలు.Reply ↓
 6. స్వాతి on 06:21 వద్ద నవంబర్ 22, 2015 said:మార్చు 0 0 Rate Thisహమ్మయ్య, మీరు మళ్ళీ వచ్చేసారు. ఆనందం. అప్పుడెప్పుడో స్వర్ణకమలం సినిమాలో ఘనపాఠి గురించిన ఒక సీన్ ఉంటుంది (మీరు సినిమాలు చూసేవారో తెలియదు మరి). నాకప్పుడు అర్థం కాలేదు అసలు ఘనపాఠి అంటే ఏమిటో, తెలుసుకోవాలనే ప్రయత్నమూ చేయలేదు. ఇదిగో ఇన్నాళ్ళ తరువాత మీ మూలాన తెలుసుకునే అవకాశం కలిగింది. Reply ↓
 7. Dr.Suman Lata Rudravajhala on 02:04 వద్ద నవంబర్ 22, 2015 said:మార్చు 0 0 Rate Thisమీరు అందరికీ పరిచయమున్న మహా మృత్యుంజయ మంత్రం ఉదాహరణ ఇస్తూ వేదం పాఠాలకు ఇచ్చిన వివరణ అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు ఉంది .ధన్యవాదాలు. మీ ‘ కాలక్షేపం ‘ కబుర్లు మాకు జ్ఞాన ప్రసాదాన్ని అందిస్తున్నాయి అని మాత్రమె చెప్పగలను . సుమన్ లతReply ↓
  • kastephaleon 00:12 వద్ద నవంబర్ 23, 2015 said:మార్చు 0 0 Rate ThisDr.Suman Lata Rudravajhala గారు,
   పరమాచార్య అనుగ్రహ భాషణాలను మరొకరు ఆంగ్లంలో కి అనువదించి పుస్తకం వేశారు. దానినుంచి విషయం సేకరించి ఒక ఋక్కుకు అన్వయించి చెప్పేను. వారు చాలా చెప్పివున్నారు, నా భాషా పరిజ్ఞానం తో తప్పులు చెబుతానేమోనని భయపడి ముగించాను. మొన్న బ్లాగ్ మూసినపుడు అక్కడక్కడా చెదురుగా ఉన్న టపాలు రాసినవి, సగం రాసినవి అన్నీ మూట్ కట్టేను. అందులో ఇది కనపడింది. ఇంకా రాయాలనుకున్నాగాని, సవరించి ముగించాను.
   అమ్మ మీ ద్వారా అనుగ్రహించిన అభిమానానికి
   ధన్యవాదాలు.

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఘనపాఠి

 1. ఇటువంటి పండితులకు ఈ కాలంలో తగిన ఆదరణ లభించకపోవడం దౌర్భాగ్యం. టి.టి.డి వారేమన్నా ప్రోత్సహిస్తున్నారేమో తెలియదు మరి.

  అమలాపురంలో మా తండ్రిగారు RDO గా ఉన్న రోజుల్లో ఒక ఆదివారం మధ్యాహ్నం ముగ్గురు నలుగురు ఘనాపాఠీలు మా ఇంటికి వచ్చారు. మా తండ్రిగారే వారికి కుర్చీలు చూపించి కూర్చోమని చెప్పారు. ఆ పండితులు నాలుగైదు పనసలు చదివారు (అదరగొట్టేశారు అనాలి).
  అసలు ఏం సాధన, ఏం ధారణ శక్తి 🙏! అటువంటి వారిలో కొంతమందికి భుక్తి సరిగ్గా గడవకపోయినా వారి జన్మ ధన్యం. సరే వారిని ఉచితరీతిన సత్కరించారు మా నాన్నగారు.

  మా నాన్నగారి ప్రక్కన నేనూ నిలబడి విన్నాను. జరుగుతున్నదేమిటో ఏమీ బోధపడ లేదు. అసలు ఎవరిని ఘనాపాఠీ అంటారో కూడా తెలియని వయసు. తరువాత రోజుల్లో వచ్చిన కె.విశ్వనాథ్ గారి “స్వర్ణ కమలం” లో ఒక ఘనాపాఠీ గారు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఎదుట నిలబడే సీన్ గుర్తొస్తోంది (ఈ క్రింది లింక్ చూడండి).

  ఇప్పుడు మీ టపా చదివితే చక్కగా అర్థమయింది. మంచి టపా అందించినందుకు ధన్యవాదాలు శర్మ గారు.

  • విన్నకోటవారు,

   తి.తి.దే, ప్రసాద్ గారు ఇంఛార్జ్ గా ఉండగా కొంతకాలం వీరికి భృతి ఏర్పాటు చేసారు. దానిపై కొందరు సెక్కులర్ పాత్రధారులు అనాటి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసారు. ఆయన విని చర్య తీసుకోలేదు. తరవాత కాలంలో ఏమయింది? ఇప్పుడేం జరుగుతోంది, తెలియదు. నేను మాఉరొదిలిపోయేదాకా సంవత్సరానికి ఒక సారి వచ్చే ఈ శ్రావణికులకు తోచిన సత్కారం చేసేది అమ్మ. ఆ తరవాత అదీ వెనకబట్టేసిందండి.
   ఘనాపాఠీ కాదండి, అది ఘనపాఠి మాత్రమే సుమా నాకు తెలిసి 🙂
   నమస్కారాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s