బొబ్బర్ల అట్టు.
బొబ్బర్లు తెలుసుకదా! బలేవారే బొబ్బర్లు తెలియకపోవడమేంటండి? నేటి కాలంలో చిరు ధాన్యాలని, రాగులు,చోళ్ళు,గంటెలు,ఊదలు,చామలు, కొర్రలు, ఇలా పేరు కూడా ఎప్పుడూ విననివాటి వెనకపడి ఎక్కడ దొరుకుతున్నాయంటే అక్కడికి పరుగెట్టీ కేజి మూడొందలంటే కొనుక్కుని తెచ్చుకుని తినటం లేదూ?
ఏం తింటున్నారూ? నేటి స్టార్ కొచ్చను కదా? ఎందుకు వీటి వెనకపడి వీటిని తింటున్నారు? ఒఖ్ఖ మాటలో చెప్పాలంటే వేలం వెర్రి ఇదంతా, మరేంలేదు..ఇవి తింటే వందేళ్ళు బతుకుతాంటా! రోగమే ఉండదుటా! ఇలా ఊహాగానాలు. . ఇదిగాక మరోమాట కూడా, ఇప్పుడు ఎవరూ,ఎప్పుడూ వినని తృణ ధాన్యం తింటున్నామన్నదో స్టేటస్ సింబలై పోయింది. అదేగాక ఇప్పుడు హై సొసైటీలో చోడిజావ తాగుతున్నామని చెప్పుకోడమూ, గంజి తాగుతున్నాం ఉడుకునుంచి రక్షించుకోడానికని చెప్పడం గొప్పైపోయింది. సరే ఏదైనా అతిచేస్తే గతి చెడుతుందని నానుడి. ఇటువంటి చిరు ధాన్యాలు తినడం మంచిదే! దానితో పాటుగా చేయవలసిన పనులు చేయకపోతే చిరు ధాన్యాలు తిన్నా ఒకటే బియ్యపు అన్నం తిన్నా ఒకటే! నా మాట బాధించవచ్చు, ఏం చేస్తాం ఇది నిజం.
రేపో నేడో స్టార్ హోటల్లో కొర్రన్నం+ కొరివికారం, గానుగు నూనెతో, నంజుడికి వెన్నతో తిని, కొద్దిగా ఉప్పేసుకుని ఉల్లిపాయ కొరుకుతూ గంజి తాగి రావడం ఫేషన్ కావచ్చు, ఎవరు చూడొచ్చేరు చెప్పండి? దారి తప్పేనా మన్నించండి.
కందులు,మినుగులు,పెసలు లాటి పప్పు ధాన్యాలే బొబ్బర్లు కూడా. పాతరోజుల్లో వీటిని ఉప్పుతో ఉడకబెట్టుకుని తినేవారు. వీటినే గుగ్గిళ్ళు అంటారు, వీటిని గుర్రాలకీ పెట్టేవారు, పొడుగుపాటి బుట్టలో పోసి గుర్రం మూతికి కట్టేసేవారు. ఈ గుగ్గిళ్ళు తిన్న గుర్రం అలుపులేక పరుగెట్టేది, మళ్ళీ దారి తప్పిపోయానండీ!
ఈ బొబ్బర్లని రాజామా అంటారు ఉత్తరాదివారు. రాజమా పప్పుతో రోటీలు,పుల్కాలు, ఉల్లిపాయ కొరుక్కుని స్టఫ్డ్ మెరపకాయతో తింటే ఓ ఆనందమే ఆనందం. బొబ్బర్లు పేదవారి ఆహారం, వీటితో రకరకాలు చేసుకోవచ్చు…ఇలా….
రాత్రి బొబ్బర్లు నానబెట్టండి, ఉదయానికి బలే ఉబ్బుతాయి. మిక్సీ లో వేయండి, మెత్తగా రుబ్బండి. చిటికెడు పసుపేసి, తగిన ఉప్పెయ్యండి. అట్టులా వేసుకోడానికి తగినంత పల్చగా చేసుకోండి. నాన్ స్టిక్కులొద్దు, ఇనప పెనం మీద అట్టులా వేసి, అల్లం పచ్చిమిర్చి వేయండి. సన్నగా కాలనివ్వండి, తగిన నూని వేయండి. అబ్బో పెసరట్టు రుచికంటే గొప్పగా ఉంటుంది.
ఇక పుణుకుల్లా వేసుకోవాలంటే ఉండయ్యేలా పిండి ఉంచండి. అందులో మిర్చి, అల్లం వేసుకోండి. ఉండల్లా చేసి నూనెలో బంగారం రంగొచ్చేదాకా వేయించి తియ్యండి. బలే రుచిగా ఉంటాయి. వీటిని పోపుపెట్టిన పెరుగులో వేయండి. చల్ల పుణుకుల్లా బొబ్బర పుణుకులు మంచి రుచిగా ఉంటాయి.
చివరగా పెసరట్ల కూర వండుకుంటాం కదా! అలాగే బొబ్బరట్లతో గాని, పుణుకులతోగాని కూర వండుకోవచ్చు.
Sir, పది రోజుల క్రితం తిరుపతి వెళ్లి వచ్చాను. అక్కడ ఇస్కాన్ మందిరంలో మధ్యాహ్నం వేడి వేడిగా అలసంద వడలు 10 రు. లకు ఒకటి చొప్పున అమ్ముతున్నారు. అతి రుచికరంగా ఉన్నాయి. వేడిగా పొంగల్ ప్రసాదం కూడా పెట్టారు. కోదండ రామాలయం లో పులిహోర పెరుగు అన్నం ప్రసాదం పెట్టారు. రుచి అమోఘం.
దైవదర్శనం బాగా జరిగితే ఒక తృప్తి. మంచి ప్రసాదాలు దొరికితే మరీ తృప్తి.
అలసంద వడలు చిత్తూరు జిల్లా ప్రత్యేకం అనుకుంటా.
కిరణ్ జీ,
అలసందలతో ఏమి చేసుకున్నా రుచిగానే ఉంటాయండి, అందులోనూ స్వామి ప్రసాదమాయె, ఇంక చెప్పేరా :)స్వామి దర్శనం చేసుకున్ననన్నారు. ఆనందం.
సామాన్యులు తప్పించి పెద్దవారెవరూ వీటిని ఉపయోగించరండి.
మా ఇంట్లోనూ అలసందలు వాడతామండీ. మీరన్నట్లు సామాన్యులే గానీ పెద్దవారెవరూ వీటిని వాడరేమో.
శరీర శ్రమ తగుమాత్రంగా లేనివారు ఇవి తింటే అజీర్తి చేసి బాధ పాదాటం జరుగుతుంది, ఇది బలుహారం.
Bobbarlu means Black eyed peas or cow peas is also known as ‘Lobia’ or ‘Chawli’ in Hindi, Bobbarlu or Alasandalu in Telugu ‘Karamani’ in Tamil, Chavli in Marathi and Alasande in Kannada. (Copied from internet)
Rajma means kidney beans
కాళిదాసు గారు,
ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారనుకుంటానండి. మా దగ్గరైతే బొబ్బర్లు అంటాం. అలసందలు అనే వాడుక కూడా ఉన్నది.
విన్నకోటవారు,లక్కాకులవారు, బండివారు.
వివరాలు సిద్ధం చేస్తున్నాను. ఈలోగా,”చక్రంబడ్డెనో”
Synopsis of messages from elders is “Ignore him” which I have to follow and implementing.
I am very sorry.
Thank you all
Bye,bye
చక్రం బడ్డెనో , యోడెనో గురుడు , ఆషామాషిగా మారె , నీ
వక్రాలాపము లింకనూ వినబడెన్ , వాచాలముల్ సాగెడిన్ ,
నక్రాల్ పాఠకలోక మందు తిరమై నాట్యంబాడు గాకేమి , బ్లా
గ్చక్రంబందున పేరులేని విబుధుల్ చాలామందిలో వీరునూ .
శర్మ గారు బ్లాగులను విడిస్తే ఎవరికీ బాగోదు “జిలేబి” గారూ. అలాగే ఈ విషయంలో మీరు చెప్పేది శర్మ గారికి చెప్పండి, నాకు కాదు.
శర్మ గారూ, ఈ విషయంలో “జిలేబి” గారు పాఠకులను గోల్ చక్కర్లు తిప్పిస్తున్నారు చూశారా ? ముఖ్యంగా ఈరోజు తన బ్లాగులో పెట్టిన పోస్ట్ జనాల్ని ఎగతాళి చేస్తున్నట్లు లేదూ? మీరిచ్చిన గడువు కూడా ముగిసింది కాబట్టి మరి గుప్పిట తెరిచే ఆలోచనేమన్నా చేస్తున్నారా మీరు?
తలిదండ్రు లిడిన పేరుం
దెలుపగ నామోషి యేల ? దీనికి షరతుల్
వలెనా ? సవాళ్ళవసరమ ?
తలపగ నిందేమిగొప్పతనమో ? దెలియన్ .
వెంకట రాజారావు . లక్కాకులగారు,
అది వారి సంస్కారం ఏంచేస్తాం చెప్పండి 🙂
ఈ చిరుధాన్యాల వేలంవెర్రి మొదలయ్యే వరకు కొంతకాలం పాటు ఓట్స్ రాజ్యం నడిచింది.
ఓట్స్ మాట విన్నప్పుడల్లా Samuel Johnson గారు ఓట్స్ కు ఇచ్చిన తన డిక్షనరీ అర్థం గుర్తొస్తుంటుందండి 👇
“ Oats. A grain, which in England is generally given to horses, but in Scotland supports the people.“
😁😁 (ఈ నవ్వు స్మైలీ నాది, జాన్సన్ గారిది కాదు)
చోళ్ళ వరకు నాకు ఐడియా ఉంది. మా చిన్నప్పుడు మా అమ్మ గారు చోళ్ళతో జావ (దాంట్లో మజ్జిగ కలుపుకుని తాగుతారు), రొట్టెలు చేసేవారు …. డయాబెటీస్ వారికి మంచిదని ఎవరో చెబితేనూ.
అలాగే నా చిన్నతనంలో ఉలవలు ఎక్కువగా కనిపించేవండి (బహుశః పల్లెటూళ్ళవడం వల్లనేమో?). పశువులకు తినిపించడానికి (అనుకుంటాను) కొంతమంది మా స్నేహితుల ఇళ్ళల్లో పెరట్లో పెద్దకాగులో ఉడుకుతుండేవి. ఉడికినవి తింటానికి బాగుండేవి. ఇప్పుడేమో ఉలవచారు చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. దాన్ని ఇష్టపడి తినేవారు కూడా ఎక్కువవుతున్నారు. నాకు నచ్చదు లెండి …. మీగడతో కలిపి తిన్నా కూడా.
ఏమైనప్పటికీ చిరుధాన్యాలు ఆరోగ్యానికి మంచివి అంటే ప్రయత్నించడంలో తప్పు లేదు. పైన మీరు చెప్పిన వంటకాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి.
విన్నకోటవారు,
ఓట్స్ గురించి నాకు తెలియదండి. ఇప్పటికి వారానికొకసారి చోడిజావ తాగుతాను,ఉదయమే!ఉలవగుగ్గిళ్ళు గుర్రాలకి,పని చేసే పశువులకి పెడతారండి. కొర్రలు అన్నం చాలా తేలికగా జీర్ణం అవుతుంది, బాగుంటుంది కూడా.
చిరుధాన్యాల వాడకం మంచిదేగాని అతి చేస్తున్నారు 🙂
సింగపూర్ లో ఒకతను చద్దెన్నం హోటల్ పెట్టేడు.వ్యాపారం జోరుగా సాగుతోందిట. తరవాణీ అన్నం కూడా ఉందిట.
ఓట్స్ గురించి నాకూ అంతగా తెలియదండి. ఒక్కసారి మాత్రం (జావ) రుచి చూసి నచ్చక వదిలేశాను. ఓట్స్ గురించి కూడా అతి అయ్యింది లెండి మొన్నటి వరకు. దాంతో బాటు అతి అయినది బేబీ కార్న్, స్వీట్ కార్న్.
చద్దన్నం హోటల్ పెట్టాడా ? తరవాణీ కూడానా? బాగుందండి. కాదేదీ వ్యాపారానికనర్హం. కాస్త తీవ్రంగా ఆలోచిద్దాం ఉండండి ఏదన్నా అటువంటి ఐడియా తడుతుందేమో … మనం కూడా వ్యాపారం మొదలెట్టడానికి 😁.
బొబ్బర్లంక కు బొబ్బర్లకు సంబంధం వుందాండి ?
ఈ “అనామకం” గారు “జిలేబి” గారే కదా?? వారే గనక అయితే వారెందుకు అనామకంగా దర్శనమివ్వడం??
విన్నకోటవారు,
అలవాటు కదండీ, పరదా వేసుకోవడం.మాయలో మాయ విష్ణుమాయ. 🙂
జిలేబిగారి దగ్గర నా వివరాలున్నాయి. వారి ఒక్కరి దగ్గరే కాదు బ్లాగులో నే నాపేరు ఇతరవివరాలున్నాయి. మళ్ళీ మళ్ళీ చెప్పడం అనవసరం. ఇక జిలేబి వివరాలు వూరు,పేరు వగైరాలు వారు చెబితేనే అందంగా ఉంటుంది.వారు వివరాలు చెప్పవలసిన సమయమాసన్నమైనది. ఈ షరతులతో.
1.ఈ బ్లాగ్లోనే వివరాలివ్వాలి, మరెక్కడా అనుమతింపబడవు..
2.వారి వూరు,పేరు తదితర వివరాలివ్వాలి, షరతు సమయంలోగా.
3.వారు వివరాలు తప్పుగా ఇస్తే, అసలు వివరాలివ్వకపోతే నా దగ్గర వివరాలు ఈ బ్లాగులో పెట్టేస్తా,
4.వారు వివరాలివ్వక్కరలేదు, నేనూ వారి వివరాలివ్వను, శరణుకోరి బయట పడమనండి,తను బెదిరించినవారందరికి మన్నింపు కోరాలి, నేను బ్లాగు నుంచి తప్పుకుంటా,మళ్ళీ కనపడను.
ఒక అనామకుణ్ణి పేరు వివరాలూ చెప్పి శరణు కోరమన్నారు. ఇలా వారు అడగం మొదటి సారి కాదు. ఇలా బెదిరించడం వారికి అలవాటే. అందుకే ఈ మాట.
ఈ షరతులలో ఏదో ఒకటి ఎన్నుకోమనండి. వివరాలు చెప్పడానికి కాని శరణు కోరడానికి కాని అఖరు సమయం 29.02.2020 ఉదయం 07.30 IST
రణమో శరణమో తేల్చుకోమనండి.
తాతగారు బ్లాగు విడిస్తే బాగోదు మాకు 🙂
మైలాపూరు శుభాంగి! గోజి వనితా! మాతా పరాశక్తి! ఓ
బేలా! అయ్యరు గారి బంగరుజిలేబీ ! లక్ష్మి! కల్లోలినీ!
మూలమ్మో పొలమూరు సింహపురి సమ్మోహించెవాసమ్ముగా
చాలా?యింకను తాళువారపు కతల్ సంఘాతమందీయనా?
జిలేబి
కండీషన్లను పెట్టా
రండీ ‘విన రా’జా భాస్కరార్యులు, సో, మే
మండీ ఎందుకు తెలపా
లండీ వివరముల! ఏల మన్నించ వలె మామి! సామీ! 🙂
ఈల వేయి నరుడా యీలవేయి! గురు
డా, జిలేబి వారి హాటు న్యూసు ప్రతి
రేపు తెలియ వచ్చు గిర తిరిగి గోడ జూడ, శ
ర్మాజి తెలుపరు వివరముల ఎప్పటికీ నయ్య!
(మేం చెప్పమయ్య! ఇది నిక్కమయ్య! ఇదే సత్యమయ్య!)
సూపర్ మచ్చీ తూచ్చి 🙂
jk / jf 🙂
అనామకం,
బోడిగుండికి బొటనవేలుకి సంబంధం ఉందాండీ. తమరు దేనికి దేనికైనా ముడి పెట్టగల సమర్థులు కదా!భుజాలు పొంగించుకోండి. 🙂
🔔🖍(ఈల)
ఎస్, సమయమాసన్నమైనది. “జిలేబి” గారు ఈ సవాలును స్వీకరించాలి, స్వీకరించాలి.
పేరేమి? మీ ఊరేమి? వివరిస్తారా మీ చిరునామా?
(“సూపర్ స్టారు”డు కృష్ణ గారి మొదటి సినిమా 1960ల నాటి “కన్నెమనసులు” చిత్రం లోని ఓ పాట స్ఫూర్తిగా) 🙂
చదువుతూ ఉంటే నోరు ఊరుతోంది శర్మగారూ
పంతుల గోపాల కృష్ణగారు,
నిజమండి