శర్మ కాలక్షేపంకబుర్లు-చలిజ్వరం పెట్టి

చలిజ్వరం పెట్టి

ప్రతి తుమ్ము,దగ్గు కరోనా కాదు. అలాగని మనకేం కాదనుకోవడమూ తప్పే. ఏదో ఐపోతోందనుకోవడమూ తప్పే. కరోనా గురించిన చాలా చర్చే నడిచింది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, ఈ వేడిలో ఈ సూక్ష్మజీవి బతకడం కష్టం. కాని అనుకూల పరిస్థితులుంటే బతుకుతుంది. ఆ అనుకూల పరిస్థితులు కల్పించకుండా ఉండడమే మన కర్తవ్యం, ఒకరినుంచి మరొకరికి పాకకుండా చూసుకోవడం మరో కర్తవ్యం.. ఆ వైరస్ ను మన దగ్గరకి రాకుండా చూసుకోవడమే కావలసినది. చాలా మంది చాలా చెప్పేరు, మన పాత అలవాట్లను ఆచరిస్తే వైరస్ మన దరి చేరలేదు. చేతులు కాళ్ళు కడుక్కోండి, బయటనుంచి రాగానే. బయటికెళ్ళి వచ్చిన బట్టలు వేరుగా పెట్టండి లేదా తడిపెయ్యండి.ఇవన్నీ బయటనుంచి శత్రువును మనం ఇంటిలోకి రాకుండా చేసుకునేవి.ఇంటిలోపల డెట్టాల్ వాడండి, లేదా పటిక నీళ్ళు వాడండి.వేడిగా తినండి…ఇలా ఎన్నో,ఎన్నో..

మనదేశం ఎప్పుడూ బయటి శత్రువు పట్ల జాగ్రత్త గానే ఉంది. బయటి శత్రువు మనల్ని ఏమీ చేయలేకపోయాడు కాని మనకి అంతశ్శత్రువులున్నారు. వారివలనే దేశం ఎప్పుడూ ఓడిపోయింది. అలాగే ఇప్పుడు మనం బయటి శత్రువు కంటే లోపలి శత్రువుకే భయపడాలి. అదేంటీ?

అదే చలి జ్వరం పెట్టి. గత ఏభై ఏళ్ళలో మన నట్టింట తిష్ట వేసినది. ఒకప్పుడు ఇది గొప్ప, కాని నేడు ఇది అవసరం. ఈ చలి జ్వరం పెట్టిలో ఏముంటాయి? ఏమైనా ఉండచ్చు, మొన్న చేసిన కంది పచ్చడి మిగిలినది మొదలు, నాలుగురోజుల కితం కొట్టిన కొబ్బరి చిప్ప దాకా! కొంతమంది ఇల్లాళ్ళు ఇందులో తమ భర్త చల్లగా ఉండాలని సూత్రాలు కూడా దాస్తున్నట్టు వార్త. కొంతమంది నిన్న రాత్రి మిగిలిన అన్నం కూడా ఈ ఫ్రిజ్ లో పెడుతున్నట్టే ఉంది. సరే ఇక పాలు కూరలు తప్పనివే. బయటి వాటికి ఎంత దూరంగా ఉందామన్నా రోజూ వచ్చే పాలు తప్పవుగా. పాల పేకట్లు రాగానే నీళ్ళలో పడేసి ఉంచి విప్పి పాలు కాచుకోడం కొంతమంది అలవాటు. ఇలా చేయడం మూలంగా బయటనుంచి వచ్చే వైరస్ ని అరికట్టవచ్చు. లేదా ఆ పేకట్లు అలాగే ప్రిజ్ లో పెట్టేస్తే ఏమీ లేకపోతే సమస్యలేదుగాని పొరబాటున వైరస్ వస్తే ఈ ఫ్రిజ్ దానికి స్థావరం ఐ పోతుంది. అలాగే బయటనుంచి తెచ్చుకున్న కూరలు ఉప్పునీళ్ళలో కడిగి ఒక సారి ఎండలో పెట్టి అప్పుడు ఫ్రిజ్ లో పెట్టండి.వండిన పదార్ధాలని ఎక్కువ కాలం ఫ్రిజ్ లో పెట్టద్దు.

కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్రిజ్ ఆరోగ్యంగా ఉండాలి. అందుకు దీన్ని వారం పది రోజులకో సారి డి ఫ్రీజ్ చేసి, సామాన్లన్నీ బయటికి తీసి డెట్టాల్ నీళ్ళతో కడిగి మరలా మంచి నీళ్ళతో కడిగి పొడిగుడ్డతో తుడిచి అప్పుడు మళ్ళీ అన్ని సరుకులూ సద్దండి. అక్కరలేనివి ఎక్కువ కాలం నిలవున్నవి తీసి బయట పడేయండి.బయటనుంచి తెచ్చుకున్న పచారీ సరుకులుగాని మరేవైనా సరే కొంతసేపు ఎండలో ఉంచెయ్యండి. ఏవైరస్ ఉన్నా చస్తుంది, ఆ తరవాత సద్దుకోండి.రోజూ ఉదయం సాయంత్రం ఒక గంట ఎండలో నుంచోలేరూ! 🙂 ఆ తరవాత మీ చిత్తం, మా భాగ్యం.

నిన్నటి రాత్రి నుంచే (21 రాత్రి) ప్రజలు బయట తిరగడం మానేశారు.

చైనా భక్తులు, ప్రధాని మోడి మరియు భారత పౌరులు కలసి కరోనా ను హత్య చేయడానికి కుట్ర పన్నుతున్నారని సుప్రీం కోర్ట్ లోనూ UNHRC పిటిషన్లు వేసినా ఆశ్చర్యపోకండి

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-చలిజ్వరం పెట్టి

 1. శర్మ గారు,
  ఒక సంగతి నాకెప్పుడూ పెద్ద పజిల్ లాగా అనిపిస్తుందండీ. అదేమిటంటే మన పెద్దవాళ్ళు ఆ రోజుల్లో ఎలా మేనేజ్ చేసుకునేవారు (చాలా మంది ఇళ్ళల్లో ఫ్రిజ్ ఉండేది కాదు గదా) ? కూరగాయలు పాడవకుండా ఎలా ఉంచేవారు (అఫ్కోర్స్ ఇప్పటివాళ్ళ లాగా వారంరోజులకు సరిపడా కూరగాయలు కొనేవారు కాదు.)? పాలు విరిగి పోకుండా ఎలా ఉంచేవారు …. ముఖ్యంగా ఎండాకాలంలో ? ఇంకా అనేకం.

  ఇప్పటి జనాలా? పప్పు దినుసులు, శనగపిండి బియ్యప్పిండి గోధుమపిండి మైదాపిండి, వేరుశనగలు వగైరా వగైరా పొట్లాలను కూడా ఫ్రిజ్ లో తోసేస్తుంటారు … అదేమంటే పురుగు పట్టకుండా అని వివరణ. అందుకే వీళ్ళకు గొడౌన్ అంత పెద్ద ఫ్రిజ్ ఉన్నా సరిపోవటం లేదంటుంటారు.

  ఈ విషయంలో పాతతరానికి హాట్సాఫ్.

  • భారతదేశం అంటే పల్లెలే కదండీ!

   కాలంలో పొలాల్లో దిమ్మ మీద కూరగాయలు వేసేవారు. వాటిని రోజూ తాజాగా ఉపయోగించుకునేవారు. పెద్ద పెద్ద పెరళ్ళలో పాదులు కూరగాయలు పెంచుకునేవారు. ఇదిగాక కూరలు ఎక్కువ పండిన కాలంలో వాటిని ఒరుగులుగానూ తయారు చేసుకుని వేసవిలో వాడుకునేవారు. పట్నవాసాలలో ఏ రోజు కూరలు ఆరోజు బజారునుంచి తెచ్చుకునే అలవాటే ఉండేది.

   ఇక పాలు ఏ పూటపాలు ఆ పూట తాజాగా తెచ్చి పోసేవారు. ఎక్కువ తీసుకునేవారింటికే గేదెను తోలుకొచ్చి పితికి ఇచ్చే సందర్భాలూ ఉండేవి. ఇక వేసవిలో పాలు నిలవ ఎలా అన్నది అసలు మాట. తాజా పాలను కాచి ఉంచేవారు. పెద్ద గిన్నెలో నీళ్ళు పోసి ఉంచి ఈ పాల గిన్నెను అందులో పెట్టి దాని మీద సరిపడా గిన్నెను బోర్లించేవారు. ఇది ఫ్రిజ్ లాగా పని చేసేది. ఇది నా అనుభవం కూడా,అమ్మ చేయగా చూసినది.

   పిండిలు అన్నీ ఎక్కువగానే తయారు చేసుకునేవారు. వాటిని డబ్బాలలో పోసి గాలి చొరకుండా మూత పెట్టేవారు. ఐనా పురుగుపడితే జల్లించి ఎండలో పెట్టేవారు.

   పాత తరంవారు కొంచం కష్టమే పడ్డారు. ఏంటో కాలం మారింది కదండీ…..ఈయనెక్కడ దొరికేడు మా ప్రాణానికి అని తిట్టుకునేవారూ ఉండచ్చు కదండీ 🙂

   • ఆరోజుల్లో కాలానుగుణంగా పండే కూరలు, పళ్ళు వాడుకునేవారు కదా. ఉదాహరణకి మామిడికాయలు ఒక సీజన్లో టమాటాలు మరో సీజన్లో దొరికేవి. ఇప్పుడు సీజన్ తో పనిలేకుండా ఏ సీజన్ లో ఏది కావాలన్నా దొరికే పరిస్థితి వచ్చేసింది. ఫ్రీజ్ చేసి నిల్వ ఉంచే టెక్నాలజీ పెరిగింది, గ్లోబలైజేషన్ పుణ్యాన మన వాతావరణంలో పెరగని వాటిని కూడా పంటకి అనుకూలంగా వుండే ప్రాంతాల్లో పండించి దిగుమతి చేసుకునే సౌకర్యం పెరిగింది. అయితే ఏ కారణాన అయినా రవాణా ఆగితే మనుగడ సాగించడం కూడా తెలియాలి. లేకపోతే మనకి ముప్పే!

   • ప్రకృతిని మనకు అనుకూలంగా మలచుకుని ఏం చేసినా బాధ ఉండదండి. ఎప్పుడు సమతుల్యం చెడగొట్టుకుంటామో అప్పుడే బాధలు పెరుగుతాయి.
    రవాణాలు స్థంభిస్తే అంతా అయోమయమే! ఇప్పుడు ప్రపంచం ఆ దశలో ఉన్నట్టుందండి.

 2. ఫ్రీజర్ లో పెట్టేవాటిని ముందు ఎండలో పెట్టలేం కదండీ.
  కానివండేటపుడు తినేటప్పుడు శుభ్రత పాటించడం ముఖ్యం.

  • భారత దేశంలో కూరగాయలన్నిటి మీద పురుగుమందుల అవశేషాలుండి తీరతాయి, వాటికి తోడు వైరస్ కనక ఉంటే,వాటిని ఫ్రిజ్ లో పెట్టేస్తే ఫ్రిజ్ రోగాలకి పుట్టిల్లు కదండీ.

   పురుగుమందుల అవశేషాలు వైరస్ లు ఉండవనుకునే దేశాలలో ఇబ్బంది ఉండదండి.

   అందుకే కూరగాయలు తెచ్చుకోగానే ఉప్పునీటిలో పడేసి ఉంచి అరగంట తరవాత తీసి ఎండలో గుడ్డమీద నీరు ఆరేదాకా ఉంచి అప్పుడు ఫ్రిజ్ లో పెడతాం, అదీ అలవాటు. పురుగుమందుల అవశేషాలనుంచీ వైరస్ లనుంచీ తప్పించుకునేందుకు.

 3. Ha ha. చలి జ్వరం పెట్టె అంటే ఏదో అనుకున్నా. చాలా సరదాగా ఉంటూనే ఎంతో ఉపయుక్తంగా ఉంది ఈ టపా.

  అసలు పాలు పెరుగు, ఇడ్లీ దోసె పిండి, కూరలు పండ్లు వంటివి ఫ్రిజ్జులో పెట్టుకోవడం ఓకే. కానీ అంటు పదార్థాలు వండినవి పెట్టిలో పెట్టుకొని తినడం అసలు ఒక దిక్కుమాలిన అలవాటు.

  మంచి సూచనలు చేశారు sir

  • వండి ఉపయోగించగా మిగిలిన ఏ పదార్ధమైనా ఇందులో పెట్టేయడం కొంత మంది అలవాటు. ఆ తరవాత ఎప్పుడో వీటిని తీసి మళ్ళీ వేడి చేసుకు తినడం కూడా చాలా మందికి అలవాటు. బద్ధకం కారణం. జాగ్రత్తలు తీసుకోవాలన్నదే సూచన కదండీ 🙂

   • ప్రమాదానికి,ప్రాణం మీదకి తెచ్చి పెడుతున్నపుడు మారాలి కదండి.చేసుకోలేకపోతే మరొకరితో చేయించుకోక తప్పదు కదా! అలా జాగరత తీసుకోకపోతే నష్టపోయేది వారేకదా

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s