శర్మ కాలక్షేపంకబుర్లు-కష్టాలే కలిసొస్తాయి.

సుఖాలు కలిసిరావు కష్టాలే కలిసొస్తాయి.

ఇది నిజమైన మాట. మనం సాధారణంగా అనేసుకుంటాం కాని విమర్శ చేసుకోము. ఒక కష్టం లో ఉండగా మరో కష్టం మీద పడటం గా అనుకుంటాం. అసలు కష్టాలేంటీ అనేదే ప్రశ్న. అష్ట కష్టాలు అనేవారు. ఇప్పుడూ అంటున్నట్టే వున్నారు. ఇవి కాలాన్ని బట్టి మారుతున్నట్టే వుంది.ఒకప్పుడు కష్టమైనది మరొకప్పుడు కాదు. కొన్ని మాత్రం అప్పటికి ఇప్పటికి మార్పురాలేదు. (  అల్లుడు ఇంటికి రావడం )

ఇప్పుడు చేరిన కష్టాలలో ఇంటర్ నెట్ పోవడం కూడా ఒక కష్టంగా చేరిపోయిందనుకుంటాను. మాకెప్పుడూ ఇంటర్ నెట్ పోదు, అనుకోవద్దు, వైద్యుని భార్య కూడా ముండా మోస్తుందని సామెత. అసలే లాక్ డవున్ లో ఉండి ఒక చిన్న ప్లగ్గు తెగిపోవడం మూలంగా ఇంటర్ నెట్ పని చెయ్యకపోతే, కొత్తది తెచ్చుకోడానికి లేకపోయే, మరోటి లేదు, నిజంగా పిచ్చే ఎక్కుతుంది, ఈ సమయంలో. అందరికి పోతే అదో సంతృప్తి.మనకే బయటపోతే బాగుచేసుకోడం మనవల్ల కాకపోతే, అబ్బో ఇంతకు మించిన కష్టం మరోటి లేదు. అదే ఒక రోజైతే, అబ్బో తలుచుకుంటేనే భయంకరం కదా! అలాగనక ఇంటర్ నెట్ పోతే ప్రపంచంలో ఎన్ని పిచ్చాసుపత్రులు కొత్తగా నెలకొల్పాలో! తలుచుకుంటేనే భయం.ఇలాలాక్ డవున్ లో ఉన్న మనకి నెట్ పోతే కష్టం మీద కష్టం వచ్చి పడ్డట్టే. అదే గనక సుఖం మీద సుఖం వచ్చి పడితే అది పులగం మీద పప్పులాటిది. కాని అదెప్పుడూ జరగదు. జరిగినా తెలుసుకో లేం.

నిజానికి కలిసొస్తాయి అనే మాటలోనే అసలు విరుపుంది. మనం    ఒక్కటే
 అర్ధం తీసుకుంటాo. కలసిరావడం అంటే కూడా రావడంగా అనుకుంటాం కాని మరో అర్ధం కూడా చెప్పుకోవచ్చు. అది అనుభవం రావడం లేదా అధికమైన లాభం చేకూరడం కాని కావచ్చు. చెప్పుకోవలసింది రెండవ అర్ధమే కాని మనం అది ఎప్పుడూ చెప్పుకోం. కష్టం వస్తేనే అనుభవం వస్తుంది కదా!

దేవుడా! ఎప్పుడూ నాకు కష్టాలే ఉండేలా ప్రసాదించమన్నాట్ట ఒక భక్తుడు, అదేమయ్యా ఎవరేనా సుఖాలు కావలనుకుంటారుగా అంటే, ఆ భక్తుడు స్వామీ నువ్వు గనక సుఖాలు ప్రసాదిస్తే నిన్నే మరచిపోతా అంచేత ఎప్పుడూ కష్టాలే కావాలి,నిన్ను మరిచిపోకుండా ఉండడానికి అన్నాట్ట.

మరీ అంతొద్దుగాని కష్ట సుఖాలు కలసైరావాలంతే.అసలు కష్టంలోనే కదా ఎవరెవరో తెలిసేది,అసలు స్నేహితులెవరో,బంధువులెవరో తెలిసేది.

సర్వే జనాః సుఖినో భవంతు.

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కష్టాలే కలిసొస్తాయి.

 1. చాలా సంతోషం శర్మగారూ ! 

  మీ వయసులో , మీకు ఈ  విధం గా కనీసం కొన్ని నిమిషాల వెసులుబాటు దొరికినా నా ప్రయత్నం ఫలించినట్లే !
  ఈ పధ్ధతి మీకు , మీరు ఉపయోగించుతున్న కొద్దీ  సులభం అవుతూ ఉంటుంది ! ఇక మీరు టపాలు పోస్ట్ చేస్తూ ఉండ వచ్చు , మీకు వీలుగా ! ఏమైనా సందేహాలుంటే తెలియచేయండి.

  మీరు ఎప్పుడూ ,ఎవరో సరిగా పోస్ట్ చేయలేని వారు , విమర్శిస్తున్నారని , మీ ప్రయత్నం ఆపకండి ! వారికి మీ టపాలు ఇష్టం లేక పొతే , లక్షణం గా రెండు క్లిక్కులలో వారికి ఇష్టమైన వేరే సైట్  లకు వెళ్ళ వచ్చు ! మీరు వారినెవరినీ మీ టపాలు చూడమని నిర్బంధించడం లేదు కదా ! 

  అభినందనలతో ,
  సుధాకర్. 

 2. శ్యామల రావు గారికి ,
  నమస్తే ! 
  శర్మగారు  తమ కంప్యూటర్ ను సెట్ చేసి నాకు తెలియ చేస్తే  తదుపరి ,సాఫ్ట్ వేర్ గురించి తెలియ చేద్దామను కున్నా ! 
  పరవాలేదు ! మీరు  ముందు గా వాడి తెలియ చేస్తే , అది శర్మగారికి కూడా స్ఫూర్తి దాయకం ! 
  కావలసినవి : 
  1. గూగుల్ క్రోమ్ ( Google Chrome  ) . దీనిని గూగుల్ వారినుంచి ఉచితం (Free )గా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ కంప్యూటర్ లోకి .
   2. ఒక నాణ్యత కలిగిన మైక్రోఫోన్/ స్పీకర్ ను మీ కంప్యూటర్ కు అమర్చాలి .
    laptop  కనుక మీకు ఉంటే  మైక్రోఫోన్ అమర్చే ఉంటుంది కనుక మీరు ప్రత్యేకం గా కొన నవసరం ఉండదు !   
  3. https :// www. dictation.io  ఈ వెబ్ సైట్ కు వెళితే  అక్కడ ఒక note pad  కనిపిస్తుంది.
   గమనించండి , ఈ వెబ్ సైట్ కూడా పూర్తి గా ఉచితమే ! ఎవరైనా ఒక్క పైసా మిమ్మల్ని అడిగినా , మీరు స్పామ్ వెబ్ సైట్ లో ఉన్నట్టే ! 
  ఈ వెబ్ సైట్ లో మీరు మీరు మాట్లాడ గలిగే అనేక భారతీయ భాషల నుంచి మన తెలుగును సెలెక్ట్ చేసుకోవాలి !
   4. ఇక ఇక్కడనుంచి మీరు start  నొక్కి మాట్లాడుతూ ఉంటే  తెలుగు అక్షరాలలో పదాలు కనబడుతూ ఉంటాయి note  pad  మీద !
   5. మీరు మాట్లాడడం పూర్తి అయిన తరువాత ( stop  బటన్  నొక్కిన తరువాత )  ఆ సంగ్రహాన్ని word  lo  paste  google  ఇమెయిల్ ‘ compose’   లో పేస్ట్ చేసుకుని సరి చూసుకోవాలి  తప్పొప్పులు .
  6. అంతే . ఆ మొత్తాన్నీ మీ బ్లాగులో పేస్ట్ చేసుకోవడమే ! 

  అభినందనలు .
   సుధాకర్. 

 3. శర్మగారికి ,మీ కంప్యూటర్ ఎప్పటిదో నాకు తెలియదు.
  1.ముందుగా గూగుల్ క్రోమ్ (  google chrome )  అనే యాప్  ను మీ కంప్యూటర్ లో డౌన్ లోడ్ చేసుకోవాలి . ఇది గూగుల్ వారి నుంచి వచ్చే ఉచిత యాప్ . 
  2.తరువాత  మీరు  ఒక స్పీకర్ ను మీ కంప్యూటర్ కు కనెక్ట్ చేసుకోవాలి. కంప్యూటరుకు  ఎటాచ్ చేసే స్పీకర్ అంటే  ఏ కంప్యూటర్ షాప్ లో నైనా దొరుకుతుంది ,ఖర్చూ  ఎక్కువ కాదు !
  3.ఈ రెండూ చేసాక తెలియ చేయండి.
  తరువాత  మీరు కేవలం  మీ స్పీకర్ లో మాట్లాడుతూ ఉంటే , తెలుగు లో పదాలు స్క్రీన్ పైన పడుతూ ఉంటాయి. మాట్లాడాక  పూర్తి  విషయాన్ని కాపీ చేసి,  మీ బ్లాగు లో పేస్ట్ చేయడమే ( తప్పొప్పులు సరి చూసుకున్నాక , మీరు స్పష్టం గా,   నియమిత దూరం లో ఉండి స్పీకర్ ముందు మాట్లాడితే ఎక్కువ తప్పులు కూడా దొర్లవు ). మీరు ఇంత వయసులో చక్కగా బ్లాగు రాయ గలుగుతున్నారు , మీకు పై న చెప్పిన విధం గా చేయడం ఎంత మాత్రం కష్టం అవదు ! 
  పైగా మీరు తక్కువ శ్రమ తో ఎక్కువ  టపాలు పోస్టు చేయగలరు ! సందేహాలుంటే తెలియ చేయండి ! 
  భవదీయుడు.
  సుధాకర్. 

  • సుధాకర్ జీ

   మీరు నాపట్ల చూపుతున్న శ్రద్ధ,ఆదరణలకు ధన్యవాదాలు. వివరాలు తెలియజేస్తానండి.ఇప్పటికే టపాలు ఎక్కువ రాసేస్తున్నాననే దుఃఖభాగులున్న కాలంలో మీరీ ఉపాయం చెప్పి, టపాలు పెరిగిపోతే….. 🙂
   ధన్యవాదాలు.

 4. శర్మ గారికి ,మీరు తరచూ మీ బ్లాగు లో టపాలు వేస్తూ ఉంటే  ఆనందం గా ఉంది ! మీరు మీ బ్లాగులను మీరే టైపు చేస్తున్నారా ?! అందుకు బాగా సమయం పడుతుంది కదా ! ?మీకు ఇంకో సులభమైన మార్గాన్ని చెబుదామనుకుంటున్నా !మీరు జవాబు ఇవ్వ గలరు .
  భవదీయుడు
   సుధాకర్. 

  • ఇదివరలో రోజూ రెండు మూడు గంటలు కంప్యూటర్ దగ్గర కూచునేవాడిని. ఇప్పుడు ఒక అరగంట కంటే కూచో లేకపోతున్నాను. ఒక టపా రాయడానికి మూడు నాలుగు రోజులు పడుతోంది. సులువు మార్గం ఉంటే …..ఆనందం. ధన్యవాదాలు.

  • శ్రీ మాత్రే నమః

   సుధాకర్ జి

   నమస్కారం

   ఎండ పెరిగిపోవడం తో సమాధానం ఇవ్వడం ఆలస్యం అయింది మన్నించండి. మీరు చెప్పినవన్నీ ఉన్నప్పటికీ సరి చూసుకునే చెబుదామనుకుని లోపుగా మీ దగ్గరనుంచి వివరం వచ్చింది ఇప్పుడు దాని నుంచే మీకు సమాధానం ఇస్తున్నాను. చాలా బాగుంది చాలా సంతోషం. మీ అభిమానానికి కృతజ్ఞత. ఇందులో తప్పు ఒప్పో లు కూడా వెంటవెంటనే సరి చూసుకునే అవకాశము చాలా బాగుంది. అయితే నాకే ప్రత్యేకంగా ఉన్న ఇబ్బంది మూలంగా కొన్ని తప్పులు జరుగుతున్నాయి. పళ్ళు లేకపోవడం మూలంగా పలుకు తేడా ఉండడం మూలంగా తప్పులు వస్తున్నాయి పళ్ళు పెట్టుకొని మరోసారి ప్రయత్నం చేస్తానండి

   ధన్యవాదాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s