శర్మ

sarmabc@gmail.com

 https://kastephali.wordpress.com/

http://kasthephali.blogspot.in/

https://sarmabc.wordpress.com/

చిర్రావూరి భాస్కరశర్మ అనే మాచనవఝుల వేంకటదీక్షితులు

.23.09.2011

ఓనమః లు పూర్తిగా రాని వాణ్ణి. జీవితం నేర్పిన పాఠాలు నేర్చుకుంటున్న వాణ్ణి. నిత్య విద్యార్ధిని.

11.03.2012.

మిత్రులందరికి నమస్కారం.
నా దగ్గర కరంటు సరిగా ఉండని కారణం చేత టపాలు వరుసగా సమయానికి వేయలేని పరిస్థితి వచ్చింది. ఇదీగాక రాత్రులు మేలుకోవద్దనే సలహా, వైద్యులు చెప్పడంతో, రోజులో ఏదో ఒక సమయానికి టపా వేయడానికి ప్రయత్నం చేస్తున్నా..

20.03.2012

మిత్రులు పాత టపాలు చదివి వ్యాఖ్యలు పెట్టచ్చా అంటున్నారు.వ్యాఖలు 180  రోజులవరకు తీసుకునేటట్లు ఏర్పాటు చేశాను గమనించ గలరు.

22.03.2012

నేటికి బ్లాగు మొదలుపెట్టి ఆరు నెలలయింది. ఎందుకో రాయాలనిపించటం లేదు. శలవు.

27.03.2012

మిత్రులు/మిత్రురాండ్రకు,
హితులకు,సన్నిహితులకు,
బ్లాగు బంధువులకు,
వందనం, అభినందనం.

ఇదే వీడుకోలు నేస్తం,
వెళ్ళిపోతున్నా దూరం
పారిపోతున్నా సుదూరం,
ఎదురు చూడకు నా కోసం

రాగ ద్వేషాలకు దూరం
ఈర్ష్యా అసూయలకు అతీతం
బ్లాగులకు బహుదూరం
నీకు నందన అభినందనం.

మిత్రులు/మిత్రురాండ్రకు,
హితులకు, సన్నిహితులకు
శ్రేయోభిలాషులకు,
వీడుకోలు,బ్లాగుకు.

10.04.2012

మిత్రులందరికి నమస్కారం,
కరంటు సరిలేదు. ఇల్లు సరిలేదు. రెండురోజులకో టపా వేయగల.

20.04.2012

కరంటు రోజుకి దగ్గరగా పది గంటలు, పగలు ఎనిమిది రాత్రి రెండు గంటలు ఉండటం లేదు, అనియతంగా. ప్రయాసగా ఉంది. క్షమించాలి.

09.05.2012

Slightly indisposed due to the heat of summer. 

16.05.2012

It is too hot,health failing

26.05.2012

నిన్నటినుంచి రోహిణి ప్రారంభమై వేడిమి భరించలేనంతగా ఉంది, దీనికి తోడు కరంటు తీసెయ్యడం, పుండు మీద కారం చల్లినట్లు ఉంది. పగలు కంప్యూటర్ దగ్గర కూచోగలిగిన స్థితి ఎలాగా లేదు, రాత్రులు నిద్ర కాయడం కుదరదు. పరిస్థితి మెరుగుపడకపోదని ఆశ.

31.05.2012

It appears,  impossible for me to continue writing in the blog. Unscheduled power failure is on the high side, really no schedule. Power failing at least 8 hours in day and four hours during night. Health failing, due to summer. Let us meet again, if possible

Thank u.

SARMA.

07.06.2012

ఎండ తగ్గే సూచన కాని చినుకు జాడ కాని కనపడటం లేదు. వేడిమి 45 డిగ్రీల పైనే ఉంటోంది. బతుకు భారమైపోతూ ఉంది. ఎలా?

19-06-2012

Showers  from last ten days. pleasant weather continuing.

21.06.12

Some problem with vision.

06.07.2012

It may not be possible to post daily. I shall try to post on alternate days.

18.08.2012

మీతో మాటాడి నెల దాటిపోయింది. ఈ నెలంతా వర్షాలే. ఇప్పుడు ఎండ చితక్కొడుతూంది. కరంటు ఎప్పుడెలా ఉండేదీ తెలియదు. ఆశ నిరాశల మధ్య మనసు ఊగిసలాడుతోంది.

05.09.2012

వారం నుంచి అనారోగ్యం ఇబ్బంది పెడుతోంది.కూచోవటమే బాధగా ఉంది. వయసొస్తే కష్టాలిలాగే ఉంటాయి, కాలూ చెయ్యీ ఆడినంతసేపే మన ప్రజ్ఞ. ఇదంతా విధి విలాసం.

19.09.2012

కరంటు ఎప్పుడుంటుందో, ఎప్పుడుపోతుందో, పోతే ఎప్పుడొస్తుందో తెలియదు. రాదామనుకున్నపుడు కరంటు లేదు, కరంటు ఉన్నపుడు రాయడానికి మరో ఇబ్బంది, అనారోగ్యం తగ్గినా ఎక్కువ సేపు కూచోడం ఇబ్బందిగా ఉంది, వెన్ను నెప్పి మూలంగా. నందో రాజా భవిష్యతి.

15.10.2012

ఈ మధ్య మీతో మాటాడలేదు. ఇప్పటి వరకు జరిగిన దానికి భిన్నంగా ఇక ముందునుంచి ఒక టపాలో 200 నుంచి 300 పదాలు ఉండేలా చూడాలనుకుంటున్నాను, ఎందుకంటే టపాలు పెద్దవయి చదవడం కష్టమే కాక అంత సేపు కూచుని రాయడం కష్టం కనక. ప్రస్థుతం అన్నీ అనుకూలంగానే ఉన్నాయి, పరిస్థితులు. 

10.11.12

చలి తిరిగింది. అనుకోని సంఘటనలు జీవితాన జరుగుతాయి కదా! కాలంగడుస్తూంది…..భారంగా….

15.12.2012

మనం మాటాడుకుని నెల దాటిందికదూ. కార్తీకం ప్రవేసించినది మొదలు ప్రయాణాలెక్కువై పోయాయి. ఆలోచించి రాసే టపాలు తగ్గేయి. ఈ నెలాఖరు దాకా ప్రయాణాలు తప్పవు, పెళ్ళిళ్ళండీ బాబూ!

03.01.2013

మిత్రులు అందరికి వందనాలు,
కరంటు కోతలున్నాయి. ఎక్కువ సేపు కూచోడం, కంప్యూటర్ దగ్గర, కొద్దిగా ఇబ్బంది పెడుతోంది, రెండురోజులకొక టపా వేయడానికి ప్రయత్నం చేస్తాను. దయ ఉంచండి.

01.03.2013

నిజంగానే మీతో మాటాడి చాలాకాలమే అయింది. వేసవి పరుగెట్టుకుని వచ్చేస్తోంది, పొద్దు నిలబడుతోంది కూడా. తెల్లవారుగట్ల కొద్దిగాచలి, పగలు ఎండ అప్పుడే పేల్చేస్తోంది. కరంటు వారీ రోజునుంచి రోజులో ఎనిమిది గంటలు అధికారిక కోత ప్రకటించారు, అనధికారం ఎంతుంటుందో చెప్పలేం. టపాలు కూడా రాసేలాలేదు. ఇప్పటి వరకు సమయం తప్పక ఉదయమే 05.30 గంటలకు టపా రాసేవాడిని, ఇక ముందు తెలియదు. మీ సహకారానికి కృతజ్ఞతలు.
ధన్యవాదాలు

28.05.2013

నిజంగానే చాలా కాలమయింది. బ్లాగులో నే చాలా విషయాలు చెబుతున్నందున వేరుగా రాయటం లేదు. వేసవి చాలా బాధాకరంగా వుంది. విజయ నామ సంవత్సరం లో మొదటిలోనే అన్నయ్యను చెల్లెలిని పోగొట్టుకోవడం, అందునా నాలుగు రోజుల వ్యవధిలో మనసును కలచివేస్తోంది.

24.08.2013

మీతో మాటాడిన తరవాత జీవితంలో చాలా మార్పులు చాలా వేగంగా వచ్చేశాయి.ఆ మార్పులు కూడా బాధాకరమైనవే అవడం విధి లిఖితం. కానున్నది కాక మానదుకదా! గతానికి వగచకు, రేపన్నది రూపులేనిది. ప్రస్తుతంలో జీవించు. ఇదే నిజంకదా! సుదూరంనుంచి ఒక వార్త కలచి వేసింది.

19.09.2013 

మీతో మాటాడి రెండు నెలలయింది దగ్గరగా, బ్లాగు మొదలు పెట్టి రెండేళ్ళు కావస్తోంది. రాయాలనే కోరికా చచ్చిపోతోంది. మనసు సహకరించటం లేదు, ఈ సంవత్సరం లో కలిగిన బాధలూ, ఈ మధ్య అయిన వారనుకున్నవారి వల్ల కలిగిన బాధలూ మనసును కుంగ తీస్తున్నాయి. ఇంతతో ముగిస్తే చాలనిపిస్తోంది.
ధన్యవాదాలు.

22.01.2014

చాలాకాలమయింది, ఈ పేజీలో రాసి, చూసి కూడా. గత సంవత్సరాన్ని ఒక సారి సింహావలోకనం చేస్తే, జీవితంలో ఎప్పుడూ జరగనటువంటి గుండె కోత నిరుడు మాత్రమే జరిగింది. ముగ్గురు సోదరసోదరిలు నలభై ఐదు రోజుల తేడాలో స్వర్గస్థులు కావడం, కొత్తగా కుటుంబంలోకి, మనసులోకి చేరి మురిపించి, మరపించినవారు, అంతే హటాత్తుగా కనపడక, మాటాడక, మరచిపోవడమో, నిర్లక్షమో,పనితొందరో తెలియదు కాని బాధ పెట్టిన, పెడుతున్నమాట వాస్తవం. కొన్ని చెప్పుకోలేని గుండె కోతలు సన్నగా బాధపెడతాయి. చిన్న చిన్న అనారోగ్యాలు ఇబ్బంది పెట్టినా పెద్దగా పడకేయించలేదు. వయసొచ్చింది అన్నీ నెమ్మదిగా వదిలించుకుని ప్రయాణానికి సిద్ధమవుదామంటే, ఏదీ వదలిపెడితేనా, కర్మ బంధాలు, కాళ్ళకు చుట్టుకుని గుది బండల్లా అడ్డుకుంటున్నాయి. ఏది ఏమైనా ప్లాట్ఫాం మీద ఉన్నము, టిక్కట్టు కన్ఫం అయిపోయింది, బండి రావడమే ఆలస్యం, ఎప్పుడొస్తుంది అన్నదే తెలియదు. అప్పటిదాకా నిరీక్షణా తప్పదు, బాధా తప్పదు.

గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్ అన్నారు, ఏమో ఏం కానుందో తెలియదు కదా!కాలమే నిర్ణయించాలి.

18.02.2015

అబ్బా! సంవత్సరం పైగా ఈ పేజీలో ఏమీ రాయలేదు, నిజమే! అనుభవాలు ఎక్కువయిపోయి బతుకు భారమైతే, నోట మాట, మనసు బాట వదిలేస్తున్నాయి. మనసు పడే బాధకి చివర అంటూ లేదేమో! అది లుప్తం కావటం లేదు. శరీర బాధలూ పెరుగుతున్నాయి, వయసుతో పాటు, సర్వేశ్వరా! విడుదల ప్రసాదించవయ్యా!!

30.05.2015

మెరిసేదంతా బంగారం కాదని తెలిసినా భ్రమ బాధ పెడుతూ ఉంటుంది, ఇది సర్వ సహజం.

అమ్మ పరమ దయాళువు. కొన్ని పనులు జరగలేదని బాధ పడతాం, మథనపడతాం. . అవి అలా జరగడం మనకి మంచిది కాదని తెలియక బాధ పడతాం కూడా. అలా జరగకపోవడం మన మంచికే అన్న సంగతి తెలిసినపుడు మాత్రం అమ్మ గొప్పతనాన్ని పొగడక ఉండలేం. అమ్మో! ఎంత పెద్ద ప్రమాదం తప్పిందీ.

11.12.2015

 ఈ బ్లాగు మూసివేయబడింది. అసహనం అనేది అంటువ్యాధి. ఇది బ్లాగులలో ఉన్నదే కాని ఇప్పుడు వెఱ్ఱితల వేసింది,విశృంఖలంగా, మరీ నగ్నంగా నాట్యమే చేస్తోంది. గత కొంత కాలంగా. ఎంత సహనం వహించినా కష్టంగానే ఉంది. అందుకే బ్లాగు మూసేశాను. ఇక ముందు రాస్తే మాత్రం ఈ URL లో చూడండి.ఈ బ్లాగును ఆగ్రిగేటర్లలో జత చేయలేదు.

https://sarmabc.blogspot.com

21.05.2017

చాలా కాలం తరవాత, చాలా జరిగిపోయిన తరవాత మాట.
పడుతూ లేస్తూ కొనసాగుతూనే ఉన్నా! చికాగానూ ఉంది, వేసవి భరించలేనిదిగానూ ఉంది. గత ఇరవైరోజులపైగా ఒక్క ముక్క రాయలేదు, ఇక రాయలేనేమో అనే అనిపిస్తూ ఉంది, చూస్తుంటే! చూద్దాం, అంతా అమ్మ దయ!

పాత టపాలను మరల ప్రచురిస్తుండగా కాలం గడిచిపోతోంది.

20.10.2022

కొన్ని సంవత్సరాలే అయింది! చాలా జరిగింది జీవితంలో. పూడ్చలేని లోటు 6.9.2018 తేదీన ఇల్లాలి మరణం. ఆ తరవాయి జీవితం నిస్సారం, చెప్పుకునేందుకేం లేదు.

sarmabc@gmail.com

19 thoughts on “శర్మ

  1. శర్మ గారు,
    Tiger abhee zindaa hai అని ఈ మధ్య కాలంలో ఓ స్లోగన్ మొదలయింది. ఏమిటటా? … పింఛనుదారులు నవంబరు నెలలో Life Certificate దాఖలు చేసి వచ్చిన తర్వాత అందరితో చెప్పుకునే మాట అది 🙂.

    నేనున్నాను అని నిన్ననే నేను మా బ్యాంక్ వారికి చెప్పడం జరిగింది. మీరు కూడా దఖలు పర్చారా?

    • విన్నకోటవారు,
      టైగర్ అభీ జిందాజై కాదండీ, 😉 టైగర్ అభిభీ జిందా హై,అని నిరూపించినది, మొన్నపుట్టిన రోజునాడు చేసిన పనదే!దానితాలూకుదే ఈ రోజు టపా ఫోటోలు 🙂

      • Zilebi
        బామ్మా! ఈ బ్లాగంటే అనుభవాల దొంతర, ఆనందాల వేదిక, మమతల పందిరి. ఈ షెర్లాక్ కూడా అందులో భాగమే! వీటన్నిటిలో నీవూ ఉన్నావుగా 🙂
        ఐడియా బామ్మా, ఐడియా. పత్తర్ఘట్టికి మారినంతలో మనుషులు మారిపోతారా?

  2. మీ పుట్టినరోజు నవంబర్ 4 అన్నట్లున్నారుగా 🤔. ఏమయిననూ శుభాకాంక్షలు ☘.

    • అనామకంగారు, బాపన్న శాస్త్రి గారు,

      ఒకరే అయిన ఇద్దరో, ఇద్దరిలా కనపడే ఒకరో! అద్వైతం!! విష్ణుమాయ!!!

      చిన్న చిక్కుల్లో ఉన్నాను, తప్పని సారిగా చెబుతాను. మీ అభిమానానికి
      ధన్యవాదాలు.

  3. శర్మగారు!
    మీ బ్లాగులు బాగుంటై! నేను రెగ్యులర్ గ ఫాల్లో అవుతాను! కంచి గరుడ సేవ అంటే ఏమిటి? సందేహం తీర్పగలరు!

  4. Sarma garu , ma menamagaru PLN Rao garu ITC lo pani chesevaru.. Anaparti maaku baaga parichayam.. na baarya anaparti aadapaduchu.. ee post choodagaane naaku balyam guryku vachi chaala anadam kaligindi. Danyavaadaalu.

    • శర్మ గారు ,
      మా మేనమామగారు Sri.P.L.N.Rao గారు ITC లొ పని చేసేవారు.. అనపర్తి మాకు బాగ పరిచయం.. నా బార్య అనపర్తి ఆడపదుచు.. ఈ పోస్ట్ చూడగానే నాకు బాల్యం గుర్తుకు వచ్చి చాల ఆనందం కలిగింది.
      ధన్యవాదాలు.

      pvnrao గారు,
      మీ మేనమామగారుSri.P.L.NRao ఇక్కడ ITC ఫేక్టరీ మేనేజర్ గా పని చేసినట్టు గుర్తు, నేను ఈ ఊరు వచ్చిన కొత్తలో. వారిని ఒకటి రెండు సార్లు కలిసి కూడా ఉండచ్చు. మీ బాల్య జ్ఞాపకాలను గుర్తుకు తేగలిగినందుకు ధన్యుడను. మీ శ్రీమతిగారు ఈ వూరు ఆడపడుచే కనక ఇలా వస్తే మా ఇంటికి దయచేయమని ప్రార్ధన.
      ధన్యవాదాలు.

    • మిత్రులు సూర్య గారు,
      నా బ్లాగుకు స్వాగతం. నేను కాకినాడలో 71-82 మధ్య ఉన్నా. దేవాలయం వీధి, బేంక్ ఆఫ్ ఇండియా ఎదురుగా మేడలో.ప్రస్తుతం అనపర్తిలో ఇల్లు కట్టుకున్నా. రిటయిరయిన తర్వాత ఇక్కడ స్థిరపడ్డా.
      ధన్యవాదాలు.

వ్యాఖ్యానించండి