శర్మ కాలక్షేపంకబుర్లు-తోట కూర నాడయినా…….

తోట కూర నాడయినా…....

తోట కూరనాడయినా చెప్పకపొతివిరా కొడకా అంటుంటారు తప్పు తోటకూరనాడయినా చెప్పకపోతినిరా కొడకా అన్నది అసలు మాట, దీని గురించిన ఒక చిన్న కథ.

ఒక పల్లెలో ఒక విధవ చిన్నవాడయిన కొడుకుతో  కాలంగడుపుతూ ఉంది. 
 కుర్రవాడు కొద్దిగా పెద్దవాడైన తరవాత ఒక రోజు పక్కవారి దొడ్డిలోని తోటకూర పీక్కొచ్చాడు. తల్లి తోటకూరెక్కడిదని అడిగింది. పక్కవారి దొడ్డిలోది పీక్కొచ్చానని చెప్పేడు. తల్లికి పక్కవారితో పడదు, అందుకు వాళ్ళెవరూ చూడలేదు కదా అని అడిగింది. దానికి కుర్రవాడు ఎవరూ చూడకుండానే పిక్కొచ్చానని చెప్పేడు. తల్లి సంతసించింది. కుర్రవానికి అలా ఇతరుల వస్తువులు సొమ్ము అదగకుండా దొంగతనంగా తీసుకురావడం తప్పు కాదనే భావం మనసులో నిలిచిపోయింది. అది మొదలు చిన్న చిన్న దొంగతనాలకి అలవాటు పడ్డాడు. అదృష్టం కొద్దీ దొరకలేదు. కాలం గడుస్తోంది, మరికొంత పెద్ద దొంగతనాలకి పాల్పడ్డాడు, తప్పించుకున్నాడు కూడా. తల్లి ఏనాడూ ఇది తప్పని మందలించలేదు, దానితో  యువకుడయ్యాడు, బరి తెగించాడు, రాజు గారి కోటలో దొంగతనం చేశాడు, దురదృష్టవశాత్తు దొంగ సొత్తుతో దొరికిపోయాడు. రాజు విచారించి మరణ శిక్ష విధించాడు. తల్లి మరణ శిక్ష అమలవుతున్న సందర్భంలో దగ్గరికిపిలిచాడు, చెవి లో రహస్యం చెబుతానన్నాడు. దొంగ సొత్తు ఎక్కడ దాచాడో చెబుతాడనుకున్న తల్లి చెవి కొరికాడు.

అప్పుడు తల్లి తోటకూరనాడయినా చెప్పకపోతినిరా కొడకా! నీకు నాడే తప్పని చెప్పి మందలించి దారిలో పెట్టి ఉంటే నేడీ గతి పట్టేది కాదని విలపించిది, ఏమి ఉపయోగం? అందుకే చిన్న తప్పేనని ఉపేక్ష చేయకూడదు.

పాకిస్తాను కశ్మీర్ వేర్పాటువాదులతో మంతనాలు చేస్తోంది. ఇది తెలిసి కూడా నాటి భారత ప్రభుత్వం మాటాడలేదు. నేటి ప్రభుత్వం పాక్ కి ఒక మాట చెప్పింది, ‘మీరు మాతోనయినా మాటాడండి లేదంటే వేర్పాటు వాదులతోనే మాటాడు కోండి’ అని చెప్పింది. దీని అర్ధమేంటీ? మీరు మా దేశం లోని అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటే మిమ్మల్ని గుర్తించమని చెప్పడమే! ఈ మాట తోటకూరనాడే (మొదటిలోనే) చెబితే బాగుండేది కదా!!

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-తోట కూర నాడయినా…….

  1. వామ్మో వామ్మో,

    తోట కూర కి , తోటి ‘కూరు’ కి లింకు పెట్టటం లో శర్మ గారే తగుదురు !!

    సెహ భేషైన భేషజం లేని టు ది పాయింట్ టపా !! సూపెర్ డూపర్ !!

    జిలేబి

వ్యాఖ్యానించండి