శర్మ కాలక్షేపంకబుర్లు-మనలో పరమాత్మ ఎక్కడున్నాడు?

మనలో పరమాత్మ ఎక్కడున్నాడు?

సుఖమా! ఎక్కడనీ చిరునామా? టపాలో పరమాత్మ మనలో ఉన్నాడంటున్నారు,ఎక్కడా? అంటే, ఇదిగో ఇక్కడా అన్నా, కొన్ని శ్లోకాలు చూపి, దానికి జిలేబిగారు ఒక టపాలో సాయించమని ఉత్తరువిచ్చారు. దాన్ని పాటించేందుకు ఈ టపా.

దీక్షితులు గారు,

దీనిని విశదీకరిస్తారూ కాస్త మరింత విస్తారం గా మాలాంటి వారి కోసం?

“పద్మకోశ ప్రతీకాశగ్ం, హృదయంఛాప్యధో ముఖమ్,
అధోనిష్ట్యా వితస్యాన్తే నాభ్యాముపరితిష్ఠతి………..”

జిలేబి

  •   @జిలేబి గారు,

    అర్ధం స్థూలంగానే చెబుతున్నా సుమా.
    బయటా లోపలా, అంతటా వ్యాపించి ఉన్న నారాయణుడు, అనంతుడు అవ్యయుడు. అటువంటివాడు మానవ శరీరంలో హృదయానికి కింద బొడ్డుకి పైన సూక్షమైన అణుమాత్రంగా పద్మంలాటి చోట ఉన్నాడు, విద్యుత్ శిఖలా ఉన్నాడు, నివ్వరి ముల్లంత ( నివ్వరి ధాన్యం గింజ చిన్నది దాని అగ్రంలో గింజ పై ఉండే ముల్లు బాగా సన్నగా చిన్నగా ఉంటుందిట)అదిగో అక్కడ పరమాత్మ ఉన్నాడని నారాయణ కవచం చెబుతోంది.వేదం పరమాత్మ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు చెప్పింది. దీనినే మనం మంత్ర పుష్పం అంటాం. పొరపాట్లుంటే సరి చేయగలరు
    ధన్యవాదాలు.

ఓం|| ధాతా పురస్తాద్యముదాజహార
శక్రః ప్రవిద్వాన్ ప్రదీ శ శ్చతస్రః
తమేవం విద్వాన్ అమృత ఇహభవతి
నాన్యః పంధా అయనాయ విద్యతే ||
ఓం || సహస్రశీర్హం దేవం విశ్వాక్షం విశ్వశంభువం
విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం ||
విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగ్ ౦ హరిం
విశ్వమే వేదం పురుషస్తద్విశ్వము పజీపతి
పతిం విశ్వస్యా త్మేశ్వరగ్ ౦ శాశ్వతగ్ ౦ శివమచ్యుతం
నారాయణం మహాజ్ఞేయం విశ్వత్మాసం పరాయణం ||
నారాయణ పరోజ్యోతి రాత్మా నారాయణః పరః
నారాయణ పరబ్రహ్మ తత్త్వం నారాయణః పరః
నారాయణ పరోధ్యాతాధ్యానం నారాయణః పరః
యచ్చకించి జ్ఞగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా
అంతర్భ హిశ్చతత్సర్వం వ్యాప్య నారాయణ స్ధితం ||
అనంతమన్యయగ్ ౦ కవిగ్ ౦ సముద్రేతం విశ్వశంభువం
పద్మ కోశ ప్రతీకాశగ్ ౦ హృదయంచా ప్యదో ముఖం ||
అధో నిష్ట్యా విత స్త్యాన్తే నభ్యాముపరి తిష్టతి
జ్వాలమాలాకులంభాతి విశ్వస్యాయతనం మహః ||
సంతతగ్ ౦ శిలాభిస్తు లంబత్యాకోశ సన్నిభం
తస్యాన్తే సుషిరగ్ ౦ సూక్ష్మంత స్మిన్సర్వం ప్రతిష్టితం ||
తస్యమధ్యే నుహానగ్ని ర్విశ్వార్చిర్విశ్వతో ముఖః
సోగ్రభుగ్విభ జన్తిష్ట న్నాహార మజరః కవిహ్ ||
తిర్యగూర్ధ్వ మధ శ్శాయీర శ్మయస్తస్య సంతతా
సంతాపయతిస్వం దేహమపాద తలమస్తకం ||
తస్యమధ్యేవ హ్నిశిఖా అణీ యోర్ధ్వా వ్యవస్దితః
నీలతో యద మధ్య స్ధాద్విద్యుల్లెఖేవ భాస్వరా ||
నీ వార శూక వత్తన్వీ పీతభాస్వత్యణుపమా
తస్య శిఖాయామధ్యే పరమాత్మా వ్యసస్దితః ||

పైన చెప్పినది మనం సాధారణంగా చెప్పే మంత్రపుష్పం, నారాయణ కవచం అని కూడా అంటాం. అందులోది కొంత భాగం. మంత్రపుష్పం వ్యాఖ్యానించే సంస్కృత పరిజ్ఞానం లేదుకాని టూకీగా, పెద్దలనుంచి తెలుసుకున్న వరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా.

బయట లోపల వ్యాపించి ఉన్నాడు పరమాత్మ. ఆయన అనంతుడు, అవ్యయుడు.హృదయానికి కింద నాభికి పైన ఉండే కమలంలాటి చోట, జ్వాలా రూపంలో ఉన్నాడు. ఎల్లప్పుడూ ఉన్నాడు,సూక్షంగా ఉన్నాడు.శరీరమంతా ఉష్ణరూపంలో వ్యాప్తి చెంది ఉన్నాడు. ఆ కమలంలోని అగ్నిలో అగ్ని శిఖలో అణువులా ఉన్నాడు. నల్లని మేఘంపై మెరిసే విద్యుల్లతలా మెరుస్తున్నాడు. నివ్వరి ధాన్యపు ముల్లులా ఉన్నాడు. నివ్వరి అనేది ఒక ధాన్యపు రకం చాలా చిన్న గింజ. అటువంటి గింజ పై ఉన్న చిన్న ముల్లులా ఉన్నాడు, అదుగో అక్కడ ఆ అగ్ని శిఖలో అణు రూపం లో విద్యుల్లతలా మెరుస్తూ, నివ్వరి ధాన్యపు ముల్లులా ఉన్నాడయ్యా, పరమాత్మ నీలో అని చెబుతోంది వేదం .ఇక్కడే షట్ చక్రాలలోని మణి పూరక చక్ర స్థానం.   ఈ నారాయణ కవచాన్ని శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిలాటి వారు వ్యాఖ్యానిస్తే అప్పుడు దానికి అందం, విషయం కూలంకషంగా తెలిసేది. వారికెపటికి ఇది చెప్పాలని పరమాత్మ తోపింప చేస్తాడో, వేచి చూడాలిసిందే.

  • షట్ చక్రాల వివరాల కొరకు మరిన్ని విశేషాలకొరకు కింద లింక్ పైనొక్కండి.

http://www.prabhanews.com/devotional/article-272624

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మనలో పరమాత్మ ఎక్కడున్నాడు?

  1. విలువైన విషయాన్ని విశదపర్చారు. అలానే ‘ఆరు చక్రాలు ఒక్కటైతే అమరత్వం’ చక్కటి లింక్ నిచ్చారు. కృతజ్ఞతలు సర్.

  2. శర్మ గారు,

    ఆ ‘అధో నిష్ట్యా విత స్త్యాన్తే ‘ ని గురించి మాత్రం చెప్ప నంటున్నారు !

    అధో నిష్ట్యా విత స్త్యాన్తే గురించి చెప్పలేదే ? కవి చమత్కారమా అది ?

    జిలేబి.

వ్యాఖ్యానించండి