శర్మ కాలక్షేపంకబుర్లు-బ్లాగు అమ్మకమునకు కలదు.

బ్లాగు అమ్మకమునకు కలదు.

నిజమే! ఈ బ్లాగును అమ్మదలచుకున్నాను. దగ్గరగా 700 టపాలున్నాయి. ఇందులో టపాలు చాలామంది తస్కరిస్తున్నారు. మిత్రుల సలహాపై ఈ నిర్ణయం తీసుకున్నాను. పుస్తకంగా అచ్చు వేయించాలనుకున్నాకాని మాని వేశాను. పుస్తకంగా అచ్చు వేయించుకోవాలనేవారికి దీనిని అమ్మేయ దలచుకున్నాను. ఈ నెల 23 వ తారీకు వరకు రాసే అన్ని టపాలతో దీని పాస్ వర్డ్ ఇచ్చివేస్తాను. ఇందులో రాసిన టపాలలో ఒక్కటపా మాత్రం జిలేబిగారినుండి అనుమతి తీసుకుని ప్రచురించాను. మిగిలిన అన్నిటపాలు నావేనని ఎక్కడనుండీ కాపీ చేయలేదని హామీ ఇస్తున్నాను. కావలసిన వారు నన్ను సంప్రదించవచ్చును. 23 వ తారీకు తరవాత ఈ బ్లాగు ప్రచురింపబడదు.
చిఱ్ఱావూరి భాస్కర శర్మ అనే
మాచనవఝుల వేంకట దీక్షితులు.

28 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-బ్లాగు అమ్మకమునకు కలదు.

  1. చిఱ్ఱావూరి భాస్కర శర్మ అనే మాచనవఝుల వేంకట దీక్షితులు అనే బ్లాగ్ లోకపు కష్టే ఫలే శర్మ గారు,

    వలదు వలదు ఇటువంటి టఫ్ డెసిషన్ ! కొనసాగింపుడు మీ బ్లాగ్యానం ! మీ టపా కి కామెంటు కొడదా మని రాస్తే అది మరో టపా అయి కూర్చుంది !

    — ఇచ్చట జిలేబీలు అమ్మకానికి గలవు !

    కాబట్టి మీరు మీ టపా ని కొనసాగించా లని ఇట్లా అమ్మకానికో అబ్బాయి, కొనడానికో కోమలి అన్న లెవల్లో అమ్మకము నకు పెట్ట వలదు ! టపాలు రాస్తూ ఉండండి . మరీ సీరియస్ అయితే , కాపీ కొట్టిన లింకుల్ని మీ బ్లాగు లో ఓ మారు ఉటంకిం చండి వారి మీద మేము కూడా కత్తులు కటార్లు నూరుతాము, టాం టాం కొట్టి భాకా భాజాయిస్తాము

    జిలేబి.

    • జిలేబి గారు,
      మళ్ళీ మాయలో పడెయ్యకండి. చాలా సార్లు ఇలా ఆపేశారు, ఈ పుస్తకంగా వేయించగల ఓపిక లేదు, పుస్తకంగా వేయించోగలవారికి అమ్మడం తప్పు కాదనుకుంటా.కాపీ కొట్టిన లింకులు మీకూ ఇచ్చాను మీదగ్గర నుంచే నాకు జడ్జిమెంట్ రాలేదు.చర్య తీసుకోబోయే ముందు దాని గురించిన విషయం పెద్దలు తప్పని నిర్ణయిస్తే లింక్ లూ బ్లాగ్ లో పెట్టడం క్షణ కాలపు పని అని మీకు తెలియనిదా?
      ధన్యవదాలు.

      • చిర్రావూరి వారు,

        సరే మీ మాటే చెల్లు ఒక్కటి తప్ప! –

        టపాలు ఆపడం తప్పించి మీరేమైనా చేసుకొన వచ్చును !

        అంటే మీ ఇప్పటి దాకా వచ్చిన టపాలని అమ్మకానికి పెట్టు కొనే అధికారం మీకు తప్పక ఉన్నది .

        కాని బ్లాగ్ లోకపు పాటక లోకం తరపున మీ టపాలు ఆప వద్దని డిమేండు చేసే అధికారం మా కున్నదని ,

        అధ్యక్షా

        ఇందు మూలం గా సవినయము జిలేబి చేయు విన్నపము ఇదే !!

        మీ టపాలు మీకున్నంత వీలు లో రాస్తూ ఉండండి – జీవనాడి ని , సజీవ నది ని ఆప రాదు !!- పారని నీరు పాచి.

        జిలేబి

  2. మీ బ్లాగు లో టపాల చౌర్యం గురించి :
    మీరు ఇతర బ్లాగుల్లో మీ టపాలను ఉంచుతున్నారనే విషయం కనుక్కోవడానికే , కొంత సమయం వృధా చేసి ఉండ వచ్చు !
    నా టపాలు ఎక్కడెక్కడ ఉంచుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయ దలుచు కోలేదు !
    ఒక సారి టపా పోస్టు చేశాక , అనేక రకాలు గా దానిని ఇతర బ్లాగుల్లో ఉంచడానికీ , చౌర్యం చేసి తమ టపాలు గా చెప్పుకోవడానికీ అవకాశం ఉంటుంది!
    ఈ విషయం మీద కొన్ని పోలీసు సైట్లు కూడా ఉన్నాయి ! ( మీకు కావలసిన వివరాల కోసం ఈ క్రింది సైటు చూడండి ! ( ఇందులో వైరస్ లు ఏవీ లేవు ! ) https://blog.kissmetrics.com/content-scrapers/ ) వాటిని ఉపయోగించి , మనం మన టపాలు ఎక్కడెక్కడ కాపీ చేయ బడుతున్నాయో తెలుసుకున్నా కూడా, పెద్దగా చేయగలిగేది ఏమీ ఉండదు ! అంటే చట్టపరమైన చర్య తీసుకోవడం ! అందువల్ల , ఇంకా సమయం వృధా అవుతుంది ! సమయం తో పాటు గా డబ్బు కూడా !
    మీరు చేయగలిగినది ఏమైనా ఉంటే , అది ఈ క్రింద చెప్పిన విధం గా ఉండ వచ్చు , మీకుఅంగీకారం అవుతే !:
    1. మీరు ప్రస్తుతం రాస్తున్న టపా లలో , మీరు చెప్పాలనుకున్న విషయాల గురించి, కేవలం సంగ్రహం గానే, అంటే బ్రీఫ్ గానే చెప్పండి !
    2. ఆ బ్రీఫ్ గా చెప్పిన విషయాల వివరాలు విపులం గా గ్రంధస్తం చేయండి !
    3. మీ దగ్గరలో ఉన్న ప్రింటింగ్ ప్రెస్ వారిని సంప్రదించి , వాటిని ముద్రించండి , పుస్తక రూపం లో !
    4. పుస్తక రూపం లో వచ్చిన మీ రచనలను , మీ టపాలో చెబుతూ ఉంటే , కొనే వాళ్ళు ఉంటారు !
    5. మీకు వచ్చిన డబ్బును ( మీరు ప్రింటింగు కు చేసిన ఖర్చులకు పోగా ) ఇంకా కొన్ని పుస్తకాలను ప్రింటు చేయడానికి ఉపయోగించుకోవచ్చు !
    మన భాషనూ , మతాన్నీ , మన ఆహారాన్నీ , మన ఆచారాలనూ , అన్నింటినీ త్యజించి , పాశ్చాత్య జీవన శైలిని అనుకరిస్తూ , తమ ఉనికినే కోల్పోతున్న వారు అనేక మంది ఉన్నారు ! ఎవరి జీవన శైలి, వారి ప్రజాస్వామ్యక హక్కు కూడా !
    మీ టపాలను చౌర్యం చేసి అది తమది గా చెప్పుకోవడం , అట్లాంటి వారికి పెద్ద నేరం గా తోచదు !

    • మూర్తీజీ,
      చిరునవ్వు వెల ఎంత?
      మరు మల్లె పువ్వంత.
      నిజంగా మీకా ఉద్దేశం ఉంటే,
      ఏ కోడలూ అత్త మీద అధికారం చెలాయించిన రోజు కనపడదు, మీరే చెప్పండి. నాకో మెయిలివ్వండి.
      ధన్యవదాలు.

  3. అంత సీరియస్‌గా తీసుకోకండి.
    మీ మంచి టపాలు మరికొంతమందికి చేరుస్తున్నందుకు ఆనందిద్దాము.
    అయినా మీ టపాలు చూస్తేనే తెలుస్తుంది, ఎవరు వ్రాసారో.
    దీన్నే మీ భాషలొ చెప్పాలంటె – ముంజేతి కంకణమునకు అద్దమేల?
    మన తెలుగు సినిమాల పంచ్ భాషలో చెప్పాలంటే – కంటెంట్ ఉన్నోడికి పేటెంట్‌తో పనేమిటి సార్?
    నా కామెంట్ మీకు నచ్చకపోతే క్షమించండి.

    • మిత్రులు బోనగిరి గారు,
      నేనూ చాలా కాలం అలాగే ఓపిక పట్టేను. ఇది రోజు రోజుకి పెరిగిపోతోంది. జ్ఞానాని దాచుకోడం తప్పు కాదు దోచుకోవడమే తప్పంటున్నా.
      ధన్యవదాలు.

  4. శర్మ గారు,
    I am sure you felt bad about stealing. But if you stop writing, then another channel that educate our future generation will be gone forever.
    My humble request is please explore options of putting ads and make it an income resource. Please take a look at sailusfood.com (by the way major telugu news papers steal her articles WITH PICTURES)
    regards
    Krishna

    • కృష్ణ jI,
      I v taken the matter light for a long time. It appears it is going on with an intention. If I am stopping, some body will occupy the place, no doubt. I am proposing to sell to safe guard my interest, not only for the sake of money. The society had given me this knowledge, I want to part with it to the betterment of this society again. In the meanwhile things are taking bad shape. It is not bad to store knowledge but it is bad to en cash it at the expense of others, to own it for benefit .
      Thanks for your suggestions and comment.
      Once again
      Thank you.

  5. కాపీస్కేప్ నెలకు ఇంతని వసూలు చేస్తుంది . దాదాపు ఐదు డాలర్లు . కాకపొతే copyrighted.com , myfreecopyright.com ఇంకా dmca.com లాంటి ఉచిత సంస్థలు కూడా ఉన్నాయి . ఒకసారి చెక్ చేయగలరు .

  6. తాతయ్య గారూ! మీకు ఇవి కాలక్షేపం కబుర్లు కావచ్చునేమో కానీ, నేనూ, నాలాటి చాలా మంది మీ రాతల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం.

    అయినా మీరు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారంటే మీ మనసు ఎంత కష్టపడిందో నేను అర్ధంచేసుకోగలను. “దయచేసి మీరు అంత కటినమైన నిర్ణయం తీసుకోకండి” అని అనాలని ఉన్నా, అనను. మీరు పెద్ద వారు. మంచీ, చెడూ తెలిసిన వారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, అది సరైనదై ఉంటుందని నమ్ముతున్నాను.

    • అమ్మాయ్ ప్రియా!
      బాలదపి సుభాషితం, నువ్వు చెప్పిన మాట నచ్చింది.ఓర్పు అవసరం. కోపంలో, ఉద్వేగం లో నిర్ణయం తీసుకోకు,సంతోషంలో వాగ్దానం చెయ్యకు, నీకు తెలుసు, మరో సారి గుర్తు చేశానంతే.
      ధన్యవదాలు.

  7. ఈ తస్కరణ అనేది ప్రస్తుతం నెట్ ప్రపంచంలొ సామన్యమై పొయింది, దరిదాపు దశాబ్ద కాలం నుండి ఈ నెట్ ప్రపంచంలో గమనిస్తున్నాను. ఎంతో కష్టపడి కొందరు రాసిన విషయాలని ఈ మద్య కాలంలొ చాలా మటుకు కాపీ చేసి పెట్టేస్తున్నారు. యాహూ జియో,వర్డ్ ప్రెస్ నుండి గూగుల్ బ్లాగ్స్ వరకు ఒక 50 పైనే బ్లాగులు కొన్ని వందలాది టపాలతో నేను రాశాను. నా దగ్గర సుమారు 150 సంవత్సరాల పూర్వం నుండీ గల పలు రాత ప్రతులు, పుస్తకాలు ఉన్నవి. అమూల్య విషయాలు చాలా సేకరించి అందరికీ అందుబాటులొ ఉంటవి కదా అని కష్టపడి రాసి బ్లాగుల్లో పెట్టాను. ఈ మద్య కాలంలొ వాటిని ఉన్నవి ఉన్నట్టు చాలా మంది పెట్టేసుకున్నారు, దానితో మనసు విరిగి ఆ బ్లాగులు రాయటమే మానేశాను. ఈ తస్కరణ భయం వలన చాలా మంది నెట్ లో రాయటానికి జంకుతున్నారన్నది అక్షరసత్యం.

    • స్వామిగారూ, శర్మగారి మనస్సుకూడా ఈ చోరశిఖామణుల అకృత్యాలవల్ల చాలా గాయపడినట్లు అనిపిస్తోంది. ఇప్పుడు నాకూ బ్లాగు(లు) వ్రాయటం మీద ఆసక్తి తగ్గిపోతున్నది. మొదటిదీ ముఖ్యమైనదీ దాదాపు ఏకాతంగానంలాంటి వ్యవహారం కావటం. అంతకన్నా ఇప్ప్పుడు మనస్సును కలచివేస్తున్నది భద్రతలేని చోట ఏ విషయం గురించి ఐనా వ్రాయటం అవసరమా అన్న శంక. నా బ్లాగులో ఏమంత ఆకర్షణీయమైన విషయం లేదు కాబట్టి ఇంతవరకూ ఏమీ చౌర్యం కాలేదని అనుకుంటున్నాను. ఐనా చేయగలిగింది లేదన్న స్పష్టతరావటంతో ఉన్న కాస్త ఆసక్తీ తగ్గిపోయే పరిస్థితి. దానికితోడు వృత్తిరీత్యా అస్సలు తీరికలేని రోజులాయె. శర్మగారు అస్త్రసన్యాసం చేసేస్తే (శాంతం పాపమ్) నా వంతూ ఎంతో దూరంలో లేకపోవచ్చును.

    • స్వామీజీ,
      చదువుకున్నవాళ్ళం, సంస్కారం ఉదనుకుంటున్నవాళ్ళం, సభ్యత తెలిసినవాళ్ళం ఇటువంటి పనులు చేయకూడదని తెలిసుండాలి కదా!మీ అనుభవం కూడా చేదేననమాట.
      ధన్యవదాలు.

  8. శర్మగారూ,

    మీ నిర్ణయం నాకు చాలా ఆశ్యర్యం కలిగించిందని చెప్పటం కంటే చాలా బాధ కలిగించిందని చెప్పటం సరిగ్గా ఉంటుంది. మీ కెంతో బాధ కలిగించిన పరిస్థితుల కారణంగానే మీరీ నిర్ణయం తీసుకున్నారని అనుకుంటున్నాను. శ్రీనివాస్ గారు చెప్పిన కాపీస్కేప్ అలోచన బాగానే ఉంది. ఆ దిశగా అలోచించవలసింది. మీ టపాలను మీరు ఈ-మ్బుక్స్ రూపంలో ప్రచురించటం బాగుంటుందేమో ఆలోచించండి. దొంగలభయం ఉందని ఇల్లు కూల్చేయాలనుకుంటే ఎలా గండీ? ఇలా మంచి విషయాలూ, ప్రమాణాలూ గల బ్లాగు ఒకటి నేడు ఆగిపోయి దారినుండి తప్పుకుంటే రేపు మరొక కొన్ని సరుకున్న బ్లాగులకూ అదేగతి పట్టే అవకాశం ఉంది.

    ప్రస్తుతానికి మీ బ్లాగును కేవలం ఖాతాదారులకోసం మాత్రమే తెరుచుకునేలా చేయండి. ఇందు వల్ల చీకటిలో కూర్చుని మీ టపాలను తస్కరించేవారిని ఆపగలుగుతారు. మీ బ్లాగును పరిరక్షించుకోవటం బ్లాగుప్రపంచానికి చాలా ఆవసరం అని నా నమ్మకం.

    • శ్యామలరావు గారు,
      బ్లాగు ఆపు చెయ్యడం నాకూ బాధ కలిగించే విషయమే, తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయో లేదో మీకే తెలుసు.దీని వలన అందరం నష్టపోతున్నాం. ఇప్పటికి తీసుకున్న నిర్ణయమిదే.కాపీ స్కేన్ దమ్మిడీ ముండకి ఏగానీ క్షవరం లాటిదనుకుంటా.
      ధన్యవదాలు.

      • మీ అభిప్రాయంతో ఏకీభవిస్తూనే ఒక్క చిన్న ముక్క మనవి చేసుకుంటాను. కాపీస్కేప్ అయ్యేది మరొకటయ్యేది ప్రతి పరిష్కారమూ సాఫ్ట్‌వేర్ ప్రపంచంలో డబ్బుతో కొనేవే కానక్కరలేదు. ఉచితంగా లభించేవీ‌ ఉంటున్నాయి వర్తమాన కాలంలో. ప్రస్తుతం ఈ సమస్యకి సంబంధించిన ఇబ్బందిని అధిగమించేందుకు ఉచితం గా సాఫ్ట్‌వేర్ లేకపోతే అలాంటిదానికి నేనే శ్రీకారం‌ చుడతానండి, మీ ఆశీర్వాదాలతో.

    • మిత్రులు శ్యామలరావు గారు,
      శోకం నుంచి శ్లోకం పుట్టింది. ఒక మహా కావ్యమే అయింది. మీ ప్రయత్నంలో విజయం సాధించాలనీ, మీరు సాధించగలరనీ విశ్వాసం. అస్తు, దిగ్విజయమస్తు
      నెనరుంచాలి.

  9. పూజ్యనీయులు శర్మ గారికి ! మీరు తీసుకుంటున్న ఈ నిర్ణయం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది . మన సంస్కృతిని సాంప్రదాయాలను వాటి వెనుక నిఘూడ అర్ధాలను విపులంగా తెలియచేస్తున్న మీరు అభినందనీయులు . కాగా – టపాలు తస్కరిస్తున్నారని బ్లాగు మూసేయడం ఏమిటి ? నెట్ లో ఈ దొంగల బాధ చాలాకాలం నుండీ ఉంది కదా ..మనం ఏంతో కష్టపడి వ్రాసినదాన్ని ఇతరులు ఉపయోగిస్తే మన మనసు బాధపడడం సహజమే ! మీ బ్లాగును కాపీస్కేప్ లో రిజిస్టర్ చేసుకుని మీ కంటెంట్ ను కాపాడుకోవచ్చు . ఎవరైనా తస్కరిస్తే వారి కంటెంట్ తొలగించే ఏర్పాటు కాపీస్కేప్ వారీ చేస్తారు . link : http://www.copyscape.com/

వ్యాఖ్యానించండి