శర్మ కాలక్షేపం కబుర్లు-మట్టిలో మాణిక్యాలు

మట్టిలోనే మాణిక్యాలుంటాయి.

మెరిసేదంతా బంగారంకాదు కాని,మట్టిలోనే మాణిక్యాలుంటాయి. ఐతే మనం చూసుకోడంలో,గుర్తించడంలో, వుంటుంది. మన పక్కనున్న వ్యక్తిలో విశేషమైన గుణం వుండచ్చు. కాని మన అతి పరిచయం వల్ల అది తెలుసుకోలేక పోవచ్చు. నేను చెప్పొచ్చేదేమంటే ఏదీ చూడగానే ఒక నిర్ణయానికి వచ్చెయ్యద్దన్నదే నా వుద్దేశ్యం. మొన్న లింగార్చన కి మా వూరెళ్ళాను. అక్కడ ఒకరిని చూశాను. వారిని నిరుడు కలిసినపుడు జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. నిరుడు నేను మొదటిసారి ఆయనను చూసినపుడు నాకు ప్రత్యేకమైన అభిప్రాయం ఏమీ లేదు. ఆయనను ఒక ప్రభుత్వ రంగ బేంకు మానేజరుగా పరిచయం చేశారు. ఆయన వేషం చూస్తే నేటి కాలపు కుర్రాళ్ళకి ఏమీ తీసిపోనట్లే వుంది. మాట మామూలుగా వున్నా వుద్యోగ ధర్మం ప్రకారంగా పల్లెలో వారితో మాట్లాడడానికి తగినట్లుగా వుంది. తాను ప్రత్యేక వ్యక్తిగా ఆయన భాసించలేదు. కారణం ఏమంటే ఆయన అక్కడివారితో మమేకం అయి వారిలో ఒకరైనపుడే వారికి, తన సంస్థ కి ఉపయోగపడగలరు. అదీ ఆయన చేస్తున్నది. ఇకపోతే,నిరుడుకూడా ఈ సంవత్సరం లాగా పూజకార్యక్రమం అయిన తరువాత జరిగిన పార్వతీ పరమేశ్వరులు కొలువుతీరి వున్న సభలొ వారికి రాజోపచారాల నిమిత్తంగా నృత్యం, వేదపారాయణ నాలుగు వేదాలనుంచి,గానం,కవిత్వం అన్నీ చెబుతారు. ఇది జరుగుతుండగా జరిగిన సంగతి. ఎవరెవరో ఎవేవో చెప్పేరు. ఈయనను ఒక పనస ( వేదంలోని ఒక ఋక్కు ) చెప్పమని కోరినపుడు నేను ఆశ్చర్యానికి లోనయ్యాను. ఈయనేమిటి వేదంలో పనస చెప్పడం ఏమిటి అనుకున్నాను. ఆ సందర్భంగా ఆయన  వేదం నుంచి ఒక పనస పారాయణ చేసారు, నిజంగా నాకు ఆయనను చూస్తే ఆయన ఒక వేదం లో ఒక పనస కాదుకదా ఒక సంస్కృత పదం కూడా చెప్పలేనివాడిలా కనుపించారు. చూసారా! మెరిసేదంతా ఎలా బంగారం కాదో, సామాన్యులను కున్న వాళ్ళలో గొప్పవాళ్ళుంటారు మనం వెతికి పట్టుకోవాలి, గుర్తించగలగాలి.. నాకు ఈ సంవత్సరం తెలిసిందేమంటే, వారు ఆ వూరికి వచ్చినపుడు ఆ సంస్థలో,  ఆవూరివారికి జరిగిన ఉపకారాలకి, లావాదేవీలకి రెట్టింపుగా వీరి ఆధ్వర్యవంలో  లావాదేవీలు పెరిగిన సందర్భంగా బేంకు యాజమాన్యం వారు గుర్తించి నగదు బహుమతి ఇవ్వడం. ఆయన అందునుంచి కొంత మొత్తం మళ్ళీ వూరివారికోసం వెచ్చించినట్లు తెలిసి అభినందించలేకుండా వుండలేకపోయాను.

ఆయన వుద్యోగం చేసుకుంటూ, భారతీయ సంస్కృతిని నిలబెట్టుకుంటూ, పల్లె ప్రజలలో కలిసిపోయి తన సంస్థ ద్వారా ప్రజలకి ఉపయోగపడి, సంస్థను ఉన్నత స్థితికి చేర్చిన విధానం బహు ప్రశంసనీయం.ఓడలో వున్నంతవరకు ఓడ మల్లయ్య, ఓడ దిగిన తరవాత బోడి మల్లయ్య అనే నేటి రోజులలో ఒక పల్లెలో తన ప్రతిభను చూపి ప్రజలకి ఉపకారం చేసి తద్వారా సంస్థ కి మంచిపేరు తెచ్చిపెట్టడం గొప్ప విషయంకదా! ఇంతా చేస్తే అయన వయసు ముప్పది ఐదు దాటి వుండకపోవచ్చు. నేను నిరుడు ఆయన తో తీరుబడిగా మాట్లాడినపుడు తెలిసిన సంగతేమంటే ఆయన చిన్నప్పటినుంచి కష్టపడి, ఇష్టంగా చదువుకుని ప్రభుత్వరంగ బేంకు వుద్యోగి అయ్యారట. కష్టంలోనే సుఖం దాగి వుంటుంది, కష్టపడకపోతే సుఖం విలువ తెలియదు.

8 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు-మట్టిలో మాణిక్యాలు

  1. @@@
    వ్యాసమూర్తిగారు!
    నాకాయనతో వున్న అతి తక్కువ కాలపు పరిచయంతో నాఅనుభవాన్ని చెప్పేను. గొప్పతనం వారిదే! బంగారాన్ని బంగారంగా గుర్తించలేకపోతే, బంగారానికి లోటా!! లోటు మనదే కాని బంగారంది కాదుగా !!! నేను గుర్తించగలిగినందుకు నాకు ఆనందంగా వుంది.

  2. its really worthy to read your blog sir..!
    the above person quoted by you is my #BABAYYA# sir….deserving few good words from people like you is like monsoon rain sir…so nice to read your personal experience and understanding your ethical and rational values towards people is quite appreciative sir….!
    my babayya is really a dedicated associative in any condition sir….!

    thankyou very much for your blessings sir.

  3. @@@
    చి.బుజ్జికి
    నాకాయనతో అతితక్కువ కాలంలో జరిగిన సంభాషణ గుర్తుచేసుకుని రాసాను. మిగిలిన వివరాలు నీ ద్వారాగా తెలుసుకున్నందుకు ఆనందంగా వుంది. ధన్యవాదాలు.

  4. Babayya, It reflected the radiance of his talent in vedas. More than this talent in chanting vedas, I liked in him the qualities like simplicity, respect for elders, mingling nature and affectionate wish. In fact, many of the villagers speak of his above qualities before they start telling anything about him. Vedic chanting is only an additional qualification/advantage, of course, which is a praise-worthy quality. I enjoyed his vedic chanting. He deserves all appreciation. Thanks for your special observation about a jewel.

  5. HI babai,

    You have rightly said it..Infact, u must remember, he chanted Vedam….Ghana panasa along with the said ritwiks…which was enthralled the audience. So simple, sobre and calm with good
    composure by this gentlemen. A rarely-available impeccable pearl !!!!

వ్యాఖ్యానించండి