మనవరాలా మజాకానా!
నిన్నసాయంత్రం మనవరాలని తీసుకు రావడానికి కాలేజి కి వెళితే,
తాతా! అని చంక ఎక్కేసింది.
ఏంటిరా అంటే,
ఇంటికి పద చెబుతానంది.
ఇంటికొచ్చాకా,రేపు నువ్వు పొద్దుటే లేచి బొబ్బలు పోసుకుని, పూజ చేసుకుని టిఫిన్ చేసివచ్చేటప్పటికి నేను తయారుగా ఉంటా. మధ్యాహ్నం దాకా ఇంగ్లీషు మాటల అంత్యాక్షరి,కొత్త తెనుగు పద్యాలు చెప్పుకోవడం, ఇంగ్లీషు కొత్త మాటలు చెప్పుకోవడం, స్పెల్లింగులు చెప్పుకోవడం చాలా ఉందిలే, రెడీ. ఆ తరవాత ఆమ్ము తినేసి నువ్వు బజ్జోవాలి, నేను కంప్యూటర్ చూసుకుంటా. అమ్మ మామిడి చెట్టుకి ఉయ్యాల వేస్తానంది. మధ్యాహ్నం ఉయ్యలూగాలి, తొక్కుడు బిళ్ళ, దొంగాట, పరుగుపందేలు, వీరీ వీరీ గుమ్మడి పండు, సాయంత్రం ఆరు దాకా ఆడుకోవాలి. ఆమ్ము తినేసిన తరవాత నీదగ్గర బజ్జుంటా, కధలు చెప్పాలి.
మరి చదువుకోవద్దా అన్నా.
నేను మా క్లాసులో ఎ+ తెలుసా?, నీకెప్పుడేనా ఎ+ వచ్చిందా?, నేనెప్పుడూ మా క్లాసులో ఎ+ అంది. నీకు తాతలు, మామ్మా, అమ్మమ్మా లేరుగా, నేనున్నాగా.
ఇంత చెబుతున్నావు మరి బళ్ళో కెళ్ళావా అన్నా.
రేపటినుంచి 28 దాకా దసరా శలవులోచ్ అంది.
దీనికి ఆడుకోడానికి మరొకళ్ళని ఇవ్వండర్రా అంటే వాళ్ళు మాట్లాడటం లేదు :).పెద్దవాళ్ళయిన మనవరాళ్ళకి కూడా నాతో దోబూచులాడటం అదొక సరదా! వాళ్ళ సరదాని, నేను మాత్రం ఎందుకు కాదనాలీ 🙂
శలవులు బాబోయ్ శలవులు. నాకూ శలవులే మరి, మనవరాలా మజకానా.
మీకు మీ మనవరాలికి మరియు ఇతర కుటుంబసభ్యులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు.
@అనూరాధ గారు ,
మీకు మీ కుటుంబ సభ్యులకు నవరాత్ర శుభకామనలు.
ధన్యవాదాలు.
మనవరాలితో దసరా సెలవలు గడిపి మరిన్ని కబుర్లతో త్వరలో వచ్చేయండి బాబాయి గారు.
@అమ్మాయ్ జ్యోతిర్మయి ,
మీకు మీ కుటుంబ సభ్యులకు నవరాత్ర శుభకామనలు. ఉయ్యాల వేయించింది, నిన్ననంతా ఒకటే ఆటలు, పాటలు, పద్యాలు. రేపు అమ్మమ్మ గారింటికి పారిపోతుందిటా, నలుగురోజుల్లో వచ్చేస్తాకదా అని ఓదార్చింది.
ధన్యవాదాలు.
సెలవలన్నీ ఆనందంగా గడపండి. కోరినవన్నీ తీర్చేయండి. మీరు..ఆది పాడండి:)
శరన్నవరాత్రుల శుభాకాంక్షలు..మాస్టారూ.. !!
@వనజగారు,
మీకు మీ కుటుంబ సభ్యులకు నవరాత్ర శుభకామనలు. నిన్ననంతా అదే హడావుడి.
ధన్యవాదాలు.
మీ కుటుంభ సభ్యులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు,
మాకు కొంచం దేవీ నవరాత్రుల అవతారాలు గురించి వివరించగలరు.
@గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారు,
మీకు మీ కుటుంబ సభ్యులకు నవరాత్ర శుభకామనలు.
ధన్యవాదాలు.
మీకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు..
మనుమరాలితో దసరా సెలవులను ఆనందంగా గడపండి శర్మగారూ!
అభివాదాలతో…@శ్రీ
@మూర్తిగారు,
మీ బ్లాగు నాతో సత్యాగ్రహం చేసేస్తోంది, బయటికి తోసెస్తోంది. మీకు మీ కుటుంబ సభ్యులకు నవరాత్ర శుభకామనలు.
ధన్యవాదాలు.
అయ్యయ్యో ఎంత మాట…అది కొన్ని సెట్టింగ్స్ మీ system lo
మారిస్తే అయిపోతుంది శర్మ గారూ!..బ్రౌజరు వేరేది వాడి చూడండి…
మీరు నా బ్లాగ్ లో కనిపించటం లేదని నాకూ బాధగానే ఉందండి…
మీ శుభాకాంక్షలకు మా శుభాభివాదాలు…@శ్రీ
మూర్తిగారు,
మూడు బ్రోజర్లు మార్చాను, సెట్టింగులూ మార్చాను. క్రోంలో కనపడుతోంది, కామెంట్ పెడదామంతే పోతోంది. ఇప్పుడు కూడా ప్రయనించి విఫలమయ్యా. మరే బ్లాగూ అలా లేదు.
ధన్యవాదాలు.