శర్మ కాలక్షేపంకబుర్లు- కారంకాని కారాలు

 

DSCN3564

చిలక్కొట్టు

కారంకాని కారాలు

అధికారము.
అంగీకారము.
అలంకారము.
అపకారము.
ఆకారము.
ఉపకారము.
ఓం కారము
అంధకారము.
అహంకారము.
ధిక్కారము.
ఘీంకారము.
క్రేంకారము.
మమకారము.
లవకారము.
వికారము.
వెటకారము.
స్వీకారము.
హుంకారము.
ఝుంకారము.
టంకారము.
బలాత్కారము.
ప్రాకారము.
సహకారము.
నిస్సాకారము.
హాహాకారము.
నిరాకారము.
ప్రాకారము.
ప్రతీకారము

కారం కాని కారాలు మరికొన్ని చెప్పండి.అలాగే హారం కాని హారాలు 4 రాయండి.ఇంగ్లీషుపదాలు లేకుండా ఒక నిమిషం మాటాడడండని టి.వి. లో ఒక కార్యక్రమం చూసిన తరవాత ఇలా అనిపించింది. 

ఈ మధ్య ఒక సారి హైదరాబాద్ వెళుతోంటే గుంటూరు రయిల్వే ప్లాట్ ఫాం మీద ఇద్దరు మిత్రులు ఇంగ్లీషులో మాటాడుకుంటూ కనపడ్డారు. “ఇదేమర్రా! ఇద్దరూ తెనుగువారే కదా ఇంగ్లీషులో మాటాడుకుంటున్నారం”టే, “తెనుగులో మాటాడితే ఎవడు గుర్తిస్తాడు బాబాయ్! అందుకు ఇంగ్లీషులో మాటాడుకుంటున్నాం,’నాకు తెనుగులో రాయడం, చదవడం రాదని చెప్పుకోడం గొప్ప తెలుసా?’. అన్నట్టు నీకు తెనుగు తప్పించి మరే భాషా రాదుకదూ!,మీలాటి వాళ్ళే నూతిలో కప్పల్లా బతికేస్తూ, తెనుగో అని తెగ  బాధ పడుతున్నారు,తెనుగెవడికి కావాలయ్యా!.”

You know,we are improving our telugu language by speaking and writing Telugu in English.  

21 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- కారంకాని కారాలు

    • @మిత్రులు శ్యామలరావు గారు,
      వెతుకుతోంటే చాలా దొరుకుతున్నాయి 🙂 మొన్న ఫణిబాబు గారి బ్లాగ్ లో సూకరాలు అన్న మాట సుఖకరాలు నుంచి పుట్టి ఉంటుందనుకున్నాం కదా! సూకరము అంటే పంది అని అర్ధం కదండీ. ఇలా సొగసులు పోయే వాళ్ళని ఎత్తిపొడుపుగా సూకరాలు అన్నారేమో!
      దయ ఉంచండి.

  1. @మిత్రులు శ్యామలరావు గారు, సుభ వల్లభగారు,జిలేబీ గారు,సుమ గారు,చిన్నిగారు,శర్మగారు, సుధాకర్ గారు,అమ్మాయ్ అనురాధ.

    అందరికి వందనాలు. కొత్తవారో పాతవారో కొంతమందిని గుర్తించలేకపోతున్నా, కొత్తవారయితే స్వాగతం, పాతవారికి స్వాగతమే కాని వారు పేర్లు మార్చుకున్నారా అని అనుమానం. ఎల్లరకు స్వాగతం. . సుస్వాగతం.

    మీ భాషాభిమానం నన్ను ఆనంద డోలికలలో ఓలలాడించింది.అందరూ మమకారాన్ని మాత్రం మరిచిపోలేదు.

    అన్నట్టు వీటన్నిటికీ అర్ధాలు తెలుసా?
    ఒక్క మాటకి అర్ధం చెప్పండి చూదాం.

    లవకారము.

    ధన్యవాదాలు.

    దయ ఉంచాలి.

    • శర్మగారూ,
      లవకారము అనే మాటకు కావ్యప్రయోగం ఉందేమో నాకు తెలియదు. లవము అంటే స్వల్పమైనది అని అర్థం. “స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సతతిః” అని లలితాసహస్రనామాల్లో ఒక నామవిశేషం కనిపిస్తుంది. అంటే అమ్మవారి యొక్క ఆనందం ముందు బ్రహ్మాదులు అనుభవించే‌ ఆనందం చాలా స్వల్పమైనది అని భావం.
      లవకరణం అంటే చిన్నదిగా చేయటం/చూపటం అని తాత్పర్యం కావచ్చును. కాని యీ‌ మాటను యెవరూ ప్రయోగించినట్లు వినలేదు.

      • @మిత్రులు శ్యామలరావు గారు,
        లవకారము అనేమాట నిఘంటువుకే ఎక్కలేదు. మీరు చెప్పినవన్నీ నిజమే. ఈ మాటను తాపీ మేస్త్రీలు విస్తృతంగా వాడతారు. గరుకుగా గచ్చు చేయడాన్ని, నునుపు గచ్చు చేసేముందు చేసేదాన్ని, కచ్చాగా చేసేదాన్ని, తాత్కాలికంగా గచ్చు చేసేదాన్ని అనే అర్ధాలలో వాదుతున్నారు.
        దయ ఉంచాలి.

  2. చాలా చాలా బాగా వ్రాసారండి.
    టపా చదివిన తరువాత ఆలోచిస్తే, సాకారము అనే పదం గుర్తొచ్చిందండి.
    ఉదా; కొందరు తాము అనుకున్నది సాధించినప్పుడు నా కల సాకారం అయింది అంటుంటారు కదా !
    హారము కాని హారము పరిహారము.

  3. మంచి ప్రశ్న వేసారు తాతగారు.. నేను అనుకున్న పదాలు మీరు పైన టపాలో వ్రాసేసారు..ఏం వ్రాయాలబ్బా??!!!

  4. శర్మగారూ

    “ప్రాకారము” అనేది రెండు సార్లు వ్రాసారు. Typo అనుకుంటాను. ఒకదాన్ని “ప్రకారము” అని మార్చవలసి ఉంది.
    “వషట్కారము” మరచిపోయారు.
    ఇంకా యేమే మున్నాయబ్బా!?

    కారాల సంగతీ హారాల సంగతీ సరేనండి కానీ తెలుగును కాని యెవరన్న పొరపాటునో‌గ్రహపాటునో ఒక ముక్క అన్నారో నాకు విపరీతమైన ఆవేదన వచ్చేస్తోంది. ఎంతచెడ్డా మమకారంలో కూడా కారం సగం ఉందిగా యేంచేస్తాం చెప్పండి.

  5. శర్మ గారూ ,

    నమస్తే .

    మీరన్నట్లు ఈ తెలుగు స్క్రిప్ట్లు ఇంగ్లీష్ లో తైపు చేసే విధానం వచ్చాక తెలుగు భాషా విఙ్నానం మఱచిపోకుండా ఉంచుకోగలుగుతున్నాం , పెంచుకోగలుగుతున్నామన్నది అక్షర సత్యం , ఆచరణ యోగ్యం . లేఖిని అంతర్జాల కనెక్షన్ లేకున్నా పనిజేయటం చూసిన కొంతమంది , అది ‘లేఖినీ కాదు లంఖిణిలా మిమ్మల్ని వదలటం లేదే అన్న వాళ్ళని చూశాను , ‘హారం’ కంఠ భూషణం కదా ! అన్నవాళ్ళు ఉన్నారు . ఇవన్నీ ఖనిజాల్లాంటి నిజాలే .

    ఈ వయసులో ప్రపంచంలోని నలుమూలలా ఉన్న తెలుగువారితో సంభాషించుకోగలుగుతున్నాము . లేకుంటే మీలాంటి వారితో , నాకు పరిచయ భాగ్యం కలిగేది కాదు .

  6. అన్నట్లు నా మొదటటి తరగతి వాచకంలో ఒక రైమ్ ఉండేది. అదింకా గుర్తుంది. క్రింద వ్రాస్తున్నాను.

    కారాల్లో కెల్లా
    రెండే కారాలు
    ఉప్పూ కార మొకటి
    ఉపకార మొకటి

వ్యాఖ్యానించండి