శర్మ కాలక్షేపంకబుర్లు-చీపురు కట్టతో ఎవరో గుర్తుపట్టండి.

 చీపురు కట్టతో ఎవరో గుర్తుపట్టండి.

DSCN3892

photo

Courtesy: Sri.K.Raghavendra Rao.

మిత్రులందరికి ఒక విన్నపం, నేను దీనిని ఫెస్ బుక్ నుంచి సేకరించలేదు. అసలు ఫోటో కింద ఇస్తున్నా. నాకొక మిత్రులు మెయిల్లో పంపేరు. దానిని నేనే మరల తీసి కింద ఉన్నది లేకుండా చేసి టపాలో చేర్చేను. ఇది నిజమైనదో కాదో నాకూ తెలియదు. 

చీపురు కట్టతో ఎవరో గుర్తుపట్టండి.

పరోపకారాయ ఫలన్తి వృక్షాః పరోపకారాయ వహన్తి నద్యః
పరోపకారాయ చరన్తి గావః పరోపకారాయమిదం శరీరమ్

పరోపకారము కొరకు వృక్షములు ఫలిస్తున్నాయి. పరోపకారము కొరకు నదులు ప్రవహిస్తున్నాయి. పరోపకారం కొరకు గోవులు పాలిస్తున్నాయి. ఈ శరీరము పరోపకారముకొరకే అని కవి హృదయము.

నేడు పరోపకారమనే మాటకి అర్ధాలే మారిపోతున్నాయి. పరోపకారమంటే “నాకిదిస్తే నీకదిస్తా” అని బేరమే జరుగుతోంది, అన్ని స్థాయిలలో కూడా.పరోపకారం కోసమే జీవిద్దామంటున్నారు కవి. అంతగా పరోపకారం కోసమే జీవించద్దుకాని బతుకు బతకనియ్యి Live let live అనే దాన్ని నిజం చేద్దాం. బిచ్చగాళ్ళని కాదు, ఎవరిమటుకు వారు తమ కాళ్ళపై నిలబడేలా, గౌరవంగా తలెత్తుకు తిరిగేలాటి ప్రజలుండే సమాజాన్ని  కోరుదాం. Live let die అన్నది మన సంస్కృతి కాదు.

jaffery wilson

Courtesy:jeffrey wilson

14 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-చీపురు కట్టతో ఎవరో గుర్తుపట్టండి.

  1. వెల్కం బెక బెక !

    మళ్ళీ పడ్డా రన్న మాట మానవుల లోకం లోకి ! జేకే !!

    పాపం ఇన్నేసి ఏళ్ళు గా ఆ ఫోటో మానవుడు ‘క్లీన్’ చేస్తున్నా ఇంకా ప్రక్షాళన అయినట్టు లేదు మన దేశం | కారణం ప్రక్షాళన లో లోపమా లేక లోపం వేరే ఎక్కడో ఉన్నదా ! ఆలోచింప దగ్గ విషయం

    మరో సారి శర్మగారు మీకు వెల్కం బెక బెక ! టెక్ కేర్ ఆఫ్ హెల్త్ ‘ఆరామం’ గా రాయండి ! విరామం ఇవ్వండి మళ్ళీ మళ్ళీ నే బ్లాగు విడచి పోతా నన మాకండి (చూడుము – బ్లాగు సన్యాసం కథ!)

    చీర్స్
    జిలేబి

    • @జిలేబి గారు,
      సామాన్యుడిని కదా అందుకు అన్ని అనుభూతుల్ని అనుభవిస్తున్నా, తప్పదు కదా! దుఃఖం కూడా జీవితం లో భాగం కదా, నిరాశలో కూరుకుపోక మళ్ళీ బయట పడుతుంటా. మళ్ళీ చెప్పకుండా, చెప్పి బ్లాగు వదలిపోతాననను, సరేనా? మీరు కోపపడితే తట్టుకోలేనేమో! 🙂 మీరన్నట్లుగా వీలు వెంబడే ఇక ముందు రాస్తాను.
      ధన్యవాదాలు

    • @పద్మగారు,
      చెప్పినపుడు అది దొంగతనం కాదు కదా! నిరభ్యంతరం గా తీసుకోండి. అసలువారి పేరు నేను సాధ్యమైనవరకు ఇస్తున్నాను. దానిని మరువకండి.
      ధన్యవాదాలు

  2. మామయ్యగారు,-రెండువేలనాలుగులో మనం తప్పుచేసి ఇరవై సం.లు. వెనుకకు వెళ్ళినాము. గుజరాతీయులు ముందుకు వెళ్ళినారు. [కానీ ఇటువంటి విషయములు బ్లాగుద్వారా చెప్పడం సరికాదని నాఅభిప్రాయం].ఇలావ్రాసినందుకు క్షంతవ్యుడను.కానీతప్పలేదు

  3. నేను బోనగిరిగారితో ఏకీబవిస్తాను, మీ పోస్ట్ ని విమర్సించటం కాదు. ఫేస్ బుక్ మీది నాకున్న దురభిప్రాయాన్ని తెలిపాను

    • @ఫాతిమాజీ,
      ఫేస్ బుక్ మీద నాకున్న అభిప్రాయం చెప్పేను. దానిలో పడి కొంత మంది నిజాలు దాచేస్తున్నారు.ఎవరికీ తెలియవనుకుంటున్నారు, అన్ని విషయాలలోనూ,
      ధన్యవాదాలు

    • @మిత్రులు బోనగిరి గారు,
      నాకు ఫేస్ బుక్ కి సగమెరిక. చాలా సార్లు చెప్పేను. ఇది ఒక మిత్రులు పంపినది. ఏదో పేపర్ లో పడిన దానిలా వుంది. అందుకే మీ మాట తరవాత, ఫాతిమాజీ అన్నప్పుడు అసలు ఫోటో పెట్టేను.
      ధన్యవాదాలు

వ్యాఖ్యానించండి