శర్మ కాలక్షేపంకబుర్లు- నిజంగా మానభంగం జరిగిందా?

139 Radhika naniCoutesy: Radhika Nani
నిజంగా మానభంగం జరిగిందా?

మొన్ననొక టపాలో వ్యాఖ్య రాస్తూ మిత్రులు జి.ఎల్.ఎన్.మూర్తిగారు “మరిరేపులెందుకు మహిళలపై జరుగుతున్నాయి???….ఏదో కుతూహలంతో అడిగా” అని కవ్వించారు. నిజానికి ఈ విషయం మీద చాలా మంది చాలాచాలా చర్చలు, వాదాలు, ప్రతివాదాలు చేసేసేరు, మళ్ళీ నేనా డొంకని కదపదలచుకోలేదు 🙂 ఈ సందర్భంగా అరవై, డెభ్భయి సంవత్సరాల కితం జరిగిన ఒక సంఘటన కర్ణాకర్ణీగా విన్నది చెబుతా అవధరించండి.

చెప్పేను కదా! కధాకాలం దగ్గరగా అరవై సంవత్సరాల పైబడ్డదేనని. అదొక మధ్యతరగతి పట్టణం, అందులో ఇద్దరు ధనికులు, పేరున్నవారు,పలుకుబడిగలవారు, ఎదురెదురు భవంతులలో కాపరాలున్నారు. ఒకరికొక అమ్మాయి, మరొకరికొక అబ్బాయి, ఒక వయసువారే. ఒకే కాలేజీలో ఒకటే తరగతిలో చదువుతున్నారు. ఆ రోజులలో కాలేజి చదువంటే చాలా గొప్ప సంగతి. అమ్మాయికి అబ్బాయి మీద మోజుందని, అమ్మాయి ఇంటివారు సన్న సన్నగా చెప్పుకుంటారు, వారిద్దరూ ఒక ఇంటివారయితే బాగుంటుందనే కోరికా ఉంది. రెండిళ్ళకి రాకపోకలు, మంచి మర్యాదలు ఉన్నాయి.

ఇలా జరుగుతున్న సందర్భంలో, ఒక రోజు అమ్మాయి ‘ఎదురింటి అబ్బాయి నన్ను మానభగం చేసేడని’ గోల చేసింది, పోలీస్ కేస్ వగైరా జరిగేయి. నాటి రోజులకి ఇప్పుడున్నట్లు రెండు వేళ్ళ పరిక్షతో మానభగం జరిగిందా లేదా అనే నిర్ణయం జరిగిందో లేదో తెలియదు కాని, కేస్ కోర్ట్ కి మాత్రం వెళిపోయింది. అమ్మాయి తరఫున ఒక ఆడ లాయరు అబ్బాయి తరఫున ఒక మగలాయరు కేసులు వాదిస్తూ వచ్చారు. కోర్టులో అమ్మాయి, ‘అబ్బాయి తనను మానభంగం చేసేడని’ చెప్పింది, అబ్బాయి ‘నాకేం తెలియదు మొర్రో!’ అంటూ వచ్చాడు, తర్జనభర్జనలు చాలా జరిగాయి. అబ్బాయి మాత్రం తనను మానభంగం చేశాడని చెప్పిన సమయంలో తన దగ్గరున్నట్లుగా అమ్మాయి ఋజువు చేయగలిగింది,సాక్ష్యం చెప్పడానికి ఎవరూ లేరు.  మానభంగం జరిగిందని ఆడలాయరు, జరగలేదని మగలాయరు, వాదిస్తూ వచ్చారు. అక్కడ ఆగిపోయింది కేసు, వాయిదాలు పడుతున్నాయి, కాని కేసులో పురోగతి కనపడటం లేదు. కోర్టులో రోజురోజుకి ఆడలాయరు మాట గట్టిగాను, మగలాయరు మాట క్షీణిస్తూ వచ్చింది. కేస్ పోతుందేమోనని మగలాయరు బెంగ పెట్టుకునే స్థితి వచ్చేసింది. రేపు వాయిదా అనగా రాత్రి,, ఈ కేస్ తాలూకు కాగితలు చూస్తూ లాయరుగారు చాలా సేపు గడిపేటప్పటికి ఆయన భార్య వచ్చి “ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నార”ంటే, లాయరు తను వాదిస్తున్న కేస్ వివరాలు భార్యకు చెప్పేడు. అందుకు ఆవిడ “ఓస్! ఇంతేనా!! ఈ కేస్ గురించి బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారా, రండి పడుకుందా’మని చెయ్యిపట్టి బెడ్ రూం లోకి తీసుకుపోయింది.

1

Courtesy:- From a friend by mail

మర్నాడు ఉదయమే మగలాయరుగారు హుషారుగా కోర్టుకు ఎప్పుడు వెళదామా అని తయారయి కూచున్నాడు. కోర్ట్ టయిమయింది, జడ్జీ బెంచ్ మీదకీ వచ్చారు, వాది, ప్రతివాదులు బోనుల్లో నిలబడి ఉన్నారు, ఆడలాయరు వాది తరఫు కేస్ చెప్పి ‘నిందితుడు తన క్లయింటును మానభంగం చేశాడని’ చెప్పి, ‘ముద్దాయిని కఠినాతి కఠినంగా ఇశిక్షించమని’ చెప్పి కూచుంది. అప్పుడు మగలాయరు లేచి ‘యువరానర్! మానభంగం జరగలేద’ని చెప్పేడు, అందుకు జడ్జీ ‘మీరీమాట చాలాకాలం నుంచి చెబుతున్నారు, మానభగం జరగలేదని, కాని ఋజువు చేయలేద’న్నారు. అప్పుడు లాయరు ఒక చిన్న ప్రయోగం చేయడానికి అనుమతి అడిగి, వాది దగ్గరకుపోయి కోట్ జేబులోంచి ఒక సూది తీసి, బొటనవేలు, మధ్యవేలుతో పట్టుకుని, అమ్మాయికి దారం ఇచ్చి సూదిలోకి దారం ఎక్కించమన్నాడు. అభ్యంతరాలు, వాదాలు అయిన తరవాత ప్రయోగం కొనసాగింది. సూదికి పైన ఉన్న చిల్లులోకి అమ్మాయి సులువుగానే దారం ఎక్కించేసింది, లాయరు సూది పట్టుకుని ఉండగా. ఇప్పుడు దారం తీసేసి మళ్ళీ ఎక్కించమన్నాడు లాయరు గారు. అమ్మాయి దారం కొస పట్టుకున్నది, సూదిలో ఎక్కించడం కోసం, ఇంతలో లాయరు, సూదిని వేళ్ళ మధ్య తిప్పడం మొదలు పెట్టేడు. అమ్మాయి దారం ఎక్కించడానికి ప్రయత్నం చేసి, కుదరక, ‘మీరు సూది అలా తిప్పుతోంటే, దారం ఎలా ఎక్కించను?’ అని అడిగింది. దానికి లాయరు “ఏంటమ్మా! అన్నావు, మళ్ళీ చెప్ప”ని, మొదట చెప్పిన సమాధానమే మళ్ళీ వాది చేత చెప్పించి, సూది స్థిరంగా ఉన్నపుడు అమ్మాయి దారం సులువుగా ఎక్కించగలిగింది, సూది కదులుతుంటే దారం ఎక్కించలేకపోయింది కనక, ఆమెను ముద్దాయి మానభగం చేయలేదని, మరెవరూ కూడా అలా చేయలేరు కనక, తన వాదనను బలపరచి, తన క్లయింట్ ని నిర్దోషిగా నిర్ణయిచ వలసినది కోరుతూ వాదన ముగించాడు.

కొంత కాలం తరవాత, జడ్జీగారు మగలాయరు చెప్పిన దానిని నమ్మి కేస్ కొట్టేసేరు. కేస్ కొట్టేసిన రోజు ఇంటికొచ్చిన తరవాత అమ్మాయిని, ఇంటిలో ఉన్న మామ్మ “ఏమే! నిజంగా వాడు నిన్ను మానభగం చేసేడా?” అని అడిగింది. అందుకు అమ్మాయి” ఏడ్చాడు! వాడికంత శక్తి ఎక్కడిది” అని సమాధానమిచ్చింది.

ఇప్పుడు చెప్పండి.
నిజంగా అబ్బాయి అమ్మాయిని మానభగం చేశాడా?
అమ్మాయి, కోర్టులో చెప్పినదా, ఇంటిలో చెప్పినదా అబద్ధం?
అంతకాలమూ మగలాయరుకి తట్టని ఆ ప్రయోగం ఆ కితంరోజు రాత్రే ఎలా తట్టింది?
భేతాళుడి ప్రశ్నలకు సమాధానం చెప్పండి.

14 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- నిజంగా మానభంగం జరిగిందా?

 1. మీరు ఉదహరించిన ‘ జరిగిన ‘ కధ, చమత్కారం గా ఉంది !
  ఇక ప్రశ్నల కు సమాధానాలు వెదికితే :
  1. లోకులు అనుకునేదాకా అమ్మాయి మోజు అబ్బాయి మీద ఉందంటే, వారిద్దరూ , ఒక ఇంటి వారు కావడానికి , ఆ అమ్మాయి ఎంచుకున్న మార్గం లా ఉంది, ఈ మానభంగం ‘ అపవాదు ‘ !
  2. ఆ అమ్మాయి కోర్టు లో అబద్ధమూ , ఇంట్లో నిజమూ చెప్పినట్టని పిస్తుంది !
  3. ఇక, అంత కాలమూ తట్టని ఆలోచన , ఆ రోజు మాత్రమే , తట్టడానికి కారణం , ఆ మునుపటి రాత్రి , అబ్బాయి తరఫు న లాయరు , తన భార్య తో ( ఇరువురి అంగీకారం తో ) జరిపిన సంభోగమే కావచ్చు !
  4. ఆ లాయరు, సూదీ దారం ఉపమానం తో సూదిని కదుపుతూ ఉండడం వల్ల , దారం ఎక్కించడం ఎంత కష్టమో , తెలియచేస్తూ , అట్లాగే , అమ్మాయి కి ఇష్టం లేక , ప్రతిఘటిస్తూ ఉంటే , మాన భంగం జరపడం కష్టమనే సత్యాన్ని , జడ్జి కి తెలియ చేస్తూ , కేసు గెలవ గలిగాడు !
  5. ఇక్కడ అందరూ గమనించ వలసినది, మాన భంగం అంటే కేవలం ఇరువురిలో, ఒకరికి ఇష్టం లేక పోయినా రెండవ వారు ( అది స్త్రీ అయినా పురుషుడు అయినా కూడా ! ) మొదటి వారి పైన జరిపే రతి క్రియ మాత్రమే కాదని !
  కామ పూరితమైన కోరికతో , ఎవరి మీద అయినా ఇంకొకరు ఏ రకమైన చర్య జరిపినా కూడా అది, వారికి మాన భంగమే అవుతుంది ! కానీ చట్ట ప్రకారం , కేవలం, రతి క్రియ జరిపితేనే, అది మాన భంగం అనబడుతున్నట్టు ఉంది ! మిగతా పనులు మాత్రమే చేస్తే, అది అత్యాచారం గా పేర్కొన బడుతుంది !
  6. మీరు ఉదహరించిన సంఘటన లా , అమ్మాయిలు , మానభంగం తమ మీద జరిగినట్టు , అపవాదు వేసే సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి , కాక పొతే , అవి చాలా అరుదు !
  ప్రపంచం లో ఎక్కువ దేశాలలో, నేరస్తులు పురుషులే ! స్త్రీల మీద జరిగే మాన భంగాల లో, కనీసం డెబ్భై శాతం సంఘటనలలో ,( పురుష ) నిందితులకు ఏ శిక్షా పడడం లేదు !
  దానికి ప్రధాన కారణం , స్త్రీల మీద కోర్టు లో ( పురుష ) లాయర్లు సంధించే ప్రశ్నాస్త్రా లే ! ( సమాజం ఎంత గా ఎదుగుతున్నా కూడా రతి కార్యాన్ని , పూస గుచ్చినట్టు బయటకు చెప్పుకోవడం ఇంకా సభ్యమైన చర్య అనిపించుకోవడం లేదు ! ) బూజు పట్టిన చట్టాలూ , ( ఉదాహరణకు: రెండు వేళ్ళ న్యాయం ! ), ఆచరణ కు నోచుకోని చట్టాలూ కూడా !
  స్త్రీ ల మీద ( కొందరు ) పురుషులు చూపించే ఈ రకమైన ( అ ) ‘మానవత్వం’ , విశ్వ వ్యాప్తం !

  భేతాళు డిని, మళ్ళీ చెట్టు మీదకు పంపించ గలిగానంటారా ?!

  • @సుధాకర్జీ,
   మా పెదనాన్న గారు ఇటువంటి సంగతులు చెప్పి ప్రశలు వేసి వదిలేసేవారు. మరుసటిరోజు చర్చ చేసి మా వాదం చెప్పాలి. ఎందుకు జరిగింది, ఎలా జరిగుంటుంది, లాబ నష్టాలు ఇలా అన్నీ చర్చించే అలవాటు చేసేరు, మా నలుగురు అన్నదమ్ములకి. మీరు చిక్కు ముడి విప్పేసేరు. నేను ఆ రోజు మానసిక పరిణితి అంత లేక కొంత దాకా చెప్పి వదిలేస్తే ఆయన పూర్తి చేసేరు. అందులో కనపడని (Lawyer’s Wife) పాత్రని మెచ్చుకునేవారు, ఆమె తెలివికి. బేతాళుణ్ణి చెట్టెక్కించేసేరు కదా!
   ధన్యవాదాలు.

  • @ఫాతిమాజీ,
   చిక్కు ముడి వేసేను కాని ఎలా విప్పాలో అనుకున్నా! డాక్టర్ సుధాకర్ జీ మానసిక విశ్లేషణ చేసి చిక్కు ముడి విప్పేసేరు, పైన చూడండి.
   ధన్యవాదాలు.

  • @సాయి సుధాకర్ గారు,
   స్వాగతం.ప్రతి విషయానికి చర్చ చేసేటపుడు మూడు కోణాలు ఉంటాయి.1. Your side. 2. My side 3. The right side of the case ఇక తప్పుడు కేస్ లు పెట్టడం మన దేశం లో పెద్ద విచిత్రం కాదండీ! మొన్న సుప్రీం కోర్ట్ అటువంటి కేస్ లో ఒక తీర్పు ఇచ్చింది.ఇష్టపడి అతనితో లైంగిక సంబంధం పెట్టుకుని తరవాత కేస్ పెట్టిన సందర్భంలో.
   ధన్యవాదాలు.

  • @మిత్రులు జి.ఎల్.ఎన్.మూర్తిగారు,
   కోణం పాతదే, కొత్తగా ఆవిష్కరింపబడలేదు, ఉత్సుకత రేపేలా చెప్పడం జరిగింది, కవ్వించి మొత్తానికి చర్చలో దింపేసేరు, అసాధ్యులు కదా 🙂
   ధన్యవాదాలు.

 2. ఈ సీను ధనమా? దైవమా? సినిమాలో ఉంది. NTR లాయర్‌గా ఓ కేసుని వాదిస్తారు. అయితే అక్కడ అమ్మాయికి అన్యాయం జరుగుతుంది. కేవలం డబ్బు కోసం NTR పాత్ర అలా వాదిస్తుంది. మీరు చెప్పిన లాజిక్ సరయినది కాదు. మీరు ఏమి చెప్పదలచుకున్నారో అర్ధం కాలేదు.

  • @మిత్రులు కొండలరావు గారు,
   మాకీ ప్రశ్న, నా వయసు పద్నాలుగు సమయంలో మా పెదనాన్న గారిచ్చినది, అంటే అరవై సంవత్సరాల కితం జరిగినది. అప్పటికి ఆ సినిమా వచ్చిందో లేదో తెలియదు. నేను సినిమాలు చూడటం మానేసి దగ్గరగా నలభై సంవత్సరాలయ్యింది. మీరన్నట్లు గా ఆ సీన్ ఆ సినిమాలో ఉంటే మాత్రం, నేను చూసినది కాదు. ఇక ఈ సందర్భంగా నేను ఏమీ చెప్పలేదు, కాకపోతే విశ్లేషించుకోడానికి సావకాశం ఉంది. మా పెదనాన్న గారు ఇలా సమస్యలు ఇచ్చి వాటిని విశ్లేషించి, ఏమయి ఉంటుంది? అలా చేస్తే ఎందుకు చేసి ఉంటారు వగైరా సమాధానలు లాజికల్ గా చెప్పించే అలవాటు చేసేరు. ఊహకి సావకాశం ఇచ్చారు. నేను జరిగినది మాత్రమే చెప్పేను.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s