శర్మ కాలక్షేపంకబుర్లు-“ఇదీ భారతం”-దుర్యోధనునికి గుడులు

“ఇదీ భారతం”-దుర్యోధనునికి గుడులు

రంగనాయకమ్మగారు భారతం మీద విమర్శ రాశారట. వారు సంప్రదించినవి కవిత్రయ భారతం, శ్రీ పురిపండా అప్పలస్వామిగారి భారతం పై రచనా. శ్రీ అప్పలస్వామిగారెవరూ? శ్రీపాదవార్కి జిగిరీ దోస్త్. శ్రీపాదవారెవరూ? వేంకటరామకృష్ణకవుల శిష్యులు, మరి వేంకటరామకృష్ణకవులెవరూ? పిఠాపురం రాజావారి అస్థాన కవులు. శ్రీ పాద వారు వేంకటరామకృష్ణకవులను గురువులుగా ఎంచుకునేటప్పుడు, ఎందుకు వారినే గురువులుగా ఎన్నుకున్నదీ కారణలు చెప్పేరు. అందులో వేంకటరామకృష్ణకవులకి దుర్యోధనునిపై ఉన్న అభిమానం వీరికి నచ్చిందట. అది కూడా ఒక కారణమనీ చెప్పేరు. రాజానుమతో ధర్మః అని నమ్మినవారు ఆ జంటకవులు. ప్రభువు కూడా దుర్యోధనుని పక్షం వారే. శ్రీపాదవారి రోజులలో పాండవులకు రాజ్యభాగం గురించిన కోర్ట్ కేసులే నడిచాయట, స్వంత ఖర్చులతో. మరిప్పుడు చెప్పండి భారతం మీద విమర్శ రాసినవారు రంగనాయకమ్మగారొకరేనా? వీరు మొదటివారూ కాదు చివరివారంత కంటేకాకపోవచ్చు.. భారతాన్ని, పురిపండా వారి రచనల్ని ఎఱ్ఱకళ్ళద్దాలతో చూసి ఉంటారంతే. ఎంతయినా మనకి కౌరవుల మీద అభిమానం ఉండడం సహజం లెండి. అదేం మాటా అంటారా? యుద్ధంలో మనం అనగా అంధ్రులం దుర్యోధనుని వైపు యుద్ధం చేసినవాళ్ళం కదూ……

దుర్యోధనుడికి గుడులే ఉన్నాయి, ఈ కింద లింకుల్లో చూడచ్చు.దుర్యోధనుడుకి ఇన్ని గుడులు గోపురాలూ ఉన్నా, ఇంతమంది భారతం గురించి వ్యతిరేకంగా మాటాడినా భారతం విలువ తగ్గిందా? ఒక మాటలెండి, వగనైనా, పగనైనా, సొమ్ము సంపాదనకైనా, ఎవరికైనా, ఎలాగైనా భారతమే దిక్కుమరి…….. కామెంటిన కనకాంగి ……..

//www.keralatourism.org/destination/malanada-duryodhana-temple-kollam/311

https://ancientindians.wordpress.com/mahabharatam/duryodhana/

https://mirrortoindia.wordpress.com/2013/07/20/here-they-worship-the-villain/comment-page-1/

 

 

11 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-“ఇదీ భారతం”-దుర్యోధనునికి గుడులు

  1. అందుకే అన్నారు “తింటే గారేలు తినాలి,వింటే భారతం వినాలని”అంతేనా శర్మ గారు.అన్ని కోణాలు అందులోనే ఇమిడిఉన్నాయ్.దాని మర్మం జీవితం అంటే ఇలాకూడా వుండవచ్చు అని ‘ఆది కావ్యం’ ద్వారా ఆనాడే తెలియచేశారు.దాని అర్ధం చేసికోవటంలో మా తరమే కొంత వెనుకబడి వుంది.ఇప్పటి సమాజంలో ధుర్యోధనులే గౌరవాన్ని పొందుతున్నారు.ముఖస్తుతి కోసమైనా మనం గౌరవిస్తున్నాం. తప్పదు మనది ప్రజాస్వామ్య దేశం కదా.

    • స్వరాజ్య లక్ష్మిగారు,
      భారతం ఏ కోణం నుంచి ఆలోచిస్తూ చదివితే అదే కనపడుతుంది. ఏ వయసుకు తగిన ఆలోచనలా వయసులో ఉంటాయంటారు, అప్పుడు అలాగే కనపడుతుంది,. ఇప్పటి తరం కూడా భారతాన్ని బాగానే చదువుతున్నారండి. ఇక వయసుతో కూడా పరిపక్వత రానివాళ్ళు కొంతమంది ఉంటారు, అదంతే.
      ధృతరాష్ట్ర పరిపాలనలో దుర్యోధనునిదే రాజ్యం కదండీ.
      ధన్యవాదాలు.

  2. దుర్యోధనుడి కంటే దుర్మార్గులకి ఊరు, వాడా విగ్రహాలు ఉన్నాయండి ఇప్పుడు.

  3. మహాభారతాన్ని చాలా మంది విమర్శించేరు.వ్యాసుడు ఒక దృక్పథంతో,అంటే పాండవులది ధర్మమనీ, కౌరవులది అధర్మమని.దానితో కొందరు ఏకీభవించకపోవచ్చును.కాని,వ్యాసుడు నిజం,వాస్తవంగా రాసాడు.ఏదీ దాచలేదు.కాని రంగనాయకమ్మ నమ్మే కమ్మ్యూనిజంలోను,సొవియెట్ పరిపాలనలోను అన్నీ అబద్ధాలతోనే నడిచాయి.

    • రమణారావుగారు,
      ఇతి హాసం అనగా ఇలా జరిగినదీ అని అర్ధం కదండి, జరిగినది జరిగినట్లుగా చెప్పేరు. నాటి ధర్మం చెప్పేరు, మానవ ధర్మమూ చెప్పేరందులో. నాటికున్న ధర్మం నేడు ఆచరణ కాకపోవచ్చు, అందుకు ఇప్పుడు దానిని తప్పు అనడం, వారు తప్పు చేసేరనడం……లోకం కదా! ఎవరు ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితోనే భారతం కనపడుతుంది.
      ధన్యవాదాలు.

  4. శ్రీ కె.ఎమ్.మున్షీగారని భారతదేశరాజ్యాంగనిర్మాణసంఘంలో ఒక సభ్యులు. ఆయన భార్యగారి పేరు లీలావతీ మున్షీ. వీరు స్థాపించినదే భారతీయవిద్యాభవన్. అలాగే భవన్స్ జర్నల్ అనే ఆంగ్లమాసపత్రిక కూడా వీరిదే. శ్రీమున్షీగారు ఆంగ్లంలో కొన్ని ఉద్గ్రంథాలు వ్రాసారు. అందులో ఒక దానిపేరు Five Brothers. ఆ గ్రంథాన్ని నేను హైస్కూల్లో ఉన్నరోజుల్లోనే చదివాను. క్రిందవ్రాస్తున్న ఉదంతం ఆ గ్రంథంలోని అనుభంధంలో ఉంటుంది.

    మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజుల్లోని సంగతులు.

    ఎన్నికల్లో ఓట్లవేట కోసం రాజకీయపార్టీలు మారుమూల గ్రామాలనుకూడా అతిప్రేమగా సందర్శించారు. అలా ఒక హిమాలయా పర్వతప్రంతాల్లోని ఒక మారుమూల గ్రామంలోనికి కాంగ్రెసువారూ, కమ్యూనిష్టులూ ఓటడుక్కుందుకు వెళ్ళారు.

    ఆ గ్రామస్థులు మాత్త్రం ఎవరికి ఓటేసేదీ నిర్ణయించేది మా ఊరిదేవుడు. ఆయనకు జాతర చేసి అడుగుతాం అన్నారు.

    చేసేదేముందీ పార్టీలవాళ్ళకి సరే అనక?

    ఊరిదేవుడు జాతరలో కొలుపు లందుకొని, కాంగ్రెసువాళ్ళకి ఓటేయమని చెప్పాడు. కమ్యూనిష్టులు ఉసూరుమంటూనూ కాంగ్రెసు వాళ్ళు ఆనందోత్సాహాలతోనూ వెళ్ళారు.

    మళ్ళీ ఎన్నికలొచ్చాయి, కొన్నేళ్ళకి.

    ఈ సారి కూడా , కాంగ్రెసువారూ, కమ్యూనిష్టులూ ఓటడుక్కుందుకు వెళ్ళారు. మళ్ళీ గ్రామస్థులు జాతర చేసి అడుగుతాం మా ఊరిదేవుణ్ణీ అనటం జరిగింది.

    ఈసారి, ఊరిదేవుడు జాతరలో కొలుపు లందుకొని, కమ్యూనిష్టులకి ఓటేయమని చెప్పాడు. కాంగ్రెసు వాళ్ళు ఉసూరుమంటూనూ కమ్యూనిష్టులు ఆనందోత్సాహాలతోనూ వెళ్ళారు.

    అన్నట్లు చెప్పలేదు కదూ, ఆ హిమాలయాపర్వతప్రంతాల్లోని సదరు మారుమూల గ్రామంవాళ్ళ ఊరిదేవుడు దుర్యోధనుడు!

    మున్షీగారి అనుకున్నది ఏమిటంటే, మహాభారతయుధ్ధం తరువాత కొత్తరాచరికం భయంతో పారిపోయిన దుర్యోధనుడి ముఖ్యమైన అనుచరగణంలో కొందరు ఈ ఊరి చేరుకొని అక్కడ దుర్యోధనుణ్ణి తమ ప్రజ్ఞతో క్రమంగా ఊరికే దేవుడిస్థాయికి తెచ్చారు అని.

  5. ఎంత మాట ! ఎంత మాట !

    మహా భారతాన్ని తిట్టోచ్చని శర్మగారే నా అంటూంట !!

    కాలం మారి పోయిందిస్మీ !

    జిలేబి

    • జిలేబిగారు,
      కాలం మారలేదండీ! మనుషుల బుద్దులు మారాయి, అంతే. భారతం ఎవరు, ఎలా, ఏ కోణం లోంచి చూసి ఆలోచిస్తే వారికి అలాగే కనపడుతుంది, అర్ధమవుతుంది.
      ధన్యవాదాలు.

వ్యాఖ్యానించండి