శర్మ కాలక్షేపంకబుర్లు-సెలవా?

సెలవా?

55 ఏళ్ళ కితం మాట. ఉద్యోగంలో చేరినప్పుడు సంవత్సరానికి 12 casual leaves  లు,  11 పని చేసిన రోజులకో Earned leave అలాగే 22 పని చేసిన రోజులకి ఒక రోజు Half pay leave ఇచ్చేవారు. ఆ తరవాత కాలంలోcasual leaves 15 చేసేరు. Optional holidays అని జాబితా ఇచ్చేరు, ఆరు ఎన్నుకోవాలి, శలవివ్వచ్చు, లేదా డ్యూటీ వెయ్యచ్చు, ప్రభువుల చిత్తమే, వారి అవసరమే.మాది 365 రోజుల ఉద్యోగం, అందునా రోజుకి 24 గంటలలో ఎప్పుడో ఒకప్పుడు ఉద్యోగం చెయ్యాలి, ఖాళీ ఉంది కదా అని చెప్పకుండా ఊరొదిలిపోకూడదు, చెప్పకుండా పోతే నేరం.

మొదట్లో కొన్నాళ్ళు వారాంతపు శలవూ ఇచ్చేవారు కాదు, ఆ రోజు పని చేసినందుకు అదనంగా డబ్బిచ్చేవారు. పండగ లేదు, పబ్బం లేదు, శలవులేదు, ఊరందరికీ శలవు, మేం మాత్రం ఉద్యోగం చేసేవాళ్ళం.ఆ తరవాత కాలం లో వారాంతపు శలవిచ్చేవారు కాని చెప్పకుండా ఊరు వదలిపోడానికి లేదు. చెబితే వద్దంటే మానెయ్యాలి, ప్రయాణం. ఉద్యోగం చేసే ఊళ్ళో ఉన్న ఇంటి అడ్రస్ ఇవ్వాలి,ఆఫీసులో, ఇంతకీ ఉద్యోగం ఏంటనుకున్నారు? టెలిఫోన్ ఆపరేటరు. కొత్తలో గొప్పగా అనిపించేది, ఆ తరవాతి రోజులలో ఉద్యోగం పెరిగితే, పెళ్ళాంతో సినిమాకి వెళితే చెప్పి వెళ్ళాలి, ఏ సినిమా హాల్లో, ఏ క్లాసులో ఉన్నదీ చెప్పాలి. మధ్యలో కబురొస్తే, అదేం చిత్రమో కాని ఇలా సినిమాకెళ్ళిన రోజునే ఖచ్చితంగా కబురొచ్చేసేదీ, ఏదో కొంప మునిగినట్టు, అప్పటికప్పుడు బయలుదేరిపోవాల్సిందే. అప్పుడు చూడాలి ఆవిడ ముఖం… చూడ్డానికే భయమేసేది…. కొత్తగానూ వింతగానూ ఉందికదూ మీకు, కాని ఇది నిజం.  సైన్యంలో ఆపరేషన్ రెడీ పాయింట్ ORP అని ఉంటుందిట, అక్కడున్నవారు ఆ క్షణంలో శత్రువుని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉంటారంటారు, మాదీ అలాటి బతుకే నాటి రోజుల్లో, అదే తంతి తపాలా శాఖలో టెలికం ఉపశాఖ.

కేజుయల్ లీవ్ కాలంటే ముందు దరఖాస్తివ్వాలి,కారణాలూ చెప్పాలి, మిగిలినవారు దొరకాలి, ఓవర్ టైమ్ వెయ్యాలి,వాళ్ళకి, ఆ తరవాతి మాటే… ఇక ఇ.ల్ అయితే ముందుగా దరఖాస్తు చేసుకుంటే ఇచ్చేవారు కాని దానికీ లక్ష తొంభయి ప్రశ్నలు… పెద్ద ఊళ్ళలో వాళ్ళకి కొంత బాధలు తక్కువేమో కాని పల్లెటూరి వాళ్ళకి ఇది నరకమే, అన్నిరోజులు పని చేసేందుకు పల్లెటూరు ఎవడూ వచ్చేవాడు కాదు, deputation. అంతెందుకు నేను పెళ్ళి చేసుకోడానికి ఒక రోజు కేజుయల్ లీవ్ ఇచ్చారు. దానికితోడు ఒకరోజు రాత్రి ఉద్యోగం చేసి పెళ్ళికెళ్ళి మరునాడు పెళ్ళి చేసుకుని మూడవనాడు సాయంత్రం నాలుగు గంటలకి ఉద్యోగానికిపోయిన ఘనత కల చరిత్ర నాది. అందుకే ఇల్లాలికి మరీ లోకువా! ఉద్యోగం పెరిగాకా, ఇంట్లో ఫోన్ మోగితే చాలు రాత్రిపూట, “మీ పెద్దపెళ్ళాం పిలుస్తోంది, వెళ్ళండి, వెళ్ళండి, లేకపోతే ఆవిడకి కోపం రాగలదు” అని ఎగతాళీ చేసేది. దానికి “అవునోయ్! ఆవిడ కరుణించబట్టే నాలుగు మెతుకులు తింటున్నాం, ఎంతయినా చిన్నిల్లు అంటేనే మక్కువకదా” అని అంటే “కబుర్లు మాత్రం బాగానే చెబుతారు” అనేది. అలా రాత్రి పగలు లేని ఉద్యోగాలు వెలగబెట్టి సాధించినదేం కనపడలా! ఏదో చేసేం అన్న తృప్తి తప్పించి. ఈ ఇ.ల్ లెక్కలు చిక్కుగా ఉన్నాయని ఆ తరవాత రోజుల్లో సంవత్సరానికి ముఫైరోజులు Earned leave దానిలో 15 రోజులు జనవరిలోనూ 15 రోజులు జూలైలోనూ ఇచ్చే ఏర్పాటు చేశారు. ఇంత కష్టం ఉన్నా శలవుకి, ఒక బ్రహ్మాస్త్రం ఉండేది, అదే sick, అనారోగ్యం సర్టిఫికట్ పెట్టి Earned leave తీసుకునేవాళ్ళం. దీనికీ ఇబ్బంది ఉండేది, సెకండ్ మెడికల్ ఒపినియన్ అని పంపేవారు, అక్కడికిపోయి ఆ మెడికల్ బోర్డ్ వారికి ఉన్న సంగతి చెప్పుకుంటే మరో పది రోజులు శలవివ్వాలని రాసిపారేసేవారు. ఎలా అయితేనేం కాని చివరికి మాత్రం నావి 600 రోజుల Half pay leave పోయింది,వాడుకోడానికి వీలు లేక. అంతకు ముందురోజుల్లో ఫర్ లాఫ్ లీవ్ ఉండేదట అంటే నవ్వుతాలికి శలవు తీసుకోడం…మరో రకం శలవుండేది Special casual leave సంవత్సరానికి 20 రోజులు, మాదాకా ఎప్పుడూ రాలేదు, యూనియన్ నాయకులు వాడుకునేవారు.ఒక శలవుతో మరో శలవు కలిపితీసుకోడానికి లేదు అన్నీ గుంట చిక్కులే.

“ఏంటీ శలవులమీద పడ్డారూ” అంటూ వచ్చారు మా సత్తిబాబూ,సుబ్బరాజూ…

“రాహుల్ బాబు శలవుపెట్టేడంటే”…… అన్నా..

“అన్నట్టు సత్తిబాబూ! మన చిన్నబాబు శలవెందుకుపెట్టేడంటావ్, ఎక్కడికెళ్ళేడంటావ్?,” అని ఆరా తీశాడు, మా సుబ్బరాజు. దానికి మా సత్తిబాబు

“వయసా నలభై దాటిపోయింది, చేసినది, చెయ్యగలది లేదనీ తేలిపోయింది… దేశపాలనకు వారసుడిని కనాలనే పనిలోకాని పడ్డాడేమోనయ్యా” అని ముక్తాయించాడు

మా సుబ్బరాజు మరో మాటన్నాడు కాని నాకే చెప్పడానికి…..

14 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-సెలవా?

  1. మీశలవు కధ చాలా బాగుంది. ప్రస్తుతం డ్యూటీ చేస్తేకదా శలవుల గురించి ఆలోచించడానికి. ఆఫీసులో సంతకం చేసి వ్యాపారాలు చేసుకొనే వారిని అదిగేవారెవరున్నారు కనుక. ఇంతకీ రాహుల్ బాబు శలవు ఎందుకో తెలిసిందా. ఈశలవులతో మొత్తం పార్టీకి అద్యక్షుడై తల్లికి పూర్తి శలవు ఇవ్వడానికి సిద్దమయ్యాడని సమాచారం తెలుస్తోంది

    • అల్లుడుగారు,
      నాటిరోజుల్లో పని చేసి శలవులేక బాధలు పడ్డాం. ఇప్పుడు సంతాకాలెట్టి స్వంత వ్యాపారాలు చేసుకునేవారికే రోజులు.
      తల్లికి శలవిచ్చి పార్టీనో అంతుచూసేస్తే….కొత్త రక్తం వచ్చి మళ్ళీ పార్టీ బాగుపడుతుందేమో!!!!
      ధన్యవాదాలు.

  2. పాపం ఆయన బుద్ధిగా సెలవు తీసుకుని పార్లమెంటుకి రావటంలేదు. అయినా తిడుతున్నారు.
    అదే చాలామంది సెలవు తీసుకోకుండానే ఎగ్గొడుతున్నా, వాళ్ళని ఎవరూ ఏమీ అనరు.

    • బోనగిరిగారు,
      శలవు తీసుకున్నందుకూ ఎవరూ ఏమీ అనలేదు, అనరు కూడా, కాని శలవు తీసుకోడానికీ సమయం సందర్భం ఉంటాయీ…. అంటున్నారు. ఇల్లు తగలబడుతుంటే చుట్టకి నిప్పడిగితే బాగోదేమో!!!!!
      భగవానుడు ‘యద్యాచరతి శ్రేష్ఠ’ అన్నారు కదా! అందుకే అడుగుతారు….
      ధన్యవాదాలు.

  3. ఈ కాలపు ప్రేమ పెళ్లిళ్ల స్థిరత్వం కన్నా మీ ‘కాజ్యువల్’ (లీవ్) పెళ్లి’ ఎంతో బెటరు అన్న కాలం లో ఉన్నాం !!

    బాగుంది మీ సెలవు కథ !

    ఇంతకీ పేటర్నిటీ లీవు తీసు కోవాల్సిన కాలం లో సబ్బాటికల్ లీవ్ తీసుకుంటున్నా రేమిటి చెప్మా ఈ కాలపు కుర్రాళ్ళు !! అట్లీస్ట్ పెళ్లి కోసమైనా సబ్బాటికల్ అంటే అదిన్నూ కాదూ అంటున్నారు ! అంతా విష్ణు మాయ !

    జిలేబి

    • జిలేబిగారు,
      మాది కేజుయల్ లీవ్ పెళ్ళేగాని, కేజుయల్ పెళ్ళి కాదు కదండీ అందుకే ఏభయి ఏళ్ళు పైన మన్నింది, ఇంక ఢోకా,ధోకా లేదు 🙂
      పెళ్ళి చేసుకుందుకైనా ప్రేమలో పడ్డానన్నా సంతోషమే కదండీ, అదేం కాదంటేనే….
      అదేదో అధికార మార్పిడి అదీ అంటున్నారు,…… నిజమే అంతా విష్ణుమాయ!!!
      ధన్యవాదాలు.

  4. శర్మ గారూ ,

    నమస్తే .

    కొత్వాలు కొలువులోని సమస్యలే మీకు వర్తించినట్లున్నాయి .
    ఆ రోజుల్లో టెలి కం ఆఫీసులో ఉద్యోగం అంటే ఎంతో ఘనంగా చెప్పుకొనేవాళ్ళం . రూపాయి కాయిన్లు వేసి ఎస్ టి డి మాట్లాడుతుంటే భలే ఆతృతతో కూడిన ఆనందం వుండేది .
    నేడు కమ్యునికేషన్ బహు చీప్ అయిపోయింది మొబైల్ సేవలు వచ్చాక .

    ఇంతకీ రాహుల్ రాజకీయ సన్యాసం చేస్తున్నానంటే బాగుందదని కొన్నాళ్ళు సెలవు అన్నట్లున్నాడనుకొంటా .
    ఎప్పుడైనా , ఎక్కడైనా ఒక స్థానం వదులుకొని వెళ్ళబోయే ముందు , వెళ్తున్నానై చెప్ప(లే)రు , సెలవలో వెళ్తున్నామంటం ఈ సమాజంలో పరిపాటి కదండి .
    అంతే అయి వుంటుంది ఈ రాహుల్ వ్యవహారం కూడా .

    • శర్మాజీ,
      ఆ రోజులలో మాకు జరిగే మర్యాదలు చాలా ప్రత్యేకంగా ఉండేవి. అందరూ మమ్మల్ని అమిత గౌరవంగా చూసేవారు, రాజకీయనాయకుల మొదలు సామాన్యుల దాకా. నిజానికి అదొక మత్తు, ఆ గౌరవాలు పొందటం.
      రాహుల్ తిరిగిరావాలి, కాడీ-మేడీ పారేసిపోతానంటే పార్టీ ఏమయ్యేనూ..
      ధన్యవాదాలు.

  5. బాగా రాశారు , మీ కొలువు లో శలవు గురించి !
    నిజాయితీ తో పని చేసే వారికే అన్ని నిబంధనలూ వర్తిస్తాయి !
    నిబంధనల ( రూల్స్ ) పేరు చెప్పి , సాధారణం గా , ఇతర మానవులే , తోటి వాళ్ళను హింసిస్తారు, అనేక రకాలుగా !
    కారణం మూడో కంటి వాడికి కూడా తెలియకుండా ,నెలల తరబడి శలవు మీద వెళ్లి , ఏ రోగమూ లేకుండా , దర్జాగా తిరిగే వాళ్ళు అనేక మంది !

    • Sudhakar జీ,
      మీరన్నమాట నిజమే కాని, ఆ రోజుల్లో అది అసహాయత. ప్రతిచోట సిబ్బంది తక్కువ. పల్లెలలో ఇదిగో ఇలా, ఎవరూ పల్లెలలో పని చేయడానికి వచ్చేవారు కాదు.
      ధన్యవాదాలు.

    • మిత్రులు శ్యామలరావు గారు.
      నిజం 5 గురు ఉండాలి. ఒకటే స్విచ్ బోర్డ్. 4 గురమే ఉండేవాళ్ళం. ఎక్కడా సిబ్బంది తక్కువే, పల్లెలలో మరీ ఇబ్బంది. డ్యూటీలు ఇలా ఉండేవి.
      00.00-07.30
      07.00-14.30
      12.00-19.30
      16.30=24.00
      The man coming for 12.00 duty to give meals relief for 30 minutes to both morning and evening operator, take his own meals relief and do office work for the remaining time.
      I v performed 00-07.00 duty, granted CL on the next day, the day of marriage. On the very next day of my marriage performed 16.30-24.00 duty. Those were the conditions.
      Thank u

      ధన్యవాదాలు.

వ్యాఖ్యానించండి