శర్మ కాలక్షేపంకబుర్లు- తూర్పుకు తిరిగి దణ్ణం పెట్టండి

తూర్పుకు తిరిగి దణ్ణం పెట్టండి

”రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు హామీలే అమలు జరగనటువంటి రోజులు, నోటి మాటలకి కట్టుబడేవారెవరు? గట్టిగా మాటాడితే ”తూర్పుకి తిరిగి దణ్ణం పెట్టమని” అనచ్చు. ఈ ”ఉభయ భ్రష్ఠత్వం ఉపరి సన్యాసం” ఏంటీ? ”తూర్పుకు తిరిగి దణ్ణం పెట్టడమేంటని” మాత్రం అడగద్దు, టపా రాస్తానని హామీ మాత్రం ఇవ్వను. :)” అన్నాను, మొన్ననొక టపాలో దానికి మోహన్జీ ఇలా అన్నారు,

”తూర్పుకే ఎందుకు తిరగాలి? ఎందెందు వెతికి జూచిన అందందే కలడు కదా? మీరు దీని గురించి వ్రాయాలిసిందే!”………… టపా రాయక తప్పలేదు మరి

తూర్పుకు తిరిగి దణ్ణం పెట్టండి
ఈ మాట వింటూనే ఉంటాం.ఏంటీ దీని విశేషం

దిక్కులెన్ని?
నాలుగు
కాదు ఆరు, విదిక్కులు మరోనాలుగు. దిక్కులుతూర్పు, దక్షణం, పడమర,ఉత్తరం,పైన (ఆకాశం), కింద (భూమి). ఇక్కడికివి ఆరు. విదిక్కులు ఆగ్నేయం,నైఋతి,వాయవ్యం,ఈశాన్యం, ఆ,నై,వా,యీ, చిన్నప్పుడు చదువుకున్నది గుర్తురాలా? మరి ఈ దిక్కులకు అధిపతులున్నారు, వారు, తూర్పుకు ఇంద్రుడు,దక్షణానికి యముడు, పడమరకు వరుణుడు, ఉత్తరానికి ధనాధిపతి కుబేరుడు, ఆకాశంలో సర్వ దేవతలు,కింద,భూదేవత. ఇక విదిక్కులకు, ఆగ్నేయంకి అగ్ని,నైఋతికి నిఋరుతి,వాయువ్యానికి వాయువు,ఈశాన్యానికి ఈశానుడు అధిపతులు. మన కోరికలన్నీ తీర్చవలసినవారు ముప్పది మూడు కోట్ల దేవతలే. ముప్పది మూడు కోట్లంటే ముప్పది మూడు సమూహాలు సుమా! మనకి కావలసిన కోర్కె ఎంతకీ తీరకపోతుంటే, ఆ దేవత కరుణించకపోతుంటే మొరపెట్టుకోవలసినది, ఇంద్రునితో. ఉదాహరణకి ఆరోగ్యాన్ని ఇవ్వవలసిన వారు అశ్వనీ దేవతల కోటిలోని వైద్యులు, వారు ఆరోగ్యం సమకూర్చకపోతుంటే, దేవతల రాజయిన ఇంద్రుని చెప్పుకోడమే తూర్పుకి తిరిగి దణ్ణం పెట్టుకోడం. అనగా ఫిర్యాదు చేయడమని అర్ధం, అనగా తదుపరి చర్య తీసుకోమని చెప్పడం, కాని నేడీ మాట అర్ధమే మారిపోయి ఎగతాళీ అయిపోయింది, దిక్కున్న చోట చెప్పుకోమన్నట్టుగా.  దేవతలకి సమర్పించేవన్నీ అగ్ని ద్వారానే ఇవ్వాలి అందుకే అగ్ని ముఖాయై దేవాః అన్నారు, ఈ మంత్రాలన్నిటికి చివర స్వాహా అనేమాట వస్తుంది.

అందుచేత తూర్పుకి తిరిగి దణ్ణం పెట్టుకోండీ.

యతోభ్రష్టః తతోభ్రష్టః అన్నా ఉభయ భ్రష్టత్వం ఉపరి సన్యాసం ఒకటే, అది ఉప్పరి సన్యాసం కదా! అదేమని అడిగారా? దాని గురించి మరో సారి.

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- తూర్పుకు తిరిగి దణ్ణం పెట్టండి

 1. Hello Thatha garu,
  mee blog chaduvutu untanu kani.. eppudu comment cheyaledu.. telugufont lo rase veelu lekapovadam oka karanam..
  intiki, tatayya laki dooram ga untunna maaku… valla nunchi telusukovalsina vishayalu enno meeru teliya chestunnaru. ilage rayadam continue cheyandi..
  chala vishayalalo ammammalu, nanammala chitka vaidyalu, vantalu, ullipaya chaluva chestundi lanti vishayalu maa taram vallaki teliyakunda potayi kada anukune danini..
  meeru konta varaku maaku sahayam chestunnaru..
  ilanti peddala anubhavalu, vignanam mee taram nundi maa taraniki andalani vaatini memu mundu taralaki andichalani korukuntunnamu..

  P.S: I pasted this in lekhini, but that wasnt working very well. I will try to get it right in telugu next time 🙂

  • పల్లవి గారు,
   తెనుగులో రాయడానికి ప్రయత్నం చెయ్యండి. బర్హ ఒక మంచి,చిన్న సాఫ్ట్ వేర్. ప్రయత్నించండి.నచ్చినందుకు
   ధన్యవాదాలు.

 2. ఇన్నాళ్ళకు ఆ మాటలోని అంతరార్ధం తెలిసింది.నిజంగా శర్మగారు ఇలాంటి మాటల అర్ధాలు తెలిసికోవాలని ఎప్పటినుంచో వున్నా చెప్పేవారేరి. నాకు మీ ద్వారా తెలిసికోవాలనివుంది అలాజరిగిపోతుంది.మంచి విషయాలు తెలియచేస్తున్నందుకు ఎప్పటిలా మరోమారు ధన్యవాదాలు.

  • స్వరాజ్య లక్ష్మి గారు,
   తెలుసుకోవాలనే కుతూహలం ఉంటే ఇంకా చెప్పేవాళ్ళు మిగిలున్నారండి 🙂
   ధన్యవాదాలు.

 3. శర్మ గారు, దుర్వాస్ గారు చెపినట్టు మీకు సాటి రారు ఎవ్వరు .ఎందరినో మీ టపాలతో అలరిస్తున్నందుకు ధన్యవాదములు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s