శర్మ కాలక్షేపంకబుర్లు-ఏడ్చేవాళ్ళు -ఈర్ష్యాళువు

ఏడవనీ – ఏడ్చేవాళ్లను ఏడవనీ
ఎదుటివాళ్ళు బాగున్నారని – ఏడవనీ –
నవ్వేవాళ్ళ అదృష్టమేమని ||ఏడ్చే||నవ్వండి – నవ్వేవాళ్ళతో నవ్వండి
నాలుగు ఘడియల నర జీవితము
నవ్వుల తోటగ చేయండి
అది నవ్వుల తోటగ చేయండి ||ఏడ్చే||

వచ్చినవాళ్ళు పోతారు – పోయిన వాళ్ళు రాబోరు
ఈ రాక పోకల సందున ఉంది – రంజైన ఒక నాటకము
బ్రతుకంతా ఒక నాటకము-కదిలిస్తే అది బూటకము
అది అంతా ఎందుకు గానీ
అనుభవించి పోనీ జీవిని – అనుభవించి పోనీ – ||ఏడ్చే||

ఉండేది ఎంతకాలమో – ఊడిపోతాము ఏ క్షణమో
రేపన్నది రూపే లేనిది – ఈ దినమే నీ కున్నది
అందాన్ని ఆనందాన్ని – అనుభవించి పోనీ జీవిని
అనుభవించి పోనీ ||ఏడ్చే||

ఏడ్చెవాళ్లని ఏడవనీ — కళ్ళు కుట్టి ఏడవనీ
కడుపుమండి ఏడవనీ – కుళ్ళి కుళ్ళి ఏడవనీ
ఏడవనీ – ఏడవనీ- ఏడవనీ….–ఆత్రేయ ,పి. లీల, ఘంటసాల,అర్ధాంగి1955,భీమవరపు నరసింహరావు
Courtesy:- nrahamthulla2.blogspot.com/…/blog-post_2619.html

 “ఈర్ష్యీ ఘృణీ త్వసంతుష్టః క్రోధనో నిత్యశంకితః
పరభాగ్యోపజీవీ చ షడేతే దుఃఖభాగినః”
ఇది నారాయణ పండితుని హితోపదేశం, మిత్రలాభం లోని శ్లోకం. ఒకరిని చూచి ఈర్ష్య పడేవాడు, అత్యాశాపరుడు, సంతృప్తి లేనివాడు, కోపస్వభావం కలవాడు, నిత్యశంకితుడు, ఇతరుల సంపదపై ఆధారపడి జీవించేవాడు – ఈ ఆరుగురు నిత్య దుఃఖితులని ఈ శ్లోకం చెప్తోంది.

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఏడ్చేవాళ్ళు -ఈర్ష్యాళువు

  1. గురువుగారు, ఇకనుంచి మిమ్మల్ని పొగడకూడదని తీర్మానిన్చుకొన్నా. మీరు చదువుకొని వారని అసత్యమొకటి మీద రుద్దుకుంటున్నారు. మీ బ్లాగుల్లో నేను చదివిన వాటిల్లో ఇది పనికిరాదు అనేది ఒక్కటి కూడా లేదు. చదివిన ప్రతిదాంట్లోను ఏదోఒక విలువైన మాట పొండుపరస్తూనే ఉన్నారు. ప్రతి చిన్న, పెద్ద విషయాలని చదివించేలా అధ్బుతంగా వ్రాయడం మీకు వరం. మీ అంత వినూత్నంగా కనీసం కామెంటు వ్రాయడం కూడా సాహసమే. మీకు సర్వదా భగవంతుని అనుగ్రహం ఉండాలని ప్రార్థిస్తూ…సెలవు.

    • durvas గారు,
      🙂 నిజం చెబితే నమ్మరు. నాకు డిగ్రీలు, డాక్టరేట్లు లేవు. నేను చదువుకున్నది ఎస్.ఎస్.ఎల్.సి. నా మాట ఏదైనా ఒకరికేనా ఉపయోగపడితే ఆనందమే. మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞుడిని.
      ధన్యవాదాలు.

  2. శర్మగారు,ఎంతవద్దనుకున్నా మీ మాటలు మా నాన్నగారినే గుర్తుకు తెస్తున్నాయ్.మా చిన్నతనంలో అన్నలకు,నాకూ సెలవుల్లో పంచతంత్రం,మిత్రలాభం,మిత్రబేధం కధలు ఎంతో వివరించి చేప్పేవారు.అప్పటినుంచీ ఆయన చివరివరకూ మీరు వ్రాసిన ఈ పోస్టు సారాంశం మొత్తం సంధర్భం వచ్చినప్పుడల్లా చెప్పేవారు.అలా ఈరోజు ఉదయమే నాన్నను గుర్తుకు తెచ్చారు. అసలు మరచిపోయినదిలేదనుకోండి.మీ పోస్టు ఉదయమే చదువుతాను.అలా అనమాట.అందించినందుకు ధన్యవాదాలు.

Leave a reply to Freebookbank స్పందనను రద్దుచేయి