శర్మ కాలక్షేపంకబుర్లు-ఎవరిని దండించాలి?

ఎవరిని దండించాలి?

అనగనగా ఒక ఊరు, ఆ ఊళ్ళో ఒక సాలెవాడు భార్యతో కాపరం చేస్తున్నాడు. అతనికి తాగడం అలవాటు, అతని భార్యకి మిండమగలతో తిరగడం అలవాటు. సాలెవాని ఇంటి పక్కనే ఒక కల్లు గీసేవాడూ కాపరం ఉంటున్నాడు. కల్లుగీసేవాని భార్య, సాలెవాని భార్య స్నేహితులు.

ఒక రోజు సాయంత్రం సాలెవాడు తాగబోయాడు. మగడు తిరిగిరావడానికి సమయం పడుతుందని తెలిసి, అతని భార్య మిండమగని దగ్గరికిపోయింది. మిండడు అనుకున్న చోటికి రాకపోయేటప్పటికి వెనక్కి తిరిగి వస్తుండగా, దారిలో భర్తను చూసింది, భర్తా భార్యను చూశాడు. ఒకరిని మరొకరు చూడలేదనుకున్నారు. భార్య భర్తకన్నా ముందుగా ఇంటికి చేరుకుని, భర్త రాగానే సపర్యలు చేసింది. మిండమగలతో తిరుతోందన్న అనుమానంతో, భర్త భార్యను శిక్షించి ’ఉదయాన్నే నీ పని చెబుతా’నని, ఆమెనొక స్థంభానికి కట్టేసి నిద్రపోయాడు. ఇది చూసిన, పక్కింటిలో ఉన్న స్నేహితురాలు వచ్చి, ఓదార్చి ఆమె కట్లు విడిపించి, మిండమగనివద్దకు పంపుతూ, తను ఆస్థానం లో నిలబడింది, సాలెవాని భార్యతో కట్టించుకుని.

కొంత రాత్రి గడచిన తరవాత సాలెవాడు లేచి భార్యదగ్గరికిపోయి ’ఇంకెప్పుడూ ఇటువంటి తప్పు చెయ్యన’ని చెప్పు, అని అడిగాడు. స్తంభానికి కట్టుబడి ఉన్న స్త్రీ పలకలేదు, పలికితే గుట్టు రట్టయిపోతుందని భావించిన కల్లుగీసేవాని భార్య, మాటాడక ఉండిపొయింది. ఆమె మాటాడకపోవడంతో సాలెవానికి కోపమొచ్చి కత్తితో ఆమె ముక్కు కోసి మరలా పడుకున్నాడు. ఈలోగా సాలెవాని భార్య మిండమగనితో కులికి వచ్చేటప్పటికి, తన ఇంటి దగ్గర కట్టుబడి ఉన్న స్నేహితురాలు, బాధ ఓర్చుకుంటూ జరిగినదంతా చెప్పింది. విన్న సాలెవాని భార్య స్నేహితురాల్ని విడిపించి మరలా తను అక్కడ నిలబడి కట్టించేసుకుంది, కల్లుగీసేవాని భార్య తన ఇంటికిపోయింది. తెల్లవారింది, స్తంభానికి కట్టుబడి ఉన్న సాలెవాని భార్య పెద్ద గొంతుతో, ”దేవతలారా! నేనే కనక పతివ్రతనైతే, నేనే పాపమూ తెలియని దాననైతే, నా భర్త కోసిన ముక్కు మరలా యధాప్రకారముగా నాకు మొలుచుగాక” అంది. ఇది విన్న సాలెవాడు భార్యవద్దకు వచ్చి చూస్తే, ఆమె ముక్కు మామూలుగానే ఉండటంతో, ఆమె పతివ్రతా ధర్మానికి ఆశ్చర్యపోయాడు, కట్లు విడిపించి, ఆమెకు మొక్కాడు.

ఇక కల్లుగీసేవాని భార్య ఇంటికిపోయి పడుకుంది,బాధతో. తెల్లవారింది, మగడు ఒక రకం కత్తి ఇమ్మని అడిగితే మరొక రకం కత్తి అతనికిచ్చింది. కోపించిన అతను కత్తి విసిరేశాడు. అప్పుడు ఆ కల్లుగీసేవాని భార్య, ”దేవుడా! నా మగడు నా ముక్కు కోసేశాడ”ని గొల్లుమంది, రాజు దగ్గరికి పరుగెట్టి ఫిర్యాదు చేసింది. రాజభటులు కల్లుగీసేవానిని బంధించగా, రాజు విచారించి, అతనికి శిక్ష వేయబోతుండగా ఒక పండితుడు అడ్డువచ్చి మహరాజా ఈ కల్లుగీసేవానిభార్య అబద్ధం చెబుతున్నదని,తానా రోజు సాలెవాని ఇంటి అరుగుపై పడుకుని జరుగుతున్నదంతా చూశానని, ఆ రోజు రాత్రి జరిగిన కథ యావత్తూ పూసగుచ్చినట్లు రాజుకి విన్నవించారు. మరి ఇందులో తప్పెవరిది?రాజు ఎవరిని దండించాలి?

16 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఎవరిని దండించాలి?

  1. సాలెవాడు గౌడు జనవిభుండును బుధుం
    డంద రరయ కల్లు బృంద మగుట
    సతులు ధర్మమందు తనియుదురా యేమి ?
    తప్పు కల్లు కుండ దగును గాదె !

    • వెంకట రాజారావు . లక్కాకుల గారు,
      బహుకాల దర్శనం కుశలమే కదా!
      తప్పు కల్లు కుండదేనండీ 🙂
      ధన్యవాదాలు.

  2. ఏ తప్పూ చేయకపోయినా అపవాదుకి గురి అయిన కల్లు గీసేవానికి వెయ్యినూట పదహార్లు సమర్పించుకోవాలి. ఎవరు సమర్పించుకోవాలి ?

  3. ఆ రాజు పాలనలో ఆడవాళ్ళకీ మగవాళ్ళకీ నీతిలేదు కాబట్టి రాజుని పదవీచ్యుతుని చేయాలి.

    కల్లు గీసేవాని భార్య , స్నేహితురాలు చేస్తున్నది తప్పని తెలిసికూడా ప్రోత్సహించింది. తప్పుని తప్పు అని చెప్పకుండా ప్రోత్సహించడం కూడా నేరమే కాబట్టి కఠిన కారాగార శిక్షవేస్తే మళ్ళీ ఇంకొకరు అటువంటి తప్పు చేసేవారిని ప్రోత్సహించడానికి ముందే ఆలోచిస్తారు !

    సాలెవాని భార్య తప్పుచేసినా భర్తకీ, కల్లు గీసేవాని భార్యకూ తెలుసు కానీ వాళ్ళు తప్పని చెప్పలేదు, విడిచిపెట్టలేదు కాబట్టి అంగీకారమే అనుకోవాలి. సాలె వాని భార్యకు కుక్క తీర్పు ప్రకారం రాణిని చేస్తే ఫాక్షనిస్టుని రాజుగా చేస్తే ఫాక్షనిజం పోయినట్లే,విభజన వాదిని రాజుగా చేస్తే విభజన వాదం రాకుండా ఒళ్ళుదగ్గర పెట్టుకుని హరితహారం వేసిమరీ కలిసిమెలిసి పనిచేసుకున్నట్లే సాలె వాని భార్య కూడా తను చేసిన తప్పు మరొకరు చేయకుండా మగవాళ్ళందరి చేతా త్రాగుడు అలవాటు మానిపించి ఆడవాళ్ళందరూ నీతిగా బ్రతికేలాగా చేస్తుంది లేదా ఏడు జన్మలెత్తుతుంది.

  4. యెవడి తప్పులు వాళ్ళు దాచుకుని కిక్కురుమనకుండా శిక్షకి తగుదునమ్మా అని ఉంతే తానుగా అవచ్చి అదక్కుండానే అనీ హెప్పి తనని దహ్ర్మసంకతంలో పదవేసీన్ పందితుణ్ణీ శిక్షిస్తే మళీ యెవడూ తనకి సంబందం లేని వయవ్హారంలో దూరకూదదనే బుధ్ధి వస్తంది:-)

    • హరి గారు,
      సమస్యలొస్తాయి, పరిష్కరించుకోవడం లోనే మన గొప్ప బయట పడేది. ఈ సమస్యని విష్ణుశర్మ తన శిష్యులకు,రాజకుమారులకు చెప్పినది. దీనికి తీర్పు మాత్రం చెప్పలేదు, సమస్య ఇప్పటికి నూతనమే.
      ధన్యవాదాలు.

      • యేదో సరదాగా అనేశాను.మీరు గట్టిగా అడిగారు గనక నాకు తోచిన సీరియస్ జవాబు ఇప్పుడిస్తున్నాను.

        అసలు విష్ణుశర్మగారి ఉద్దేశం యేమిటంటే యే ప్రాంతానికీ యే కాలానికీ యే సమాజానికీ సార్వకాలికమైన యేకైక ధర్మం అనేది ఉండదని!అట్లాగని యెవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండకుండా ఒక ధర్మం అంటూ ఉంటే ఆ సమాజంలోని అందరూ పాటిస్తేనే వాటికి విలువ ఉంటుంది,యే ఒక్కరికి అన్యాయమనిపించినా వాళ్ళు ఖచ్చితంగా తిరగబడతారు గనక తనుగా యే తీర్పూ చెప్పకపోవడమే ఉత్తమం అని!హిందువులలో ధర్మనిర్ణయానికి శుతి,స్మృతి,తర్క,మీమాంస లాంటి తార్కిక సాధనాలు చాలా ఉన్నాయి.యెప్పుదు దేనిని పాటించాలి అనేదానికి సంబంధించిన చర్చ చాలా జరిగింది వాటిల్లో.న్యాయం చెప్పేవాళ్ళు తమ దగ్గిరకి వచ్చిన సమస్యల్లో యేదయినా రెఫరెన్సు ఉంటే వాటిని వాడుకునే వాళ్ళు – ఇప్పటి న్యాయాధిపతుల లాగే!అయితే వాటిలో కనబడని కొత్త సమస్య వస్తే యేమి చెయ్యాలి అన్నపుడు రెండు రకాల పరిష్కారాలు చెప్పారు.ఒకటి తను సాహసించి తన విచక్షణని ఉపయోగించి కొత్త తీర్పుని ఇవ్వటం.కేసుని అపరిష్కృతంగా ఉంచటం కూడా వాంచనీయం కాదు గాబట్టి అక్కడ ధర్మాసనంలో కూర్చున్న వ్యక్తి తన విచక్షణని ఉపయోగించి యే ఒక్కరినైనా శిక్షించవచ్చు,లేదా అందరినీ శిక్షించవచ్చు.అలాగే అటువంటి చిక్కుసమస్య వచ్చినప్పుడు న్యాయాధిపతి తన సొంత విచక్షణని ఉపయోగించి ఇచ్చినా ఆ తీర్పు అన్యాయం అనకుండా అందరూ ఒప్పుకుని పాటించాల్సిందే!

        వెటన్నింటికన్నా యేది ధర్మం యేదధర్మం అని పండితులూ న్యాయాధిపతులూ కూడా ఇదమిధ్ధంగా తేల్చలేని సన్నివేశం యెదురైనప్పుడు పాటించేది “పదుగురాడు మాట పాడియై ధర జెల్లు” ననే ప్రజాభిప్రాయాన్ని కోరడమే!

        నీతి అనేది దాన్ని ఒప్పుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది.చట్టం అనేది ఒప్ప్పుకోకపోయినా పాటించమని ఒత్తిడి చేస్తుంది.యెంత గట్టిగా 99 మంది ఇదే నీతి అన్నా కూడా దాన్ని వ్యతిరేకించే 100వ వ్యక్తి ప్రతి సమాజంలోనూ తప్పకుండా ఉంటాడు.అందుకే తను స్వయంగా ధర్మబధ్ధమయిన శృంగాన్ని సమర్ధించినా “వేశ్యాధికరణం”,”పారదారికం” అనేవాటిని గురించి కూడా విపులంగా చర్చించాడు వాత్స్యాయనుడు.నైతికపరమయిన విషయాల్లో యెదటివాళ్ళ మీద పెత్తనం చెయ్యాలన్నా కుదరదు.చట్టపరమయిన విషయాల్లో వ్యతిరేకించటమూ కుదరదు.పై కధలో ఉన్నది రాజు కాబట్టి ఆ స్థానంలో ఉన్నవాడు యేది చెప్తే అదే ధర్మం.

        యేనుగుల వీరాస్వామయ్య గారు తెలుసు కదా,వారి కాశీయాత్ర చరిత్ర నా దగ్గిర ఉంది.అందులో ఆయన చాలా విషయాల్ని గురించి ప్రస్తావించాడు!యేదో కాశీ వెళ్ళాడు,వచ్చాడు ఆ స్థలాల గురించి రాశాడు అనే మామూలు యాత్రాస్మ్ర్తి కాదది.హందూ ధర్మానికి సంబంధించి ఇవ్వాళ మంకి వస్తున్న చాలా సందేహాలకి ఆయన చాలా మంచి జవాబులే చెప్పాడు.వీలు వెంబడి దాని ఆధారంగా చాలా ఓష్తులు వెసే ఉద్దేసం ఉంది నాకు.ఆయన ఒక పరిసీలన చేసి చెప్పిన సత్యం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది! “అందర్నీ మెప్పించగలిగిన చెడు కల్వని మంచి యెక్కడా ఉండద్య్” అని బల్ల గుద్ది చెప్పాడు.ఆబట్టి పై కధాగతమైన సమస్యకి అనదరూ మెచ్చే ఒకే ఒక తీర్పు అసంభవం!

      • హరిగారు,
        చక్కటి పరిశీలన,వివరణ. ఏ కాలంలోనైనా తీర్పు అందరికి నచ్చాలని లేదు, ధర్మానికి,న్యాయానికి కట్టుబడి ఉండాలి, అంతే.
        ధన్యవాదాలు.

  5. మొదట తప్పు చేసింది సాలెవాని భార్య.
    తెలియకుండా వేరే వ్యక్తికి తప్పు శిక్ష వేసినవాడు సాలెవాడు.
    ఆపద్ధర్మానికి పోయి శిక్ష వేయించుకున్నది కల్లుగీసేవాని భార్య.
    ఏ తప్పు చెయ్యకపోయినా అపవాదుకి గురయింది కల్లు గీసేవాడు.

    ఇందులో నాకెందుకో వర్తమాన రాజకీయ ముఖచిత్రం కనపడుతోంది.

    • బోనగిరి గారు,
      పురాతన కాలం లో పంచతంత్రంలో విష్ణుశర్మ రాజకుమారులకు చెప్పినది ఇది. సమస్య ఇప్పటికి నిత్య నూతనమే, సమగ్రమైన తీర్పురాయాండి.
      ధన్యవాదాలు.

  6. రాజుని పదవి నుండి దింపివేసి సాలెవాడి భార్యని రాణిగా చేసి, కల్లు గీసే వాడి భార్యకి కఠిన గృహనిర్భంద శిక్ష వేయాలి.

  7. రాజు అందరినీ దండించేడు . ఇప్పుడు ప్రశ్న; _ రాజు అందరినీ ఎందుకు దండించేడు ??

    జిలేబి

వ్యాఖ్యానించండి