శర్మ కాలక్షేపంకబుర్లు-వితండవాదం అంటే?.

వితండవాదం అంటే.

షడ్దర్శనాలు అంటారు, అంటే అవి ఆరు. కాని ఏడు దర్శనాలు కనపడుతున్నాయి, ఇవేకాక ఇంకా దర్శనాలూ ఉన్నాయన్నారు. ఎన్ని ఉన్నా అవన్నీ వీటిలో ఇమిడేవే అంటారు పెద్దలు. దర్శనాలు
1 న్యాయదర్శనం
2.వైశేషిక దర్శనం
3.యోగదర్శనం.
4.సాంఖ్య దర్శనం
5.కర్మ మీమాంసా దర్శనం
6.దైవీ మీమాంసాదర్శనం.
7.బ్రహ్మమీమాంసా దర్శనం.

ఒకటిరెండు దర్శనాలు ఒక గుత్తి,మూడు నాలుగు మరోగుత్తి కాగా, ఆరు ఏడుగాని, ఐదు ఆరుగాని ఒక దర్శనంగా భావిస్తే మొత్తం దర్శనాలు ఆరే.

న్యాయదర్శనాన్ని అన్వీక్షికి,అక్షపాద దర్శనం అని కూడా అంటారు, దీనిని గౌతమ మహాముని పదిరోజులలో రాసినట్లూ చెబుతారు. .న్యాయ దర్శనాన్ని మూడు భాగాలుగా చెబుతారు, I.తర్కం II.న్యాయం III.దర్శనం.

I. తర్కభాగంలో తర్కనిర్ణయము 1.వాదము 2.జల్పము 3. వితండము
II. న్యాయ భాగంలో ప్రమాణము మొదలైన విషయాలుంటాయి.
III. దర్శనభాగంలో ఆత్మానాత్మ విచారం ఉంటుంది.

I.న్యాయంలో తర్కనిర్ణయమనుకున్నాం కదూ, దాని లక్షణం, ”ఇది ఇట్లుకాదగినది” అనుకోవడమే తర్కం, స్వపక్ష లక్ష్యమేదో అది ’నిర్ణయము’ దానిని చేరుకోడానికి చేసేదే వాదము

1. జయాపజయాలతో సంబంధం లేక విషయ నిర్ణయం మాత్రమే లక్ష్యంగా ఉండేది, ’వాదము’.
2.(తత్త్వ) విషయ నిర్ణయాన్ని లక్ష్యపెట్టక ప్రతిపక్షి పరాజయము, స్వపక్ష జయము కోరేది ’జల్పము’
3.(తత్త్వ) విషయ నిర్ణయంతో సంబంధము లేక ప్రతిపక్షి వాదాన్ని ఖండించడమే లక్ష్యంగా కలదాన్ని ‘వితండం’ అంటారు.

II. న్యాయభాగంలో ప్రమాణం ఉంటుందనుకున్నాం కదా! ‘ప్రమ’ అంటే యదార్థమని అర్ధం. ఈ ప్రమాణం నాలుగు రకాలు. 1.ప్రత్యక్షప్రమాణం 2.అనుమాన ప్రమాణం 3.ఉపమాన ప్రమాణం 4. శబ్ద ప్రమాణం.

1.ప్రత్యక్ష ప్రమాణం అంటే పంచేంద్రియాలకి ఎదురుగా కనపడేది, నిజం.
2. ముందుగా నిప్పును, దానితో పొగను చూసిఉన్నవారు అనగా ఆ విషయం తెలిసిఉండి, మరొకచో పొగను చూసి నిప్పు అక్కడ ఉన్నదని నిర్ణయించుకోవడమే అనుమానప్రమాణం, ఈ అనుమాన ప్రమాణం కూడా మూడు రకాలు.1.పూర్వవత్తు2.శేషవత్తు3.సామాన్యతో దృష్టము.

హేతువును దుష్టంగా చెప్పడం హేత్వాభాసం అంటారు
ప్రయోగింపబడిన వాక్యానికి విపరీతార్ధం చెప్పడాన్ని ’ఛలము’ అంటారు.
ఇంకా ’జాతి”నిగ్రహము’ మొదలినవీ ఉన్నాయి. ఈ జాతి ( మనం అనుకునేజాతి కాదు) దీనిలో ఇరవైనాలుగు భేదాలున్నాయన్నారు.

ఇంకాలోపలికెళితే చాలా ఉంది, చాలా విషాయాలు గురు ముఖతః నేర్చుకోవలసినవే.

ఇదీ తర్కం అంటే, వితండవాదం అంటే…..

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-వితండవాదం అంటే?.

  1. గురువు గారు , దర్శనాలు వందకు పైగా వున్నాయి అంటారు కదా . వాటి గురించి చెప్పగలరు అని ఆశిస్తున్నాను .

    • ఫణీన్ద్ర పురాణపణ్డగారు,

      ఛలవాదంతో పాటు చాలా రకాల వాదాలున్నాయండి. ఇది ముఖ్యమైనదని,నేటి కాలంలో ఎక్కువగా వినియోగింపబడుతోందని చెప్పేను. మరోసారి టపా చదివితే కనపడింది. విషయం తెలిసింది కదా!

      ధన్యవాదాలు.

    • ఫణీన్ద్ర పురాణపణ్డగారు,

      ఛలవాదమంటే టపాలోనే చెప్పేను, చాలాకాలమైందిగా మరచిపోయాను.

      ఛలవాదమంటే చెప్పిన వాక్యానికి విపరీతార్ధం కల్పించి వాదించడం.

      ధన్యవాదాలు.

  2. గ్రాంధికం పొట్టు అంతా వూదేసి శుధ్ధ వ్యావాహారికంలో చెప్పాలంటే మన దగ్గిర పాయింటు లేకపోయినా మనం ఓడిపోకుండా ఉండటం కోసం యెదటివాణ్ణి కూడా గెలవనివ్వకపోవటం అన్నమాట!

    క”హారి”నీ?!

  3. బ్లాగుల్లో తరచూ కనిపిస్తూనే ఉంటుందిగా “వితండం” 🙂
    (సీరియస్ టపా కి సరదా కామెంట్)

వ్యాఖ్యానించండి