శర్మ కాలక్షేపంకబుర్లు- నలుగురు

నలుగురు

తమ కార్యబు పరిత్యజించి పరార్ధ ప్రాపకుల్ సజ్జనుల్,
తమ కార్యంబు ఘటించుచున్ పరార్ధ ప్రాపకుల్ మధ్యముల్,
తమకై అన్య హితార్ధ ఘాతుకజనుల్ దైత్యుల్, వృధాన్యార్ధ భం
గము గావించెడి వారలెవ్వరో ఎరుంగన్ శక్యమే ఏరికిన్.                 అన్నారు.

తమ పని చెడిపోయినా ఎదుటివారికి ఉపకారం చేసేవారు ఉత్తములు, తమ పని చేసుకుంటూ ఇతరులకు ఉపకారం చేసేవారు మధ్యములు, తమ పని కోసం ఇతరుల పని చెడకొట్టేవారు దితి కుమారులు, రాక్షసులని, ఊరకనే ఇతరుల పని చెడకొట్టేవారిని ఏమనాలో తెలియదు అన్నారు. ఎప్పుడో వందల సంవత్సరాల కితం మన సమాజాన్ని, మానవ మనస్తత్వాన్ని కూలంకషంగా కాచి వడపోసిన కవి ఎంత గొప్పవాడు. ఇప్పటికీ ఈ నలుగురిలో మార్పు రాలేదు కదా. నలుగురు తప్పించి, ఈ సంఖ్య పెరగలేదు, తరగలేదు.

ఈ కింది పట్టిక చూడండి. ఇందులో నాలుగు రకాల రక్తం గ్రూపులు,అవి A (A+,A-); B (B+,B-); AB  (AB+,AB-); 0 (0+0-). నిన్ను కోస్తే పాలు,నన్ను కోస్తే నీళ్ళూ రావు అందరిలోనూ రక్తమే ఉంటుంది అంటారు, కాని అందరి రక్తమూ అందరికి పని చెయ్యదు, అలా ఎక్కిస్తే అంతే సంగతులు, ఇది సైన్స్ చెబుతున్నమాట నాదికాదు.ఇందులో రకాలు చూడండి.

blood-donation

పై పట్టికని అలాగే చూస్తే ఏం తెలీదు, విశ్లేషిద్దాం

Group         Can donate to Group          Can receive from group

0-                        ALL                                           O-

ఈ గ్రూపు రక్తం ఉన్నవారు మహానుభావులు, అందరికి వితరణ,దానం చేసేవారే, కాని మరొక్కరెవరూ వీరికి రక్తం ఇవ్వలేరు, వీరే భర్తృహరి చెప్పిన పరార్ధప్రాపకుల్ సజ్జనుల్, వీరికి శిరసు వంచి నమస్కారం.

Group        Can donate to Group           Can receive from group

0+                   0+;A+;B+;AB+                            0+;0-
A-                    A+;A-;AB+;AB-                           A-;0-
B-                   B+;B-;AB+;AB-                           B-;0-

వీరు చూడండి, నలుగురికి ఉపయోగపడతారు, ఉపకారమూ పొందుతారు, మితంగానే, వీరే భర్తృహరి చెప్పిన మధ్యములు తమపని చేసుకుంటూ,ఇతరులకూ ఉపయోగపడేవారు,వీరికి నమస్కారం.

Group       Can donate to Group            Can receive from group

AB-                  AB+ ;AB-                              AB- ;A- ;B- ;O-
B+                     B+ ;AB+                              B+ ;B- ;O+ ;O-
A+                     A+ ;AB+                              A+ ;A- ;0+ ;0-

వీరు చూడండి, పుచ్చుకోడం పూర్వీకులనుంచీ ఉంది కాని, పెట్టడం పెద్దలనాటి నుంచీ లేదనేవారు. స్వార్ధపరులు, తమ పనైపోతేచాలు వీరికి.మధ్యములకు పూర్తి వ్యతిరేకులు, వీరు భర్తృహరి చెప్పిన మూడవ వారు కదా! నమస్కారం

Group       Can donate to Group              Can receive from group

AB+                             AB+                                     ALL

వీరు చూడండి, ఒంటికాయి సొంటికొమ్ము లాగా ఉంటారు. ఎవరికి, ఎప్పుడూ ఉపయోగపడరు.వీరు భర్తృహరి చెప్పిన నాలుగవవారు. పొరపాటుగా వీరి రక్తం ఎవరికేనా ఎక్కిస్తే అది విషంతో సమానం. వీరికి నేను పేరుపెట్టలేనని గోలపెట్టేరు భర్తృహరి, మరి మీవల్లేమైనా అవుతుందా?

మానవజాతి ఎప్పటికీ నాలుగురకాలే, మార్పు రాలేదు,రాదు,రాబోదు. ఈ నాలుగు రకాల మనుషుల్లో ఎవరెక్కువుంటే సమాజం అలాగే ఉంటుంది.

సాధారణంగా O-,A+,O+ ,సమాజానికి ఉపయోగపడే వీరికోమాట, ఎవరో ఇస్తార్లే రక్తం, అని నిర్లక్ష్యం చేయకండి. అవసరంలో మీకు మరొకరు సాయం చేయలేరు సుమా! అందుచేత మీరు రక్తం ఇవ్వడం మరవద్దని సవినయ విజ్ఞప్తి. నిజం చెప్పాలంటే మీ వల్లే మానవజాతి మనుగడ సాగిస్తోంది, అందుకు గర్విద్దాం.

blood-type-chart

రక్తదానం చేయండి, మీరెవరో తెలుసుకోండి.

Take it easy, Donate blood

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- నలుగురు

  • చిరంజీవి రవి,
   O- గ్రూప్ రక్తం ఉండేవాళ్ళు జనభాలో 6.6 శాతం. చాలా తక్కువ. వీరు ఎవరికైనా రక్తం ఇచ్చి రక్షించగలరు, అందుకే వీరిని విశ్వ దాతలంటారు, Universal donors. కాని దురదృష్టం, వీరికి మరెవరి రక్తం పనికి రాదు, వీరి గ్రూప్ రక్తం తప్పించి. వీరి రక్తం అరుదైనది. అందుకే వీరి గ్రూప్ ని రక్షించుకోడానికి రక్తం ఇవ్వాలి. Rare blood group.

   ఇక AB + వారు 3.4 శాతమే జనాభాలో. These people are diametrically opposite to O- group. వీరందరి దగ్గరా తీసుకుంటారు, ఎవరికి ఇవ్వరు, వారు బతకడానికి ఇబ్బంది లేదు, మీ గ్రూప్ వాళ్ళు బతకాలంటే మీరే రక్తం ఇచ్చి తీరాలి, ఇప్పుడు తెలిసిందా?

   You are great. You can save any body,but you cannot be saved except by O-
   Wish you all the best and continue to donate blood.
   ఏ బ్లడ్ బేంక్ లోనైనా ఓ- రక్తం కోసం, కావాలని అడుగు, వివరాలు చెప్పక, ఏం సమాధానమొస్తుందో చూడు.
   Wish you and your family happy and prosperous future.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s