శర్మ కాలక్షేపంకబుర్లు- మేలుకొలుపు

Courtesy: You tube

మేలుకొలుపు

మేలుకోవయ్యా! కావేటి రంగా శ్రీరంగా మేలుకోవయ్యా!!
రంగనాథ స్వామికి మేలుకొలుపు భానుమతి కంఠంలో…
 

లోకాలనేలే స్వామికి నిద్ర,  ఆయనకు   మేలుకొలుపు. బలే ఊహ కదా! ఇది మానవులు చేసే చిత్రం. నవవిధ భక్తి మార్గాలలో సారూప్యం ఒకటి. ఇందులో భక్తుడు భగవంతుని తనలాగే ఊహించుకుని సేవించుకోవాలనుకుంటాడు, అందుకే ఈ మేలుకొలుపు. ఇక

కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే

ఉత్తిష్ట నర శార్దూలా కర్తవ్యం దైవమాహ్నికం

అంటే రామా, లేవయ్యా తెలవారుతోంది లేనాయనా! నిత్య కార్యక్రమాలున్నాయి , లేచి నిర్వహించు అని గురువుగారు హెచ్చరించారు. ఇది మొదటి రోజు రాజసౌధం వదలిన రామునికి మేలుకొలుపు నదీ తీరంలో! రాముడు మళ్ళీ ఎప్పుడూ తెల్లరుతోంది లే అనే హెచ్చరిక విన్నట్టు కనపడలేదు.
 

ఇక ముందుకెళితే

వేంకన్నబాబుకి

ఉత్తిష్టోత్తిష్ట గోవింద   ఉత్తిష్ట గరుడ ధ్వజ

ఉత్తిష్ట కమలా కాంతా త్రైలోక్యం మంగళం కురు.

గరుడుడు ధ్వజంగా కలవాడా లేవయ్యా! లే!! లెద్దూ!!! ముల్లోకాలకీ మంగళం కలగాలంటే  లేవాలి, లే!!! మానవుని తొందర కనపడుతోందీ మేలుకొలుపులో,లే,లే,లే అంటూ తొందరపడుతూ తొందర పెడుతున్నాడు, భక్తుడు. . ఇలా మానవులలో మహరాజులు వంది మాగధులని మేలుకొలుపు కోసం నియమించుకునేవారు.
 

ఇదొక హెచ్చరిక….ఇలా నిర్నీత సమయానికి హెచ్చరిక చేయడం కోసం ఏభయ్యేళ్ళ కితం టెలిఫోన్ వ్యవస్థలో ఒక సర్వీస్ ఉండేది. బహుశః దీని గురించి చాలామందికి తెలియకా పోవచ్చు. This service was popularly known as morning alarm service or Wake up call. ఎందుకంటే ఇది పట్టణాలలో మాత్రమే ఉండేది. దీనికో నంబరు  176 , దానికి ఫోన్ చేసి ఫలానా నంబరుకు ఫలానా సమయంలో హెచ్చరిక, మేలుకొలుపు తెలపండి అన్నది ముందు బుక్ చేసుకుంటే, వారు phone పెట్టేసిన తరవాత మళ్ళీ ఆ నెంబర్ కి పిలిచి విషయం నిర్ధారించుకునేవాళ్ళం. ఇందుకు గాను ఆ హెచ్చరిక వినిపించిన తరవాత (After completion of the wake up call at the stipulated time.) రెండు కాల్స్ కి ఛార్జి చేసేవాళ్ళం.

 
చాలా మందికి తెలియని మరో సేవ సమయం చెప్పడం. దీనికి ఒక నెంబరు అది 174. దీనికి పిలిస్తే సమయం చెప్పేవాళ్ళం వరుసగా రెండు సార్లు. దీనికి ఒక కాల్ ఛార్జి చేసేవాళ్ళం.
 

అసలు సమయం చెప్పే వ్యవస్థ ఎందుకు ఏర్పాటయింది, దీనికో కారణం చెబుతా. ఐ.ఎస్.టి అనగా ఇండియన్ స్టాండర్డ్ టయిం నిర్ణయించేది 82.5 డిగ్రీల తూర్పు అక్షాంశం, longitude . గ్రీన్విచ్ లో రాత్రి పన్నెండు 00.00 గంటలైతే డిల్లీ లో ఉదయం 05.30 నిమిషాలవుతుంది.

 ఈ రేఖ డిల్లీ దగ్గరనుంచి, మన ఆంధ్రాలో అన్నవరం మీద  నుంచి   పోతుంది. దీనికోసమే అన్నవరంలో దేవాలయం పక్కగా సన్ డయల్ ఉన్నది, వెళ్ళినపుడు చూడండి . ఇక్కడ సమయం ఖచ్చితంగా Indian Standard time. ఐ.ఎస్.టి. ఇక దీని గురించిన ఒక టపా పలభాయంత్రం పెరుతో ఉన్నది, ఇదే బ్లాగులో.

 విషయాని   కొస్తే.డిల్లీలో సమయమే దేశం అంతా పాటించాలి,ఎలా? అందుకుగాను రోజూ మధ్యాహ్నం పన్నెండు గంటలకి డిల్లీ టెలిఫోన్ ఎక్ఛేంజి వారు ఆ సమయం చెప్పే  observatory కి ఫోన్ చేసి తమ మాస్టర్ క్లాక్ ని సరి చేసుకునేవారు. The time is taken from the Sun dial in the observatory. ఆ తరవాతనుంచి సాయంత్రం  నాలుగు గంటలకి కలకత్తా,బొంబాయి, మద్రాస్ ఎక్స్ఛేంజిలవారు డిల్లీ నుంచి సమయం తెలుసుకుని తమ  గడియారాలు మార్చుకునేవారు. ఆ తరవాత నుంచి మిగిలిన చిన్న ఊళ్ళ వారు సమయాన్ని చూపే గడియారాలు సరి చేసుకునేవారంటే, సమయాన్ని సరి చూసుకునేందుకు ఇంత వ్యవస్థ ఉండేదంటే నమ్మగలరా! కాని ఇది నిజం. 
 
మిగిలిన చిన్న ఊళ్ళలో ఫోన్ ఎత్తీ సమయం అడిగితే ఊరకనే చెప్పేవాళ్ళం. పల్లెలలో ఇలా నిర్నీత సమయానికి లేపి హెచ్చరించే వ్యవస్థ లేకపోయినా రాత్రి డ్యూటీ వారిని, ఫలానా సమయానికి లేపండి అని అడిగితే లేపేవాళ్ళం.ఈ ఉదయమే మేలుకొలుపుల్లో ఎన్నెన్ని పదనిసలో…… 

3 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- మేలుకొలుపు

 1. విన్నకోటవారు

  ఆ పాట గుర్తులో ఉన్నదే కాని భానుమతి పాటలో…..అదనమాట సంగతి. మంచి పాట గుర్తు చేశారు.

  టెలికంలో మొదటగా అన్నీ మేన్యుయల్ ఎక్స్ఛేంజిలే, ఆ తరవాత పెద్ద ఊళ్ళలోవి ఆటో అయ్యాయి, ఇవి స్ట్రౌజర్ ఎక్స్ఛేంజిలు, మొదటి తరమనమాట. ఆ నాడు చెప్పిన 174,176 నెంబర్లు వాడేవారు. ఆ తరవాత తరం లో ఎలక్ట్రానిక్ ఎక్స్ఛేంజిలొచ్చాయి దేశంలోకి, అవి వివిధ కంపెనీలవి, సర్వీసులన్నీ ఉన్నా డిజైన్ వేరు, ఒక్కో కంపెనీదో తీరు, నంబర్లు వేరు. మీరు వాడిన కాలంలో మేన్యుయల్ గా రిజిస్టర్ చేసుకున్నది కాదు, మీ అభ్యర్ధన, అదీ ఆటోమేటిక్కే, మీరే మీకు కావలసిన సమయం డయల్ చేసుకునేవారు. నేను చెప్పిన మొదటి తరంలో అభ్యర్ధన మేన్యుయల్ గా రికార్డ్ చేసేవారు, అదీ తేడా!

  కాల్ ట్రాన్స్ఫర్ వగైరా సర్వీసులు చాలానే ఉన్నట్టున్నాయండి. చాలా కాలంగా ఫోన్ లేండ్ లైన్ గురించి పట్టించుకోలేదు, కొన్ని తెలియవు కూడా.స్మార్ట్ ఫోన్ వచ్చాకా అన్నీ పోయాయండి.
  ధన్యవాదాలు.

  అనామకం.

  అవును మేల్కొలుపు సర్వీసే 🙂

  ఎందుకీ ముసుగులో గుద్దులాట? 🙂 తమరు జిలేబీ అన్నది తెలుస్తూనే ఉంటుంది. దేశంలో చాలా కాలం ఉండిపోయారు, ఏంటి సంగతీ? మనవడికి పెళ్ళి గినా చేశారా? పిలిస్తే వచ్చి వాలిపోతామనుకున్నారా? పిలిచినా వచ్చేలా లేదు 🙂

  సింగపురం ఎప్పుడు చిత్తగించారో!
  ధన్యవాదాలు.

 2. కృష్ణుడికి మేలుకొలుపు “తెల్లవార వచ్చే తెలియక నా స్వామీ మళ్ళీ పరుండేవు లేరా” అనే ఒక పాత పాట ఉంది, మీకు తెలుసుగా (సినిమా పాటే అనుకోండి, కానీ చక్కటి పాట. పాత “చిరంజీవులు” చిత్రంలోని పాట). లింక్ ఈ క్రింద.

  BSNL వారి లాండ్ లైన్ ఫోన్ లో Wake-up Call సేవ చాలా ఉపయోగకరంగా ఉండేదండి. నేను, మా ఆవిడ విరివిగా వాడేవాళ్ళం. దరిమిలా సెల్ ఫోన్లు వచ్చి వాటిల్లోనే alarm సౌలభ్యం కూడా ఉండటంతో BSNL వారి సదుపాయం క్రమేపీ మరుగున పడినట్లుంది. అయితే, శర్మ గారూ, ఆ సౌకర్యం కోసం డయల్ చేయవలసిన కోడ్ 116 అని నాకు బాగా గుర్తు. ఉదాహరణకు, ఉదయం ఆరు గంటలకు మేలుకొలుపు కావాలంటే 1160600 అని డయల్ చెయ్యాలన్నమాట (మీరు 176 అన్నారు. electronic exchanges లో 116 అని ఏమన్నా పెట్టారేమో మరి? ). ఇప్పుడేదో Phone Plus అనే స్కీం పెట్టారటగా BSNL వారు? ఈ Wake-up Call, Call Transfer వగైరా సౌకర్యాలను ఆ స్కీం క్రిందకు తెచ్చారట, subscriber ఆ స్కీం లో రిజిస్టర్ చేసుకోవాలట కదా?

  మొత్తానికి మంచి టపా వ్రాశారు శర్మ గారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s