శర్మ కాలక్షేపంకబుర్లు-”చిన్నప్పుడు తాగిన దొండాకు పసరుతో….

”చిన్నప్పుడు తాగిన దొండాకు పసరుతో….

ఏంటీ! తెగనీలుగుతున్నావ్!! చిన్నప్పుడు తాగిన దొండాకు పసరుతో సహా కక్కిస్తానేంటనుకుంటున్నావో!!!” ఇలా తిట్టడం తెనుగునాట బాగా అలవాటు.

చిన్నప్పుడు దొండాకు పసరు ఎందుకు తాగిస్తారు?. దొండ రెండు రకాలు. తియ్యదొండ,చేదుదొండ లేదా కాకిదొండ, లేదా పిచ్చిదొండ అంటారు. ఈ పిచ్చి దొండపాదులు పల్లెలలో బాగా పెరుగుతాయి, ఎక్కడపడితే అక్కడ. చిన్నపిల్లలికి మూడు నెలలుదాటి సంవత్సరం లోపులో వస పోస్తారు, మాటలుబాగా వస్తాయట, ఎక్కువగా మాటాడేవాళ్ళని వసపిట్టలని అంటారు, వసెక్కువ పోసినట్టున్నారంటారు. అలాగే ఈ పిచ్చిదొండ ఆకులు తెచ్చి మెత్తగా నలగకొట్టి రసం తీసి, రోజుకి రెండు పూటలా మూడు రోజులు పట్టిస్తారు. ఇలా చేయడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందట. ఇప్పటివారికి పోయటం లేదుగాని, మా చిన్నప్పుడు అందరూ దొండాకు పసరు తాగినవాళ్ళే. మరోమాట ఈ పిచ్చి దొండపాదుల్ని కాయలు బాగా కాస్తాయి, తెలివైనవాళ్ళు వాటిని తెచ్చుకుని చక్రాల్లా తరుక్కుని ఎండబెట్టి వరుగులు చేసుకుంటారు. వీటిని ఆ తరవాత వేయించుకుని తింటారు, కొంచం చేదుగా ఉన్నా ఆరోగ్యానికి మంచిదిట. మరో సంగతి పిచ్చి దొండాకుల్ని మెత్తగా నలిపి రక్తపుగడ్డ మీద వేస్తే మూడో రోజుకి ఫట్, ఆ తరవాత అదే ఆకులముద్ద వేస్తే పుండు మానుతుంది, ఇది ఆంటీ బయోటిక్ ట.

మరచాను మరోమాటా! తెనుగు నాట దొండాకు పసరే కాకుండా గాడిదపాలు పోయడమూ, దేశంలో కొన్ని చోట్ల ఒంటె పాలు పోయడమూ అలవాటే. ఇలా గాడిద పాలు మూడు రోజులు తాగిస్తే కూడా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందటా! ఇప్పుడు తెనుగునాట గాడిదపాల వ్యాపారం మూడు గాడిదలూ రోజుకి ఆరువేల రూపాయల సంపాదనా లా నడిచిపోతోందట. ఇంటికి గాడిదనుతోలుకొచ్చి వంద ఎమ్.ఎల్ పాలు పితికి రెండువందల ఏభై రూపాయలు పట్టుకుపోతున్నారట. గాడిద మహాలక్ష్మి రాకకై ఎదురు చూస్తున్నారట. దానికీ సమయం కేటాయించేస్తున్నారట (కాల్ షీట్ బుక్ చేసుకొంటున్నారట) గాడిదలు కాసేవారు. పిల్లలకే కాదు పెద్దవారూ గాడిద పాలు తాగుతున్నారట.

చిన్నప్పుడు మా మాస్టారు చదువుకోక గాడిదల్ని కాస్తావా అనేవారు. నిజంగా గాడిదల్ని కాస్తేనే బాగున్నట్టుంది, రోజుకి ఆరువేలు నెలకి రెండు లక్షలు, ఆపైన లెక్కొద్దుబాబూ! టాక్స్ లేని ఆదాయం!

కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా? గాడిదలు కాయండి!

ఒక కేజి గాడిద వెన్న తయారు చెయ్యడానికి డెభ్భై లీటర్ల గాడిద పాలు కావాలిట. ఒక కేజి గాడిద వెన్న ఖరీదు అక్షరాలా రెండు లక్షలు, గాడిద వెన్న చాలా సున్నితంగా మెత్తగా ఉంటుందిటా! సౌందర్య సాధనాల్లో, మొహానికి రాసుకునేవాటిలో వాడతారటా!

ఆడగాడిదలని పెంచండి, కోటీశ్వరులు కండి.

గాడిద మహాలక్ష్మికీ జై!!!

25 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-”చిన్నప్పుడు తాగిన దొండాకు పసరుతో….

  1. —దీనిని బట్టి తెలియునదేమనగా మీరు చాలా కాలం కితమే దేశం వదలిపెట్టి, జపానో జర్మనీయో వలసపోయిన దాఖలాలు కనపడుతున్నాయి 🙂

    హై 🙂 యైపాసామినే గిరికీలు కొట్టించి సందిగ్ధావస్థ లో‌ పడేసేనా దాయిచే యో నిప్పానో అని సూర్యుడు 🙂

    నారదా

    జిలేబి

    • Zilebi గారూ,

      అక్కలకఱ్ఱ,దాల్చిన చెక్క, పిప్పలికట్టి, మరాఠీ మొగ్గ ఏంటక్కా ?
      జిలేబి సందేహంలో పడిపోచ్చి 🙂 🙂 🙂
      ధన్యవాదాలు.

      • వీఠన్నిఠి గురించి చింత వస్తున్న దంటే ఒంటికి పడిశం పట్డినట్టు 🙂 కొంత గాఠ్ఠిగ కషాయం వేసుకొని కుదురుకోవలె 🙂

  2. // “బ్యాంకులో కాకుల లెక్కలు వేసే వారి మల్లె వున్నారు ” //

    అబ్జెక్షన్ యువరానర్ 😠.

      • వాదనలో సాక్ష్యాధారములే గానీ ఇతర అంశములు గురించి ప్రస్తావించరాదు.

    • విన్నకోటవారు,

      ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఈ విషయం గూగులిస్తే పేగులు లెక్కెట్టచ్చు. దేశం లో ఈ వ్యాపారం పోటీ లేనిది.

      జిలేబి
      ఇక ప్రాజెక్ట్ ఎస్టిమేట్ ఇలాగే ఉంటుంది కదా! డెటైల్డ్ ఎస్టిమేట్లు వేరుగా ఉంటాయి,దీనికి లోబడి. చాలా తక్కువ పెట్టుబడితో చక్కటి వ్యాపారం చేయచ్చు. కచ్ ప్రాంతంలోని గుజరాత్ ఆడ గాడిదలు ప్రపంచ ప్రఖ్యాతి పొందినవి. పాకిస్తాన్ ఈ గాడిదలను ఎగుమతి చేస్తోంది. నేనిచ్చిన ప్రాజెక్ట్ ఖరీదు చాలా ఎక్కువగా చెప్పేను. రంగంలో దిగితే చాలా తక్కువకే అవుతుంది.

      ఒకాయన కథ రాసుకుంటానన్నాడు, మరొకరు సక్సెస్ స్టోరీ సినిమా తీయచ్చు, నవ్వులాట కాదు, నిజమే చెబుతున్నా.

      ధన్యవాదాలు.

      • అనామకం
        on 01:16 వద్ద నవంబర్ 12, 2019.

        ఎంత కాదనుకున్నా! భారతవాసి కదండీ జిలేబి, చివర రోజులకైనా నాలుగురాళ్ళు పోగేసుకోకపోతారా అని ఆశ 🙂

        ధన్యవాదాలు.

    • అందులో జిలేబి కేరెక్టరైతే ( కేరెట్టైతే) దానికి సమోసా అని‌ మీరు పేరెడితే హేగ్ కోర్టులో మీ పేర్న వ్యాజ్యం తథ్యం 🙂

    • సూర్య గారు.

      మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేయను. ”గూగులిస్తే పేగులు లెక్కెట్టచ్చు”. మీ చిత్తం.

      దీనిని బట్టి తెలియునదేమనగా మీరు చాలా కాలం కితమే దేశం వదలిపెట్టి, జపానో జర్మనీయో వలసపోయిన దాఖలాలు కనపడుతున్నాయి 🙂

      ధన్యవాదాలు.

      • ఎంతమాట ఎంతమాట. చిన్నపుడు దొండకాయ వస బదులు కాకరకాయ, ఇంకా ఏవేవో కలిపి చేసిన చేదు తాగిన గుర్తులు మాకూ ఉన్నాయండి.
        కాకపోతే గాడిదపాల గురించి మాత్రం ఐడియా లేదు.
        ఇంతకీ ఆరెండుదేశాల పేర్లే ఎందుకు రాశారో?!

      • సూర్యగారు,

        ఐతే మీరూ దొండాకు పసరే తాగుంటారు 🙂
        ఇప్పుడు గాడిదపాలు జోరుగా తాగిస్తున్నారండి. నిజంగానే వంద ఎమ్.ఎల్ పాలు రెండువందల ఏభై రూపాయలు,ఇంటి దగ్గరకి గాడిదను తోలుకొచ్చి అప్పటికప్పుడు పితికి ఇస్తున్నారు. పెద్దలూ తాగుతున్నారు, పిల్లలకి తప్పక పట్టిస్తున్నారు. మొన్ననో నలభై ఏళ్ళ కుర్రాడు, మాటల సందర్భంలో గాడిదపాలు కితం నెలలో తాగానని అన్నాడు.

        ఇక జపాను,జర్మనీ అని ఆ రెండు దేశాలే ఎందుకన్నారు?

        రెండవ ప్రపంచయుద్ధం తరవాత, నేలకు కరుచుకుపోయిన ఈ రెండు దేశాలు మళ్ళీ తలెత్తుకున్నాయి. జపాను వాళ్ళు కోపమొస్తే ఎక్కువ పని చేస్తారట. ఇక జర్మనీ వాళ్ళకి ఈ మధ్య సంస్కృతం జ్వరం పట్టుకుందిట. నాకు ఈ రెండు దేశాలంటే మక్కువ. ఈ రెండు దేశాల గురించి చిన్నపుడు మా సోషల్ మాస్టారు, జాన్ గారు మంచి పునాది వేశారు. ”జపాను గెల్చునా? జర్మని జయించునా? ” అని తెల్లవాళ్ళు ప్రచారం కోసం ఒక పాట రాయించారనీ పాడేవారు క్లాసులో,గుర్తు లేదు పూర్తిగా. ఈ రెండు దేశాలకి వెళ్ళిన వారు చిటుకు చిటుకుమని మన దేశానికి తిరిగిరారు.

        ప్రపంచ యుద్ధం తరవాత అభివృద్ధే ఆదర్శంగా ఎదిగిన దేశం జపాను. ముక్కలైన దేశాన్ని ఏకం చేసుకున్న దేశం జర్మనీ, నవంబరు తొమ్మిది బెర్లిన్ గోడ కూలిన రోజుకదా!

        అదనమాట సంగతి. మీరుగాని ఈ రెండు దేశాల్లో ఎక్కడేనా ఉన్నారా?

        ధన్యవాదాలు.

  3. గాడిదల తోలుకోండ
    ర్రా డింగరులార యనుచు ప్రాజ్ఞులు తెల్పం
    గా డిగనురుకుల పరుగిడి
    గాడిద మాలచ్చి గనిరి కష్టేఫలిగా!

    జిలేబి

    • జిలేబీ పాటీ!

      ఆడగాడిదల ఫారం పెడుతున్నారా? భేషూ. అందుకేనా ఇండియాలో ఉండిపోతున్నారు. 🙂

      ఐతే మళ్ళీ ఏడాదికి కోట్లకి అధిపతులే 🙂

      ధన్యవాదాలు.

      • “జిలేబి” గారు కోట్లకు పడగెత్తిన తరువాత మనలాంటి వాళ్ళం గుర్తుంటామో లేదో శర్మ గారూ🙁 ?
        మరొక భయం ఏమిటంటే మనల్ని ఎప్పుడైనా వారింటికి ఆహ్వానిస్తే గనక గాడిద పాలతో కలిపిన కాఫీ ఇస్తారో ఏమిటో 😳 ?

      • జిలేబీ

        మంచి వ్యాపారం, మొదలెట్టెయ్యండి. మమ్మల్ని పిలవద్దు ఓపెనింగు కి. సరేనా!

        Jokes apart, seriously. A good start up. Wish you best of luck

        ధన్యవాదాలు.

      • విన్నకోటవారు,

        నిజంగానే మీరు అమాయకులండీ! ”కుడుము చేతికిస్తే పండగనుకుంటారు”.

        అమ్మవారికి ”విరుపు” గాని ”కలుపు” తెలీదు. ఎప్పుడూ ఏవరో ఒక బకరా కోసం వెతుకుతుంటారు. మనం జ్ఞాపకమా! కొత్త బకరా దొరకాలంతే!

        ఈ తొమ్మిదేళ్ళ బ్లాగింగ్ లో పదిమంది పైగా అభిమానులు,స్నేహితులకు ఆతిథ్య మిచ్చానండి. ఇదివరలో చెప్పేవాణ్ణి. గత రెండేళ్ళుగా చెప్పటం లేదు. అమ్మవారు పొరబాటున కూడా పిలవరు, మీకా భయం లేదు,నాది హామీ.

        పొరబాటుగా పిలిచి మనం వెళ్ళినా అమెరికన్ కాఫీ పోస్తారు కాని అంత ఖరీదైన గాడిదపాల కాఫీ ఇవ్వరుగాక ఇవ్వరు. లీటరు పాలు అక్షరాలా రెండు వేల ఐదువందల రూపాయలు. పాలే చెల్లిపోతున్నాయి. వెన్న చేసుకుంటే ఇక కాసులే కాసులు.

        ధన్యవాదాలు.

    • ఈ గాడిద పాల ఐడియా ఎదో బాగుంది. కంపెనీ పేరు ఏం పెడితే బావుంటుంది చెప్మా!
      Donkihote అనే పేరు స్పెయిన్ వాడు తీసుకున్నాడు.
      ఏస్స్స్ లుకింగ్ ఎంటర్ ప్రయజెస్ -ఈపేరేదో బావుంది.

      • సూర్య

        A rough project.

        1.Five acres semi arid land rent @ Rs.20,000 per year= 1,00,000
        2.Female donkeys @ 1,00,000 per donkey X 25 =25,00,000
        3.Male donkeys 2 X 50,000 each 1,00,000
        4.power and shed, bore well for water source 5,00,000
        ——————————————————————
        32,00,000

        Man power and recurring expenditure.

        1. Veterinary doctor and herd keepers per year 5,00,000
        2. Lady attendants for making curd etc 2 2,00,000
        3.unforeseen and insurance 5,00,000
        4. Marketing advertisements etc 5,00,000
        —————————————————————————-
        17,00,000 per year

        A milking donkey gives milk 2 liters per day for roughly nine months. So you can calculate. Surely a good business
        and turn around period expected in 5 years.

        Name your choice.Wish you best of luck.
        Thank you

      • ఈ సూర్య గారు బ్యాంకులో కాకుల లెక్కలు వేసే వారి మల్లె వున్నారు 🙂

వ్యాఖ్యానించండి