శర్మ కాలక్షేపంకబుర్లు-సీత చెప్పిన కత్తి కత


సీత చెప్పిన కత్తి కత

సీతారామలక్ష్మణులు అరణ్యవాసం చేస్తూ దండకారణ్యం చేరారు. వనాలను చూస్తూ ముని ఆశ్రమాల సొగసు పరిశీలిస్తూ నడుస్తున్నారు. ఒక రోజు హటాత్తుగా ఒక రాక్షసుడు విరాధుడు అనేవాడు ఎదురయ్యాడు. రామ లక్ష్మణులను భయపెడుతూ సీతను పట్టుకున్నాడు. రామ లక్ష్మణులిద్దరూ విరాధుని రెండు భుజాలూ నరికేశారు, ఐనా విరాధుడు చావలేదు. రాముడు విరాధుని పట్టిఉండగా లక్ష్మణుని గొయ్యి తియ్యమన్నాడు, పూడ్చిపెట్టడానికి, అప్పటికి వీరెవరో తెలిసిన విరాధుడు మరణిస్తూ రామ లక్ష్మణులను శరభంగ ముని ఆశ్రమానికి వెళ్ళమని సూచించి చనిపోయాడు. శరభంగ ముని ఆశ్రమం చేరు కున్న రామ లక్ష్మణులను శరభంగముని స్వాగతిస్తూ తాము దేవేంద్రునితో వెళ్ళవలసివున్నా వీరి కోసం అగినట్లు చెబుతూ తమ శక్తులను ధారపోస్తాం తీసుకోమని అడిగారు. విన్న రాముడు తానే వాటిని స్వయంగా సంపాదించుకోవాలనుకుంటున్నానని చెబుతూ తాము నివసించడానికి యోగ్యమైన స్థలం చెప్పమని కోరేరు. దానికి శరభంగ ముని మీరు సుతీక్ష్ణుని ఆశ్రమానికి వెళ్ళండి అని సూచిస్తూ, ఈ ప్రాంతంలో రాక్షసుల బెడద ఎక్కువగా ఉన్నదని వారినుంచి మునిలోకాన్ని రక్షించమనీ కోరుతారు. సుతీక్షణుని ఆశ్రమానికి వెళ్ళారు, సీతారామలక్ష్మణులు. స్వాగత సత్కారాల తరవాత సుతీక్షణుడు కూడా దివ్య శక్తుల్ని తీసుకోమని అడిగితే శరభంగునికి చెప్పినట్టే చెప్పి, రాక్షసుల బెడదనుంచి మునిలోకాన్ని కాపాడమని కోరుతూ ఆ ప్రాంతంలో ఉన్న అన్ని ముని ఆశ్రమాలూ దర్శించమని చెప్పారు. మరునాడు అగమ్యంగా బయలు దేరిన సీతారామలక్ష్మణులు నడుస్తుండగా సీత రాముని ఉద్దేసించి ఇలా అంది.

రామా! మనం ఇక్కడికి వచ్చింది రాక్షస సంహారానికే అని మునిలోకం అనుకుంటున్నది.అధర్మం ఎంతటివారినైనా వంచిస్తుంది. అందులో అసత్య భాషణం, పరదారాగమనం, వైరం లేని హింస దానికి మార్గాలు. మీపట్ల మొదటి రెండు చేరలేవు కాని మూడవదైన వైరంలేని హింస మనల్ని బాధించేలా ఉంది. రాక్షసులతో మనకు వైరం లేదు. రాక్షసులు ఎదురైతే మీరు ఆగలేరు. మనం అరణ్యంలో ఉండద్దు. ఈ సందర్భంగా నాకో కత గుర్తుకోస్తోంది చెబుతా,వినండి అని చెప్పి ఇలా చెప్పింది.

ఒక ముని తపస్సు చేసుకుంటున్నారు, పరిక్షాధికారి ఇంద్రుడు సైనిక వేషంలో ఒక కత్తిని ముని కి ఇస్తూ దాచిపెట్టమన్నాడు. ముని కత్తి అందాన్ని పదును చూసి ముచ్చటపడి దాని సంరక్షణకోసం కూడా పట్టుకు తిరగడం ప్రారంభించారు. ఆయన ఆ కత్తిని ఉపయోగిస్తూ అకారణ హింసకు పాల్పడడం మొదలు పెట్టేరు, అధర్మానికి లొంగి. ఆ చర్యలు ఆయనను తపస్సుకు దూరం చేయడమే కాదు నరకానికి తీసుకువెళ్ళాయి. అందుచేత మీరిద్దరూ ఏమి చేస్తే మంచిదో ఆలోచించి నిర్ణయం తీసుకోమన్నది. దానికి రాముడు

సీతా నీకు మాపట్ల ఉన్న ప్రేమానురాగాలకి చాలా సంతోషం కలిగింది. అడవిలో ఉన్నా అయోధ్యలో ఉన్నా నేను రాజవంశీయుడినే. మంచివాళ్ళను,బలహీనులను రక్షించడమే రాజధర్మం.అందుకే ఆయుధాలు ధరిస్తాం. ఈ అడవిలో ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్న వీరిని బాధ పెట్టే దుష్టులను శిక్షించడం నా ధర్మం,అందుచేత ఆయుధం విడవనని చెప్పేడు.





9 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-సీత చెప్పిన కత్తి కత

  1. బోనగిరి గారు
    రామునిగా ధర్మం స్వయంగా ఆచరించి చూపాడు
    కృష్ణునిగా ధర్మాన్ని ఆచరింపచేశాడు. అంతే కదండీ తేడా.

    అనామకం
    పోయి వాల్మీకి రామాయణం అరణ్యకాండలో తొమ్మిదో సర్గ చదువుకో

    కిరణ్ జీ
    అవునుకదా!

    విన్నకోటవారు,
    ముని వేషం లో ఆయుధాలు ధరించడం రాజధర్మం ఆచరించడం పరస్పర విరుద్ధంగా కనపడ్డాయనుకుంటా. సీత ఒకప్పుడు చెప్పినమాట, ”రాజపుత్రులున్నచోట అసహాయుల ఆర్తనాదం వినపడకూడదని”.

  2. రాచబిడ్డ అయిన సీతాదేవి అలా అనడం ఆశ్చర్యంగా ఉంది. భార్యగా ఆవిడ ఆదుర్దా ఆవిడది అనుకోవాలేమో?
    రాముడు సరైన సమాధానం చెప్పాడు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s