శర్మ కాలక్షేపంకబుర్లు- రాముని అంతరంగం/విభీషణుని పట్టాభిషేకం.

రాముని అంతరంగం/విభీషణుని పట్టాభిషేకం.

శరణు వేడిన విభీషణునికి శరణు ఇవ్వాలా? వద్దా? రాముని కొలువులో చర్చ జరిగింది. చివరికి ”రావణుని కైనా అభయం ఇస్తాను, శరణు వేడితే” అని రాముడు అనడం తో చర్చ ముగిసింది, విభీషణుడు నేలకు దిగాడు.

”రావణునిబలం మరియు లంకా నగర విశేషాలు చెప్పమని” అడిగాడు,రాముడు. విభీషణుడు కొన్ని చెప్పాడు. వింటున్న రాముడు ”ఇవన్నీ ఇదివరకు విన్నవే” అని ”నీకు అభయం ఇస్తున్నాను, రావణ వధానంతరం నీకు లంకా రాజ్యం పట్టాభిషేకం చేస్తాను,నా ముగ్గురు తమ్ములపైన ఒట్టు”, అని చెప్పేడు. విన్న విభీషణుడు ”లంకానగర విజయ యాత్రలో సర్వ సాయం చేస్తాను” అని మాటిచ్చాడు. విన్న రాముడు మనసు మార్చుకొని లక్ష్మణునితో ”తమ్ముడూ, మన మిత్రుని లంకాధిపతిగా చూడాలని ఉంది, సముద్రజలాలు తెప్పించు” అన్నాడు. అంతే విభీషణునికి లంకా రాజ్యం పట్టాభిషేకం జరిగిపోయింది. రాముడు కొద్ది సేపటిలోనే ఎందుకు మనసు మార్చుకున్నాడు?

రాముని అంతరంగం
”లంక మాదికాదు, మా దాయాదులదీ కాదు. లంక మీద ఆధిపత్యం కావాలని తన వంశంలో వారెవరికి లేదు. అటువంటపుడు రావణ వధానంతరం లంకకి పట్టాభిషేకం చేస్తానననేల?
లంకా రాజ్యం పట్టాభిషేకం చేస్తానని వాగ్దానం మాత్రం చేస్తున్నాను, గెలవనని అనుమానమా? రావణ వధ తప్పదు, అటువంటప్పుడు పట్టాభిషేకం ఇప్పుడు చేయకపోవడం, విభీషణునికి మనసులో ఏమూలనో. ”వాగ్దానం చేసిన రాముడు నాకు లంక ఇస్తాడా?” అనే అనుమానంకి దారి చూపడం కదా. అందుకు ఇప్పుడే,ఈ క్షణమే లంకా రాజ్యనికి విభీషణుని పట్టాభిషేకం మంచిది” అని పట్టాభిషేకం జరిపించాడు.విభీషణుని మనసులో అనుమానమే మొలకెత్తకుండా జాగ్రత్త పడ్డాడు, అదీ రాజకీయ చతురత.

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- రాముని అంతరంగం/విభీషణుని పట్టాభిషేకం.

వ్యాఖ్యానించండి