శర్మ కాలక్షేపంకబుర్లు-పులిహోర ఆవకాయ.


పులిహోర ఆవకాయ.

రేడియో రోజుల్లో శ్రోతలు కోరిన పాటలు అనీ, సిలోన్ లో మన్ చాహేగీతనీ, ఇక బుధవారం రాత్రి ఎనిమిదికి అమీన్ సయానీ చేసేహడావుడి గుర్తుందా, బినాకా గీత్ మాలా అనీ ఆ తరవాత రోజుల్లో సిబాకా గీత్ మాలనీ, అదో ప్రపంచం. ఆ పాటలకి గ్రేడింగూ ఒకటో నంబర్ మీద వచ్చే పాటకి పెద్ద బిల్డప్పూ, ఇలోగా మిత్ర బృందం ఏ పాటొస్తుందో పందాలూ,ఆధా హై చంద్రమా రాత్ ఆధీ రహన జాయే తేరీ మేరీ బాత్ ఆధీ, ములాకాత్ ఆధీ 
आधा है चंद्रमा रात आधी रहनजायॆ तॆरी मॆरी बात आधी मुलाकात आधी…ఏంటి అర్ధమయిందా వయసులో 🙂 ఏదో మంచిపాటేలే నవర్ంగ్ లోది అని సరిపెట్టుకోడాలూ, ఇలా నేటి కాలానికి పాఠకులు కోరిన టపాలూ రాసేవాణ్ణి కాని మానేశాను, ఇదిగో మళ్ళీ వద్దనుకుంటూనే మొదలయింది. మొన్ననే ఒక టపా రాయనని, రాయలేనని మొహమాటం లేకుండా చెప్పడంతో,ఇప్పుడు మొహమాటం అడ్డొచ్చి ఈ టపా విన్నకోటవారి కోరికపై.


గోజిలలో ఆవకాయ పెట్టడంలో వైవిధ్యం ఎక్కువ. చెప్పుకోవాలంటే పులిహోర ఆవకాయ,పెసరావకాయ,శనగల ఆవకాయ, నూపిండి ఆవకాయ ఇలా ఎన్నో, ఎన్నో రకాలు. ఈ రకాల ఆవకాయలకి అన్నిటికి ఒక ప్రత్యేకత, ముక్కలు చిన్న చిన్నవిగా ఉండాలి. డొక్క ఉంటే సరి,లేకున్నా ఫరవాలేదు.. ఎంత చిన్నవైతే ముక్కలు, అంత మంచిది. ఈ ఆవకాయలు నిలవ ఉండేది తక్కువ. ఊరగాయల కాలంకి మూడు నాలుగు నెలల్లో అవకొట్టేయాలి, లేకపోతే బూజెక్కిపోతాయి.వీట్లో కొన్నిటిని ఎరుగుదును,కొన్నిటిని ఎరగను.
పెసరావకాయ,శనగల ఆవకాయ, నువు పిండి ఆవకాయ:- పెసరపిండి కారం,ఉప్పు సమానంగా తీసుకోవాలి నూనెతో గుచ్చెత్తాలి,చిన్నగా చేసుకున్నముక్కలు కలిపెయ్యాలి. పైన నూనెపోసుకోవాలి. కొందరైతే పెసలు కూడా పైన వేస్తారు. అవి నూనెలో,ఊటలో ఊరి బాగుంటాయి.ఆవ ఉండదు. శనగావకాయ కూడా ఇంతే, కాబూలీ శనగలని పెద్ద శనగలు వేస్తారు. నువు పిండి ఆవకాయ కూడా ఈ కోవలోదే.నువుపిండి,మెంతి,ఉప్పు ,కారం కలుపుతారు. ఇదో రుచీ.

పులిహోర ఆవకాయకి ముక్కలు చిన్నవిగా ఉంటాయి,మెంతి,కారం,ఉప్పు పోస్తారు, నూనెతో గుచ్చెత్తుతారు. ఆపై ఎండు మిర్చి ముక్కలు చేసుకుని, శనగపప్పు, మినపపప్పు, ఆవాలు, మెంతులు తో పోపు పెడతారు. కొందరైతే ఇంగువ కూడా వేస్తారు.ఇవన్నీ నూనెలో పుల్లటి ఊటలో నాని తింటుంతే ఆదో రుచి.

కొన్ని మరచిపోయానేమో కూడా సుమా.

25 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పులిహోర ఆవకాయ.

    • ఓహో, YVR గారా? బహుకాల దర్శనం. ఏమయ్యారు స్వామీ ఇన్ని రోజులూ / నెలలూ? నివాసం సింహాల ఊరేనా? అంతా కుశలమేనా?

      మీ ఊరే తన నివాసం కూడా అని బ్లాగ్ జనులకు అభిప్రాయం కలిగించిన “జిలేబి” గారి భోగట్టా ఏమన్నా తెలుసా?

      • నమస్తే సర్. సింహాల ఊరులోనే కుశలంగా వున్నాం.
        ఎందుకోగానీ మాలికలో నా బ్లాగు కనబడ్డంలేదు. మాలికామాలికులకి ఎన్ని మెయిళ్ళు పంపినా రెస్పాన్సులేక ఎలాగోలా కంటబడాలని ఇలా గురువుగారికి నమస్కారించాను. మీరూ చూశారు.
        జిలేబిగారు ఇంకా కవియే. “క”నిపించరు. “వి”నిపించరు.

  1. శర్మ గారికి నమస్కారం!
    మనందరి ఆకాంక్షల ఫలితం రాజమండ్రిలో యజ్ఞం చాలా గొప్పగా జరిగింది!దానినుంచి ప్రేరణ పొంది జగ్గయ్యపేట వాస్తవ్యులు కూడా యజ్ఞం చేశారు,మొన్ననే పూర్ణాహుతి కూడా జరిగిపోయింది.నాకూ లేటుగానే తెలిసింది.

    మీతోపాటు ధనసహాయం చెయ్యదల్చుకున్న ఇతరులకు ఈ వివరాలను అందిస్తున్నాను.
    పేరు:Gowri V
    అకవుంట్:005305004068
    IFSC:ICIC0000053
    రాజమండ్రిలో ధియోసాఫికల్ సొసైటీ సంస్థ పనిచేసింది గానీ ఇక్కడ భక్తులు తమంతట తామే ముందుకొచ్చి చేశారు.
    ఈ కార్యక్రమాల వీడియోలు అన్నిటికీ వేదాస్ వరల్డ్ వారు వారి వెబ్సైటు దగ్గిర లింకులు ఇచ్చారు.గతంలో జరిగినప్పుడు చూడలేని వాటిని కూడా అక్కడ చూడవచ్చు.ఈసారి కామెంటులో ఆ వివరాలను పొందు పరుస్తాను.
    భవదీయుడు
    హరి.S.బాబు

  2. అయితే అమ్మవారి నగరప్రవేశం జరిగిందా? హతోస్మి. ఆ పోస్టాఫీసు వీధి కుటుంబం Stay Home అంత శ్రద్ధగా పాటించలేదు అనుకోవాలేమో?

    మీరన్నట్లు చాలా మటుకు వ్యసనాల ప్రభావం అలాగే ఉంటుంది కదా …. తప్పించుకోవడం తప్ప వదిలించుకోవడం అరుదు.

  3. ఈమాట” వెబ్ మాసపత్రిక ఈ నెల (జూన్ 2020) సంచికలో పాలపర్తి ఇంద్రాణి గారు వ్రాసిన “చెదురుబాటు నుండి కుదురుబాటుకు” అనే చాల మంచి వ్యాసం వచ్చింది. సోషల్ మీడియా వ్యసనం గురించిన సమకాలీన వ్యాసం. తప్పక చదవవలసిన వ్యాసం. ఈ క్రింది లింకులో చదవచ్చు.

    https://eemaata.com/em/issues/202006/22833.html

    • విన్నకోటవారు,

      ఎంత వద్దన్నా,జాగ్రత్తలు తీసుకున్నా కరోనా అమ్మవారు, మా వూళ్ళో కాలు మోపింది, పోస్టాఫీస్ వీధిలో.అతన్ని హాస్పిటల్ కి పంపించారు. కత నడుస్తోంది.

      పాలపర్తి ఇంద్రాణిగారి ……….. ”చెదురుబాటు నుండి కుదురుబాటుకు” బాగుంది. అక్కడొకరు చెప్పినమాట ముల్లు తీసి కొర్రు కొట్టుకోమన్నట్టనిపించింది,నాకు 🙂

      మతి భ్రమణం కలిగించే తీగ పేరు ’మరుల మాతంగి” ఇది ఒక ఔషధం కూడా. ఈ వ్యసనం నుంచి తప్పించుకోడానికి అందరికి ఒకటే మందులేదు.

      నాకు నచ్చిన మార్గం. రాయాలి అనే పురుగు కుట్టకుండా ఉండాలి. కుట్టిన తరవాత తప్పదు. కరోనా లాటిదే ఇది కూడా. తప్పించుకోవడం తప్ప వదిలించుకోవడం అన్న మాటే లేదు. దీనితో సహజీవనం తప్పదు, దాని బారి పడిపోకుండా బతకడమే రహస్యం. ఒకప్పుడు రాసి, రాయక నిలిపి, మరచి అనేక ఎత్తులు తప్పవు. కొంతమంది దీని బారి పడిపోయి మరుల మాతంగిని తొక్కినవారే ఐపోతున్నారు, బహుపరాక్ !

    • వనజగారు,
      కుశలమేనా? ఎక్కడున్నారు?ఈ బ్లాగును మరచానేమోనండీ 🙂
      కామెంట్ వేసి గుర్తుకు తెచ్చినందుకు
      ధన్యవాదాలు.

      • మన దేశంలోనే వున్నానండీ.. బ్లాగ్ లకు అపుడపుడు వస్తున్నాను. 🙂 భగవంతుని దయవలన అందరం బాగున్నాం. 🙏

  4. అవకాయల గురించి వివరించిన విధము బాగుంది …ఇంకా వివరాలు ఇస్తే బాగుండు …పాటలు నాటి రోజుల్లోకి తీసుకు వెళ్లాయి

    • హిమబిందు గారు
      ఏంటో అలా పాతరోజుల్లోకి వెళిపోయానండి. నిజమేనండి. జీవిత చంద్రుడు సగమైపోయాడు కదా!
      ఊరగాయల గురించి చాలా టపాలే ఉన్నాయండి. ఓపిక లేక కొంత దాటేశానండి.ఇప్పటివాళ్ళకి ఆవకాయ తినేటంత ఓపిక ఉందంటారా! 🙂

  5. అవకాయల గురించి వివరించిన విధము బాగుంది …ఇంకా వివరాలు ఇస్తే బాగుండు …పాటలు నాటి రోజుల్లోకి తీసుకు వెళ్లాయి

  6. శర్మ గారికి ,
    మీరు మీ టపాలలో రక రకాలైన ఆవకాయల గురించి చెబుతూంటే , వాటి గురించి వివరం గా తెలుసుకోవాలనిపిస్తుంది ! శ్రమ తీసుకుని కేవలం వివిధ రకాల ఆవకాయల మీదే ఒక ‘ లఘు గ్రంధాన్ని ‘ రాయ మని విన్నపం ! కేవలం ఒకటి రెండు వాక్యాలలో కాకుండా ,  ఆ వివిధ ఆవకాయలను పెట్టే  విధానం కూడా తెలియ చేస్తే , ముందు తరాల వాళ్లకు చాలా ఉపయోగ కరం గా ఉంటుంది ! 

    • అనామకంగారు,
      అనామకాలకి సమాధానాలివ్వటం లేదు, ఏదో తమరు నా పట్ల చూపుతున్న అభిమానానికి తలవంచి సమాధానం ఇవ్వక తప్పటం లేదు 🙂
      ముందుతరాల పట్ల తమ అభిమానానికి సంతోషం.
      లఘుగ్రంధమేమి? బృహద్గ్రంధమే వేయిస్తాను.సొమ్ములు ఏర్పాటు చేయండి. తమ అనామకం పేరే పెట్టుకుంటా….. 🙂

  7. “ఆధా హై చంద్రమా” (నవరంగ్) చాలా మధురమైన, సున్నితమైన పాట 👌. నాకు చాలా ఇష్టమైన గీతం ఆనాటికి, ఈనాటికీ.

    • అమీన్ సయానీ మాటలపుట్ట..ఆ మాటల సాగతీతకి, పాటల సెలెక్షన్ కీ….ఆనందం. ఆధాహై చంద్రమా ఎన్నివారాలు మొదటి పాటగా వచ్చిందో..ఆనాటి యువతని ఒక ఊపు ఊపిన పాట.

      ఇలాటి మాటల మరాఠీలు మెవెల్ డిమెల్లో
      తెనుగులో బందా

  8. అంతే లెండి, ఎవరి రుచి వారికి ఆనందం 🙂.

  9. ఆవకాయలో అన్నేసి రకాలున్నాయన్నమాట! ఆసక్తికరమైన విషయం.

    నిజంగానే “శ్రోతలు కోరిన పాటలు” కార్యక్రమం ఫక్కీలో మా కోరిక మీద మీరు టపా వ్రాసినందుకు ధన్యవాదాలు శర్మ గారు 🙏.

    • అవునండి ఆవకాయల్లో అన్ని రకాలు.మరచానండి ఎండావకాయ అని మరో రకం, గోజిలలో పెట్టే అలవాటు లేదుగాని ఉత్తరాంధ్ర లో బాగా అలవాటు. దీనిలో ప్రత్యేకత ఆవకాయ పెట్టేకా పెచ్చులు, పిండి వేరు వేరుగా తీసి ఎండబెట్టడం

      • అలా ఎండబెట్టడం …. ఏమిటి లక్ష్యం? ఎండిన తరువాత పెచ్చుల్ని మళ్ళీ తిరిగి పిండిలో కలిపెయ్యాలిగా?🤔

వ్యాఖ్యానించండి