శర్మ కాలక్షేపంకబుర్లు-కర్ణుడు-అంగరాజ పట్టాభిషేకం.

కర్ణుడు-అంగరాజ పట్టాభిషేకం.


కుమారస్త్ర విద్యా ప్రదర్శనలో అర్జునునితో తలపడ్డానికి సిద్ధమయ్యాడు, కర్ణుడు. తగదని వారించారు కృపుడు. కారణమడిగాడు దుర్యోధనుడు. రాజుకాని వాడు రాజుతో తలపడడానికి లేదని చెప్పేరు, కృపుడు. ఐతే కర్ణుని రాజుగా ( అనగా పరిపాలకునిగా) ప్రకటిస్తున్నానని చెప్పి అంగరాజ్యానికి పట్టాభిషేకం చేసాడు. ఈ సంఘటన గురించి రకరకాల వ్యాఖ్యానాలున్నాయి.

తనకే రాజ్యార్హత లేదు అంగరాజ్యానికి కర్ణుని ఎలాపట్టాభిషేకం చేసాడు? మరికొందరు, దుర్యోధనునికి ఆ హక్కు వున్నది పట్టాభిషేకం చేయచ్చు. ఇలా రకరకాల మాటలున్నాయి. కాని భారతం లో ఏమున్నది?

దుర్యోధనుడు కర్ణుని అంగ రాజ్యానికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకుని, విషయం భీష్మునికి చెప్పేడు,ద్రోణునికి,విదు రు నికి తెలిసింది. ధృతరాష్ట్రుడు ఒప్పుకున్నాడు. అప్పుడు కర్ణునికి అంగరాజ్యం పట్టాభిషేకం చేశాడు దుర్యోధనుడు. అసలు పట్టాభీషేకం అంటే ఒక సర్వతంత్ర స్వతంత్ర్య రాజ్యం ఇచ్చేయలేదు. ఇది కురు సామ్రాజ్యంలోని ఒక పరగణా లేదా ఒక చిన్న రాజ్యం. దీనికి పరిపాలకుడుగా నియామకం జరిగింది, అంతే!

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కర్ణుడు-అంగరాజ పట్టాభిషేకం.

  1. ఆ విశ్వాసం మూలానేనేమో ఎప్పుడు చూసినా కర్ణుడు హస్తినాపురం లోనే ఉన్నట్లు కనిపిస్తుంది 🙂 – నియోజకవర్గాన్ని వదిలేసి రాజధానిలోనే తిరుగుతుండే ఆధునిక మంత్రుల లాగా ?

    విషయానికి వస్తే – తరువాత కాలంలో కూడా దుర్యోధనుడు తను చేసిన పనులను తండ్రిగారికి (అంటే మహారాజు గారికి) చెప్పే చేసినట్లున్నాడు కదా.

    మీ బ్లాగులో బహుకాల దర్శనం, శర్మగారు. “జిలేబి” గారయితే “వెల్కం బెకబెక” అనుండేవారు. వ్రాస్తుండండి, శర్మగారు.

    • విన్నకోటవారు,

      మీరన్నమాట నిజం. విశ్వాసం చూపించాడు,అంతే!

      ఆ తర్వాత కాలంలో కొన్ని చెప్పి,కొన్ని చెప్పక చేసేడు. చివరికి చస్తానని బెదిరించాడు కూడా తండ్రిని.

      ఈ బ్లాగుని రెండేళ్ళ కితం వదిలేశాను, వాతావరణం కొంచం చల్లబడితే కొద్ది హుషారుతో ఈ బ్లాగులో కొచ్చాను, చాలా గందరగోళం అనిపించింది, అంతే కాదు, సగం రాసినవి, తలకట్లు పెట్టి వదిలేసినవి ఇలా చలా అసంపూర్తి టపాలు కనపడ్డాయి, ఈ అసంపూర్తి టపా రెండేళ్ళ కితం రాసినదే! రెండో భాగం రాయలనుకున్నా కుదరలేదు, ఎలా పబ్లిష్ అయిందో చెప్పలేను, ఐపోయింది 🙂

      జిలేబి పట్టుబడిపోయే కాలం దగ్గరకొచ్చేసిందని భయపడి పారిపోయింది, ఇప్పుడు నా మాట వెలకం బెకబెక, జిలేబికి,తన గురించిన నిజాలు చెప్పనని బహిరంగంగా హామీ! 🙂

      నాలుగు నెలలయిందేమో తెనుగులో రాసి, అంతా కొత్తగా ఉంది 🙂 ఓపిక కనపట్టం లేదు.

వ్యాఖ్యానించండి